సహనం మరియు క్షమ అనేవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని, వ్యాధులను నయం
చేయడంలో, రక్తపోటును
తగ్గించడంలో సహాయపడతాయని,
తద్వారా గుండెపోటు మరియు
స్ట్రోక్‌ల నుండి మన శరీరాన్ని రక్షించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ రోజు, మానసిక రుగ్మతలతో
బాధపడుతున్న రోగులను సహనం మరియు క్షమ అలవర్చుకోమని మరియు ఇతరులకు సహాయం
చేయండి అని మానసిక డాక్టర్లు సలహా ఇస్తున్నారు. డబ్బు ద్వారా ఆనందాన్ని
పొందలేమని వారు కనుగొన్నారు. అవసరమైన వారికి
సహాయం అందించడం ద్వారా మానసిక ఆనందాన్ని పొందవచ్చును అని మానసిక నిపుణులు
అభిప్రాయపడుతున్నారు.
అల్లాహ్ మనలను సహనంతో, క్షమతో ఉండమని ఆజ్ఞాపించాడు.
అల్లాహ్, పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు:
“విశ్వాసులారా! మీ
భార్యలలో మరియు మీ సంతానం లో కొందరు మీకు శత్రువులు: వారి విషయం లో అప్రమత్తంగా
ఉండండి. ఒకవేళ మీరు ఉపేక్షించి, మన్నిస్తే అల్లాహ్ క్షమించేవాడు, కరుణించే వాడును.
64:14)
ఇతరులతో సహనంతో వ్యవరించమని మరియు వారిని క్షమించమని అల్లాహ్ మనలను ఆజ్ఞాపించాడు మరియు మన మానసిక మరియు సామాజిక సమస్యలకు తగిన చికిత్సను అల్లాహ్ సూచించాడు.
No comments:
Post a Comment