1857 జూన్ 23న, సహాయ మేజిస్ట్రేట్ అయిన రాబర్ట్‌సన్, పోలీసు జమాదార్ అయిన వారిస్ అలీని అరెస్టు చేయడంతో బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో
మొదటి స్వాతంత్ర్య యుద్ధ జ్వాలలు మొదటిసారిగా వ్యాపించాయి. అప్పటికే వారిస్ అలీ కొంతకాలంగా
మేజిస్ట్రేట్ కార్యాలయంలో సెలవుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నాడు, దీనివల్ల ఆంగ్లేయులకు వారిస్ అలీ పై అనుమానం కలిగింది. జూన్ 23న, వారిస్ గుర్రంపై గయా వైపు వెళ్తుండగా రాబర్ట్‌సన్
వారిస్ అలీని అరెస్టు చేశాడు.
వారిస్ అలీ వద్ద గయాకు చెందిన
జాతీయవాద భూస్వామి అయిన అలీ కరీంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు దొరికాయి. ఆ
ఉత్తరాలలో, అన్ని 'ఏర్పాట్లు' పూర్తయ్యాయని, వెంటనే గయాలో తనతో చేరమని కరీం వారిస్‌ను
కోరాడు. మరో ఉత్తరంలో, జాతీయవాద శక్తులలో చేరడానికి తన ఉద్యోగం, ఆస్తి, కుటుంబాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా
ఉన్నానని వారిస్ అలీ బదులిచ్చాడు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కుట్ర పన్నారనే ఆరోపణపై రాబర్ట్‌సన్ వారిస్‌అలీ ను
అరెస్టు చేశాడు. వారిస్ అలీ భారత జాతీయవాదుల నాయకులలో ఒకరిగా, అందువల్ల 'ప్రమాదకరమైన' వ్యక్తిగా పరిగణించబడ్డాడు. వారిస్
అలీ ని ఉరితీయడం కోసం మేజర్ హోమ్స్ వద్దకు పంపడానికి రాబర్ట్‌సన్‌కు పెద్దగా
ఆలోచించాల్సిన అవసరం రాలేదు. వారిస్ అలీ కేసును పరిశీలించిన మేజర్, వారిస్అలీ ఒక నాయకుడు కాబట్టి
అతన్ని క్షుణ్ణంగా విచారించాలని భావించారు. వారిస్ అలీ నుండి జాతీయవాదుల ప్రణాళికల
గురించి మరింత సమాచారం రాబట్టవచ్చని ఆంగ్లేయులు తప్పుగా భావించారు.
వారిస్ అలీ కేసు దినాపూర్‌లోని
మేజిస్ట్రేట్‌కు బదిలీ చేయబడింది. మరింత సమాచారం రాబట్టడానికి వారిస్ అలీ చిత్రహింసలకు
గురిచేశారు. నిజమైన జాతీయవాది మరియు తన ఆశయానికి కట్టుబడిన వారిస్ అలీ, ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టలేదు.
మరింత సమాచారం రాబట్టే వారి ప్రయత్నాలు విఫలమవడంతో, ఆంగ్లేయులు వారిస్ అలీ 1857 జూలై 6న పాట్నాలో ఉరితీశారు. ఉరితాళ్ల వద్దకు తీసుకువచ్చినప్పుడు, వారిస్ అలీ ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నారు,"ఇక్కడ స్వరాజ్యం పట్ల నిజమైన భక్తుడు ఎవరైనా ఉంటే, నన్ను విడిపించండి!"
వారిస్
అలీ ఉరిశిక్ష తర్వాత, 1857 ఆగస్టు
మధ్యకాలంలో జరిగిన విచారణ అనంతరం గాజీ ఖాన్, ఖైరాతి ఖాన్,
మీర్ హిదాయత్ ఖాన్, వజీర్ ఖాన్, కల్లు ఖాన్ మరియు అనేకమంది ఇతర పోలీసులను అరెస్టు చేసి, ఉద్యోగాల నుండి తొలగించారు; అలాగే వారి
ఆస్తులన్నింటినీ జప్తు చేశారు. వారందరికీ జీవిత ఖైదు విధించబడింది. వారితో పాటు
షేక్ ఖుర్బాన్ అలీని కూడా పోలీసు ఉద్యోగం నుండి తొలగించారు; షేక్
ఖుర్బాన్ అలీ ఆస్తులను జప్తు చేసి, మూడేళ్ల జైలు శిక్ష
విధించారు.
నుండి
రైల్ గోడౌన్ వరకు ఉన్న రహదారికి 'వారిస్
అలీ రోడ్' అని పేరు పెట్టారు; కాలక్రమేణా
వాడుకలో అది 'వార్సల్లీ రోడ్'గా
మారింది... కానీ కాలం గడిచేకొద్దీ ఆ పేరు కూడా కనుమరుగైపోయింది.
No comments:
Post a Comment