జమియాత్-ఇ-ఉలమా-ఇ-హింద్ మరియు జామియా మిలియా ఇస్లామియా
వ్యవస్థాపకులలో ఒకరైన ముఫ్తీ కిఫాయతుల్లా, భారత
స్వాతంత్ర్య పోరాటంలో తన పాత్రకు జర్మనీ మరియు జపాన్ నుండి సుభాష్ చంద్రబోస్ నుండి
చేసిన రేడియో ప్రసారాలలో ప్రశంసలు పొందిన అతి కొద్ది మంది భారతీయులలో ఒకరు.
1942 ఆగస్టు 31న, జర్మనీ నుండి చేసిన ఒక రేడియో ప్రసారంలో సుభాష్ చంద్రబోస్ ఇలా అన్నారు, “నేను భారతదేశంలో విశిష్ట దేశభక్తుడు మరియు నాయకుడు ముఫ్తీ కిఫాయత్ ఉల్లా నేతృత్వంలోని ఉలేమాల పాత ప్రతినిధి సంస్థ అయిన జమియత్-ఉల్-ఉలేమా కు విజ్ఞప్తి చేస్తున్నాను….. ఈ సంస్థలన్నీ ఈ పోరాటంలో చేరితే భారతదేశ విముక్తి దినం దగ్గరపడుతుంది.”
1942 అక్టోబర్ 6న జరిగిన మరొక రేడియో ప్రసారంలో, బోస్ ఇలా అన్నారు, “… భారతదేశ స్వాతంత్ర్యం కోసం జైలులో ఉన్న ధైర్యవంతుడైన ఆల్-ఇండియా జమియత్-ఇ-ఉలేమా నాయకుడు ముఫ్తీ కిఫాయత్ ఉల్లా మరియు ఇతర సంస్థలు ముందుకు వచ్చి అహంకారపూరిత బ్రిటిష్ రాజకీయ నాయకుల తప్పుడు వాదనలకు తగిన సమాధానం ఇవ్వాలి.”
“తాలిమ్-ఉల్-ఇస్లాం” గ్రంధ రచయిత మరియు ప్రముఖ ముస్లిం నాయకుడు ముఫ్తీ కిఫాయతుల్లా, బ్రిటిష్ వ్యతిరేక ఆందోళనలలో పాల్గొన్నందుకు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆనాటి రాజకీయ ఖైదీలలో ఎక్కువ మంది బ్రిటిష్ వారి ప్రయోజనాల కోసం జాతీయవాద సిద్ధాంతాన్ని తిరస్కరించేవారు లేదా భారత జాతీయ కాంగ్రెస్ నుండి ఆర్థిక సహాయం పొందేవారు, కిఫాయతుల్లా రెండింటిని తిరస్కరించారు.
కిఫాయతుల్లా అరెస్టు అయినప్పుడు వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడు మియాన్ సర్ ఫజల్ హుస్సేన్ ద్వారా కిఫాయతుల్లా కు ఒక సందేశం పంపబడింది, “బ్రిటిష్ ప్రభుత్వం మిమ్మల్ని రాజకీయ ఉద్యమం నుండి వేరుగామని అభ్యర్థిస్తోంది. ప్రతిగా, ప్రభుత్వం మీకు మదర్సా సఫ్దర్ జంగ్ యొక్క రాజ భవనం మరియు మైదానాలను బహుమతిగా ఇస్తుంది. మీరు మౌనంగా ఉండి రాజకీయాలకు దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము.”
పై సందేశానికి కిఫాయతుల్లా స్పష్టమైన
పదాలలో స్పందించారు. కిఫాయతుల్లా ఇలా అన్నారు, “నేను
వ్యక్తిగత సుసంపన్నత కోసం స్వాతంత్ర్య ఉద్యమంలో చేరలేదు. మీ ఆఫర్కు చాలా
ధన్యవాదాలు కానీ ఏ ప్రలోభమూ నా గొంతు/వాణిను అణచివేయదు.”
.ఆ రోజులలో కాంగ్రెస్, జైలుపాలు అయిన తన క్యాడర్ ఖర్చులను భరించేది. వారి కుటుంబాలు, కేసులు మొదలైన వాటిని కాంగ్రెస్ నిర్వహించే నిధి చూసుకునేది. ఈ నిధులను ప్రజా విరాళాల ద్వారా కాంగ్రెస్ సేకరించెది
మౌలానా కరీముద్దీన్ మీరాఠీ ఇలా గుర్తుచేసుకున్నారు, “1930 నాటి పౌర అవిధేయత civil disobedience సమయంలో, జమియతుల్-ఉలమా చాలా కష్టాల్లో ఉంది, డబ్బు లేదు మరియు జీతాలు లేకుండా చాలా నెలలు గడిచాయి. మోతీ లాల్ నెహ్రూ కాంగ్రెస్ నిధుల నుండి ద్రవ్య సహాయం అందించారు. ఆ సమయంలో, ముఫ్తీ కిఫాయతుల్లా ఢిల్లీ జైలులో ఉన్నారు, సంప్రదించినప్పుడు ముఫ్తీ కిఫాయతుల్లా ఇలా అన్నారు, ‘స్వాతంత్ర్య పోరాటంలో, మేము మరెవరి నుండి సహాయం లేదా మద్దతు తీసుకోలేదు. మా భూమి విముక్తి కోసం మేము చేస్తున్న ప్రయత్నాలు మా మతపరమైన బాధ్యత. మేము జమియత్ కార్యకలాపాలను కొనసాగించలేకపోతే, మేము కార్యాలయాలను మూసివేస్తాము.’”
ముఫ్తీ కిఫాయతుల్లా కు దేశం కోసం పోరాడటo మతపరమైన విధి. 1920లో మహాత్మా గాంధీ ప్రతిపాదించిన సహాయ నిరాకరణ ఆలోచనను ఉత్సాహంగా స్వాగతించిన వారిలో ముఫ్తీ కిఫాయతుల్లా మొదటి వ్యక్తి అని జవహర్లాల్ నెహ్రూ ప్రశంసించారు..
1939లో, మహాత్మా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్
బ్రిటిష్ వారితో రాజీ పడినప్పుడు, ముఫ్తీ
కిఫాయతుల్లా సుభాష్ చంద్రబోస్ పక్షాన నిలిచారు మరియు ఏది ఏమైనా జమైత్ బ్రిటిష్
సామ్రాజ్యవాదంతో అంతిమ యుద్ధానికి
సిద్ధంగా ఉందని ప్రకటించారు.