29 April 2020

లాక్-డౌన్/క్వారంటైన్ సమయమం లో రంజాన్ నెల గడపటం. Spending Ramadan in Lock-Down/Quarantine



Blog - Muslim Kit

 

కరోన మహమ్మారి కారణం గా ప్రపంచవ్యాప్తంగా మానవాళి/ముస్లింల మతపరమైన దినచర్యలకు ఆటoకం ఏర్పడినది.  

రంజాన్ మాసం ప్రారంభమైనది మరియు ఈ పవిత్రమైన నెల భూమిపై ఉన్న ప్రతి మానవుడికి చాలా శుభవార్త తెస్తుందని ముస్లింలు  ప్రార్థిస్తున్నారు.

లాక్-డౌన్/క్వారంటైన్ లో  రంజాన్ గడపటానికి పరిగణించదగిన అంశాలు:

మనo మానసికంగా  లాక్-డౌన్/క్వారంటైన్ లో రంజాన్ గడపడానికి సిద్ధం కావాలి.

ముందుగా  మనం ఈ పవిత్రమైన రంజాన్ మాసం లో చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకోవాలి.


1.రంజాన్ ప్లానర్:
రంజాన్ నెల ప్రారంభం అయ్యింది మరియు ఈ విలువైన సమయాన్ని ఉత్తమంగా గడపడానికి ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. ఇఫ్తార్ మరియు సెహర్ కోసం తినుబండారాలను సిద్దం చేసుకోవడం, ఇంట్లో   ప్రార్థన ప్రాంతాన్ని పునర్వ్యవస్థీకరించడం, ఇబాదా కోసం బట్టలు ఏర్పాటు చేయడం మరియు ఇతర గృహ శుభ్రపరిచే పనులు చేయడం వంటి పనుల జాబితాను రూపొందించండి. రంజాన్ ప్లానర్‌లో ఈ అన్ని పాయింట్లను వ్రాసుకొంటే, సమయానికి చేయవలసిన అన్ని పనులను గుర్తుంచుకోవడానికి సులభం అవుతుంది.


2.ప్రతిఫలం పొందడానికి రంజాన్ ఉత్తమ సమయం:

రంజాన్ నెల సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రార్థనలకు  (ఫర్జ్  మరియు నఫిల్) సాధారణ రోజుల కంటే డెబ్బై రెట్లు ఎక్కువ ప్రతిపలం ఇచ్చే నెల.

సల్మాన్ (ర)అన్నారు : షాబాన్ చివరి రోజున, అల్లాహ్ యొక్క దూత మమ్మల్ని ఉద్దేశించి ఇలా అన్నారు:  ఓ ప్రజలారా! ఇప్పుడు మీపై ఒక గొప్ప నెల వస్తుంది. అది అత్యంత ఆశీర్వాదమైన నెల, దీనిలో వెయ్యి నెలల కన్నా ఎక్కువ విలువైన రాత్రి ఉంది. ఈ నెల పగటిపూట ఉపవాసం పాటించాలని, మరియు రాత్రి తారావీహ్ ను అల్లాహ్ సున్నత్ చేసాడు. ఎవరైతే ఈ నెలలో ఏదైనా సద్గుణమైన కర్మలు చేయడం ద్వారా అల్లాహ్‌కు దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తారో అతనికి 70 రెట్ల ఉత్తమ ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దయతో మీరు అధిక ప్రతిఫలం లభించే ఈ నెలలో ఫర్జ్ మరియు నఫిల్ ప్రార్థన చేసేలా చూసుకోండి.


3.ఇంట్లో పవిత్ర ఖురాన్ పారాయణం చేయండి:

లాక్-డౌన్/క్వారంటైన్ సమయం లో మీరు ఇంటికి మాత్రమే పరిమితం కావాలి. పవిత్ర ఖురాన్ ను దాని తఫ్సీర్ తో పాటు పఠించడానికి మీకు ఎక్కువ సమయం ఉంది. మీ సమయాన్ని ఉపయోగించుకోవటానికి మరియు అల్లాహ్ (SWT) తో మీ సంబంధాన్ని పెంచడానికి ఇది ఉత్తమ సమయం.


4.ఇంట్లో తరావీహ్ ప్రార్థన చేయండి:

తరావీహ్ రంజాన్ కరీం యొక్క అందం. లాక్-డౌన్ /క్వారంటైన్ కాబట్టి మీరు తరావీహ్ ప్రార్థనలు ఇంట్లో చేయండి. మీరు ఖురాన్ యొక్క చిన్న సూరాలను పఠించడం ద్వారా తరావీహ్ ను కూడా చేయవచ్చు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌తో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఈ ప్రార్థనలు మిమ్మల్ని ఆధ్యాత్మికత యొక్క అపారమైన సంతృప్తికి దారి తీస్తాయి.


5.రంజాన్ ను అధ్కర్ మరియు దువాలతో  (adhkar and duas) గడపండి:
లాక్డౌన్/క్వారంటైన్ లో  అందరు ఒకరకమైన ఆందోళన, వత్తిడిని  కలిగి ఉంటారు. కరోన మహమ్మారి కి వ్యతిరేకంగా దువా చేయండి. అధ్కార్ మరియు దువాలతో సమయాన్ని గడపండి. దువా చేయడానికి ఇది ఉత్తమ సమయం. దువాలు  చిన్నవి అయినప్పటికీ, మీరు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వాటిని పఠించడం నిత్యకృత్యంగా చేసుకోవచ్చు.


లాక్-డౌన్/క్వారంటైన్ లో  రంజాన్ గడపటానికి ఇవ్వన్ని పరిగణించదగిన అంశాలు. అంతిమంగా మీ హృదయాన్ని అల్లాహ్‌కి సమర్పించి అన్ని ఒత్తిళ్లు, ఆందోళనలు, చింతలు, భయాలు మరియు ఆశలను ఆయనతో పంచుకోవడానికి ఇది ఉత్తమ సమయం. అతనికి  మాత్రమే అన్ని తెలుసు మరియు అతను తన జీవులపై దయ చూపిస్తాడు.


లాక్-డౌన్/క్వారంటైన్  సమయం లో మన సృష్టికర్తను ప్రసన్నం చేసుకోవడానికి మన వంతు కృషి చేద్దాం.

పవిత్ర రంజాన్ మాసం లో ముందస్తు శారీరక సన్నాహాలు: చిట్కాలు Pre-Ramadan Preparations for Your Body: Tips for Preparing of Ramadan






Ramadan Kareem Meaning and More about Ramadan - Be A Better Muslim



రంజాన్ మాసం లో ముందస్తు శారీరక సన్నాహాల కోసం కొన్ని చిట్కాలు:

1. ఒక నెల ముందు స్వచ్ఛందంగా ఉపవాసం ఉండటం ప్రారంభించండి.
షబాన్ ఉల్ ముజ్జంలో, కొన్ని ఉపవాసాలు ఉండండి. అభ్యాసం మనిషిని పరిపూర్ణo చేస్తుంది కాబట్టి రంజాన్ ముందు స్వచ్ఛందంగా ఉపవాసం ఉండటం ప్రారంభించండి.

2.  వైద్యుడిని సంప్రదించండి.: మీరు అనారోగ్యంతో బాధపడుతుంటే లేదా ఆరోగ్య  సమస్య ఉంటే రంజాన్ కు ముందు వైద్యుడిని సంప్రదించండి, ఆరోగ్య రీత్యా సురక్షితంగా  ఉపవాసాలు ఉండండి  మరియు రాత్రి ప్రార్ధనలలో పాల్గొనండి..

3. ముందుగా ప్రారంభ అల్పాహారం (సేహరి)  తీసుకోవటం అలవాటు చేసుకోండి:
రంజాన్ ఉపవాసాలు ప్రారంభించే ముందు, ముందుగా అల్పాహారం తీసుకోవడం ప్రారంభించండి. ఇది మిమ్మల్ని సుహూర్ (ప్రీ-డాన్ భోజనం) కు  ప్రాక్టీస్ ఇస్తుంది  మరియు మీ శరీరం ఆ దినచర్యకు అలవాటుబడుతుంది

4. అవసరమైన వస్తువులను  అమర్చుకోండి:
మీరు రంజాన్ ముందు ఆహారపదార్ధాలను తగినంతగా సమకకూర్చుకొంటే  రమదాన్ నెలలో ఇబాడాలో ఎక్కువ సమయం గడపడానికి వీలు నిస్తుంది.. రంజాన్ ప్లానర్‌ లో అవసమైన  వస్తువులను సమకూర్చుకోవడాన్ని కూడా రాసుకోండి.

5. చిరుతిండి మానుకోండి:
పగటి సమయాల్లో స్నాక్స్ తినడం మానుకోండి. ఒక రోజులో మూడు-కోర్సు(Three Course) భోజనం తీసుకోండి, తద్వారా రంజాన్లో సుహూర్ మరియు ఇఫ్తార్ యొక్క రెండు భోజనాలకు అలవాటుఅవుతుంది.. అల్పాహారాన్ని నివారించడం  భోజనాన్ని సర్దుబాటు చేయడానికి సహాయం చేస్తుంది.

6.  నిద్ర షెడ్యూల్ సర్దుబాటు చేయండి:
రంజాన్ కరీంలో మీ నిద్ర షెడ్యూల్‌ను సర్దుబాటు చేయడం మరియు రంజాన్ నెలకు ముందే త్వరగా/early గా  నిద్రపోవటానికి ప్రయత్నించడం మంచిది. త్వరగా నిద్ర పోవడం ద్వారా సుహూర్ కోసం మీరు తేలికగా మేల్కొoటారు.

 7. కాఫీ తీసుకోవడం తగ్గించండి లేదా మానివేయండి:
కాఫీ/టీ తీసుకోవడం తగ్గించడానికి/మానివేయడానికి  ప్రయత్నించండి. ఒక కప్పుకు పరిమితం చేయండి.డీకాఫిన్ చేయబడిన కాఫీని తాగడం ప్రారంభించండి.

8. ఆహార పరిమాణం  తగ్గించండి:
రంజాన్ ముందు, ఉపవాసం సమయంలో మీకు ఇబ్బంది కలిగించే అదనపు ఆహార వినియోగాన్ని తగ్గించండి. బలహీనతను నివారించడానికి అవసరమైన అన్ని కేలరీలు మరియు కొవ్వులు గల పోషకాహారంను తీసుకోండి.

9. ధూమపానం తగ్గించండి లేదా మానివేయండి:
ధూమపానం మానివేయడానికి  రంజాన్ మంచి అవకాశం. రంజాన్ ముందు తక్కువ ధూమపానం చేయడం/మానివేయడం  మంచిది. రంజాన్లో ఆందోళన మరియు చంచలత నుండి ఇది మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది మరియు ఉపవాసంపై దృష్టి పెట్టడానికి మీకు వీలు కల్పిస్తుంది.

ఉపవాసం ఐచ్ఛికం కాదు Fasting is Not Optional



Intermittent Fasting Can Reverse Type 2 Diabetes in Some Cases 


విశ్వసించిన ప్రజలారా ! ఉపవాసం మీకు విధిగా నిర్ణయిoపబడినది- ఎవిధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి కూడా విధించాబడినదో, దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.”- దివ్య ఖురాన్ 2:183

ఈ అయత్ ఉపవాసాలను ఒక బాధ్యతగా సూచిస్తుంది. ఇది రంజాన్‌లో తప్పనిసరి ఉపవాసం గురించి మూడు ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది: (1)  రంజాన్ మాసంలో ఉపవాసం ఉండమని విశ్వాసులకు అల్లాహ్ ఆజ్ఞాపించాడు; (2) ఉపవాసం వారికి కొత్త విషయం కాదు, ఎందుకంటే ఇది మునుపటి ప్రజలకు కూడా ఆజ్ఞాపించబడింది మరియు (3) ఉపవాసం యొక్క నిజమైన ఉద్దేశం లాఅల్లకుం తట్టకూన్ (తద్వారా మీరు దైవబీతి పరులు  అవుతారు).

రంజాన్‌లో ఉపవాసం తప్పనిసరి, ఐచ్ఛికం కాదు. వయోజనడైన, తెలివిగల మరియు శారీరకంగా బాగా ఉన్న ప్రతి ముస్లిం (అతడు/ ఆమె)  రంజాన్ సమయంలో ఉపవాసం ఉండాలి.

సలాత్ (ప్రార్థనలు) మాదిరిగా పూర్వపు ప్రవక్తల అనుచరులకు కూడా  ఉపవాసం తప్పనిసరి విధి. యేసుక్రీస్తు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడని బైబిలు చెబుతోంది (మాథ్యూ 4: 1-4, మార్కు 1: 12-13 మరియు లూకా 4: 1-4). పేతురు 2: 21 లో క్రీస్తు అనుచరులు తమ ప్రవక్త చేసినట్లుగా ఉపవాసం ఉండాలని ఆదేశించారు. వేదాలు, పురాణాలు కూడా ఉపవాసాలను సూచిస్తాయి. ఆ విధంగా వివిధ  మతాల ప్రజలు ఉపవాసాలు ఉనప్పటికీ, ఉపవాసం ఉండే రోజుల సంఖ్య మరియు నిర్దేశించిన సమయాలలో తేడా ఉంది.

భక్తిని పెంపొందించే ప్రధాన వనరులలో ఉపవాసం ఒకటి. ఇది నెల రోజుల శిక్షణా కోర్సు.

రమజాన్ నెలలో విశ్వాసులు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు తినడం, త్రాగటం మరియు శృంగారంలో పాల్గొనడం మానేస్తారు. ఇలా ఉండటం వారికి షరియా నిషేధించినదాని నుండి మరియు ప్రాపంచిక ప్రలోభాల నుండి  దూరంగా ఉండటానికి వీలు కల్పిస్తుంది..

20 April 2020

అబ్దుల్ ఖాదిర్ బవాజీర్ (-31 డిసెంబర్, 1931)

ప్రఖ్యాత భారత స్వాతంత్ర సమర యోధుడు: గాంధీజీ  సహచరుడు.

Album Matter in Telugu and English.p65 Pages 101 - 150 - Text ...

ఇమామ్ సాహెబ్ అని ప్రేమగా పిలువబడే అబ్దుల్ ఖాదీర్ బవాజీర్  గుజరాత్ లోని ఒక  సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించాడు. ఇమాం సాహెబ్ తండ్రి బొంబాయిలోని ప్రసిద్ధ జుమ్మా మసీదుకు చెందిన ముయెజిన్. ఇమామ్ సాహెబ్ యొక్క పూర్వీకులు అరబ్బులు మరియు భారతదేశానికి వచ్చి కొంకణ్ ప్రాంతం లో  చాలాకాలం క్రితం స్థిరపడ్డారు.అబ్దుల్ ఖాదిర్ లేదా ఇమాంసాబ్ కు మాతృభాష గుజరాతీ, కానీ కొంకణి, అరబిక్, ఇంగ్లీష్ మరియు క్రియోల్ ఫ్రెంచ్‌ మరియు ఉర్దూ తెలుసు. సాధారణ పాఠశాల విద్య మాత్రమే అబ్యసించాడు.

తన బాల్యం నుండే వ్యాపార చతురతను సంపాదించిన అబ్దుల్ ఖాదిర్ బవాజీర్ అరేబియా గుర్రాలు మరియు గుర్రపు బండ్ల వ్యాపారం చేయడానికి దక్షిణాఫ్రికా వెళ్ళి వ్యాపారిగా చాలా సంపాదించాడు  మరియు ట్రాన్స్‌వాల్‌లో స్థిరపడ్డాడు. అబ్దుల్  ఖాదిర్ బవాజీర్  జోహాన్నెస్‌బర్గ్ మసీదులో ఇమామ్ గా పని చేసినoదున అతన్ని ఇమామ్ సాహెబ్అని ప్రేమగా పిలుస్తారు.

1903 లో అతనికి మొదటిసారి దక్షిణాఫ్రికాలో గాంధీజీతో పరిచయం ఏర్పడినది మరియు ఆ పరిచయం గాంధీజీ తో సన్నిహిత సానిహిత్యానికి దారితీసింది.
  
అబ్దుల్ ఖాదీర్ బవాజీర్ 1904 లో గాంధీజీ స్థాపించిన ఫీనిక్స్ సెటిల్మెంట్‌లో తన కుటుంభం తో సహా చేరాడు. గాంధీజీతో కలిసి  అబ్దుల్ ఖాదీర్ బవాజీర్ ఫీనిక్స్లో ఫకీర్జీవితాన్ని గడిపినాడు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా భారతీయులు చేపట్టిన అన్ని ఆందోళనలలో  ఆయన ముందున్నారు. 1907లోహమీడియా ఇస్లామిక్ సొసైటీఅధ్యక్షుడిగా అబ్దుల్ ఖాదీర్ బవాజీర్ ప్రజలకు సేవ చేశాడు. అతను 1908 లో జైలు పాలయ్యాడు.

1914 లో గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు అబ్దుల్ ఖాదీర్ దక్షిణాఫ్రికాలో తన వృద్ధి చెందుతున్న వ్యాపారాన్ని మరియు సుఖ జీవితాన్ని విడిచిపెట్టి, మహాత్మా గాంధీ తో కలిసి భారతదేశానికి వచ్చి సబర్మతి ఆశ్రమ స్థాపనలో గాంధీజీ కి సహాయం చేశాడు. అబ్దుల్ ఖాదీర్ మరియు అతని కుటుంబ సభ్యులు సబర్మతి ఆశ్రమంలో నివసించారు మరియు  సబర్మతి ఆశ్రమం నిర్వహించిన ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసేవారు.

అబ్దుల్ ఖాదిర్ ప్రెస్‌లో కంపోజిటర్‌గా మరియు అతని భార్య, ఇద్దరు  కుమార్తెలు అమీనా మరియు ఫాతిమా ప్రెస్ మరియు ఆశ్రమంలోని ఇతర పనులు నిర్వహించేవారు.  అబ్దుల్ ఖాదిర్  పెద్ద కుమార్తె అమీనా వివాహం సబర్మతి ఆశ్రమంలో జరిగినప్పుడు, గాంధీజీ, ఇమామ్ సాహెబ్ తన సోదరుడని అతిదులకు వివరించి ఇమామ్ సాహెబ్‌ తరుపున స్వయంగా అతిథులను సాదరంగా ఆహ్వానించారు.

జాతీయ ఉద్యమంలో అనేక సార్లు ఇమామ్ సాహెబ్ మరియు అతని కుమార్తెలను అరెస్టు చేసి జైలులో పెట్టారు. 1928 లో, అబ్దుల్ ఖాదీర్ సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో కలిసి బార్డోలి సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొన్నారు. 1930 లో గాంధీజీ దండి మార్చిప్రారంభించినప్పుడు, అబ్దుల్ ఖాదీర్ మార్చ్‌ లో ముందు నడిచారు. దండి మార్చ్ లో పాల్గొన్న అతన్ని అరెస్టు చేసి జైలులో పెట్టారు. జైలులో అతని ఆరోగ్యం క్షిణించినది.  అబ్దుల్ ఖాదిర్  1931 లో విడుదలయ్యాడు.

ఇమామ్ సాహెబ్ అబ్దుల్ ఖాదీర్ బవాజీర్ 1931 డిసెంబర్ 31 న కన్నుమూశారు మరియు సబర్మతి ఆశ్రమం సమీపంలో ఖననం చేయబడ్డాడు. గాంధీజీ  అబ్దుల్ ఖాదిర్ ను సత్యాగ్రహం మరియు హిందూ ముస్లిం ఐక్యత కోసం ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తిఅని కొనియాడారు. అతని సంస్మరణను సర్దార్ పటేల్ 1931 డిసెంబర్ 13 నవజీవన్ లో రాశారు. ఇమామ్ సాహెబ్  మునిమనవడు జస్టిస్ అకిల్ అబ్దుల్ హమీద్  కురేషి ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా పనిచేస్తున్నారు. .





15 April 2020

మప్పిలా తిరుగుబాటు వీరుడు అలీ ముస్లియార్ Ali Musliyar 1853-1922




alimusliyar Instagram posts (photos and videos) - Picuki.com 



అలీ ముస్లియార్ గా ప్రసిద్ది కెక్కిన  ఎరిక్కున్నన్ పలాట్టు మలాయిల్ అలీ (1861-1922) బ్రిటీష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో 1921–22 మప్పిలా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ప్రముఖ సూఫీ నాయకులలో ఒకరు. అతను ఖాదిరియా తారికా యొక్క సూఫీ.

ముస్లియార్ మస్జిద్  అల్-హరామ్ నుండి విద్యావంతుడైన ఇస్లామిక్ పండితుడు. అతను 1907 నుండి తిరురంగడి మసీదు యొక్క ఇమామ్‌గా పనిచేశాడు. మప్పిలా తిరుగుబాటు లో పాల్గోనందుకు  కోయంబత్తూ సెంట్రల్ జైలులో ఉరితీయబడ్డాడు. అతను ఖిలాఫత్ ఉద్యమం యొక్క చురుకైన వక్త.
ముస్లియార్ మలబార్ జిల్లాలోని ఎరనాడ్ తాలూకాలోని నెల్లిక్కునట్టు దేసోంలో కున్హిమోయిటన్ మొల్లా మరియు కోటకల్ అమినా దంపతులకు జన్మించాడు. అతని తల్లి కోటక్కల్ అమినా పొన్నాని యొక్క ప్రసిద్ధ ఇస్లామిక్ పండితుల  మక్దూమ్ కుటుంబంలో జన్మించినది.  ముస్లియార్ తాత మాసా "మలప్పురం అమరవీరులలో" ఒకరు. అలీ ముస్లియార్ విద్యను ఖురాన్, తజ్విద్  మరియు మలయాళ భాషలను కక్కడమ్మల్ కునుకుమ్ము మొల్లా దగ్గిర నేర్చుకొన్నారు. షేక్ జైనుద్దీన్ మక్దుమ్ I (అఖిర్) దగ్గిర మతం మరియు తత్వశాస్త్రంలో అధ్యయన కోసం పొన్నాని డార్సేకు వెళ్ళాడు అక్కడ అతను 10 సంవత్సరాల అధ్యయనం  విజయవంతంగా పూర్తి చేశాడు.

తరువాత మరింత విద్య కోసం హరామ్, మక్కా (మక్కా) వెళ్ళాడు. ఈ కాలంలో, సయ్యద్ అహ్మద్ సాహ్ని దహ్లాన్, షేక్ ముహమ్మద్ హిస్బుల్లాహి మక్కి, మరియు సయ్యద్ హుస్సేన్ హబ్షిలతో సహా పలువురు ప్రసిద్ధ పండితులు ఆయనకు మార్గనిర్దేశం చేశారు. మక్కాలో ఏడు సంవత్సరాలు గడిపిన తరువాత, లక్ష దీవులలోని కవరట్టిలో చీఫ్ ఖాసీగా పనిచేశారు.


1894లో, తన సోదరుడు మరియు ఇతర కుటుంబ సభ్యులు 1896నాటి మలబార్ అల్లర్లలో  హత్య కావిoపబడిన విషయం తెలుసుకున్న తరువాత, ముస్లియార్ మలబార్కు తిరిగి వచ్చాడు. ఆ అలర్ల లో అనేకమంది అతని సంభందికులు మరియు తోటి విద్యార్థులు చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. 1907 లో ఎరనాడ్ తాలూకాలోని తిరురంగడి వద్ద మసీదుకు చీఫ్ ముస్లియార్‌గా నియమితులయ్యారు.

అతను ఖిలాఫత్ ఉద్యమ నాయకుడయ్యాడు ఖిలాఫత్ ఉద్యమం ఆరoభం తరువాత, 1921 ఆగస్టు 22 న జమాత్ మసీదులో ఖిలాఫత్ రాజుగా ప్రకటించబడి ఖిలాఫత్ ప్రభుత్వo తరపున మార్కెట్ ఫీజులు, ఫెర్రీ మరియు టోల్ ఆదాయం వసులు చేయసాగాడు.

అతను మలబార్ ప్రజల గొప్ప నాయకుడు అయ్యాడు. ఖిలాఫత్ మరియు నాన్-కోపరేషణ్ సమావేశాలు అలీ ముసాలియార్ అద్వర్యం లో క్రమం తప్పకుండా జరిగాయి. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చురుకైన మరియు ప్రత్యక్ష కార్యాచరణ కోసం ముస్లియార్  మరియు అతని అనుచరులు రహస్య సన్నాహాలు చేస్తున్నారు. గాంధీ మరియు అలీ బ్రదర్స్ సహాయంతో అఫ్ఘనిస్తాన్ అమీర్,  భారతదేశంపై దాడి చేయబోతున్నారని వార్తలు వ్యాపించాయి ఖిలాఫత్ వాలంటీర్లను నియమించారు మరియు ఖిలాఫత్ కొరకు మరణానికైన సిద్దం అని వారు పవిత్ర ఖురాన్ మీద ప్రమాణం చేశారు. అలీ ముసాలియార్ స్వచ్చంద సేవా దళాలు ఆప్రాంతమంతా సాయుధ యూనిఫాంలో తిరిగేవి. 1921జూలై 24 న పొన్నానిలో జరిగిన నాన్-కోపరేషణ్ సమావేశంలో  సుమారు 50 నుండి 100 మంది స్వచ్ఛంద సేవకులు ఖిలాఫత్ యూనిఫాం ధరించి కవాతు చేశారు. ఆ ప్రాంత వ్యవసాయ దారులలో అసంతృప్తి ఉంది


1921 ఆగస్టు 20 న అలీ ముస్లియర్  తో సహా ముగ్గురు నాయకులను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించిన తరువాత 1921–22 ముపిల్లా తిరుగుబాటు ప్రారంభమైంది. బ్రిటిష్ దళాలు మంపురం మసీదును నాశనం చేశాయని మోప్లాస్ ద్వారా పుకార్లు వ్యాపించాయి మరియు మోప్లాలు భారీ సంఖ్యలో, 15,000 మరియు 30,000 మధ్య బయటకు వచ్చారు. ఇది బ్రిటిష్ దళాలు మరియు స్థానిక ప్రముఖ వర్గాల ఉచకోతకు దారితీసింది దక్షిణ మలబార్ అంతటా భవనాలు, రైలు వంతెనలు, రోడ్లు మొదలైన ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విస్తృతమైన హింసాకండ జరిగింది.దానికి  అలీ ముసాలియార్ నాయకత్వం వహించారు మరియు ఇతర మోప్లా కుటుంబాలు (తంగల్ కుటుంబాలు) నిర్వహింహినవి..

బ్రిటిష్ సైనిక  దళాలు అనేక పట్టణాల్లో పైచేయి సాధించినప్పటికీ, అనేక మంది తిరుగుబాటుదారులు గెరిల్లా కార్యకలాపాలను ప్రారంభించారు, బ్రిటిష్ వారు అదనపు సైనిక విభాగాలను మోహరించి  మరియు "దూకుడు" పెట్రోలింగ్‌ను ప్రవేశపెట్టారు. క్రమంగా ఫిబ్రవరి 1922 లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు ముగిసింది. బ్రిటిష్ న్యాయస్థానం మోపిల్లా విచారించి మర్డర్, ఆర్సన్ మొదలైన నేరాలకు గాను   మరణశిక్ష విధించిన డజను మంది నాయకులలో అలీ ముస్లియార్ కూడా ఉన్నారు. తరువాత అతన్ని 17 ఫిబ్రవరి 1922 న కోయంబత్తూ సెంట్రల్ జైలులో ఉరితీశారు.



.