6 May 2015

భారతీయ సంస్కృతి లో తాంబూల సేవనం –విశేషాలు



తాంబూలం ను తెలుగు లో కిళ్ళి అని ఉర్దూ లో పాన్ అని అనెదరు. తాంబూలం (కిళ్ళీ) తమలపాకు, సున్నం, వక్క, కాచు, ఏలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారుచేస్తారు. భోజనానంతరము దీనిని సేవించటం భారత సంస్కృతిలో ఒక భాగం.
తాంబూలం చరిత్ర చాల పురాతనమైనది.  ప్రస్సిద్ద హిందీ కవి అమీర్ ఖుస్రో తన రచనలలో తాంబూలం గురించి వివరించినాడు.ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి ఇంట్లో శుభకార్యం  జరిగినప్పుడు విందు భోజనం అనంతరం కిళ్ళి ఇస్తారు. శుభకార్యాలలో తాంబూలం ఇచ్చి పుచ్చు కొంటారు. గురజాడ కన్యాశుల్కం లో అగ్ని హోత్రావధనుల చేత “తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి” అనే ప్రస్సిద్ద సంభాషణను  పలికించుచుతాడు. అల్లసాని పెద్దన భోజనానంతరం తూగుటుయ్యాలపై పవళించి దాసీ చేతి  కర్పూరపు విడియం సేవించాలని అంటాడు.
ప్రతి పండుగలో, ప్రతి శుభ సందర్భంలో తాంబూలానికి అగ్రస్థానం ఉంటుంది. భారతీయ సంస్కృతిలో తాంబూలానికి - అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత వుంది వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు.తిన్న ఆహార పదార్ధం జీర్ణం అగుటకు తాంబూలం ఉపయోగపడుతుంది.  
తాంబూలం విశేషాలు :
  శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది.
§  తాంబూలం దంతాల మూలాలకు, చిగుళ్ళకు బలం చేకురిస్తుంది.
§  పళ్ళ లో ఉండే చీము(pus) ను తొలగించి, పళ్ళను మెరిసేటట్లు చేస్తుంది.
§  నోటి దుర్వాసనను తొలిగిస్తుంది.
§  తాంబూల సేవనం వలన నోటి నుంచి సుగంధం వ్యాపించి తిన్న వారి మనస్సు ను ఆహ్లాదం గా ఉంచుతుంది.
§  పళ్ళ పాచిని తొలగిస్తుంది.
§  హృదయానికి బలం ఇస్తుంది.
§  వాంతులను, గుండెలలో మంటను తొలగించును.
§  తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
§  ఆకలిని పెంచును.
§  కొద్దిగా మత్తును కలిగించును.
§  రాజులు, చక్రవర్తులు ఎల్లప్పుడూ దీనిని తమతో పాటు ఉంచుకొండురు.
§  తాంబూల సేవనం గొప్పదనానికి చిహ్నం.
§  సంతోషానికి చిహ్నం గా దీనిని సేవిస్తారు, దుఖానికి, భాధకు నివారణగా ఉపయోగపడును.
§  అతివల ముత్యాల వంటి పలు వరుసకు చక్కటి శోభను ఇచ్చును.
§  శుభకార్యాలకు వన్నె తెచ్చును.
§  ప్రేమికులను దగ్గరకు చేర్చును.
§  తాంబూల సేవనం అనిర్వచనమైన ఆనందాన్ని కల్గించును
§  ఆతిద్యానికి గుర్తు తాంబూలం.

తమలపాకు ఆరోగ్యకరమైన ఉపయోగాలు :

  తమలపాకు తోటలు దక్షిణ ఆసియా లోని ఇండియా, బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక,  మొదలగు దేశాలలో కన్పించును.

§  ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి.
§  ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థకు మేలు కలుగును. .
§  తమలపాకులో చెవికాల్అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నివారించును.
§  తమలపాకుల రసమును గొంతునొప్పిగొంతు నొప్పి  నివారణకు ఉపయోగిస్తారు.
§  శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు.
§  తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు.
§  తమలపాకుల రసమును చెవిలో పిండిన చెవినొప్పి తగ్గిపోవును.
§  అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు.
§  ప్రతిరోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.
§  ప్రతిరోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.
§  తమలపాకు, సున్నం, వక్కఇవి మూడూ చక్కని కాంబినేషన్. సున్నంవల్ల ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం) రాకుండా ఉంటుంది; తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే ,వక్కపొడి తమలపాకుతో  చేరి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది.
§  తమలపాకు షర్బత్‌ని తాగితే గుండె బలహీనత. కఫం, మందాగ్ని బలహీనత దూరమవుతుంది
§  చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.
§  తమలపాకును తినడంవల్ల లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది
§  తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది. మొండి వ్రణం త్వరితగతిన మానాలంటే వ్రణంమీద తమలపాకును అమర్చి కట్టుకట్టుకోవాలి.
§  తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
§  మాంస కృతులు అన్ని ఎరుపును కలిగి ఉందును కాని తమలపాకు ఎరుపును తొలగించును.
§  తమలపాకులను పై కట్టుగా కట్టుట ద్వారా కత్తి/భాణపు గాయాలు త్వరగా మానును.
§  తొమ్మిది రుచులలో ఇది మూడు రుచులను కలిగి (వగరు, ఉప్పగా, తియ్యగా, రుచి లేకుండా) ఉండును.
§  ఆరు ఫలాలు ఆరు విబిన్న రకాల రుచులను కలిగి ఉందును కాని తమలపాకు ఆరు రుచులను కలిగి ఉండును
§  సప్త వర్ణాలలో ఇది ఐదు రంగులను కలిగి(ఎరుపు, ఆకు పచ్చ, తెలుపు, నలుపు, పసుపు) కలిగి ఉండును.
§  ప్రతి చోట ఫలాలు తింటారు కాని ఇక్కడ ఆకు ను తింటారు.
§  ఆరు నెలలు గడిచినా తమలపాకు తాజాగా ఉండును.