13 September 2020

జస్టిస్ మొహమ్మద్ హిదయతుల్లా 17 డిసెంబర్ 1905-18 సెప్టెంబర్, 1992.

 


జస్టిస్ హిదయతుల్లా ఒక ప్రముఖ న్యాయవాది, పండితుడు, రచయిత, విద్యావేత్త మరియు భాషావేత్త.

జస్టిస్ మొహమ్మద్ హిదయతుల్లా భారత సుప్రీం కోర్ట్ 11వ ప్రధాన న్యాయమూర్తి (ఫిబ్రవరి 25, 1968 నుండి 1970 డిసెంబర్ 16 వరకు) మరియు భారతదేశపు  6వ ఉపాధ్యక్షుడు (1979 ఆగస్టు 31 నుండి 1984 ఆగస్టు 30 వరకు).

ఆయన రెండుసార్లు భారత తాత్కాలిక అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. జూలై 1969 నుండి 24 ఆగస్టు 1969 వరకు మరియు 1982 అక్టోబర్ 6 నుండి 1982 అక్టోబర్ 31 వరకు.

 

జస్టిస్ హిదయతుల్లా 1905 డిసెంబర్ 17 న బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, భారతదేశం) లోని యునైటెడ్ ప్రావిన్స్ లోని లక్నోలో ప్రసిద్ధ ముస్లిం ఉన్నత తరగతి కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి ఉర్దూ కవి మరియు అతని తాత న్యాయవాది. జస్టిస్ హిదయతుల్లా భారతదేశపు మొదటి ముస్లిం ప్రధాన న్యాయమూర్తి మరియు భారత రాష్ట్రపతి పదవిని నిర్వహించిన 2వ ముస్లిం.

రాయ్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి తన ప్రాధమిక విద్యను  మరియు నాగ్‌పూర్‌లోని మోరిస్ కళాశాల లో ఉన్నత విద్యనూ  అభ్యసించారు. తదుపరి చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లి కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీలో బి.ఏ. మరియు M.A. డిగ్రీలు పొందినారు.. 25 సంవత్సరాల వయసులో 1930 లో లింకన్స్ ఇన్ నుండి బారిస్టర్ పట్టాను పొందినారు..

గ్రాడ్యుయేషన్ తరువాత భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, జూలై 19, 1930 న నాగ్పూర్(Nagpur)  లోని హైకోర్టు ఆఫ్ సెంట్రల్ ప్రావిన్స్ మరియు బెరార్ లో న్యాయవాదిగా ఎన్రోల్/enroll అయ్యారు. 1942 లో, జస్టిస్ హిదయతుల్లా నాగ్‌పూర్‌ హైకోర్టులో  ప్రభుత్వ న్యాయవాదిగా నియమించబడ్డారు తరువాత  ఆగస్టు 2, 1943, సెంట్రల్ ప్రావిన్స్ మరియు బెరార్ యొక్క అడ్వకేట్ జనరల్ గా నియమిoపబడినారు. పిదప  జూన్ 24, 1946 న నాగ్పూర్ లోని హైకోర్టు ఆఫ్ సెంట్రల్ ప్రావిన్స్ మరియు బెరార్ లో అదనపు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. 1946 సెప్టెంబర్ 13 న ఆయన ఆ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1954 డిసెంబర్ 3 న ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

 

1డిసెంబర్ 1958, జస్టిస్ హిదయతుల్లా సుప్రీంకోర్టు జడ్జ్ గా నియమిoపబడినారు. మరియు 25 ఫిబ్రవరి 1968 న భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 1970 డిసెంబర్ 17 న పదవీ విరమణ చేసారు..

 

జస్టిస్ హిదయతుల్లా అతి పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్, అతి పిన్న వయస్కుడైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు అతి పిన్న వయస్కుడు అయిన భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రికార్డ్ సాధించారు.

 

అతను భారత సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడు, అప్పటి అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ అకస్మాత్తుగా మరణించారు, అప్పుడు ఉపాధ్యక్షుడు వి.వి.గిరి భారతదేశానికి తాత్కాలిక అధ్యక్షుడయ్యారు, కాని వి.వి.గిరి ఉపరాష్ట్రపతి మరియు యాక్టింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి ప్రెసిడెంట్ పదవికి అభ్యర్థి అయ్యారు. అప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిదయతుల్లా భారతదేశ తాత్కాలిక ప్రెసిడెంట్ గా  పనిచేశారు. జస్టిస్ హిదయతుల్లా 1969 జూలై 20 న భారత తాత్కాలిక/ Acting రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు మరియు వి.వి. గిరి రాష్ట్రపతి గా ప్రమాణ స్వీకారం చేసేవరకు ఆ పదవిలో కొనసాగారు.

భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తరువాత, ఏకగ్రీవంగా భారత వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు మరియు 1979 నుండి 1984 వరకు పదవిలో కొనసాగారు.. ఉపాధ్యక్షుడిగా ఆయన రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించారు రాజ్యసభ మరియు దాని కార్యకలాపాలను చాలా సామర్థ్యం మరియు వివేకంతో నిర్వహించినారు.. ఉపరాష్ట్రపతిగా ఉన్న కాలంలో, అతను మళ్ళీ 1982 లో తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు.

1982 లో జస్టిస్ హిదయతుల్లా భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు. భారత రాష్ట్రపతి జైల్ సింగ్ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు’ అప్పుడు  జస్టిస్ హిదయతుల్లా భారతదేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినారు.

రెండుసార్లు జస్టిస్ హిదయతుల్లా భారత తాత్కాలిక/యాక్టింగ్ ప్రెసిడెంట్ గా వ్యవరించారు..

2003 లో రాయ్‌పూర్‌లో జస్టిస్ హిదయతుల్లా గౌరవార్థం హిదయతుల్లా నేషనల్ లా యూనివర్శిటీ స్థాపించబడింది. ఆయన జ్ఞాపకార్థం విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరం జస్టిస్ హిదయతుల్లా మెమోరియల్ నేషనల్ మూట్ కోర్ట్ పోటీ (హెచ్‌ఎంఎన్‌ఎంసిసిHMNMCC) ను నిర్వహిస్తుంది.

అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న హిదాయతుల్లా, న్యాయ శాస్త్రము, విదేశాంగ వ్యవహారాలపై అనేక ప్రాచుర్యమైన రచనలు కూడా చేశారు.

జస్టిస్ హిదయతుల్లా హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, పర్షియన్ మరియు ఫ్రెంచ్ భాషలలో పండితుడు. ఆయనకు సంస్కృత మరియు బెంగాలీతో సహా మరికొన్ని భారతీయ భాషల పరిజ్ఞానం ఉంది.

సంస్థలు:  

హిదయతుల్లా ఇండియన్ లా ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ లా అసోసియేషన్ (ఇండియన్ బ్రాంచ్), ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా 1968 నుండి 1970 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు.

1982 లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కూడా అధ్యక్షత వహించారు.

నయా రాయ్‌పూర్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టారు.

పుస్తకాలు

ఆయన రచించిన ప్రముఖ పుస్తకాలు

డెమోక్రసీ ఇన్ ఇండియా అండ్ ది జ్యుడిషియల్ ప్రాసెస్, 1966 బై ఆసియా పబ్లిషింగ్ హౌస్ (1967).

ది సౌత్-వెస్ట్ ఆఫ్రికా కేస్, ఆసియా పబ్లిషింగ్ హౌస్ చే ప్రచురించబడింది 1967 (1966).

నేషనల్ పబ్లిషింగ్ హౌస్ (1970) చే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అండ్ పార్లమెంటరీ స్టడీస్ కొరకు ప్రచురించబడిన జ్యుడిషియల్ మెథడ్స్.

ఎడిటర్, ముల్లాస్ మహ్మదాన్ లా

భారత రాజ్యాంగ చట్టం: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ (1984).

ఆస్తి హక్కు మరియు భారతీయ రాజ్యాంగం: కలకత్తా విశ్వవిద్యాలయం (1984).

జస్టిస్ హిదయతుల్లా ఆన్ కమర్షియల్ లాస్: డీప్ & డీప్ (1982).

 

అవార్డులు మరియు గౌరవాలు :

ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (OBE), 1946 కింగ్స్ బర్త్ డే ఆనర్స్

ఆర్డర్ ఆఫ్ ది యుగోస్లావ్ ఫ్లాగ్ విత్ సాష్, 1970,

మెడల్లియన్ అండ్ ప్లేక్ ఆఫ్ మెరిట్ ఫిల్కాన్సా, మనీలా, 1970 మరియు

నైట్ ఆఫ్ మార్క్ ట్వైన్, 1971;

అలహాబాద్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం, ఎన్‌సిఆర్, ఘజియాబాద్ (గ్రేటర్ నోయిడా) అధ్యాయం 2007-2008 నుండి 42 మంది సభ్యుల జాబితాలో "ప్రౌడ్ పాస్ట్ అలుమ్ని" తో సత్కరించింది. రిజిస్ట్రేషన్ నెం. 407/2000.

గౌరవ బెంచర్ ఆఫ్ లింకన్స్ ఇన్, 1968; * ప్రెసిడెంట్ ఆఫ్ హానర్, ఇన్స్ ఆఫ్ కోర్ట్స్ సొసైటీ, ఇండియా.

శిరోమణి అవార్డు, 1986;

ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఇండియా అవార్డు, 1987;

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క దశరత్మల్ సింగ్వి మెమోరియల్ అవార్డు.

1970 మరియు 1987 మధ్య, 12 భారతీయ విశ్వవిద్యాలయాలు మరియు ఫిలిప్పీన్స్ విశ్వవిద్యాలయం అతనికి డాక్టరేట్ ఆఫ్ లా లేదా లిటరేచర్ గౌరవ డిగ్రీని ప్రదానం చేశాయి.

 

వ్యక్తిగత జీవితం:

1948 లో హిదయతుల్లా పుష్ప షాను వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు అర్షద్ హిదయతుల్లా భారత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది.

 

భారత దేశ చరిత్రలో జస్టిస్ హిదయతుల్లా, భారత సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, భారత రాష్ట్రపతి మరియు భారత ఉపరాష్ట్రపతి పదవులను నిర్వహించిన ఏకైక వ్యక్తి అయ్యారు.

జస్టిస్ హిదయతుల్లా అతి పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్, అతి పిన్న వయస్కుడైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు అతి పిన్న వయస్కుడు అయిన భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రికార్డ్ సాధించారు.

 

సుప్రీంకోర్టులో ఆయన సుదీర్ఘ పదవీకాలంలో, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ అఫ్ పంజాబ్ తీర్పుతో సహా అనేక మైలురాయి తీర్పులకు పార్టీగా ఉన్నారు, రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులను తగ్గించే అధికారం పార్లమెంటుకు లేదని అభిప్రాయపడ్డారు. రంజిత్ డి. ఉదేషి Ranjit D. Udeshi (అశ్లీల చట్టంతో వ్యవహరించడం law of obscenity)  కేసు లో తీర్పు అతని  సాహిత్య నైపుణ్యాన్ని ప్రదర్శించింది

 

జస్టిస్ మొహమ్మద్ హిదయతుల్లా 18 సెప్టెంబర్, 1992న 86 సంవత్సరాల వయస్సు లో బొంబాయి లో మరణించారు.

 

ఆధారాలు:

1.  వికిపెడియా,

2.  హిదయతుల్లా నేషనల్ లా యూనివెర్సిటి

3.  Law Corner


No comments:

Post a Comment