20 March 2018

అండర్గ్రాడ్యుయేట్ కోర్స్ లో బేసిక్ సైన్స్ మరియు ఆర్ట్స్ కు పూర్వ వైభవం.



అండర్గ్రాడ్యుయేట్  స్ట్రీమ్ లో   2 వ స్థానంలో ఇంజనీరింగ్ స్థానం లో బేసిక్ సైన్స్ చేరింది.

.సైన్స్ కోర్సులు భారతదేశం యొక్క రెండవ అత్యంత పాపులర్ అండర్గ్రాడ్యుయేట్ స్ట్రీమ్ గా తిరిగి ఉద్భవించాయి.


ఆర్ట్స్ ఎల్లప్పుడూ అతిపెద్ద ఆకర్షణ గా ఉంది మరియు ఇదే ధోరణి భవిష్యత్ లో కొనసాగుతుంది.

2016-17లో  97.3 లక్షల మంది విద్యార్ధులు BA లో చేరగా, 47.3 లక్షల మంది విద్యార్ధులు  BSc కోర్సులను ఎంచుకున్నారు మరియు 41.6 లక్షల మంది ఇంజనీరింగ్ ఎంచుకొన్నారని  HRD మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది.



ఇంజనీరింగ్ ఆకర్షణ  కోల్పోయి, అండర్గ్రాడ్యుయేట్ స్ట్రీమ్ లో  సైన్స్ కోర్సులు దేశం లో తిరిగి అత్యంత ప్రాచుర్యం పొందినవి. యువకులలో సివిల్స్, కాంపిటిటివ్ ఎగ్జామ్స్  పై మోజు పెరుగుట వలన ఆర్ట్స్ ఎల్లప్పుడూ అతిపెద్ద ఆకర్షణగా నిలిచినది మరియు రాబోయే సంవత్సరాలలలో ఇదే ధోరణి కొనసాగుతుంది.

కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం  2016-17లో బీఏలో 97.3 లక్షల మంది విద్యార్థులు చేరగా, బిఎస్సీ కోర్సులoదు  47.3 లక్షల మంది మరియు  41.6 లక్షల మంది ఇంజనీరింగ్ కోర్స్ లలో చేరారు.

BSc లోని  కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ మరియు ఫార్మ   వంటి శాఖల పట్ల  పెరుగుతున్న ఆకర్షణవల్ల  సైన్స్ విద్యార్ధులకు ఇష్టమైన కోర్స్ గా మారింది. ప్రఖ్యాతి పొందిన విద్యా సంస్థలో పొందిన ఇంజనీరింగ్ డిగ్రీ కు మాత్రమె విలువ ఉంది. ఈ నాడు ఇంజనీరింగ్ విద్యార్ధులు సాధారణ ఉద్యాగాల కోసం BA, BSc పొందిన విద్యార్ధులతో పోటిపడుతున్నారు. ఇంజనీరింగ్ ఆకర్షణ తగ్గటం తో అనేక ఇంజినీరింగ్ కాలేజి లను మూసివేయడం జరిగింది. నాణ్యత(quwality) గురించి ఆలోచిస్తున్నారు. ఈ ధోరణి ఈలాగే సాగితే నాణ్యత లేని కోర్స్లు, కాలేజి లు మూతబడవచ్చు.

గత అర్ధ-దశాబ్దంలో అండర్గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారుల ఎంపికలు గణనీయంగా మారాయి. ఐదు సంవత్సరాల క్రితం వరకు వాణిజ్యం(కామర్సు) ఆర్ట్స్ తరువాత 2వ స్థానం లో ఉన్నది ఆ తరువాత సైన్స్, ఇంజనీరింగ్ మూడవ స్థానంలో నిలిచాయి.

2013 లో బిఏ కోర్సుల్లో 75.1 లక్షల మంది విద్యార్ధులు చేరగా కామర్స్ లో 28.9 లక్షల మంది విద్యార్థులు చేరినారు.  . బి టెక్ 17.9 లక్షలు; BE లో 16.4 మంది విద్యార్ధులు, బిఎస్సి లో 25.4 లక్షల మంది విద్యార్ధులు  చేరినట్లు  హెచ్ఆర్డి మంత్రిత్వశాఖ డేటా తెలుపుతుంది.


అకస్మాత్తుగా, వాణిజ్యం (కామర్స్)  దాని ఆకర్షణను కోల్పోయింది మరియు నాల్గవ స్థానానికి దిగజారింది. 2014-2015 ఇంజనీరింగ్ విద్యార్ధులకు గోల్డెన్ పిరియాడ్ గా నిలిచినది.  2014-2015లో, ఐటి రంగం లో ఎక్కువ నియామకాల జరగడం తో ఇంజినీరింగ్ రెండో అత్యంత ప్రజాదరణ పొందిన కోర్సుగా నిలిచినది. దానితో B-స్కూల్స్ లో విద్యార్ధులు కూడా తగ్గారు.

కానీ ఇప్పుడు నాణ్యత, సౌకర్యాలు, విద్యార్ధులు  లేని ఇంగజినీరింగ్  కాలేజి ల విస్తరణ ఇంజినీరింగ్ విద్యార్ధుల  పట్ల  ఒక శాపం గా మారింది.

 2015-16 మరియు 2016-17 ల డేటా సైన్స్ అడ్మిషన్ లో పెరుగుదల చూపిస్తుంది మరియు ఇంజనీరింగ్ లో నియామకాలు(placements) తగ్గుదలను చూపుతున్నాయి.

విద్యా మౌలిక సదుపాయాల కల్పన పట్ల తక్షణ శ్రద్ద చూపాలి Educational Infrastructure Challenges Deserve Instant Attention. -




విద్య   వ్యక్తిగతంగా మరియు సామాజికంగా అభివృద్దికి కి వెన్నెముకగా పరిగణించబడుతుంది  మరియు   చివరికి అది జాతీయ వృద్ధి కి  చిహ్నoగా పరిగణించబడుతుంది. ఇది మార్పు కోసం వ్యక్తిగత ఆలోచనా ప్రక్రియలను ఇంధనంగా మార్చడం ద్వారా సామాజిక, దేశ స్వరూపాన్ని మార్చే  సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది అన్ని సందర్భాలలోనూ విజయం మరియు శ్రేయస్సు కు నిచ్చెనగా పరిగణించబడుతుంది.  కానీ దశాబ్దాలు  గా దీనిని గుర్తించడం లో  మన విధాన రూపకర్తలు నిర్లక్షం ప్రదర్శించారు.  ఎన్నికల సమయములో లేదా జాతీయ బడ్జెట్ల రూపకల్పన సమయం  లో కూడా విద్య తగిన స్థానం పొందలేదు.

ఐఐఎంలు, ఐఐటిలు వంటి భారతదేశంలోని ప్రధాన విద్యా సంస్థల ప్రదర్శనలను అంచనా వేసేటప్పుడు మనం గర్వపడతాము కానీ నిజానికి  దేశం లోని  అధిక  ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాలన్నీ శూన్యంగా ఉన్నాయని చెప్పటానికి వెనుకాడతాము. స్మార్ట్ క్లాసెస్ మరియు ఇ-లెర్నింగ్ గురించి గొప్పగా చెప్పుకొంటాము కాని గ్రామిణ ప్రాంతాలలో విద్యార్ధులు పాఠశాలలకు చేరుకోవడానికి గంటల కొద్ది  నడవడం, అడవుల  గుండా వెళ్ళడం లేదా వారి పాఠశాలలను చేరుకోవడానికి పడవలను ఉపయోగించడం, సరిఅయిన స్కూల్ బిల్డింగ్ వారి లోకాలిటి లో లేకపోవడం వలన బాలికల డ్రాప్-అవుట్ ఎక్కువడం గురించి ప్రస్తావించం.

శిధిలమైన పాఠశాల నిర్మాణాలు, పగిలిన గోడలు,  కారుతున్న కప్పులు, మురికి గదులు, పారిశుధ్య కొరత  మరియు అపాయకరమైన వాతావరణo మరియు అనేక సందర్భాల్లో తరగతి గదులు లేక పాఠశాల భవనాలు లేకపోవడం  మరియు  ఏక  ఉపాధ్యాయుడుని కలిగి ఉండటం  ఇవి అసలైన గ్రౌండ్ రియాలిటీని ప్రదర్శిస్తాయి. కొన్నిసార్లు, పైభాగం లో కప్పు లేకపోవడం మరియు నాలుగు గోడలు కూడా లేకపోవడం వలన పిల్లలు ఆరుబయట విద్యను   అధ్యయనం చేయవలసి వస్తుంది. సంబంధిత వ్యక్తులు ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల పెంపు కోసం వారి సూచనలను పంపుతూనే ఉంటారు అలాగే  ఈ సంవత్సరం కూడా అదే విధమైన డిమాండ్లు చేసారు కాని ఏ మాత్రం ఫలితం  లేదు.

ఈ సంవత్సరం, భారత ప్రభుత్వం విద్య కోసం 85,000 కోట్ల రూపాయలు కేటాయించింది (US $ 13.26 బిలియన్). వీటిలో, రూ 50,000 కోట్ల పాఠశాల విద్య కోసం ఉద్దేశించబడింది, మిగిలినది ఉన్నత విద్య కోసం. ఇది మునుపటి సంవత్సరంలో పోలిస్తే సుమారు 8% ఎక్కువ.

అదే రకంగా సెకండరీ విద్య కు బడ్జెట్ కేటాయింపు పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సెకండరీ విద్య కు బడ్జెట్ కేటాయింపు రూ. 3,900 కోట్ల(17-18) నుంచి రూ 4,200 కోట్లకు పెరిగింది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాలలో  విద్యాభివ్రుద్ది నిరాశగా ఉన్నప్పటికీ, స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి) లో ఈ విభాగం లో కేటాయింపు కేవలం 3.8% మాత్రమే ఉంది. దశాబ్దాలుగా ఈ రంగానికి కేటాయింపు సంతృప్తికరంగా లేదు. నిజానికి, గత దశాబ్దంలో ఈ ముఖ్యమైన రంగంపై భారతదేశ కేటాయింపు మొత్తం ఖర్చులో 3.8-4.0% మధ్య ఉంది.

అసోసియేషన్ ఫర్ ఇండియన్ యూనివర్సిటీస్ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ ఫుర్ఖన్ కమర్ ఇలా అంటున్నారు  "విద్యకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది, విద్యలో మన ప్రభుత్వ పెట్టుబడులను గణనీయంగా పెంచాలి. ప్రైవేటు భాగస్వామ్యం స్వాగతించదగినది, అయితే అది పబ్లిక్ పెట్టుబడుల అవసరాన్ని భర్తీ చేయలేదు”.

భారతదేశం మరియు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని ప్రజలు విద్య కోసం బడ్జెట్ కేటాయింపును పెంచాలని డిమాండ్ చేస్తున్నప్పుడు అమెరికా లోని డోనాల్డ్ ట్రంప్ ప్రబుత్వం  మాత్రం విద్యా బడ్జెట్ను 5 శాతం తగ్గించాలని కోరింది. విద్యా బడ్జెట్ను తగ్గించాలి అన్న  ట్రంప్ ప్రతిపాదనను విమర్శిస్తూ  FI ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ప్రముఖ పెట్టుబడిదారుడు, పౌర నాయకుడు మరియు అమెరికా యొక్క ప్రఖ్యాత విద్యా దాత ఫ్రాంక్ ఇస్లాం, "విద్యా బడ్జెట్ లో తగ్గింపు  మరియు సైనిక బడ్జెట్ లో  భారీ పెరుగుదల కు అస్సలు అర్ధమే లేదు. ప్రజాస్వామ్యం యొక్క భవిష్యత్తు కోసం సైనిక బలం వలె విద్య కూడా చాలా ముఖ్యమైనది మరియు   ఆ దేశం యొక్క పౌర శక్తికి విద్య దోహదపడుతుంది” అని అన్నారు.

ప్రైవేట్  పాఠశాలకు ప్రాధాన్యత ఇవ్వవాలన్న ప్రతిపాదన పై  ఫ్రాంక్ ఇస్లాం మాట్లాడుతూ "ప్రభుత్వ పాఠశాలల కన్నా ప్రైవేట్ పాఠశాలల  నిర్వహిణ ఉత్తమమని  సాక్ష్యాలు ఉన్నట్లయితే ఇది మంచి విషయంగా ఉండవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా జరిపిన పరిశోధనలు  దానికి వ్యతిరేకం ఉన్నవి మొత్తంమీద, లేదా కొన్ని చోట్ల లేదా కొన్ని ప్రాంతాలలో పబ్లిక్ స్కూల్స్  మెరుగైన ప్రదర్శనను కలిగి ఉన్నవి.

గ్రామిణ ప్రాంతాలలో విద్యా స్థితి నిరాశలో ఉన్నప్పటికీ భారతదేశంలో విద్య కోసం బడ్జెట్ కేటాయింపు అనేది చాలా తక్కువగా ఉంది. 8 వ ఏ అల్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషన్ సర్వే (ఎఐఎస్ఈఈ) నివేదిక ప్రకారం మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 6.75 లక్షల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 1.18 వేల డిగ్రీ కళాశాలలతో పాటు 3.04 లక్షల ఉన్నత ప్రాధమిక(అప్పర్ ప్రైమరీ), 82.8 వేల సెకండరీ మరియు 36.9 వేల హయ్యర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. ప్రాధమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల శాతం స్కూల్ కు కేవలం 2.2 చొప్పున ఉంది.

అదేవిధంగా, తరగతి గదులు, సురక్షితమైన త్రాగునీటి, టాయిలెట్ సౌకర్యాల గణాంకాల దృష్ట్యా గ్రామీణ భారతదేశంలోని పాఠశాల అవస్థాపన సౌకర్యాల కల్పన పై తక్షణ శ్రద్ధ చూపవలసిన అవసరం ఉంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాల పై తక్షణం ద్రుష్టి సారించవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పటికే ఉన్న పథకాలు మరియు నిబంధనలను మరింత శ్రద్దగా అమలు చేయడం అవసరం.

ఒక అంచనా ప్రకారం, 80 మిలియన్ల మంది పిల్లలు ఇప్పటికీ పాఠశాల వెలుపల/బయట  ఉన్నారు, మరియు 10 శాతం పాఠశాలలు ఇప్పటికీ ఒక్క ఉపాధ్యాయుడిని కలిగి  ఉన్నాయి. ఇప్పటికీ భారతదేశం అంతటా పాఠశాలల్లో ఒక మిలియన్ టీచర్ పోస్ట్స్ ఖాళీగా ఉన్నట్లు అంచనా వేయబడింది. 2015-16 నాటికి మొత్తం పాఠశాలల్లో 62 శాతం మాత్రమే విద్యుత్ సౌకర్యాలు కలిగివున్నాయి, దాదాపు 24 శాతం ఫంక్షనల్ కంప్యూటర్లు కల్గి ఉన్నవి.

గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 9 శాతం స్కూల్స్  విద్యుత్ కనెక్షన్, ఫంక్షనల్ కంప్యూటర్ల రెండింటిని కలిగి ఉన్న పరిస్థితులలో డిజిటల్ పురోగతి విస్తరించాలనే ఆలోచించడం సాధ్యమేనా? గ్రామీణ మరియు పట్టణ విద్యా వ్యవస్థ మరియు అవస్థాపన యొక్క సమస్యలు ముందుగానే పరిష్కారమైతేనే తప్ప  2022 నాటికి 'అప్-గ్రేడింగ్  ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2022' మరియు 'బ్లాక్ బోర్డ్ నుండి డిజిటల్ బోర్డ్లకు ట్రాన్స్ఫార్మింగ్' వంటి నినాదాలు ఉపయోగపడవు.

అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, గ్రామీణ గృహాలలో 86 శాతం మరియు పట్టణ కుటుంబాలలోని 96 శాతం మంది తమ ఇళ్ళ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నత ప్రాధమిక పాఠశాలలను(UP స్కూల్స్) కలిగి ఉన్నారు. గ్రామిణ ప్రాంతాల్లో పురుషులు 4.5 శాతం మరియు 2.2 శాతం మంది స్త్రీలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు కాగా, పట్టణ ప్రాంతాల్లో 17 శాతం పురుషులు, 13 శాతం స్త్రీలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

2014 సంవత్సరపు జాతీయ శాంపిల్ సర్వే అఫ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 6-13 (సర్వ శిక్ష అభియాన్ లో ఉన్నవారు ) వెల్లడించిన అంశం ప్రకారం భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని  60 లక్షల స్కూల్ విద్యార్ధులలో 77  శాతం మంది స్కూల్ వెలుపల/బయట ఉన్నారు.

ఇటీవల బడ్జెట్లో(18-19), ఆరోగ్యం, విద్య మరియు సాంఘిక రక్షణపై ప్రభుత్వం అంచనా వేసిన బడ్జెట్ వ్యయం 1.38 లక్షల కోట్లు ఉంది అని ఈగ్ను(IGNOU) మాజీ వైస్ ఛాన్సలర్, అఖిల భారత విద్యా ఉద్యమం (AIEM) యొక్క అధినేత అన్నారు.  ప్రొఫెసర్ M. అస్లాం ప్రకారం. ఇది 2017-18లో 1.22 లక్షల కోట్ల గా అంచనా వేయబడింది. ఇది విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన వ్యయాలను కలిగి ఉంటుంది. విద్యా రంగంలో కావలసిన విజయం సాధించడంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలక పాత్ర పోషిస్తుంది.

మౌలిక సదుపాయాల సమస్యపై, ప్రొఫెసర్ అస్లాం ఇలా అంటున్నారు, "గ్రామీణ విద్యా అవస్థాపన సౌకర్యాలు  లేకపోవటం అనేది ఇప్పుడు దీర్ఘకాల విద్యా విధాన ప్రణాళికా రచయితలకు తీవ్రమైన ఆందోళన కలిగించే అంశము. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలా పాఠశాలల్లో ఇంకా మరుగుదొడ్లు లేదా నిరంతర విద్యుత్తు లేదు. పాఠశాలల్లో అధిక భాగం ఇప్పటికీ నల్లబోర్డులు మరియు చాక్ ను  ప్రధాన బోధనా పరికరాలుగా ఉపయోగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చాలా పాఠశాలల్లో మూడింట ఒక వంతు సింగిల్ టీచర్ ఉన్నారు.

ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిత్వశాఖ జారి చేసిన ఒక ప్రకటనలో, "విద్య మరియు సాంకేతిక పరిజ్ఞానంలో డిజిటల్ తీవ్రతను పెంచుకోవడమనేది విద్య నాణ్యతను మెరుగుపరుచుకోవడంలో అతిపెద్ద డ్రైవర్ గా  వ్యవహరిస్తుంది" అని  అంది. ఇది వాస్తవాలకు దూరంగా ఉంది. అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేనప్పుడు డిజిటల్ బోర్డులు రియాలిటీ కాగలవా? కొత్త టెక్నాలజీ అమలు చేయడం చాలా సులభం, కానీ ముందు దాని ఉపయోగాన్ని సమర్థించడం కష్టం.

భారతదేశం లో  కొత్త మల్టీ-మోడ్ సాంకేతిక జోక్యాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అది  బోధన యొక్క సాంప్రదాయ మార్గాలు మరియు నూతన సమాచార ప్రసార సాంకేతిక ఉపకరణాల మధ్య సమతుల్యాన్ని స్థాపించాలి. పాఠశాల అవస్థాపన, ప్రత్యేకించి గ్రామీణ భారతంలో మరింత మెరుగుపరచవలసిన  అవసరం ఉంది.

“తగినంత గదులు, సురక్షితమైన తాగునీటి సౌకర్యాలు, ఆటంకాలు లేని విద్యుత్తు, టాయిలెట్ సౌకర్యాలు మరియు ఇతరులను  అందించే సమయ పరిమితి కార్యక్రమం అవసరం ఉంది. తగినంత మౌలిక సదుపాయాల లేకుండా డిజిటల్ ప్రపంచo సరి అయినది కాదు. అది సాధారణ ప్రజల విద్యాపరమైన ఉద్ధరణపై ఏమాత్రం ప్రభావం చూపదు "అని ఇగ్నో మాజీ వైస్ ఛాన్సలర్ వాదించాడు.

ఒక పెద్ద ప్రశ్న ప్రస్తుత సందర్భంలో మన మనసులోకి వస్తుంది: దాదాపు అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాలలో  గ్రామీణ మరియు పట్టణ విభజన మద్య ఎందుకు పెద్ద అంతరం  ఉంది? ఈ లోపం పట్టణ దృక్పథం ఆధిపత్యం వహించే మన ఆలోచనా ప్రక్రియ లేదా విధానం లో ఉందా? ఈ గ్రామీణ-పట్టణ విభజన భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు కొనసాగుతోంది మరియు ప్రజల ఎన్నికల ఓట్ల విలువ రెండు ప్రాంతాలలో సమానంగా ఉన్నప్పుడు ఎందుకు నాయకులు లేదా ప్రభుత్వాలు ఈ విభజనను అనుమతించాయి?

విద్యా సాధికారికత సాధించిన ముస్లిం మహిళలు మార్పుకు సంకేతాలు


-
భారతదేశం ప్రపంచం లో మెరుగైన స్థానాన్ని సంపాదించడానికి శక్తివంతమైన ఆయుధం విద్య.

ముస్లిం మహిళల సాధికారత, విద్య కోసం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ పిలుపు కు విస్తృతమైన అంగీకారం మరియు మద్దతును లబించవచ్చునని ప్రభుత్వ పక్షం ఉహించినది. కాని దీనికి బిన్నంగా జరిగినది. విభిన్న కారణాల వలన  పలు రంగాల్లో ప్రతిఘటన ఎదురైంది. కొంతమంది దీనిలో మోడీ రాజకీయ చతురతను చూశారు. ముస్లిం మహిళల విద్య మరియు సాధికారికత విషయం లో అసలు  మోడీ ఏమైనా చేసాడా అని కొందరు ప్రశ్నించారు? దీనికి ట్రిపుల్ తలాక్ వివాదానికి సంభంధం ఉండుట వలన దీనిని కొందరు తీవ్రంగా  వ్యతిరేకించారు.

ఏది ఏమైనా భారతదేశం తన సంపూర్ణ సామర్థ్యాన్ని సాధించడానికి మరియు భారత ముస్లిం మహిళలను శక్తివంతం చేయటానికి విద్య ఒక స్పష్టమైన సంకేతం మరియు ఆయుధం. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం ముస్లిం అక్షరాస్యత రేటు కేవలం 59% మాత్రమే.

ముస్లింలు మరియు ఇతరు బలహీన వర్గాలకు సంబంధించిన వేనుకుబాటు తనంకు కారణాలు కనుగొనటానికి 2006 లో  ఏర్పాటు చేయబడిన సచార్ కమిటీ నివేదిక అనేక రంగాలలో ముస్లింల వెనుకుబాటుతనంను వెల్లడించింది. ఈ నివేదిక మైనారిటీల అభివృద్ధికి అనేక ప్రోగ్రామ్స్  సృష్టించింది. ఈ కార్యక్రమాలు ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగిoచినవి.

2011 జనాభా లెక్కల్లో ముస్లింల మొత్తం అక్షరాస్యత శాతం 68.5 శాతం పెరిగింది. అది మంచి వార్త.జాతీయ అక్షరాస్యత శాతం  74 శాతానికి వరకు పెరిగింది.

ముస్లిమ్స్ మహిళలు -తక్కువ  అక్షరాస్యత
కానీ గణాంకాలు వేరే కథను చెప్పుతున్నాయి. భారతదేశంలో ముస్లిం మహిళల అక్షరాస్యత రేటు 52% కంటే తక్కువగా ఉంది. అది ఆందోళనకు కారణం అవుతుంది.

ఉన్నత విద్య పరంగా ముస్లింల స్థితి మరింత ఆందోళనగా ఉంది. 2013 లో విడుదల చేసిన  అమెరికన్-ఇండియా పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం, సచార్ రిపోర్టు సమర్పించిన  ఆరు సంవత్సరాల తరువాత భారతదేశంలో ముస్లింలలో ఉన్నత విద్య కేవలం 11% మాత్రమే జాతీయ సగటు  19% ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం జనరల్ కేటగిరి ఉన్నత విద్య లో ముస్లింల పరిస్థితి తగ్గుదల లో ఉంది.

అక్షరాస్యత రేటు మరియు ఉన్నత విద్య గణాంకాలు ముస్లిం మహిళల సాధికారతకు డబల్ అడ్డంకిగా ఉన్నాయి. విద్యలో అక్షరాస్యత అనేది ప్రారంభ శ్రేణి మరియు ఉన్నత విద్య అనేది సాధికారికత పొందడానికి పూర్తిస్థాయి లో  తోడ్పడుతుంది. ఈ గణాంకాల ప్రకారం తగినంత మంది ముస్లిం మహిళలు ప్రారంభ శ్రేణిని దాటలేదని, చాలా కొద్దిమంది మాత్రమే  పూర్తి స్థాయి కి చేరుతారని తెల్పుతున్నాయి.

ముస్లిం మహిళలు -పూర్తి విద్యా కొనసాగి౦పు:
ఇది తప్పనిసరిగా జరగాలి. ముస్లిం మహిళల మొత్తం విద్యా కొనసాగింపు పూర్తి స్థాయి లో జరగాలి.   ముస్లిం మహిళలు -పూర్తి విద్యా కొనసాగి౦పు ముస్లిం మహిళ, ముస్లిం కుటుంబం మరియు భారతదేశం యొక్క భవిష్యత్తు కోసం కీలకమైనది.

ఒక ముస్లిం మహిళ కోసం, విద్య సాధికారికంగా ఉంది. ఇది అజ్ఞానం యొక్క సంకెళ్ళు తొలగిస్తుంది. ఇది జ్ఞానం, నైపుణ్యాలు మరియు వైఖరులను అభివృద్ధి చేస్తుంది. ఇది స్వీయ గౌరవం మరియు విశ్వాసం పెంచుతుంది. విద్య ఒక బహుమతి లాంటిది  భవిష్యత్తులో ఇది ఒక సృష్టికర్త మరియు వంతెన లాంటిది.

ముస్లిం కుటుంబానికి, విద్య ఒక మార్పు ఏజెంట్ అది  ముస్లిం మహిళకు  సాధికారికతను  కల్పిస్తుంది.  చాలా ముస్లిం కుటుంబాలు పేదరికంలో చిక్కుకున్న కారణంగా విద్య పొందలేకపోతున్నారు.  ముస్లిం మహిళ తన స్వంత విద్యతో తన పిల్లలను విద్యావంతులను చేయగలదు. పేదరికం నుండి బయటికి రావడానికి ముస్లిం మహిళలకు విద్య తోడ్పడుతుంది. విద్య శక్తివంతమైన సాధనం.
 
విద్య అనేది  భారతదేశం కోసం ప్రపంచంలో అతిపెద్ద ప్రాతినిద్య  ప్రజాస్వామ్య వాగ్దానం అందిస్తుంది. ఆ వాగ్దానికి కేంద్రం సమానత్వం, అవకాశం మరియు సంపూర్ణ ఆర్థిక చలనశీలత. విద్య సాధికారికత  వాగ్దానం ను నిజం చేస్తుంది. వాగ్ధానం నిజం అయినప్పుడు ముస్లిం మహిళ భారతదేశం ఉన్నతి కి తోడ్పడగలదు. వారు భారతదేశం చిత్ర పటాన్ని ప్రపంచ స్థాయి లో మార్చగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

21 వ శతాబ్దంలో, ఉన్నత విద్య అనేది విజయపు   నిచ్చెన పైకి ఎక్కడానికి చాలా ముఖ్యమైనది. ఉన్నత విద్య అనగా కేవలం కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాలు కాదు. దానిలో సెకండరీ స్థాయిలో సాంకేతిక, వృత్తిపరమైన మరియు వృత్తిపరమైన విద్య కూడా కలిసి ఉంది. అజంఘర్  ఫాతిమా గర్ల్స్ ఇంటర్ కాలేజీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అబ్దుల్లా మహిళల కళాశాలలోని  యువ ముస్లిం మహిళా విద్యార్థులు ఉన్నత విద్య పై సానుకూల దృక్పదాన్ని, నిబద్ధతను చూపారు.

భారత ముస్లిం మహిళా సముదాయం నుండి "భారతదేశం మరియు ప్రపంచాన్ని మెరుగు పరిచే భవిష్యత్తు నాయకులు  వస్తారు".
.
ముస్లిం మహిళలను విద్యాభ్యాసం పొందుతారు మరియు ఇతర ముస్లిం మహిళలకు సాధికారికత కల్పిస్తారు. ఇలా  చక్రం కొనసాగుతుంది.

అది సంభవించినప్పుడు, ముస్లిం మహిళల సంపూర్ణ సామర్థ్యo బయట పడుతుంది. వారు భారతదేశం మరియు ప్రపంచాన్ని గెలుస్తారు.  వారు విజయం సాధించినప్పుడు, మనమందరం విజయవంతం అవుతారు. భారతదేశం విజయం సాధించింది. ప్రపంచం విజయవంతమవుతుంది.

హ్యాపీ వరల్డ్‌ స్లీప్‌ డే

తీరిక లేకుండా చేసే ఉద్యోగాలు, జీవితంలో మోసే బాధ్యతలు మనకు తెలియకుండానే ఎన్నో ఒత్తిడిలకు గురిచేస్తుంటాయి. వాటిని ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సిన పనులు కూడా చేయలేము. ఫలితంగా సహజ సిద్ధంగా చక్కటి ఆరోగ్యం లభించే పరిస్థితిని కోల్పోయి నిత్యం ఆస్పత్రుల చుట్టూ పరుగులు పెడుతుంటాము. బహుశా అందుకేనేమో.. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండంటూ ఏడాదిలో కొన్ని ప్రత్యేకమైన రోజులు పెట్టారనుకుంటా. వివధ దినోత్సవాల మాదిరిగానే మార్చి 16కు కూడా ఒక ప్రత్యేకత ఉంది.

అదే ప్రపంచ నిద్ర దినోత్సవం (వరల్డ్‌ స్లీప్‌ డే-మార్చి 16). మన దేశంలో దీనికి పెద్దగా ప్రాధాన్యత, గుర్తింపు లభించనప్పటికీ వివిధ దేశాల్లో ఈ దినోత్సవాన్ని తప్పకుండా పాటిస్తారు. ఆ రోజు భిన్నచర్చలు జరుపుతుంటారు. వాస్తవానికి శరీరానికి విశ్రాంతి లేకుంటే ఏం చేయలేము.. చేసినా అది స్పష్టంగా ఉండదు. శరీరంలోని ప్రతి భాగం సమన్వయం కావాలంటే నిద్ర తప్పనిసరి. అందుకే ప్రతి మనిషి రోజు కనీసం 8గంటలైనా నిద్రపోవాలని ప్రత్యేకంగా హెచ్చరించి మరీ చెబుతుంటారు. ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా నిద్రతో వచ్చే లాభాలుపలువురు, వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్పారు.. వాటిని ఒకసారి పరిశీలిస్తే..

1.ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఉత్పాదక శక్తి పెరుగుదల
మెదడు సక్రమంగా పనిచేయడంలో నిద్రనే కీలక పాత్ర పోషిస్తుంది. అది సరిగా పనిచేస్తే మంచి ఉత్పాదక శక్తి, ఏకాగ్రత లభిస్తుంది. గొప్పగా, తెలివిగా పనిచేయడంలో సహకరిస్తుంది. మంచి జ్ఞాపక శక్తిని పెంచేందుకు కూడా నిద్ర ఉపయోగపడుతుంది.

2.క్రీడల్లో, వ్యాయామాల్లో రాణింపజేస్తుంది
సరైన నిద్ర అథ్లెటిక్స్‌లో బాగా రాణించేలా చేస్తుంది. అలాగే, దేహదారుఢ్యం చక్కగా ఉంచుకునేందుకు చేయాల్సిన వ్యాయామానికి సహకరిస్తుంది. మానసిక చలనత్వం వేగంగా చేస్తుంది.

3.రోగ నిరోధకశక్తి పెంపొందుతుంది
చక్కటి నిద్రతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిర్ణయించిన 8గంటల లోపుకంటే ఎవరు తక్కువగా నిద్రిస్తారో వారిలో జలుబు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఎదుర్కోవడం 8గంటలకంటే ఎక్కువ నిద్రపోవడంతోనే సాధ్యం అవుతుంది.

4. ఒళ్లు నొప్పులు తగ్గిస్తుంది
గాఢమైన నిద్ర శరీరంలోకి కలిగే నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. సరిగా నిద్రపోకుంటే శరీరంలోని కణాలు దెబ్బతినే అవకాశం ఎక్కువవుతుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ పరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. నొప్పులకు సంబంధించిన  రోగాలు బయలుదేరతాయి.

5. నిద్రలేమితో కష్టమే
నిద్రలేమితో శరీరంలో అమితంగా కొవ్వుపేరుకుపోతుంది. ఒబేసిటీకి నిద్రలేమి ముఖ్యకారణం. నిద్ర తక్కువగా పోవడం మూలంగా హార్మోన్లలో సమన్వయం పోతుంది. పైగా వ్యాయామం చేయాలనే ఆలోచనను కూడా దూరం చేస్తుంది. బరువు తగ్గాలంటే చక్కటి నిద్ర కూడా అవసరం.

6. భావోద్వేగాల నియంత్రణ, సామాజిక సంబంధాలు
మంచి నిద్ర వ్యక్తులను భావోద్వేగాల పరంగా బలమైనవాడిగా మారుస్తుంది. అలాగే, తన చుట్టూ ఉండేవారితో చక్కటి సంబంధాలు కొనసాగించేందుకు కూడా సహకరిస్తుంది.

7. నిద్రలేమి వల్లే మానసిక ఒత్తిడి
నిద్రలేమి కారణంగానే మానసిక ఒత్తిడిలు వస్తాయి. 90శాతం ఒత్తిడితో బాధపడే రోగులు తగినంత నిద్రపోని వారే ఉంటారని ఇప్పటికే పరిశోధనలు తేల్చాయి. చాలినంత నిద్ర పోకుంటే అప్నియా, ఇన్సోమ్నియా, ఒత్తిడివంటి సమస్యలు వస్తాయి.
ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో సమస్యలు ఉంటాయి. అందుకే సహజ సిద్ధంగా లభించే నిద్రను ఆస్వాధించండి.. చక్కటి ఆరోగ్యంతో జీవించండి.. హ్యాపీ వరల్డ్‌ స్లీప్‌ డే..

సిరియా చరిత్ర History of Syria




ఇస్లామిక్ సిరియా చరిత్ర   
సిరియా ఆసియాఖండం లోని పశ్చిమాసియా ప్రాంత  దేశము. దీని రాజధాని డమాస్కస్.  పూర్తి పేరు సిరియన్ అరబ్ రిపబ్లిక్ Syrian Arab Republic
Al-Jumhūriyyah al-ʿArabiyyah as-Sūriyyah الجمهورية العربية السورية
(అల్ జుమురియా అల్ అరబియ అస్ సుర్రియా). దేశ అధికార బాష అరబిక్ మరియు సిరియా లో అద్యక్ష గణతంత్ర రాజ్యము అమలులో ఉన్నది.  దేశ అద్యక్షుడు బషర్ అల్ అస్సాద్. ఫ్రాన్స్ నుండి 1946 లో స్వాతంత్ర్యం పొందినది.దాదాపు 2 కోట్లకు పైగా జనాభాను కలిగి ఉంది. మానవాబ్రివ్రుద్ది సూచికలో 107 స్థానం పొందినది. దేశ కరెన్సీ సిరియన్ పౌండ్స్. దేశం లో  90 శాతం ముస్లిములు, 8 శాతం క్రైస్తవులు,1 శాతం మిగిలిన ఇతర మతాల వారు ఉన్నారు. పత్తి, పళ్ళు, బంగాళదుంపలు, చెరకు, గోధుమలు, బార్లీ, కూరగాయలు మొదలైన పంటలు పండిస్తారు.  చమురు సహజవాయువులు, దుస్తుల పరిశ్రమలు, పళ్ళు, కూరగాయల ప్రాసెసింగ్, బార్లీ, ఊలు, సిమెంటు, తోలు వస్తువులు, గ్లాస్, మెటల్ పరిశ్రమలు కలవు. ఇరాక్జోర్డాన్ఇజ్రాయెల్లెబనాన్టర్కీమధ్యధరా సముద్రం తో సరిహద్దులు కలవు.

సిరియా చరిత్ర పూర్వ కాలం లో:

క్రీ.పూ. 2500 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజలు  ఉన్న దాఖలాలు ఉన్నాయి. రాజధాని డమాస్కస్ నగరంలో ఆనాటి ఆనవాళ్ళు ఇప్పటికీ కనబడుతున్నాయి. క్రీస్తుకు పూర్వం 10 వ శతాబ్దం లో నియో-అస్సీరియన్ సామ్రాజ్యo యొక్క రాజధాని నగరం అషుర్ (Ashur)  నుండి "సిరియా" అనే పేరు ఉద్భవించింది. ఈ భూభాగంను వివిధ కాలాలలో  వివిధ పాలకులు స్వాధీనం చేసుకున్నారు, మరియు వివిధ ప్రజలు అక్కడ  స్థిరపడ్డారు.

క్రీస్తు కు పూర్వం 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు ఫోనీషియన్లు,  ఫోనేషియన్ల తర్వాత గ్రీకులురోమన్లుబైజాంటైన్ రాజులు పరిపాలించారు దేశంలో ఎక్కువగా పర్వత ప్రాంతాలు, ఎడారి ఆక్రమించి ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా రాజధాని డమాస్కస్ ప్రాంతంలో నివసిస్తుంటారు. 'సిరియన్లు'’ ఎక్కువగా వ్యాపార రంగంలో ఉన్నారు. చైనాభారతదేశంఅరబ్బు దేశాలతో వ్యాపార సంభందాలను కలిగి ఉన్నారు.

 ఖలీఫాల పరిపాలన లో సిరియా :

క్రీస్తు శకం 634-640 లో ఖలీద్ ఇబ్న్ అల్-వాలిద్ నేతృత్వంలోని రాషీదున్ సైన్యం రూపంలో ముస్లిం అరబ్లు సిరియాను స్వాధీనం చేసుకున్నారు, ఫలితంగా సిరియాదేశం ఇస్లామిక్ సామ్రాజ్యంలో భాగమైంది. కొన్ని వందల సంవత్సరాలపాటు ఖలీఫాలు పరిపాలించారు.

7 వ శతాబ్దం మధ్యకాలంలో ఉమయ్యద్ రాజవంశం తమ సామ్రాజ్య రాజధానిని  డమాస్కస్లో ఉంచారు. డమాస్కస్, హోమ్స్, పాలస్తీనా మరియు జోర్డాన్ అనే నాలుగు  జిల్లాలుగా సిరియాను విభజించారు. ఇస్లామిక్ సామ్రాజ్యం వేగంగా విస్తరించింది. స్పెయిన్ నుండి భారతదేశం మరియు మధ్య ఆసియా వరకు విస్తరించింది. అందువల్ల సిరియా సామ్రాజ్యపరంగా, సామ్రాజ్య కేంద్రంగా ఉంది. అబ్దుల్ మాలిక్ మరియు అల్-వాలిద్ I వంటి ప్రారంభ ఉమ్మాయాద్ పాలకులు ముఖ్యంగా డమాస్కస్, అలెప్పో మరియు హోమ్స్ వంటి  సిరియా లోని ప్రాంతాలలో  అనేక అద్భుతమైన రాజభవనాలు మరియు మసీదులు నిర్మించారు.ఉమ్మయ్యాద్ ఖలీఫాలు క్రైస్తవుల పట్ల మత సహనం  చూపారు. అర్మినియన్లు మరియు ఈశాన్య అస్సీరియన్లు అనేక ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు.

8 వ శతాబ్దం మధ్యకాలంలో ఖలీఫాత్ రాజవంశ పోరాటాలు, ప్రాంతీయ తిరుగుబాట్లు మరియు మతపరమైన వివాదాల మధ్య కుప్పకూలింది. ఉమాయ్యాద్ రాజవంశం స్థానం లో  750 లో అబ్బాసిద్ వంశస్తులు అధికారం లోనికి వచ్చారు.  సామ్రాజ్యం యొక్క రాజధాని బాగ్దాద్కు తరలించబడింది. అబ్బాసిద్ యుగంలో అరబిక్ అధికార బాష అయినది.

ఆ తరువాత అనేక సంవత్సరాల  వరకు సిరియాను ఈజిప్టు నుంచి తులనిడ్స్ (887-905) అ తర్వాత ఇఖిషీద్డ్స్ Ikhshidids (941-969) అనంతర కాలం లో ఉత్తర సిరియా అలెప్పో యొక్క హమ్దానిడ్స్Hamdanids క్రింద వచ్చింది. ఆలీ సైఫ్ అల్-దౌలా యొక్కఆస్థానం, 'స్వోర్డ్ ఆఫ్ ది స్టేట్' (944-967) సంస్కృతికి కేంద్రంగా ఉంది, అరబిక్ సాహిత్యం పోషించబడినది.  సిరియాను తిరిగి పొందడానికి బైజాంటైన్ ప్రయత్నాలను అతడు అడ్డుకున్నాడు.

అతని మరణం తరువాత బైజాంటైన్లు ఆంటియోచ్ మరియు అలెప్పోలను(969) స్వాధీనం చేసుకున్నారు హమ్దానిడ్స్, బైజాంటైన్స్ మరియు డమాస్కస్ ఆధారిత ఫాతిమడ్స్  మధ్య అంతర్యుద్దం లో సిరియా చిక్కుకోంది. బైజాంటైన్లు మొత్తం సిరియాను 996 లో స్వాధీనం చేసుకున్నారు, కానీ 11 వ శతాబ్దంలో సిరియాను సెల్జక్ టర్క్లు (1084-1086) స్వాధీనం చేసుకున్నారు. సెల్జుక్ పాలనలో ఒక శతాబ్దం తరువాత, సిరియాను (1175-1185) ఈజిప్ట్ యొక్క అయ్యూబిడ్ రాజవంశం స్థాపకుడైన సలాదిన్ జయించారు.

12 వ -13 వ శతాబ్దాలలో, సిరియా యొక్క భాగాలు క్రుసేడర్ (క్రైస్తవ) రాజ్యాల పాలనలోకి వచ్చాయి. 1260 లో సిరియా ను మంగోలులు జయించారు.  ఆ తరువాత ఈజిప్ట్ యొక్క మమ్లుకులు సిరియాను జయించారు. మామ్లుక్ నాయకుడు బైబార్లు,  కైరో ప్రధాన రాజధానిగా మరియు  డమాస్కస్ ను  ఒక ప్రాంతీయ రాజధానిగా రూపొందించాడు. మమ్లుకులు సిరియాలోని క్రూసేడర్స్ ను తొలగించి అనేక మంగోల్ దండయాత్రలను తిప్పికొట్టారు.

అలెప్పో యొక్క కోట ప్రపంచంలోని పురాతన మరియు అతిపెద్ద కోటలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 1400 లో, తైమూర్ లెంక్ లేదా తమెర్లేన్, సిరియాపై దాడి చేసి, అలెప్పో వద్ద మమ్లుక్ సైన్యాన్ని ఓడించి డమాస్కస్ను స్వాధీనం చేసుకుంది. నగరం యొక్క నివాసితులు చాలామంది సంహరించబడ్డారు, శిల్పకారులను మినహాయించి మిగతా  వారిని సమర్ఖండ్ కు  తరలించారు. ఈ సమయంలో సిరియా క్రైస్తవ జనాభా హింసకు గురయింది.

1516 లో ఒట్టోమన్ సామ్రాజ్యం సిరియాను జయించారు.

ఒట్టోమన్ యుగం లో :


ఒట్టోమన్ సుల్తాన్ సెలిమ్ అలెప్పో సమీపంలోని మార్జ్ దబిక్ యుద్ధంలో మామ్లుక్లను ఓడించిన తరువాత 1516 లో సిరియాలో చాలా ప్రాంతం స్వాధీనం చేసుకున్నాడు. 1516 నుండి 1918 వరకు ఒట్టోమన్ సామ్రాజ్యంలో సిరియా భాగంగా ఉంది, అయితే ఇరానియన్ సఫావిడ్స్, ముఖ్యంగా షా ఇస్మాయిల్ I మరియు షా అబ్బాస్ 2 చేత  స్వల్ప కాలం సిరియా  ఆక్రమించ బడింది.

 ఒట్టోమన్ పాలన లో అరబిక్ దివ్య ఖురాన్ బాషగా గౌరవించబడినది మరియు డమాస్కస్ మక్కాకు ప్రధాన రహదారి ప్రదేశంగా మారింది, మరియు ఇది మక్కా యాత్రకు హాజరైన యాత్రికుల బార్కాహ్ (ఆధ్యాత్మిక శక్తి లేదా దీవెన) కారణంగా ముస్లింలకు పవిత్రమైన స్థలం గా రుపొందింది.

ఒట్టోమన్ టర్కులు సిరియాను ఒక పెద్ద ప్రావిన్స్ మార్చారు. ప్రావిన్స్ తిరిగి అనేక జిల్లాలు లేదా   సంజక్స్ గా  ఉపవిభజన చేశారు. 1549 లో సిరియా రెండు ప్రావిన్స్ గా పునర్వ్యవస్థీకరించబడింది; డమాస్కస్ ప్రావిన్స్ మరియు అలెప్పో ప్రావిన్స్. 1579 లో లాటాకియా, హమా మరియు హోమ్స్ లను కలిగి ఉన్న ట్రిపొలీ ప్రావిన్స్ స్థాపించబడింది. 1586 లో తూర్పు సిరియాలో రక్కా  ప్రావిన్స్ స్థాపించబడింది.

ఒట్టోమన్ పరిపాలన లో నాలుగు వందల సంవత్సరాల పాటు సిరియన్ సమాజం శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించింది. ప్రతి రిలీజియస్  మైనారిటీ - షియా ముస్లిం, గ్రీక్ ఆర్థోడక్స్, మరానైట్, అర్మేనియన్ మరియు యూదులు  కలసి మెలసి ఉన్నారు. సమాజంలోని మతపరమైన అధిపతులు అన్ని వ్యక్తిగత హోదా చట్టాలను నిర్వహించారు మరియు కొన్ని పౌర కార్యక్రమాలను నిర్వహించారు.ఆధునిక ఒట్టోమన్ పరిపాలనలో ఆధునిక సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, జోర్డాన్, పాలస్తీనా అథారిటీ, గాజా స్ట్రిప్ మరియు టర్కీ మరియు ఇరాక్ ప్రాంతాలలో గ్రేటర్ సిరియా భూభాగం ఉంది.


మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అక్టోబర్ 1918 లో అరబ్ మరియు బ్రిటీష్ దళాలు సిరియా లోకి ప్రవేశించి డమాస్కస్ మరియు అలెప్పోను ఆక్రమించారు. సైక్స్-పికోట్ (Sykes-Picot agreement) ఒప్పందానికి అనుగుణంగా, 1920 లో ఫ్రెంచ్ నియంత్రణలో సిరియా లీగ్ ఆఫ్ నేషన్స్ ఆదీన ప్రాంతం  అయ్యింది. 17 ఏప్రిల్, 1946లో   సిరియా దేశం స్వాతంత్య్రం పొందింది