13 July 2024

చరిత్రలో తొలిసారిగా మహారాష్ట్ర శాసన మండలిలో ముస్లింలు ఎవరూ లేరు. No Muslim in Maharashtra Legislative Council for the First Time in History

 



1937లో ప్రారంభమైన తర్వాత మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌   కు మొదటి సారి ప్రస్తుతం జరిగిన ఎన్నికలలో ఒక్క ముస్లిం ప్రతినిధి కూడా ఎన్నిక కాలేదు. శాసన మండలికి  జరిగిన ఎన్నికలలో ఏ ఒక్క పార్టీ కూడా తన తరుపున ముస్లిం అబ్యర్ధులను నిలబెట్టలేదు.

1937 నుండి మహారాష్ట్ర యొక్క ఉభయ సభలు  (విధాన సభ , విధాన మండలి) - ఎల్లప్పుడూ ముస్లిం ప్రతినిధులను కలిగి ఉందేవి..  ఇటివల జరిగిన  పార్లమెంట్ ఎన్నికలలో 48 స్థానాలలో కూడా ఏ ఒక్క  ముస్లిం అబ్యర్ది విజయం పొందలేదు. ఈ పరిణామం ముస్లిం నాయకులు మరియు వర్గాలు  తమ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..ఇటీవలి ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థుల గైర్హాజరు కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలలోని ముస్లిం నాయకులలో గణనీయమైన అసంతృప్తిని రేకెత్తించింది.     

2011 జనాభా లెక్కల ప్రకారం, మహారాష్ట్ర లో 1.30 కోట్లకు పైగా ముస్లిం జనాభా (ముస్లింలు 12% కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ)  2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, 288 సీట్ల సభకు కేవలం 10 మంది ముస్లింలు మాత్రమే ఎన్నికయ్యారు.,   

 “ మహా రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి మహారాష్ట్ర నుండి 567 మంది ఎంపీలు ఎన్నికయ్యారు, వారిలో 15 మంది (2.5%) మాత్రమే ముస్లిం సమాజానికి చెందినవారు. 

శాసన మండలి లో ముస్లిములు లేకపోవడం  మహారాష్ట్ర రాజకీయ దృశ్యంపై విస్తృత ప్రభావాలను కలిగిస్తుంది.  రాష్ట్రంలోని విభిన్న జనాభాకు వాస్తవికంగా ప్రాతినిధ్యం వహించే సమ్మిళిత రాజకీయాల అవసర౦ ఉంది.   అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి మరియు సమాజం యొక్క సమాన అభివృద్ధికి కీలకం.

 

 

 

No comments:

Post a Comment