27 April 2019

ఖుత్బా(Khuṭbah)ఇస్లామియా ఆరాధనలలో  భాగంగా ఖాతిబ్ (khaṭīb (orator) అనబడే వ్యక్తి ఇచ్చే ప్రసంగాన్ని  ఖుత్బా అని అందురు. ఇది శుక్రవారం సముహ ప్రార్ధన సందర్భంలో, రెండు పండగ (ʿĪd) దినాలలో మరియు హజ్ 9వ రోజు (ధుఅల్-హజ్జ యొక్క తొమ్మిదవ) ఇవ్వబడుతుంది. ఇంకా ఇది  వివాహలు,   గ్రహణాలు లేదా కరువు కాటకాల సమయంలో కూడా ఇవ్వబడుతుంది. శుక్రవారం సముహ ప్రార్ధనలో ఖుత్బా ప్రార్ధనకి ముందు, పండుగుల  (ʿĪd ) సందర్భం లో ప్రార్ధన తరువాత ఉంటుంది.
వివాహ వేడుకలో, ఇమాం నిఖా ఒప్పందం ముందు ఖుత్బా చదువుతాడు. హదీస్ ప్రకారం వివాహ ఒప్పందంలో ((khuṭbatu al-nikāh) ఖుత్బా సిఫారసు కాని, తప్పని సరి కాదు. వివాహ ఖుత్బా లో భాగంగా  ఇమాం మూడు ఆయతులు  (ఖురాన్ 4: 1, 3: 102, 33: 70-71) మరియు వివాహానికి సంబంధించిన హదీసును పఠిస్తాడు. దీనితో పాటుగా, దంపతులకు ఇరువురికి  వారి హక్కులు మరియు బాధ్యతలను విశిదికరిస్తాడు తద్వారా  వారిలో  దైవభీతి (తఖ్వా) ప్రేరేపించవచ్చు

ఖుత్బా అనేది శుక్రవారం సమూహా ప్రార్ధనలో తప్పని సరి అంశము. శుక్రవారంను అరబ్బీ లో జుమాహా అందురు.జుమాహ్ (శుక్రవారము jumʿah (Friday) అనే పదo అరబిక్ పదo జమా jamaʿa)  నుండి వచ్చింది. జమా jamaʿa)  అనగా సేకరించడం, సంఘటిత పరచడం   మరియు ఏకం చేయడం అని అర్ధం. ఈ విధంగా జుమ్'అహ్ ప్రార్థన, ముస్లింలను ప్రార్ధన కొరకు సoఘటిత పరుస్తుంది. శుక్రవారపు సమూహా ప్రార్థన అనేది ఒక విశ్వాసికి తప్పనిసరి అయిన ఆచరణ.
ముస్లిం సంప్రదాయం ప్రకారం, శుక్రవారం అత్యంత పవిత్రమైన రోజు. అల్లాహ్ శుక్రవారంనాడు  సముహ  ప్రార్ధనను  తప్పనిసరి చేసాడు.దివ్య ఖురాన్ లోని  ఆయతులు  62: 9-11 ప్రకారం శుక్రవారం అనగా వారంలో ఆరోవ రోజు అల్లాహ్   ఆకాశం మరియు భూమిని సృష్టించినాడు మరియు సృష్టిని పూర్తి చేసాడు. హదీస్ ప్రకారం  దేవుడు శుక్రవారం ఆదామును సృష్టించాడు మరియు అతనిని స్వర్గంలో ఉంచాడు మరియు  శుక్రవారం నాడు ఆదామును స్వర్గం నుంచి తొలగించాడు. ముస్లింలు అంతిమ ఘడియ  (Last Hour) శుక్రవారం ప్రారంభమవుతుందని  నమ్ముతారు మరియు హదీసు ప్రకారం శుక్రవారం నాటి ఒక  నిర్దిష్ట ఘడియ  లో అన్ని దువాలు ఆమోదించ బడతాయి. ఆ ఘడియ  విషయం లో పండితులు  విభేదించారు, చాలామంది అది ఖుత్బా  (khṭbah) మరియు ప్రార్థన మధ్య లేదా ఆ రోజు చివరిలో ఉంటుందని అంటారు.

ప్రవక్త(ప) మదీనాకు వలస వెళ్ళే ముందు  ముస్లిం సమాజం మక్కాలో శుక్రవారం సమూహా ప్రార్ధనలు నిర్వహించ లేదు. శుక్రవారo (జుమా'హ్) ప్రార్ధన అనేది మదీనాలో సురా “అల్-జుమాహ్” యొక్క అవతరణ ఫలితంగా అభివృద్ధి చెందింది. శుక్రవారం సమూహా ప్రార్ధన ప్రస్తావన దివ్య ఖురాన్ 62: 9 ఆయత్ లో ఉంది; “విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచి నప్పుడు అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి; క్రయవిక్రయాలను వదిలి పెట్టండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది." అందువల్ల ఖుత్బా యొక్క ప్రాధమిక విధి అల్లాహ్ ను సమూహా ప్రార్ధన ద్వారా స్మరించడం. దీనినే దివ్య ఖురాన్ పరిభాష  లో  “దిక్ర్ అల్లాహ్ dhikr Allāh  అందురు.

శుక్రవారం సముహా ప్రార్ధన ప్రతి ముస్లిం మగవారి కోసం తప్పనిసరి చేయబడింది. జమ్మూ ఖుత్బా  మరియు ప్రార్థనలకు మహిళలకు హాజరు కావొచ్చు, అది వారికి తప్పనిసరి కాదు. ఒక వ్యక్తి శుక్రవారం ప్రార్ధన కు తప్పనిసరి గా హాజరు కావడానికి ఐదు షరతులు ఉన్నాయి: 1. అతను నగరం లేదా పట్టణం యొక్క నివాసి (ముకిమ్)అయి ఉండవలయును, ప్రయాణికులు హాజరు కావడం నుండి మినహాయించబడ్డారు; 2.పురుషులు ; 3. యవ్వన వయస్సును చేరుకొన్నవారు ; 4.ఖాళి గా  ఉన్నవారు. (being free)  మరియు 5. ఆరోగ్యవంతుడు.

జబ్బుపడిన ప్రజలు హాజరవ్వకుండా మినహాయించబడినారు.కావున పై నియామల ప్రకారం అర్హుడైన ప్రతి వ్యక్తి ఖుత్బా మరియు ప్రార్ధనకు తప్పనిసరిగా హాజరు కావలి. తీవ్రమైన వర్షం, అనారోగ్యంతో ఉన్నవారికి సేవచేసే వారిని లేదా ఏవైనా  ప్రాణాంతక పరిస్థితులు వ్యక్తిని ప్రార్ధనకు హాజరు కాకుండా నిరోదిస్తున్నప్పుడు వారికి మినహాహింపు  ఉంది.
 
శుక్రవారం ఖుత్బా  ఒక నిర్దిష్ట విధానంను అనుసరిస్తుంది. షాఫి న్యాయ సంప్రదాయం( ఫికా) ప్రకారం శుక్రవారం ప్రార్థన లో దేవుని (hamdalah హమ్దాలా) ప్రశంసలు, ప్రవక్త(స)పై ఆశీర్వాదాలు (సలావాత్ salawāt)) పంపడం మరియు షాహదాహ్ (ఒకే దేవుడు  మరియు ముహమ్మద్ను అతని దూతగా ధృవీకరించడం) అంశాలుగా ఉంటాయి.  వీటన్నింటినీ అరబిక్లో పఠoచాలి.హనఫీ న్యాయ సంప్రదాయం (ఫికా) ప్రకారం ఇది సిఫార్సు గాని తప్పనిసరి కాదు.  

కుతుబ్బా రెండు విభాగాలుగా విభజించబడింది, మొదటి భాగం రెండవ భాగం కన్నా  ఎక్కువ కాలం ఉంటుంది. మొదటి విభాగం చాలా వరకు మతపరమైనదిగా ఉంటుంది, అయితే రెండవ విభాగం లో  రోజువారీ వ్యవహారాలు  మరియు మరింత రాజకీయపరంగా ఉంటుంది. ఖుథ్బాహ్ యొక్క రెండు విభాగాల మధ్య నిశ్శబ్దం గా  ఖాతిబ్ కూర్చుంటారు.. ప్రవక్త ముహమ్మద్ (స) మీద ఆశీర్వాదాలు పంపి మరియు అoదరు ముస్లింల కొరకు ప్రార్థన చేయడం ద్వారా ఇమాం ఖుత్బా ముగిస్తాడు.

కొంతమంది విద్వాంసులు అరబిక్ భాషలో ఖుత్బా ఇవ్వాలని అంటారు..  కొన్నిసార్లు అరబిక్లో మాట్లాడటం లేదా అర్ధం చేసుకోలేని దేశాలలో కూడా ఖుత్బా అరబిక్లో ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో, ఖుత్బా (küṭbah) యొక్క మొదటి భాగాన్ని అరబిక్లో ఇస్తారు, అయితే రెండవ భాగం ప్రజల స్థానిక భాషలో ఇవ్వడం జరుగుతుంది.

14 April 2019

అంబేద్కర్ మరియు ఓటు హక్కు(Ambedkar and the right to vote)
 
బి.ఆర్. అంబేద్కర్

రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్గా పనిచేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, భారతీయులు సార్వజనీన వయోజన ఓటుహక్కును పొందటం లో కీలక పాత్ర పోషించినారు.
భారతదేశము లోని చారిత్రాత్మకంగా వెనుకబడిన వర్గాలు రాజకీయoగా అభివృద్ధి చెందటానికి మరియు పౌరసత్వo పొందటానికి   ఓటు హక్కు అతి ముఖ్యమైన మార్గంగా అంబేద్కర్ అభిప్రాయ పడినారు.

ప్రజాస్వామ్య పౌరసత్వానికి సంబంధించిన రెండు  ప్రాధమిక అంశాల్లో ఒకటి ఓటు హక్కు అతి ప్రదానమైనది మరియు సార్వత్రికమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిణామ క్రమంలో, తరచుగా రాజకీయ పండితులు   పెద్ద ఎత్తున సామాజిక పునర్నిర్మాణాన్ని తీసుకురావడానికి ఉపయోగించే ఆయుధంగా ఓటు హక్కు ను భావించారు.  చరిత్రలో   అనాదిగా మహిళలు, మైనారిటీలు, పేద ప్రజలకు  తరచూ ఓటు హక్కు నిరాకరించబడినది.  చరిత్రకారుడు అలెగ్జాండర్ కీసార్ తన పుస్తకం “ది రైట్ టు వోట్: యునైటెడ్ స్టేట్స్ లో ప్రజాస్వామ్యం యొక్క సమస్యాత్మక చరిత్ర The Right To Vote: The Contested History Of Democracy In The United States, లో వివరించినట్లు అమెరికా లో  సార్వజనీన వయోజన ఓటు, దీర్ఘకాలిక (తరచుగా హింసాత్మక) రాజకీయ పోరాటం తర్వాత లబించినది.  ఇతర పాశ్చాత్య ప్రజాస్వామ్యాలలో కూడా ఇదే విధంగా లబించినది. 

అయితే భారతదేశం పాశ్చాత్య దేశాలకు  చాలా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. భారత రాజ్యాంగం సార్వత్రిక వయోజన ఓటు హక్కు ను గుర్తించినది. వలసరాజ్య పాలనలో కేవలం  15% మంది భారతీయులు (పరిమితంగా) ఓటు హక్కును కలిగి ఉన్న పరిస్థితి నుండి, భారత పౌరులు ప్రతి ఒక్కరికి  సార్వత్రిక వయోజన ఓటు హక్కును మంజూరు చేసింది. పేదరికం మరియు నిరక్షరాస్యత, కులం, వర్గం మరియు లింగ బేధం తో బాధపడుతున్న భారత దేశం లో ఇది నిజంగా విప్లవాత్మకమైన మార్పు.  స్వ-పరిపాలన నిర్వహించటానికి తగినంత పరిపక్వత చెందలేదని బ్రిటీష్ వారిచే ఎగతాళి చేయబడిన భారతీయులకు ఓటుహక్కు అనేది రాజ్యాంగo ప్రసాదించిన ఒక వరం అని చెప్పవచ్చు. స్వాత్రంతం పొందినప్పటి నుంచే  భారతదేశం పూర్తి ప్రజాస్వామ్యంగా అవతరించింది.

స్వాతంత్ర్య ఉద్యమ నాయకులు మరియు ఇండియన్ జాతీయ  కాంగ్రెస్ నేతలు, సార్వజనీన వయోజన వోటు హక్కు సూత్రాలపై స్వతంత్ర భారతదేశం స్థాపించబడుతుందని  మొదటి నుంచి స్పష్టపరిచారు. ఉదాహరణకి, భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన 1931 కరాచీ తీర్మానం లో  ఇది స్పష్టపరచబడినది. కానీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు తీర్మానంకు  రాజ్యాంగ రూపం కల్పించవలసిన బాధ్యత రాజ్యంగముసాయిదా కమిటి చైర్మన్ గా బి.ఆర్.అంబేద్కర్  పై పడినది. అంబేద్కర్, ఈ బాద్యతను నెరవేర్చడం లో కీలక పాత్ర పోషించినాడు. 

తన రాజకీయ జీవితం ప్రారంభంలోనే  ఓటు హక్కు ప్రాధాన్యతను అంబేద్కర్ గుర్తించారు. 1919 లో భారతదేశ డొమినియన్కు చెందిన ప్రతినిధి సంస్థల (representative institutions) రూపకల్పన చేయడానికి ఏర్పడిన  సౌత్బారో కమిటీ (Southborough committee) ముందు తన లిఖిత సమర్పణల లో, "పౌరసత్వం కల్పించటానికి  రెండు అతి ముఖ్యమైన హక్కులు- ప్రాతినిధ్యపు  హక్కు మరియు అధికారo చేపట్టే హక్కు " ఉండాలని  అంబేద్కర్ అన్నారు.

అంబేద్కర్ వాదనలు ప్రధానంగా రెండు సూత్రాలపై ఆధారపడ్డాయి: మొదటిది పౌరసత్వ సాధనకు  మరియు పాలన వ్యవస్థలో సమానత్వ నైతిక సభ్యత్వంకు (equal moral membership of the polity) ఓటుహక్కు  తప్పనిసరి మరియు రెండోవది రాజకీయ మరియు సాంఘిక జీవితంలో ఓటుహక్కు  నిరాకరించబడిన వారికి రాజకీయ విద్యా సాధనంగా వోటు హక్కు ఉపయోగపడుతుంది మరియు ఉనికిలో ఉన్న వ్యవస్థలో  "చెడు పరిస్థితులను తొలగించడానికి" దానిని ఒక సాధనంగా చెప్పవచ్చు.

పై రెండు సూత్రాలే  సార్వజనిక వయోజన  వోటుహక్కు ను  రాజ్యాంగంలో భాగంగా మార్చినవి. రాజ్యంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్గా అంబేద్కర్, ఆర్టికల్ 326 ను రాజ్యాంగంలోకి చేర్చినాడు దాని ఆధారంగా సార్వత్రిక వయోజన వోట్ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఎన్నికలలో  నిలబడటానికి కావలసిన కనీస వయస్సు వంటి అర్హతలు, అనర్హతలను రూపొందించబడినవి.  ఈ నిబంధనలను చర్చించినప్పుడు, వ్యక్తులు  ఓటు వేయడానికి  ఎటువంటి ఆస్తి పరమైన  అర్హతలు లేదా నిలకడలేని వివక్షతలను గురించి ఆలోచించలేదని అంబేద్కర్ స్పష్టం చేసాడు.

విశ్వజనీన వయోజన వోటుహక్కు ను రాజ్యాంగంలోకి పొందుపరచాలనే నిర్ణయం వివాదాలకు అతీతంగా  లేదు. రాజ్యాంగ నిర్మాణ సంఘ సభ్యుడైన H.V. కామత్ ఉన్నత స్థాయి నిరక్షరాస్యత ఉన్న దేశాలలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనెది ప్రమాదకరమైన విషయం అని  మరియు దానిని నియంత్రించాలని అభిప్రాయపడ్డారు. రాజ్యంగ సభ లోని ఇతర సభ్యులు కూడా  ఆయనకు మద్దతు ఇచ్చారు. అయితే, కామత్ వాదనను దాని యొక్క చారిత్రక అవసరాన్ని  గుర్తించిన రాజ్యాంగ సభ తిరస్కారించినది.

రాజ్యాంగ అసెంబ్లీ సభ్యుడు అల్లారి కృష్ణస్వామి అయ్యర్ ఇలా పేర్కొన్నారు: " భారతీయ ప్రజలు  పెద్ద సంఖ్యలో అజ్ఞానం మరియు నిరక్షరాస్యతతో  ఉన్నప్పటికీ, రాజ్యంగా సభ సామాన్యుడి పట్ల  అపారరమైన విశ్వాసం తో వయోజన ఓటు హక్కు సిద్ధాంతాన్ని అనుసరించింది. వయోజన ఓటు హక్కు ఆధారంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరిచినది.  వయోజన ఓటు హక్కు సామాన్య ప్రజల జీవన ప్రమాణం, సౌలభ్యం మరియు మంచి జీవన ప్రవృత్తిని ప్రోత్సహిస్తుందని పూర్తి నమ్మకం ఉంచినది. దీనికి  రాజ్యంగ సభ  అభినందించబడాలని మరియు ప్రపంచం చరిత్రలో ముందు ఎన్నడూ ఇటువంటి ప్రయోగం ధైర్యంగా చేపట్టబడలేదని  చెప్పవచ్చు. "

కొన్ని దశాబ్దాల క్రితం సౌత్ బరో (Southborough) కమిటీ ముందు అంబేద్కర్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సూత్రాలు: అంతిమంగా, ప్రజాస్వామ్య ప్రభుత్వం - ఓటు హక్కు విడదీయరానివి మరియు  ఓటు వేయడం రాజకీయ విద్య యొక్క విజయానికి మారు పేరు.