5 December 2014

శీతాకాలం లో తీసుకోవలసిన పండ్లు-కాయగూరలు-ఆకుకూరలు


శీతాకాలం వచ్చింది. చలి పెరిగింది . పగటి సమయం తగ్గి రాత్రి సమయం పెరిగింది. ఉష్ణోగ్రతలు తగ్గుతున్నవి. మరి ఈ కాలం లో మన ఆరోగ్యాన్ని కాపాడుకొని ఫిట్ గా ఉండటానికి మనము తినే  ఆహారములో కొన్ని ఫలాలను-కూరగాయలను చేర్చవలసి ఉంది.
శీతాకాలం లో మన శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవటానికి  కావలసిన శక్తీని గోధుమ,జొన్నలు, సజ్జలు, మినుములు, రాగులు, కందిపప్పు, బెల్లం, స్వీట్స్, క్రీం, పాలు, మేవా మొదలగునవి అందించును. వాటితో పాటు జామ,నారింజ, యాపిల్, అరటి, బొప్పాయి,ఖజ్జురం, వేరుసెనగ, గాజర్ తో చేసిన హల్వా, దానిమ్మ వంటివి మన ఆరోగ్యమును కాపాడును. ఆమ్ల,రాడిష్, క్యారెట్, దోస,టమోటా తో చేసిన సలాడులు,జ్యూస్ లు మన ఆరోగ్యమును కాపాడి శరీరానికి కావలసిన రక్షణ ఇచ్చును.  శీతాకాలం లో పెద్ద ఉసిరి తో చేయబడిన చవనప్రాశ్య తీసుకోవడం వలన శరీరానికి కావలసినంత విటమిన్ సి లబించి వ్యాధినిరోధక శక్తీ పెరిగి శ్వాశకోస వ్యాదులు నివారించబడును.
మేతి, పాలక్ మొదలగు ఆకుకూరలలో విటమిన్ ఏ, విటమిన్ సి అధికముగా ఉండి అంటి-ఆక్సిడెంట్స్ గా పని చేయును. ఆవాలు, ఇంగువ, జిలకర్ర,నల్ల మిరియాలు మొదలగు సుగంధ ద్రవ్యాలు శరిరమునకు కావలసిన శక్తిని ఇచ్చును.శీతాకాలం లో శరీరం పొడిగా తయారు అగును. చర్మపు పోడితత్వం ను అరికట్టుటకు రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు త్రాగవలయును.
పరిమితంగా మాంసం,ఆవు, పాలు, నట్స్, పన్నీర్, మిల్క్, దాల్, సోయబిన్, ఫిష్, గుడ్లు, వంటి హై-ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం వలన అవి చర్మం, కీళ్ళు మొదలగు వాటిని రక్షించును. శీతాకాలం లో అల్లపు టి, పసుపు తో కూడిన గోరువెచ్చని పాలు, గోరువెచ్చని నిటి తో   కూడిన నిమ్మరసం, తేనే. తులసి మొదలగు వాటిని తీసుకొనడం మంచింది. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తిసుకోనవలయును. నడక, స్క్కిప్పింగ్, సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయాయం కూడా చేయవలయును.
చలిని ఎదుర్కొని ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే కొన్ని రకాల ఫలాలు –కూరగాయలు, వాటి పోషక విలువలను తెలుసుకొందాము!
క్యాబేజీ:
సామాన్యులకు కుడా తక్కువ ధరలో అందుబాటులో ఉండే కూరగాయాలలో క్యాబేజీ ఒకటి. క్యాబేజీ విటమిన్స్ మరియు మినరల్స్ (విటమిన్ సి,కే,మరియు ఫోలేట్),పిచుపదార్ధం, అంటి-ఆక్సిడెంట్స్,అంటి-కార్సినోజేనిక్ (కాన్సర్ వ్యతిరేక) పదార్ధాలతో కూడి ఉందును. కొలస్టరాల్, క్యాన్సర్,డయాబిటిక్స్ ను తగ్గించును.
బంగాళ దుంప

పిండి పదార్ధం,పొటాషియం, మెగ్నీషియం,ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, ప్రోటీన్ లతో కూడిన బలవర్ధకరమైన ఆహారం బంగాళ దుంప. లో బ్లడ్ ప్రెజర్ తగ్గించును. అంటి-ఆక్సిడెంట్ లాగా పని చేయును. అనేక ఆహార పదార్ధములతో కలిపి వండవచ్చును.

ఉల్లిపాయలు:
సంవత్సరం పొడువునా ఉపయోగపడే ఆహార పదార్ధం ఉల్లిపాయలు. సూప్,సలాడ్, మాంసం లో వాడబడును. ఉల్లిపాయ కోయునప్పుడు వచ్చే కన్నీళ్ళు కంటి కి మంచి చేయును. తక్కువ కాలరీలు, అధికంగా విటమిన్ సి, పిచు పదార్ధంను కలిగి ఉండును. చెడు కొలస్టరాల్ ను తగ్గించును.
క్యారెట్
క్యారెట్ లో బీటా-కరోనిన్ అధికంగా ఉందును.  రోగనిరోధక శక్తిని పెంచును. విటమిన్ ఎ అధికముగా ఉండుటవలన కళ్ళకు,చర్మమునకు, మ్యుకస్ మేమ్బరిన్ కు తోడ్పడును. విటమిన్ సి అధికముగా ఉందును. అంటి-అక్సిడెంట్స్ కలిగి క్యాన్సర్ ప్రమాదమును, హృదయ సంబంధ వ్యాధులను తగ్గించును.
ముల్లంగి
ముల్లంగిలో మంచి పోషక విలువలు కల పదార్దములు కలవు. అధికముగా పీచు, పొటాషియం,విటమిన్ సి , ఫోలేట్ కలిగివుండును. సూప్, కూర తయారు చేసుకోవచ్చును. ప్రతి రోజు ఒక కప్పు ముల్లంగి తీసుకొన్న దానిలో  విటమిన్ సి అధికంగా ఉంది 55 కేలరీల విలువైన పోషక పదార్ధాలను అందించును. వ్యాధినిరోధక శక్తిని పెంచును, బ్యాక్టిరియా,వైరస్ లను ఎదుర్కొనును.  

చిలకడ దుంప
చిలకడ దుంప లో పీచు పదార్ధం, బీటా-కరోతిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, అంటి-ఆక్సిడెంట్స్ కలిగిఉండును. మధుమేహమును నియంత్రించును. వ్యాధినిరోధక శక్తిని పెంచు కణజాలమును శరీరంలో ఉత్పత్తి చేయును.
 సిట్రస్ ఫలాలు-ఆరెంజ్, కమల మొదలగునవి.  

 సిట్రస్ ఫలాలు విటమిన్ సి, ఫ్లెవనొయిడ్స్ కలిగి నోటికి రుచి నిచ్చును మరియు క్యాన్సర్ ప్రమాదమును తగ్గించును. అల్జిమేర్స్,పార్కిన్సన్  వ్యాధి రాకుండా ఉపయోగపడును, మధుమేహం, కలరా, కంట్లో శుక్లాలు, జిన్జివిటిస్ మొదలగు వ్యాధులు రాకుండా కాపాడును.  
దానిమ్మ కాయ

దానిమ్మ కాయలు మానవునికి అతి ప్రాచిన కాలమునుండి పరిచయం ఉన్నవి. అధిక పోషక విలువలతో కూడినవి మరియు అంటి-ఆక్సిడెంట్స్, అంటి-ఇంఫ్లమేటరి గా పనిచేయును. అధిక కొలస్టరాల్, అధిక రక్తపోటు, గుండె పోటు ను నివారించును. దానిమ్మ రసం ధమనులలోని కొవ్వును కరిగించును,గుండె కు బలమును కల్గించును.

ఆకుపచ్చని ఆకు కూరలు :


ఆకు కూరలలో విటమిన్ ఎ,విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం పొటాషియం, ఫైటో కెమికల్స్ మరియు అంటి-ఆక్సిడెంట్లు ఉండును. వ్యాధి నిరోధక శక్తిని పెంచును. ఇవి మానవ శరీరానికి కావలసిన పోషణను ఇచ్చును. ఆకు కూరలను అన్ని వంటకాలలో  కలిపి  వాడవచ్చును. జీర్ణక్రియ లో సహాయ పడును. కొలెస్టరాల్ తగ్గుదలకు, క్యాన్సర్ నిరోధానికి తోడ్పడును. 

భారత దేశం లో స్త్రీల హక్కులను వివరించు రాజ్యంగ/చట్ట ప్రకరణలు




భారత రాజ్యాంగ ప్రస్తావన  మరియు రాజ్యాంగం లో పొందుపరిచిన  ప్రాధమిక హక్కులు, ప్రాధమిక విధులు మరియు ఆదేశ సూత్రాలలో లింగ (స్త్రీ-పురుష)సమానత్వం కనిపించును. రాజ్యాంగం స్త్రీలకు పురుషులతో పాటు సమాన హక్కులు ప్రసాదించడంతో పాటు స్త్రీ సంక్షేమానికి అనేక చర్యలను తీసుకొనడానికి రాజ్యానికి అధికారం ఇచ్చింది. వివిధ రంగాలలో స్త్రీల అబివృద్ది కి గాను భారత ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో భాగంగా చట్టలు, అబివృద్దికరమైన విధానాలు, ప్రణాలికలు, పధకాలను రూపొందించుటకు నిర్ణయించడమైనది. స్త్రీలకు సమాన హక్కులను ప్రసాదించే అనేక అంతర్జాతీయ సంప్రదాయాలను,మానవ హక్కుల ప్రకటనలను భారతదేశం అంగికరించినది విటన్నిలోకి ప్రధానమైనది 1933 లో ఆమోదించిన కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ అఫ్ అల్ ఫార్మ్అఫ్ డిస్క్రిమినేషన్ ఎగనెస్ట్ విమెన్(Convention of elimination of all forms of discrimination aganist women -CEDAW) ముఖ్యమైనది.
రాజ్యంగ నిబంధనలు: 
భారత దేశం లో సామాజిక, రాజకియ,ఆర్ధిక, విద్యా సంబంధ రంగాలలో  అవరోధాలను ఎదుర్కొని స్త్రీ సమానత,సాధికారికత సాధించుటకు భారత రాజ్యాంగం అనేక చర్యలు తిసుకోవలసినడిన రాజ్యమును సూచించినది. ప్రాధమిక హక్కుల ప్రకారం రాజ్యము మతము,జాతి, కులం, ప్రాంతం, లింగం (స్త్రీ-పురుష) ఆధారంగా పౌరుల మద్య వివక్షత చూపరాదు. రాజ్యాంగం లోని 14,15,16,39(A),39(B),39(C) మరియు 42 వ నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నవి.
భారత రాజ్యాంగం లోని
ప్రాధమిక హక్కులలోని 
14 వ నిబంధన ప్రకారం చట్టం ముందు అందరు (స్త్రీ-పురుషులు) సమానులే.
15 వ నిబంధన ప్రకారం రాజ్యం పౌరుల మద్య మతం,జాతి, కులం,లింగం (స్త్రీ-పురుష) జన్మస్థలం ఆధారం గా వివక్షత చూపదు.
15(3) నిబంధన ప్రకారం స్త్రీలు మరియు పిల్లల కోసం కొన్నిప్రత్యెక సదుపాయాలను కల్పించవచ్చును.
16వ నిబంధన ప్రకారం ఉద్యోగావిషయములలో పౌరులందరికీ(స్త్రీ-పురుష తేడాలేకుండా)  సమాన అవకాశములు కలవు.
ఆదేశ సూత్రాల ప్రకారం
39(a) నిబంధన ప్రకారం స్త్రీ-పురుషులు ఇరువురికి చాలినంత జీవనోపాధి అవకాశములను కల్పించవలయును
39(d) ప్రకారం స్త్రీ-పురుషులు-ఇరువురికి సమానవేతనాన్ని అందించవలయును.
39A ప్రకారం న్యాయవ్యవస్థ పేద వర్గాల ప్రయోజనాలను కాపాడి, సామాజిక న్యాయాన్ని సమకూర్చే విధంగా వారికి ఉచితన్యాయ సహాయం అందించాలి.
42 వ నిబంధన ప్రకారం న్యాయబద్దమైన, మానవత పరిస్థితులతో కూడిన పనిని చూపించడానికి,ప్రసూతి వైద్య సదుపాయాలను కల్పించాలి.
46వ నిబంధన క్రింద రాజ్యం బలహీనవర్గాలకు ముఖ్యంగా షెడ్యుల్ కులాలు, షెడ్యుల్ తెగలకు చెందిన ప్రజల విద్యా, ఆర్ధిక ప్రయోగానాలను పెంపొందించాలి. అలాగే రాజ్యం వారిని అన్ని రకాల దోపిడిలు, సాంఘిక అన్యాయాల నుంచి కాపాడాలి.
47 వ నిబంధన ప్రకారం ప్రజలకు పోషకాహారం అందించి వారి జీవన ప్రమాణం పెంపొందించాలి.
ప్రాధమిక విధుల ప్రకారం
51A(e) భారత ప్రజల మద్య మత బాష ప్రాంతీయ వర్గ వైవిద్యాలకు అతీతంగా సోదర బావాన్ని, స్పూర్తిని పెంపొందించడo,స్త్రీల గౌరవాన్ని భంగపరిచే ఆచారాన్ని త్యజిండం.
స్థానిక స్వపరిపాలనా సంస్థలలో
243D(3) నిబంధన ప్రకారం పంచాయతి మెంబెర్  స్థానాల్లో 1/3 కు మించకుండా మహిళలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. వాటిని రొటేషన్ పద్దతిలో కేటాయించవలయును.
243D(4) నిబంధన ప్రకారం పంచాయతి చైర్-పర్సన్   స్థానాల్లో 1/3 కు మించకుండా మహిళలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగింది.
243T(3) నిబంధన ప్రకారం మునిసిపల్ కౌన్సిల్ సబ్యుల స్థానాల్లో 1/3 కు మించకుండా మహిళలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. వాటిని రొటేషన్ పద్దతిలో కేటాయించవలయును.
243T(4) నిబంధన ప్రకారం మునిసిపల్ చైఅర్-పర్సన్ స్థానాల్లో 1/3 కు మించకుండా మహిళలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగింది.
సాంఘిక వివక్షత, అనేకరకాల హింసలు, అత్యాచారాలను నివారించి మహిళలకు సమాన హక్కులు, బద్రత కల్పించుటకు భారత ప్రబుత్వo అనేక రకాల చట్టాలను రూపొందించినది.
ప్రత్యేకించి స్త్రీలకు వ్యతిరేకంగా నేరాలను రెండు శిర్షికల క్రింద వివరించవచ్చును.
1.భారత శిక్షాస్మృతి లోని ఈ క్రింది సెక్షన్ల ప్రకారం స్త్రీలపై ఈ క్రింది నేరాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయవచ్చు.
§  రేప్ –ఐపిసి -376,
§  వివిధ అవసరాల కోసం కిడ్నాపింగ్ మరియు ఎత్తుకెళ్ళడం- ఐపిసి -363-37
§  కట్నం కోసం హత్య ప్రయత్నం చేయడం, కట్నం మరణాలు మరియు అందుకు ప్రయత్నించడం - ఐపిసి -302/304-B
§  శారీరక మానసిక వేధింపులు - ఐపిసి -498-A
§  శారీరక వేధింపులు (molestation)- ఐపిసి -354
§  లైంగిక వేదింపులు (sexual harresment)-ఐపిసి-509
§  21 సంవత్సరాల లోపు పిల్లల అక్రమ రవాణ
2.స్పెషల్ లాస్ క్రిందకు వచ్చే నేరాలు (SLL)
స్త్రీల ప్రయోజన పరిరక్షణకు కొన్ని ప్రత్యెక చట్టాలను రూపొందించడం జరిగింది.
§  ది ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సురెన్స్ ఆక్ట్ 1948
§  ది ప్లాంటేషన్ లేబర్ ఆక్ట్ 1951
§  ది ఫ్యామిలీ కోర్ట్స్ ఆక్ట్ 1954
§  ది స్పెషల్ మ్యారేజ్ ఆక్ట్ 1954
§  ది హిందూ వివాహ చట్టం 1955
§  ది హిందూ వారసత్వ చాటం 1956(2005 సవరణ తో సహా)
§  ఇమ్మొరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) ఆక్ట్ 1956
§  ది మెటర్నిటి బెనిఫిట్ ఆక్ట్ 1961(1995 లో మార్చబడినది)
§  కట్న నిరోధక చట్టం 1961
§  ది మెడికల్ టెర్మినేషన్ అఫ్ ప్రేగ్నేన్సి చట్టం 1971
§  కాంట్రాక్ట్ లేబర్ (రేగ్యులైజేషణ్ మరియు అబోలిషన్) చాటం 1976
§  సమాన వేతన చట్టం 1976
§  బాల్య వివాహ నిరోధక చట్టం 2006
§  ది క్రిమినల్ లా (సవరణ) చట్టం 1983
§  ఫాక్టరీ చట్టం (సవరణ) 1986
§  అబ్యంతకర రీతిలో స్త్రీలను ప్రదర్శించుట నిరోధ చట్టం 1986
§  సతి నిరోధక కమిషన్ చట్టం 1987
§  గృహ హింస నిరోధక చట్టం 2005
స్త్రీల ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యెక సంస్థలు-పధకాలు :
§  జాతీయ మహిళా కమిషన్:
భారత రాజ్యాంగం మహిళలకు ప్రసాదించిన రాజ్యాంగపరమైన రక్షణలను, న్యాయబద్దమైన రక్షణలను సమిక్షించడానికి మరియు ఎప్పటికప్పుడు మహిళలకు సంబందించిన చట్టాలను సమీక్షించి వాటికి తగిన మార్పులను సూచించుటకు “జాతీయ మహిళా కమిషన్” ను 1992,జనవరి 31న ఏర్పాటు చేయడమైంది.
§  నేషనల్ ప్లాన్ అఫ్ యాక్షన్ ఫర్ ది గర్ల్ చైల్డ్ (1991-2000)
ఆడపిల్లలకు సరియైన భవిష్యత్ ను ప్రసాదించు లక్ష్యం తో బాలికల మనుగడ, రక్షణ, అబివృద్ది కోరకు సమగ్రమైన ప్రణాలికను రూపొందించడం జరిగింది.
§  మహిళా సాధికారికత సాధనకు జాతీయ ప్రణాళిక-2001(National Policy for the Empowerment of Women, 2001)
మానవవనరుల శాఖలోని స్త్రీ-శిశు సంక్షేమ విభాగం 2001 లో మహిళా సాధికారికత సాధనకు జాతీయ ప్రణాళికను రూపొందించినది.  స్త్రీ సాధికారికత, అబివృద్ది మరియు ముందంజను  సాదించుట ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.