30 September 2020

ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు మౌలానా హబీబర్ రెహ్మాన్ లుధియాన్వి मौलाना हबीबुर्रहमान लुधियानवी



పార్లమెంట్  సెంట్రల్ హాల్ (సెంట్రల్ హాల్) లో భగత్ సింగ్ బాంబులు విసిరినప్పుడు  బ్రిటిష్ ప్రభుత్వం  భగత్ సింగ్ కుటుంబం మరియు వారి సన్నిహితుల పై నిర్దయతో కక్షపురిత చర్యలను ప్రారంభించినది.. బ్రిటిష్ వారి అణచివేతకు భయపడి అతని కుటుంబ సభ్యులకు ఆశ్రయం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో పంజాబ్లో చాలా ప్రభావవంతమైన నాయకుడు మౌలానా హబీబుర్రహ్మాన్ లుధియాన్వి భగత్ సింగ్ కుటుంబ సభ్యులకు ఆశ్రయం కల్పించడానికి ముందుకు వచ్చారు.

మౌలానా తన ఇంటిలో భగత్ సింగ్ కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు. వారు ఒక నెలకు పైగా మౌలానా హబీబర్ రెహ్మాన్ ఇంట్లో  అతిదులుగా  ఉన్నారు. మౌలానా హబీబర్ రెహ్మాన్ కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్‌తో కూడా సన్నిహితంగా ఉండేవారు  మరియు భారత జాతీయ ఉద్యమం లో ముఖ్యమైన పాత్ర పోషించారు

మౌలానా హబీబ్-ఉర్-రెహ్మాన్ లుధియాన్వి ఒక అరేన్ (తెగ) కు చెందినవాడు మరియు 1857 నాటి భారత తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వలసరాజ్యాల పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిపిన స్వాతంత్ర్య సమరయోధుడు షా అబ్దుల్ ఖాదిర్ లుధియాన్వి యొక్క ప్రత్యక్ష వంశస్థుడు.

1857 నాటి భారత తిరుగుబాటు సమయంలో హబీబ్-ఉర్-రెహ్మాన్ లుధియాన్వి తాత షా అబ్దుల్ ఖాదిర్ లుధియాన్వి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు మరియు పంజాబ్ నుండి వారిపై తిరుగుబాటు చేసిన వారిలో మొదటివాడు. అతను ఒక పెద్ద పోరాట శక్తిని సేకరించి బ్రిటిష్ వారిని లూధియానా నుండి మాత్రమే కాకుండా పానిపట్ నుండి కూడా తరిమికొట్టాడు. ఈ పోరాట శక్తిలో ముస్లింలు, హిందువులు మరియు సిక్కులు ఉన్నారు. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌కు మద్దతుగా దిల్లికి వెళ్లారు. అతను 1857 లో డిల్లి లోని చాందిని చౌక్ వద్ద వేలాది మందితో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన ప్రాణాలను త్యాగం చేసినాడు..

మౌలానా హబీబ్-ఉర్-రెహ్మాన్ లుధియాన్వి 3 జూలై 1892 న పంజాబ్ లోని లుధియానాలో జన్మించారు. మౌలానా హబీబ్-ఉర్-రెహ్మాన్ లుధియాన్వి మౌలానా అబ్దుల్ అజీజ్ కుమార్తె బీబీ షఫతున్నిసాను వివాహం చేసుకున్నారు..

ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. ఖిలాఫత్ ఉద్యమం మరియు నాన్ కో ఆపరేషన్ ఉద్యమంలో మౌలానా చాలా చురుకుగా పనిచేశారు. మౌలానా హబీబుర్ రెహ్మాన్ 1921 డిసెంబర్ 1 న మొట్టమొదటసారి  అరెస్టు చేయబడ్డాడు. లూధియానాలో వారి ఉత్తేజకరమైన ప్రసంగాల  వల్ల, అక్కడి ప్రజలు  బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. వారు 14 సంవత్సరాలు దేశంలోని అనేక  జైళ్లలో  గడిపారు మరియు హింసను అనుభవించారు.

మౌలానా బంధువులు కూడా జాతీయోద్యమం లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు, స్వాతంత్ర్య సమరయోధురాలు అయిన  అయిన మౌలానా భార్య షఫతున్నిసా బీబీకూడా జాతీయోద్యమం లో పాల్గొని   బ్రిటిష్ పోలీసుల చేతిలో  క్రూరమైన అణచివేతకు గురి అయినారు..

జమైత్-ఉల్-ఉలామా-ఎ-హింద్‌లో కీలక పాత్ర పోషించిన లుధియాన్వి  ఒక విప్లవ వక్త మరియు భారతదేశంలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలనుకున్న జాతీయవాద ఉద్యమం మజ్లిస్-ఎ-అహ్రార్-ఉల్-ఇస్లాం(1920) (ది సొసైటీ ఆఫ్ ఫ్రీమెన్)  వ్యవస్థాపకులలో ఒకరు.వారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సలహా ప్రకారం ఈ పని చేసినారని మౌలానా అంతరంగికుల వాదన.ఈ సమయంలో లుదియానా లో జరిగిన ఒక సంఘటన వారిన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేటట్లు చేసింది..

1929 లో, బ్రిటిష్ 'డివైడ్ అండ్ రూల్' విధానం ప్రకారం పంజాబ్‌లోని లుధియానాలోని గ్రాస్ మండి చౌక్ వద్ద హిందువులు మరియు ముస్లింల కోసం వేరు వేరు గా నీటి కుండల ఉంచారు. మౌలానా  మౌలానా హబీబర్ రెహ్మాన్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు  మరియు "సబ్కా పానీ ఏక్ హై" పేరుతో ఒక ప్రచారాన్ని ప్రారంభించాడు, ఇది దేశవ్యాప్తంగా  వ్యాపించింది. లూధియానాలో ఈ విషయంపై పెద్ద నిరసన జరిగింది, ఇందులో పండిట్ నెహ్రూ కూడా పాల్గొన్నారు. నిరసన పలితంగా బ్రిటీష్ ప్రభుత్వం దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఒకే నీటి కుండను ఏర్పాటు చేయవలసి వచ్చింది, ఇది సబ్కా పానీ ఏక్ హై అనే సందేశాన్ని ఇస్తుంది.

 

మౌలానా హబీబర్ రెహ్మాన్ ఎల్లప్పుడూ బ్రిటిష్ వారికి తలనొప్పి కల్గించేవారు.. అతను 1931 లో షాహి జామా మసీదు సమీపంలో సుమారు మూడు వందల మంది బ్రిటిష్ అధికారులు మరియు పోలీసుల సమక్షంలో భారత జెండాను ఎగురవేసారు. వారిని  అరెస్టు చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం, వారిని సిమ్లా, మనాలి, ధర్మశాల, ముల్తాన్, లూధియానాతో సహా వివిధ జైళ్లలో 14 సంవత్సరాలు ఉంచారు.

 

తన చివరి క్షణం వరకు ప్రజల స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం కోసం కట్టుబడి ఉన్న మౌలానా హబీబ్-ఉర్-రెహ్మాన్ లుధియాన్వి, 1956 సెప్టెంబర్ 2 న కన్నుమూశారు (వయసు 64). అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆయనకు సన్నిహితులు అని చెబుతారు. నెహ్రు అభ్యర్థన మేరకు మౌలానా హబీబర్ రెహ్మాన్‌ను డిల్లి లోని జామా మసీదు సమీపంలోని స్మశానవాటికలో ఖననం చేశారు.

 

ఈ సమాచారం అంతా ప్రసిద్ధ చరిత్రకారుడు మాస్టర్ తారా సింగ్ రాసిన 'హిస్టరీ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ ఇండియా' పుస్తకంలో ఉంది. మాస్టర్ తారా సింగ్ కూడా మౌలానాకు సన్నిహితులు.

 

మౌలానా హబీబర్ రెహ్మాన్ మనమడు లూధియానాలోని షాహి జామా మసీదు ఇమామ్ మౌలానా హబీబుర్రహ్మాన్ కస్మిII ప్రకారం, సర్దార్ భగత్ సింగ్ కుటుంబ వాసులు ఇప్పటికీ ఆయనను సందర్శిస్తారు మరియు తమ పూర్వీకులు చెప్పిన సమాచారాన్ని గుర్తు చేసుకొంటారు. భగత్ సింగ్ సోదరుడి కుమారుడు సంధు కూడా తరచుగా ఇక్కడకు వస్తాడు. అతను అభిప్రాయంలో మౌలానా హబీబుర్రహ్మాన్ గొప్ప వ్యక్తి నిజమైన దేశభక్తుడు మరియు వారి కుటుంభ దేశబక్తులగల  కుటుంభం అని అంటాడు..

 

 

 


 

27 September 2020

భారతదేశంలో ముస్లిం విద్య: కొన్ని సూచనలు Muslim education in India: Some Suggestions


ముస్లింలు మరియు బలహీన వర్గాలలోని ఇతరులు అభివృద్ధి పరంగా ఇతర మత సమూహాలలో ఉన్నవారి కంటే చాలా వెనుకబడి ఉన్నారు. ప్రీ-స్కూల్ నుండి ఉన్నత విద్య ద్వారా వరకు విద్య లో అభివృద్ధి లోటు కన్పిస్తుంది.

 

2006 యొక్క సచార్ కమిటీ నివేదిక భారత దేశం లోని అనేక ప్రాంతాలలోని  మైనారిటీలు విద్యా పరంగా  "అభివృద్ధి లోటు" ను కలిగి ఉన్నారని వెల్లడించింది. ఈ నివేదిక భారతదేశంలో మైనారిటీల అభివృద్ధి కోసం బోర్డు ప్రోగ్రాంను రూపొందించింది.

 

2011 జనాభా లెక్కల ప్రకారం, ముస్లింలలో  అక్షరాస్యత రేటు 68.5 శాతానికి పెరిగింది. ముస్లిం స్త్రీల అక్షరాస్యత రేటు 52 శాతానికి తగ్గలేదు.

 

2013 చివరిలో యుఎస్ ఇండియా పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఒక అధ్యయనం ప్రకారం, 2006 నుండి,ఇతర వర్గాల జనాభాతో పోలిస్తే ముస్లింల అక్షరాస్యత స్థాయి మరియు మెరుగుదలలు నిరాడంబరంగా modest ఉన్నాయి.

 

అదే అధ్యయనం ప్రకారం, భారతదేశంలో ముస్లింలలో కేవలం 11 శాతం మంది మాత్రమే (జాతీయ సగటు సుమారు 19 శాతం) ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు అని తెలిపింది.

 నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 75 వ రౌండ్ నివేదిక 3 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల ముస్లిం బాలికలలో 22 శాతం మంది ఎప్పుడూ అధికారిక/ఫార్మల్  విద్యా కోర్సులో చేరలేదని తేలింది.

సచార్ కమిటి నివేదిక తరువాత ముస్లిం సామాజిక వర్గం విద్యాపరంగా కొంత పురోగతి సాధించబడింది, కాని ఇంకా చాలా చేయాల్సి ఉంది.

 

అందుకు కొన్ని సూచనలు:

 అన్ని స్థాయిలలో విద్యావకాశాలను, నాణ్యతను మెరుగుపరచాలి. విద్యా అక్షరాస్యత ప్రారంభ రేఖగా ఉండాలి మరియు ఉన్నత విద్య ముగింపు రేఖగా ఉండాలి.

 ప్రాధమిక మరియు ద్వితీయ స్థాయిలలోని విద్యార్థుల కోసం, భాష, విజ్ఞానం, గణితం మరియు సాంకేతిక పరిజ్ఞానంలో ప్రాథమిక జ్ఞానం, నైపుణ్యాలు మరియు సామర్ధ్యాలను నిర్ధారించడానికి విద్యా మెరుగుదల కార్యక్రమాలను అప్‌గ్రేడ్ చేయవలసిన  అవసరం ఉంది.

ముస్లిం పిల్లలు మరియు యువత మదరసాల లో 2-4 శాతం మధ్య మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు. మదరసాలు  తమ పాఠ్యాంశాలను ఆధునీకరించాలి మరియు ఇస్లాం కేంద్రీకృత విద్య నుండి సమగ్ర విద్యా విధానానికి మారాలి.  మదరసా విద్యార్ధులు  పూర్తిగా భారతీయ సమాజంలో కలిసిపోయే విద్యావిధానం ను అనుసరించాలి.

 సెకండరీ మరియు పోస్ట్ సెకండరీ స్థాయిలలో సాంకేతిక, వృత్తి మరియు వృత్తి విద్యను కలిగి ఉండాలి.

 విద్య 21 వ శతాబ్దపు కేరియర్స్ లో  పాల్గొనడానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పోటీపడే సామర్థ్యాలు పెంచేదిగా ఉండాలి. విద్యా సౌకర్యాల విస్తరణ  ముస్లింలలోని పేదరికం తొలగించడానికి ఉపయోగపడుతుంది.

 ముస్లింలకు విద్యావకాశాలు కల్పించడంలో ముస్లిం సంస్థలు కృషి చేయాలి.

ముస్లిం బాలికల విద్యా ప్రాప్యతను మెరుగుపరచడానికి కృషి చేయవలసి ఉంది. విద్య బాలికలలో మార్పు ఏజెంట్ కావలి. తల్లి తన పిల్లలను విద్యావంతులను చేయగలదు. ముస్లిం  మహిళా గ్రాడ్యుయేట్లు భారతదేశాన్ని మరియు ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి అమూల్యమైన కృషి చేస్తారు.

భారత దేశం లోని వక్ఫ్ బోర్డులు  మరియు సంపన్న ముస్లింలు  "ప్రపంచ స్థాయి విద్యా సంస్థల" ఏర్పాటు మరియు అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయవలసిన అవసరం ఉంది.  భారత దేశం లోని ముస్లింలు మరియు ఇతర వర్గాల "అక్షరాస్యత మరియు హాజరు అంతరాలను" తగ్గించడానికి ఇది తోడ్పడుతుంది.

 

 

 

 

24 September 2020

జీనత్ మహల్ Zeenat Mahal


జినత్ మహల్ అని పిలువబడే బేగం సాహిబా జీనత్ మహల్ (زینت محل), (1823 - 17 జూలై 1886) కడపటి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా II జాఫర్ తరపున మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాస్తవ సామ్రాజ్ని. ఆమె అతనికి ఇష్టమైన భార్య. మొఘల్ కడపటి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ భార్య అయిన బేగం జీనత్ మహల్ చాలా చిన్న వయస్సు గలది ఆమె వయస్సు చక్రవర్తి వయస్సు లో సగం ఉండేది.జినత్ మహల్ 1840 నవంబర్ 19డిల్లి లో బహదూర్ షా II ను వివాహం చేసుకున్నారు మరియు  వారికి మీర్జా జవాన్ బఖ్త్ అనే కుమారుడు జన్మించాడు.

 

జీనత్ మహల్ తన  కాలంనాటి  అత్యంత ప్రభావవంతమైన మహిళలలో ఒకరు. ఆమెను నూర్జహాన్ (జహంగీర్ భార్య) లక్ష్మీబాయి, రజియా సుల్తానా, హోల్కర్ అహిలియాబాయి మరియు చంద్ బీబీ తో పోల్చవచ్చు. ఆమె చక్రవర్తిని బాగా ప్రభావితం చేసింది మరియు క్రౌన్ ప్రిన్స్ మీర్జా దారా బఖ్త్ మరణం తరువాత, ఆమె తన కుమారుడు మీర్జా జవాన్ బఖ్త్ ను చక్రవర్తి సింహాసనం కు వారసునిగా ప్రోత్సహించడం ప్రారంభించింది. కానీ బ్రిటీష్ వారి ప్రిమోజెన్చర్ విధానం కారణంగా, ఇది అంగీకరించబడలేదు. ప్యాలెస్ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకున్నందుకు 1853 లో డిల్లి లోని బ్రిటిష్ రెసిడెంట్ థామస్ మెట్‌కాల్ఫ్‌ ను ఆమె విషపూరితం చేసినట్లు అనుమానించబడింది.

 

స్వాతంత్ర్య సమరయోధురాలు అయిన ఆమె  మే 11, 1857 ఉదయం మీరట్ నుండి వచ్చిన తిరుగుబాటు సిపాయిలకు ఎర్ర కోట యొక్క తలుపులు తెరిచింది. కాని  సింహాసనాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఆమె తన కొడుకును తిరుగుబాటుదారులతో సంబంధం లేకుండా చేసింది. బ్రిటీష్ వారు తిరుగుబాటును అనిచివేసినారు.  చక్రవర్తి యొక్క మరో ఇద్దరు కుమారులు తిరుగుబాటుదారులకు మద్దతు ఇచ్చినందుకు కాల్చి చంపబడ్డారు; అయినప్పటికీ, ఆమె కుమారుడు వారసుడు కాలేదు.

 

ఆమె ఎర్రకోటలో నివసించినప్పటికీ, డిల్లి లోని లాల్ కువాన్లోని Lal Kuan, ఆమెకు సొంత హవేలీ కలదు.బ్రిటిష్ వారి పట్ల విధేయత చూపిన కొంతమంది సిపాయి తిరుగుబాటుదారులు ఆమె హవేలీపై దాడి చేశారు. 1857 అక్టోబర్ మొదటి వారంలో సాధారణ స్థితి నెలకొన్న తరువాత, ఆంగ్లేయులు డిల్లిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు మరియు వారి బేగం పట్ల అయిష్టత కారణంగా ఆమె హవేలికి నష్టం చేసారు.

 

 

1858 లో ఆమె భర్తను బ్రిటిష్ వారు పదవీచ్యుతుని చేసి, మొఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేశారు, మరియు ఆమె తన భర్తతో కలిసి రంగూన్‌కు బహిష్కరించబడింది. 1862 లో ఆమె భర్త మరణించిన తరువాత, రాచరికం రద్దు చేసే ప్రయత్నంలో బ్రిటిష్ వారు చక్రవర్తి పదవిని పొందకుండా ఎవరినీ నిషేధించారు.

 

ఆమె జూలై 17, 1886 న మరణించింది(వయసు 93-94). కొంతమంది ఆమె భర్త మరణించిన తరువాత 20 సంవత్సరాలు మరణించినది అంటారు. ఆమెను రంగూన్ లో భర్త సమాధి స్థలం వద్ద ఖననం చేసారు. ఈ ప్రదేశం తరువాత బహదూర్ షా జాఫర్ దర్గా అని పిలువబడింది. అనేక దశాబ్దాలుగా మరుగున పడిన తరువాత, 1991 లో పునరుద్ధరణ సమయంలో ఈ సమాధి కనుగొనబడింది.

 

ప్రస్తుతం దిల్లిలోని ఆమె హవేలిలో 111 సంవత్సరాల క్రితం స్థాపించబడిన జీనత్ మహల్ బాలికల సీనియర్ సెకండరీ ప్రభుత్వ పాఠశాల ఉంది. ప్రస్తతం దానిని "సర్వోదయ కన్యా విద్యాలయ, లాల్ కువాన్" అని పిలుస్తారు.

 

 

 

 

 

 



 

 

 

 

 

 

 

 


 

23 September 2020

హజ్రా బేగం (1910-2003) HAJARA BEGUM (1910-2003)


ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు, కార్మిక పక్షపాతి  హజ్రా బేగం 1910 డిసెంబర్ 22 న ఉత్తర ప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించినది.ఆమె రాంపూర్లో పెరిగింది ఆమె తండ్రి బ్రిటిష్ ప్రభుత్వం లో మీరట్‌లో పనిచేసే  మేజిస్ట్రేట్. జోహ్రా సెహగల్ ఆమె సోదరి. హజ్రా బేగం కు వివాహం అయిన తరువాత కొంతకాలానికి వివాహం విఫలమై విడాకులు పొంది తన కొడుకుతో పాటు తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చారు. ఆమె మీరట్ కుట్ర కేసు నుండి ప్రేరణ పొందింది.

దేశవిముక్తి కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి శ్రామిక ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన హజారా బేగం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ కు నాయకురాలుగా కూడా పనిచేసినది..

1933 లో హజ్రా బేగం తన కొడుకుతో కలిసి మాంటిస్సోరి బోధనా కోర్సును అభ్యసించడానికి గ్రేట్ బ్రిటన్ వెళ్ళారు. బ్రిటన్లో ఆమె చదువుకునేటప్పుడు, గ్రేట్ బ్రిటన్ కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన మొదటి భారతీయులలో ఆమె ఒకరు. ఆమె భారతీయ మార్క్సిస్ట్ విద్యార్థుల సమూహంలో భాగం. ఆమె 1935 లో సోవియట్ యూనియన్‌ను సందర్శించింది.

1935 లో హజ్రా బేగం, కె.ఎమ్. అష్రఫ్, జెడ్.ఎ. అహ్మద్ మరియు సజ్జాద్ జహీర్ తో భారతదేశానికి తిరిగి వచ్చినది. ఆమె 1935 లో లక్నోలోని కరామత్ హుస్సేన్ మహిళా కళాశాలలో లెక్చరర్‌గా చేరారు. ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఏర్పాటులో ఆమె ప్రసిద్ధ కవి సజ్జాద్ జహిర్‌తో కలిసి పనిచేశారు.

ఆమె 1935 లో ఒక జాతీయవాద నాయకుడు డాక్టర్ జైనుల్ అబీదీన్ అహ్మద్‌ను వివాహం చేసుకున్నారు మరియు అదే సంవత్సరంలో ఇద్దరూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో సభ్యత్వం పొందారు. వారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, తమను పూర్తిగా భారత జాతీయ ఉద్యమానికి అంకితం చేశారు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు, హజ్రా బేగం పోలీసులకు తెలియకుండా కమ్యూనిస్ట్ పార్టీ కోసం ప్రచారం చేశారు., ఆమె 1937 లో ఆంధ్రప్రదేశ్‌లోని కొట్టపట్నంలో జరిగిన రహస్య రాజకీయ వర్క్‌షాప్‌కు కూడా హాజరయ్యారు.

హజారా బేగం చిన్న వయస్సు నుండే లింగ పక్షపాతానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆమె అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా విజయవంతంగా పోరాడింది. ఆమె అణగారిన / గుర్తించబడని రంగ కార్మికుల దోపిడీని వ్యతిరేకిoచినది ఆమె తన భర్తతో కలిసి 1940 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి తప్పుకుంది. అప్పటి నుండి, అసంఘటిత కార్మిక రంగాన్ని నిర్వహించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

ఆ  తరువాత, ఆమె Z.A. అహ్మద్ ఇద్దరూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క పూర్తి సమయం పార్టీ కార్యకర్తలు అయ్యారు. అలహాబాద్‌లోని కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఆమె చురుకుగా పాల్గొంది మరియు ఆమె ఆక్కడి రైల్వే కూలీలు, ప్రెస్ వర్కర్లు మరియు రైతులను ఆర్గనైజ్ చేసిoది..

ఆమె అలహాబాద్‌లోని Z.A. అహ్మద్, కె.ఎం. అష్రఫ్ మరియు రామ్మనోహర్ లోహియా మొదలగు సిఎస్‌పిCSP యువ నాయకులలో ఒకరు. వీరిలో లోహియా మినహా అందరూ అజ్ఞాత సిపిఐ లో సభ్యులు. ఆ సమయంలో ఆమె కొద్దిమంది మహిళా సిపిఐ సభ్యులలో ఒకరు.

ఆమె 1940 లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీ అయ్యారు మరియు దాని హిందీ-భాషా పత్రిక రోష్నినిఎడిట్ చేసారు.. కౌమి జాంగ్ వారపత్రికకు ఆమె తరచూ వ్యాసాలు రాస్తుండేవారు. ఆమె 1949 లో లక్నో జైలులో ఐదు నెలలు జైలు శిక్ష అనుభవించింది మరియు విడుదలైన తరువాత అజ్ఞాతం లో పనిచేసింది.

ఆమె 1952 లో వియన్నాలో జరిగిన ప్రపంచ శాంతి సదస్సులో పాల్గొంది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ వ్యవస్థాపకులలో హజ్రా బేగం ఒకరు. ఆమె హజ్రా ఆపాగా బాగా ప్రాచుర్యం పొందింది.

ట్రేడ్ వర్కర్స్ పట్ల ఆమె చేసిన కృషిని గుర్తించి సుప్రీం సోవియట్ జూబ్లీ అవార్డు (1960) ను కూడా ఆమె అందుకుంది. తన జీవితమంతా దేశ సేవలో, మహిళా సాధికారత కోసం గడిపిన హజారా బేగం 2003 జనవరి 20 న ఆమె తుది శ్వాస విడిచింది.