30 May 2014

16వ లోక్ సభ ఎన్నికైన సబ్యుల వయస్సు, ఆధాయ,విద్యార్హత మరియు క్రిమినల్ రికార్డ్ వివరాలు.



నేషనల్ ఎలెక్షన్ వాచ్ మరియు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ వారి నివేదిక ప్రకారం 2014 లోక్ సభ ఎన్నికలలో పోటీచేయు అబ్యర్ధులు ఎన్నికల కమిషన్ ముందు  సమర్పించిన అఫిడవిట్ ప్రకారం కొత్తగా ఎన్నికైన 541 మంది  ఎం‌పి ల వయస్సు, ఆధాయ,విద్యార్హత మరియు క్రిమినల్ రికార్డ్ వివరాలు పరిశీలించగా క్రింది వాస్తవాలు తెలియవచ్చినవి.

వయస్సు:
2014 లోక్ సభ సబ్యులలో మొత్తం 543 మందిలో 25-50 ఏళ్ల మద్య వయస్సు ఉన్న వారు 202 మంది (37%), 51-70 మద్య వయస్సు ఉన్నవారు 298 మంది (55%), 51నుంచి 70 వయస్సు ఉన్నవారు41 మంది  (8%),71 కన్నా ఎక్కువ  వయస్సు కలిగి ఉన్నవారు 41 మంది (8%). 40కన్నా తక్కువ వయస్సు ఉన్నవారు 71మండి ఎం‌పిలు ఉన్నారు. 55 కన్నా తక్కువ ఉన్నవారు 216 మంధి ఉన్నారు. బి‌జే‌పి కి చెందిన ఎల్‌కే అద్వానీ అందరి కన్నా అధికంగా వయస్సు ఉన్న ఎం‌పి 86 సంవత్సరాలు. మహిళా సబ్యులలో బి‌జే‌పి కి చెందిన నజ్మా హెఫ్తుల్ల అందరి కన్నా అధిక వయస్సు 74 సంవత్సరాలు కలిగి ఉన్నారు. మొదటి సారి ఎన్నికైనవారిలో 12మంది 30సంవత్సరాలలోపు,48 మంది 31-40 సంవత్సరాలలోపు వారు.

విద్యార్హతలు:
లోక్ సభ కు కొత్తగా ఎన్నికైన వారిలో ఒకరు నిరక్షరాస్యులు. మేట్రిక్యులేషన్ అర్హత లేనివారు 13% (2009 లో 3%)మెట్రికులేషన్ అర్హతగా ఉన్నవారు10% మంది (2009 లో 17%). 125మండి (23%) ఇంటెర్మీడియట్ (12వ తరగతి) అంతకన్నతక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు. లోక్ సభ ఎన్నికలలో ఎన్నికైనవారిలో 75%మండి పట్టబద్రులు(2009 లో 79%) పి‌జి చేసినవారు  28%, డాక్టరేట్ కలిగిన వారు6% మండి.(2009 లో 3%). వ్యవసాయం వృత్తిగా ఉన్న ఎం‌పి లు 27%(2009 లో 27%), సాంఘిక సేవ వృత్తిగా ఉన్న ఎం‌పి లు 24%,(2009 ల0 8%) వ్యాపారం వృత్తిగా ఉన్న వారు 20%(2009 లో 15%)గా  ఉన్నారు.
16వ లోక్ సభ లో 38 మండి లాయర్లు, 24మండి డాక్టర్లు, 18 మండి కళాకారులు ఉన్నారు.

క్రిమినల్ కేసులు

నేషనల్ ఎలెక్షన్ వాచ్ మరియు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ వారి నివేదిక ప్రకారం 2014 లోక్ సభ ఎన్నికలలో పోటీచేయు అబ్యర్ధులు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం కొత్తగా ఎన్నికైన 541 మండి ఎం‌పి లలో 34% ఎం‌పి లు అనగా ప్రతి ముగ్గురిలో ఒకరు  క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 2009 లో 30% అనగా 158 మంది  ఎం‌పి లు,2004 లో 24% మంది ఎం‌పిలు  క్రిమిననల్ కేసులు ఎదుర్కొన్నారు.
క్రిమినల్ కేసులు ఉన్న 186 మండి ఎం‌పి లలో 112 మంది(21%) పై సీరియస్ క్రిమినల్ కేసులు (మర్డర్,అటెంప్ట్ టుమర్డర్, సామాజిక ప్రశాంతతకు అవరోధం,కిడ్నాపింగ్, స్త్రీలపై అత్యాచారాలు వంటి కేసులు) (2009 లో 77 మంది అనగా 15%ఎం‌పి లపై ) కలవు. 9మంది  ఎం‌పి లపై మర్డర్ కేసులు, 17 మంది పై అటెంప్ట్ టు మర్డర్, ఇద్దరిపై స్త్రీలపై అత్యాచారకేసులు కలవు. 16 మంది పై సామాజిక ప్రశాంతతకు భంగం కలిగించారన్న నేరారోపణలు కలవు. 10 మంది పై రాబరీ,డెకాయిటీ,7గురి పై కిడ్నాపింగ్ కేసులు కలవు.

క్రిమినల్ చరిత్రగలవారు, క్రిమినల్ చరిత్ర లేని వారి కన్న రొందింతలు అధికంగా ఎన్నికలలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఉన్న అబ్యర్ధులు గెలిచే అవకాశాలు 2014 ఎన్నికలలో 13% ఉండగా క్లీన్ రెకార్డ్ ఉన్న అబ్యర్ధులు గెలిచే అవకాశాలు 5% మాత్రమే ఉన్నాయి. (ఏ‌డి‌ఆర్,అహ్మదాబాద్  రిపోర్ట్)

బి‌జే‌పి కి చెందిన 281 విజయం సాదించిన వారిలో 98 మంది  లేదా 35% మంది  పై క్రిమినల్ కేసులు కలవు. కాంగ్రెస్ కు చెందిన 44 మందిలో 8గురు (18%) మండి,ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే కు చెందిన 37మందిలో 6గురు(16%) శివసేన కు చెందిన 18మంది లో 15 మంది (83%) టి‌ఎం‌సి కి చెందిన 34 మందిలో 7గురు(21%) పై క్రిమినల్ కేసులు కలవు.దీనికి తోడుబి‌జే‌పి కి చెందిన 63 సబ్యులపై (22%) కాంగ్రెస్ కు చెందిన 3గురు (7%) ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే కు చెందిన 8మండి సబ్యులపై (44%) శివ సేన కు చెందిన 8మండి సబ్యులపై (44%) తృణ మూల్ కాంగ్రెస్ కు చెందిన 4 సబ్యులాపి (12%) సీరియస్ క్రిమినల్ కేసులు కలవు. 
 
ఆర్‌జే‌డి కి చెందిన మొత్తం 4గురు సబ్యులపై క్రిమినల్ రికార్డులు కలవు.ఎన్‌సి‌పి కు చెందిన 5లో 4గురి పై క్రిమినల్ కేసులు కలవు. బి‌జే‌డి కి చెందిన 15% సబ్యులపై, టి‌డి‌పి కి చెందిన 38% సబ్యులపై, టి‌ఆర్‌ఎస్ కు చెందిన 46% సబ్యులపై, సి‌పి‌ఐ‌ఎం కు చెందిన 56% సబ్యులపై వై‌ఎస్‌ఆర్‌సి కు చెందిన 56% మంది సబ్యులపై,  ఎల్‌జే‌పి కి 67%సబ్యులపై, పి‌డి‌పి కి చెందిన 33% సబ్యులపై, జే‌డి‌యూ కు చెందిన 50% సబ్యులపై, క్రీమినల్ రికార్ద్లు కలవు. ఏ‌ఏ‌పి కి చెందిన ఎవరిపై క్రిమినల్ రికార్ద్లు లేవు. మహారాస్త్ర,యూ‌పి,బిహార్ కు చెందిన అబ్యర్ధులు ఎక్కువుగా క్రిమినల్ రెకార్డ్ కలిగి ఉన్నారు.
2014 ఎన్నికలలో కాంగ్రెస్, బి‌జే‌పి నిలబెట్టిన ప్రతి ముగ్గురు లోక్ సభ  అబ్యర్ధులలో ఒకరు క్రిమినల్ రికార్డ్ కలిగి ఉన్నారు. సీమాంద్ర నుండి ఎన్నికైన 82 ఎం‌ఎల్‌ఏ లు,11మండి ఎం‌పిలు, తెలంగాణా నుండి ఎన్నికైన 63 మండి ఎం‌ఎల్‌ఏ లు, 8 ఎం‌పి లకు క్రిమినల్ రెకార్డ్ ఉంది.

ఆస్తి/ఆదాయ వివరాలు
2014 లోక్ సభ ఎన్నికలలో దేశం లో కల్లాఅత్యధికం ధనం కలిగిన కోటీశ్వర్లు 10 మండి పోటీ చేయగా వీరిలో ఇరువురు మాత్రమే ఎన్నికైనారు. 16 వ లోక్ సభకు ఎన్నికైన  వివిధ పార్టీల ఎం‌పి లు సగటున 14.61 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు. 2009 54%, 2004 30% మండి కోటీశ్వర్లు. దేశం లో కల్ల అత్యంత ధనిక లోక్ సభ సబ్యుడు గల్లా జయదేవ (టి‌డి‌పి) 683 కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడు. 442లోక్ సభ సబ్యులకు అనగా 82% మండి కి  ఒక కోటి అంతకన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.(2009 లో 300 మందికి అనగా 58%)
బి‌జే‌పి కి చెందిన వారిలో 237 మండి అనగా 84% కోటీశ్వరులు. బి‌జే‌పి కి చెందిన ఎం‌పి లు సరాసరి 11 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు.కాంగ్రెస్స్ కు చెందిన వారిలో 35 మండి కోటీశ్వరులు కాంగ్రెస్ కు చెందిన ఎం‌పిలు 16 కోట్ల ఆస్తిని సగటున కలిగి ఉన్నారు. ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే సబ్యులు 6.5కోట్లు,బి‌జే‌డి సబ్యులు 16.5 కోట్లు, శివ సేన సబ్యులు 9.2 కోట్లు, టి‌డి‌పి,టి‌ఆర్‌ఎస్,వై‌ఎస్‌ఆర్‌సి‌పి కి చెందిన పార్టీల అబ్యర్ధులు సగటున 60కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. సి‌పి‌ఐ‌ఎం కు చెందిన ఎం‌పి లు సగటున 79 లక్షల ఆస్తిని కలిగి ఉన్నారు.ఎల్‌జే‌పి సబ్యులు 2.5కోట్లు,ఎన్‌సి‌పి సబ్యులు 37కోట్లు, ఆర్‌జే‌డి 4కోట్లు,పి‌డి‌పి 39సబ్యులు 39 కోట్లు జే‌డి (యూ)1.7 కోట్ల ఆస్తులను కలిగిఉన్నారు. ఏ‌ఏ‌పి సబ్యులు 3కోట్లు,తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎం‌పి దేశం లో కల్లా అత్యంత బీదవాడు –కేవలం 5 లక్షల ఆస్తిని కలిగి ఉన్నాడు. ఒరిస్సా లో అసెంబ్లీ కు ఎన్నికైన మొత్తం 147 శాసన సబ్యులలో 52% మంది అనగా 76 మంది కోటీశ్వరులు.











.







2014 పార్లమెంట్ ఎన్నికలు - 16 వ లోక్ సభ ఎన్నికల ఫలితాలు-విశేషాలు



·       2014 పార్లమెంట్ ఎన్నికల లో  అర్హత ఉన్న వోటర్ల సంఖ్య 81.4 కోట్ల మంది.
·       2014 పార్లమెంట్ ఎన్నికలలో దేశవ్యాప్తం గా అత్యంత అధికంగా వోటింగ్ శాతం 66.38% జరిగింది. (1984 లో 64.01%,2009 లో 58.13% జరిగింది.)
·       2014 లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ దేశవ్యాప్తంగా 989 కేంద్రాలలో జరిగింది.
·       2014 ఎన్నికలలో మొత్తం వోటర్ల సంఖ్య 81.45 కోట్లు, ఇందులో 18-19 వయస్సు కల వోటర్లు 2.3 కోట్లు, వీరిలో బి‌జే‌పి 39% సాదించగా, కాంగ్రెస్స్ 19% వొట్లను సాదించినది,
·       అరుణాచల్ ప్రదేశ్ లోని బొందిల జిల్లాలో కేవలం 3గురు వోటర్లు మాత్రమే  ఎన్నికలలో పాల్గొన్నారు.
·       బి‌జే‌పి గుజరాత్(26), రాజస్తాన్(25) డిల్లీ (౭) గోవా (2) హిమాచల్ ప్రదేశ్ (4) ఉత్తరాఖండ్ (5) లలో పూర్తి స్థానాలను సాదించినది.
·       కేరళ,మణిపుర్, మేఘాలయ,మిజోరాం,నాగాలాండ్ లలో బి‌జే‌పి ఒక్క స్థానము సాదించలేదు.
·       గుజరాత్,హిమాచల్ ప్రదేశ్,జార్ఖండ్,డిల్లీ,ఒరిస్సా,రాజస్థాన్,తమిలనాడు మరియు పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ ఒక్క స్థానము సాదించలేదు.
·       కాంగ్రెస్ లోక్ సభ లో అత్యధికంగా 1984 లో 414 స్థానాలు సాదించగా అత్యల్పంగా 2014 లో 44 స్థానాలు సాదించినది.
·       కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయే ప్రమాదం లో పడినది.
·       బి‌జే‌పి పూర్వపు  అత్యుత్తమ ప్రదర్శన 1998,1999 ఎనికలలో 182 స్థానాలు ఉండగా ప్రస్తుతం 2014 లో అత్యధికంగా 282 స్థానాలు సాదించినది.
·       కాంగ్రెస్ పూర్వపు నిరాశ ప్రదర్శన 1999 లో 114 స్థానాలు సాదించగా ప్రస్తుతం 2014 లో 44 స్థానాలు సాదించినది.
·       భారత పార్లమెంట్ ఎన్నికలలో ఒకే పార్టీ అత్యుత్తమ ప్రదర్శన గా 1984 లో కాంగ్రెస్స్ అదికంగా 414 స్థానాలు సాదించగా,దాని తరువాత ప్రస్తుతం 2014 లో బి‌జే‌పి 282 స్థానాలు సాదించినది.
·       1984 తరువాత సొంతంగా ఒక పార్టీ ఈ సారి అనగా 2014 లో బి‌జే‌పి అధికారాన్ని చేపట్ట బోతున్నది.
·       లెఫ్ట్ పార్టీలు తొలి సారిగా అత్యంత తక్కువ స్థానాలు సాదించినవి. మొత్తం 10 స్థానాలు అనగా సి‌పి‌ఐ ఒక స్థానాన్ని సి‌పి‌ఎం 9 స్థానాలు మాత్రమే సాదించినది.
·       సి‌పి‌ఎం 3.2% వొట్లను,సి‌పి‌ఐ 0.8% వొట్లను సాదించినవి.
·       సి‌పి‌ఐ జాతీయ పార్టీ గుర్తింపు హోదాను కోల్పోయినది.  
·       1984 లో యూ‌పి లో కాంగ్రెస్స్ 85 స్థానాలకు గాను 83 స్థానాలు సాదించగా ప్రస్తుతం బి‌జే‌పి యూ‌పి లో 80 స్థానాలకు గాను 71స్థానాలు సాదించినది.
·       2014 ఎన్నికలలో బి‌జే‌పి 31.1% వొట్లను సాదించగా, కాంగ్రెస్ 19.4% వొట్లను సాదించినది.
·       2014 లో కాంగ్రెస్ నిరాశ పూర్వక ప్రదర్శనకు కారణం  దేశవ్యాప్తంగా 9% వోట్లు తగ్గటమే. బి‌జే‌పి కి 13% వోట్లు పెరిగినాయి.
·       2014 ఎన్నికలలో బి‌జే‌పి నాయకత్వం లోని ఎన్‌డి‌ఏ కూటమి 336స్థానాలు సాదించగా, కాంగ్రెస్ నాయకత్వం లోని యూ‌పి‌ఏ_2 కూటమి 59 స్థానాలను, ఇతరులు 148 స్థానాలు సాదించిరి.
·       ఈ ఎన్నికలలో పరాజయం పొందిన  ప్రముఖులు 1. అరవింద కేజ్రివాల్(వారణాసి) 2. అరుణ్ జైట్లీ (అమృత్ సర్) 3.మీరా కుమార్ (మాజీ స్పీకర్—ససారామ్ -బీహార్) 4. అజిత్ సింగ్ (ఆర్‌ఎల్‌డి-భాగపత్ –యూ‌పి) 5. నందన్ నీలేకరి (బంగళూర్ సౌత్ –కాంగ్రెస్స్-కర్ణాటక) 6. శరద్ యాదవ్ (జే‌డి-యూ అద్యక్షులు) 7.శృతి ఇరానీ,8.కపిల్ సిబాల్,9.బసుదేవ ఆచార్య, 10.ప్రియా దత్ (సునిల్ దత్ కుమార్తె) 11. సచిన్ పైలట్ (రాజస్థాన్) 12. రబ్ది దేవి (ఆర్‌జే‌డి)
·        భావి భారత ప్రధానిగా కలలు కంటున్న మాయావతి అశలు నిరాశ అయినాయి. యూ‌పి లో బి‌ఎస్‌పి ఒక్క స్థానం కూడా సాదించక పూర్తిగా తుడుచుపెట్టుకు పోయినది.
·       4.1% ఓట్లు సాదించినప్పటికి బి‌ఎస్‌పి కి ఒక్క స్థానము లబించలేదూ.బి‌ఎస్‌పి కు 15వ లోక్ సభలో 21 స్థానాలు కలవు.
·       తమిళ నాడులో జయ లలిత ఘనవిజయం సాదించినది. మొత్తం 39స్థానాలలో 37 స్థానాలు సొంతంగా ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే  గెలిచినది.పార్లమెంట్ లో అతిపెద్ద 3వ పార్టీ గా అవతరించినది. 3.3% వోట్లు సాదించినది.
·       తమిళ్ నాడులో  డి‌ఎం‌కే ఒక్క స్థానం కూడా సంపాదించక  పూర్తిగా తుడిచి పెట్టుకు పోయినది. డి‌ఎం‌కే కు 15వ లోక్ సభ లో 18 స్థానాలు కలవు.
·       దశాబ్ధాలుగా డి‌ఎం‌కే కంచు కోట ఐనా చెన్నై నగరం లోని 3 పార్లమెంటరీ నియోజక వర్గాలలో తొలిసారి ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే     విజయం సాదించినది.
·        అస్సామ్ ముఖ్య మంత్రి తరుణ్ గొగోయి, బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ ఎన్నికలలో పరాజయానికి నైతిక బాద్యత వహిస్తూ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేసినారు.
·       అస్సామ్ లో బి‌జే‌పి 7స్థానాలు, కాంగ్రెస్ 3, ఏ‌ఐ‌యూ‌డి‌ఎఫ్ 3,ఇండిపెండెంట్ ఒక స్థానం సాదించిరి.   
·       మోడి ప్రభంజనాన్ని ఎదుర్కొని ఒరిస్సా లో 4వ సారి ముఖ్య మంత్రి పదవిని బిజూ జనతాదళ్ కు చెందిన నవిన్ పట్నాయిక్  అదిష్టించబోతున్నారు.
·       పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్స్ 34 స్థానాలు సాదించినది.3.8% వొట్లను సాదించినది.
·       మమతా బెనెర్జీ మేనల్లుడు అబిషేక్ బెనెర్జీ పార్లమెంట్లో తొలి సారి అడుగు పెట్ట బోతున్నాడు.
·       వెస్ట్ బెంగాల్ లో కమ్యూనిస్ట్లులు కేవలం 2 స్థానాలకే పరిమితం అయినారు.
·       పశ్చిమ బెంగాల్ నుంచి రాష్ట్ర పతి కుమారుడు అబిజీత్ బెనర్జీ ఎన్నికైనారు.
·       మొదటి సారిగా పంజాబ్ నుంచి ఏ‌ఏ‌పి  25% వొట్ల తో ఉన్న 13స్థానాలలో 4 స్థానాలు గెలిచినది.
·       మహారాస్త్ర లో కాంగ్రెస్స్ ప్రదర్శన అద్వానముగా ఉంది. 48 సీట్లలో కేవలం 2 సీట్లు గెలిచినది. ఎన్‌సి‌పి 4 స్థానాలు సాదించినది. బి‌జే‌పి+శివసేన కూటమి 42 స్థానాలు సాదించినవి.
·       నవీన్ పట్నాయక్ మోడి ప్రబంజనాన్ని తట్టుకొని ఒరిస్సా లో 147 స్థానాలకు గాను 115 స్థానాలు సాదించారు. దేశవ్యాప్తంగా 1.7% వొట్లను సాదించినది. రాష్ట్రం లో పార్లమెంట్ కు 44.1%, రాష్ట్రం లో 43.4 స్థానాలు సాదించినది.
·       ఒరిస్సా లో అసెంబ్లీ కు ఎన్నికైన మొత్తం 147 శాసన సబ్యులలో 52% మంది అనగా 76 మంది కోటీశ్వరులు.
·       2014 ఎన్నికలలో కాంగ్రెస్, బి‌జే‌పి నిలబెట్టిన ప్రతి ముగ్గురు లోక్ సభ  అబ్యర్ధులలో ఒకరు క్రిమినల్ రికార్డ్ కలిగి ఉన్నారు.
·       బి‌జే‌పి తరుపున పోటీ చేసిన ప్రతి ముగ్గిరిలో ఇద్దరు గెలుపు సాదించిరి.
·        కర్నాటక నుంచి 4 మాజీ ముఖ్య మంత్రులు లోక్ సభ కు ఎన్నికైనారు. -1.వీరప్ప మొయిలీ (కాంగ్రెస్),యెడియూరప్ప (బి‌జే‌పి),సదానంద గౌడ (బి‌జే‌పి), దేవగౌడ(జే‌డి-ఎస్ .
·       మోడి ప్రబంజనాన్ని నిలువరించిన రాష్ట్రాలు నాలుగు  1. ఒడిస్సా  (నవీన్ పట్నాయక్)2.తమిళ్ నాడు (జయా లలిత) 3. వెస్ట్ బెంగాల్ (మమతా బెనెర్జీ ) కేరళ (ఒమేన్ చాంది)
·       బి‌జే‌పి ప్రముఖుడు,మాజీ రక్షణ శాఖ మంత్రి 2014 ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన జసవంత్ సింగ్ ఎన్నికల లో ఓడిపోయినారు.
·       కేంద్రం లో 1999-2004 వరకు మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఎన్‌డి‌ఏ పూర్తి కాలం అధికారం లో ఉంది.
·       బి‌జే‌పి మాజీ అద్యక్షుడు  గడ్కారీ మొదటి సారిగా పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు.
·       మేఘాలయ అధిక నోటా వొట్ల శాతం 2.8% సాదించినది.
·       గుజరాత్ లో నోటా వోట్లు గా దాదాపు 4లక్షల,54వేల,880 పోల్ ఆవినవి. ఇవి గుజరాత్ లో కాంగ్రెసేతర,బి‌జే‌పి ఏతర పార్టీలు సంపాదించిన మొత్తం వొట్ల కన్నా అధికం.
·       ప్రస్తుత 2014 ఎన్నికలలో దాదాపు 60 లక్షలకు పైగా నోటా  వోట్లు పోల్ ఆవినవి. దేశవ్యాప్తం గా నోటా  వోట్లు 1% కన్నా పైనే ఉన్నాయి.
·       దేశం లో అత్యధికంగా యూ‌పి నుంచి 5,91 లక్షల నోతా వోట్లు పోల్ అయినావి.
·       ముఖ్యంగా రిజర్వుడ్ నియోజక వర్గాలలో నోటా  వొట్లు అధికంగా పోల్ ఆవినవి.
·       ఏ‌ఏ‌పి ప్రముఖుడు యోగేంద్ర యాదవ్ గుర్గావ్ నుంచి ఎన్నికలలో ఒడి పోయినారు.
·       సి‌పి‌ఎం కేవలం 9 స్థానాలు (కేరళ-5,వెస్ట్ బెంగాల్-2,త్రిపుర -2) సాదించి జాతీయ పార్టీ హోదాను కోల్పోవ బోతున్నది.
·       ఎస్‌సిపి,బి‌ఎస్‌పి లు కూడా జాతీయా పార్టీ హోదాను కోల్పోయే ప్రమాదం లో ఉన్నాయి.
·       మొదటి నుండి ఇప్పటి వరకు పేరు మారని పార్టీ సి‌పి‌ఐ‌ఎం మాత్రమే  
·       బి‌జే‌పి దక్షిణాది నుంచి పూర్వం 1998 లో అధికంగా 20 స్థానాలు సాదించగా ప్రస్తుతం 2014 లో అధికంగా 21 స్థానాలు సాదించినది.
·       కాంగ్రెస్ దక్షిణాది నుంచి కేవలం 19 స్థానాలు (మొత్తం 129 స్థానాలు) సాదించినది.
·       బిహార్ లో ఎన్‌డి‌ఏ కూటమి మొత్తం 40 స్థానాలలో 32 స్థానాలు సాదించినది.
·       రాజ్ థాకరే కు చెందిన ఎం‌ఎన్‌ఎస్ మహారాస్ట్రా లో ఖాతా తెరవలేదు.
·       అస్సామ్ నుంచి ఏ‌జి‌పి కూడా ఖాతా తెరవలేదు (2009 లో ఒక స్థానం కలదు)  
·       పార్లమెంట్ ఎన్నికల తో పాటు బీహార్ లో జరిగిన 5 అసెంబ్లీ ఉప-ఎన్నికలలో 3 స్థానాలు ఆర్‌జే‌డి, 1బి‌జే‌పి,1జే‌డి(యూ) సాదించినవి.
·       ప్రధాన మంత్రి గా అధికారం లో ఉంది లోక్ సభ ఎన్నికలలో ఓడిపోయిన ఏకైక ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ .
·       2014 ఎన్నికలలో 62 మండి స్త్రీ లోక్ సభ సభ్యులు ఎన్నికైనారు. (2009 లో  మహిళా లోక్ సభ సబ్యుల సంఖ్య 61)
·       2014 ఎన్నికలలో లోక్ సభ కు 23మండి ముస్లిం అబ్యర్ధులు ఎన్నికైనారు. 53 నియోజక వర్గాలలో 2వ స్థానం లో ఉన్నారు.
·        2014 ఎన్నికలలో లోక్ సభ కు 4గురు స్త్రీ ముస్లిం అబ్యర్ధులు ఎన్నికైనారు.
·       2014 లో ముస్లిం లు కాంగ్రెస్ కు దేశవ్యాప్తం గా 44%వోట్ వేసినారు.
·       ముస్లిం లు ఛత్తీస్గర్,మద్య ప్రదేశ్ లో 90% కాంగ్రెస్ కు వోట్ చేసినారు.
·       దేశవ్యాప్తంగా ముస్లిం లు 87 నియోజక వర్గాలలో అత్యధికంగా ఉన్నారు. వీటిలో 45 చోట్ల బి‌జే‌పి విజయం సాదించింది.
·       యూ‌పి లో ముస్లిం లు అధికంగా ఉన్న 27 నియోజక వర్గాలలో బి‌జే‌పి విజయం సాదించింది.
·        14 రాష్ట్రాలనుంచి గత 25 సంవత్సరాలనుంచి ఒక్క ముస్లిం కూడా ఎన్నిక కాలేదు.
·       2014 లోక్ సభ ఎన్నికలలో దక్షిణ భారత దేశం నుంచి నలుగురు ముస్లిం లు ఎన్నికైనారు.
·       యూ‌పి,మహారాస్ట్రా లలో ఒక్క ముస్లిం ఎం‌పి ఎన్నిక కాలేదు.
·       కేంద్రం లో బి‌జే‌పి/రాష్ట్రం లో టి‌డి‌పి  10 సంవత్సరాల తరువాత అధికారం లోకి రాబోతున్నవి.
·       బి‌జే‌పి సొంతంగా తొలి సారి కేంద్రం లో సాదారణ మెజారిటీ ని సాదించినది.(282 స్థానాలు)
·       బి‌జే‌పి ప్రబంజనము లో కూడా మద్య ప్రదేశ్ లో జోతిరాదిత్య సింధియా, కమల్ నాథ్ కాంగ్రెస్ తరుపున గెలిచారు.
·       బి‌జే‌పి వృద్ద నేత ఎల్‌కే అద్వానీ గుజరాత్ లోని గాంధీ నగర్ నుంచి గెలిచారు.
·       సుష్మా స్వరాజ్ మద్య ప్రదేశ్ విదిశ నియోజక వర్గం నుంచి ఎన్నికైనారు
·       మోడి వడోదరా నుంచి అత్యదికంగా 5.7 లక్షల ఓట్ల మెజారిటీ తో గెలిచారు.
·       శశి దరూర్ కేరళ తిరువనంత పురం నుంచి విజయం సాదించగా, కేంద్ర హోం శాఖ మంత్రి షిండే మహారాస్త్ర నుంచి పరాజయం పాలైనారు.
·       ములాయం సింగ్ ఆజంఘడ్ నుంచి, వరుణ్ గాంధి సుల్తాన్ పూర్ నుంచి ఎన్నికైనారు.
·       6కేంద్ర పాలిత ప్రాంతాలలో బి‌జే‌పి నాల్గింటిని తన ఖాతాలో వేసుకుంధి,
·       బి‌జే‌పి కూటమి కేంద్రం లో నాల్గోవ సారి అధికారం లోకి వస్తుంది. (1996లో,1998,1999,2014లో )
·       లడక్ లో బి‌జే‌పి అబ్యర్ధి కేవలం 37 వొట్ల తేడా తో గెలిచాడు.
·       నేతాజీ సుభాస్ చంద్ర బొసే మనమడు సుగత బొసే (జాదవ్ పూర్-వెస్ట్ బెంగాల్ -తృణమూల్ కాంగ్రెస్ తరుపున ) ఎన్నికైనారు.
·       ఉత్తర్ ప్రదేశ్ లో ములాయం అతని కోడలు డింపుల్ యాదవ్ ఇరువురు గెల్చినారు.
·       హర్యానా లో 15ఏళ్ల తరువాత బి‌జే‌పి మంచి ఫలితాలను అనగా 8 స్థానాలలో 7 స్థానాలు సాదించినది.
·       జే‌ఎం‌ఎం నేత శిబూ సొరేన్,ఎల్‌జే‌పి నేత రామ్ విలాస్ పాశ్వాన్ విజయం సాదించినారు.
·       బోడోలు అధికంగా నివసించే అస్సామ్ లోని కొక్రాఝార్ నియోజక వర్గం నుంచి మొదటి సారిగా నాన్-బోడో వ్యక్తి ఎన్నికైనారు.
·       బి‌జే‌పి 5వేలు మెజారిటీ తో ఒక స్థానాన్ని, లక్షకు పైగా మెజారిటీ తో 195 లోక్ సభ స్థానాలు గెల్చుకొన్నది.
·       ఒర్రిస్సా లో బి‌జే‌డి లోక్ సభ మొత్తం21 స్థానాలలో 20 స్థానాలను స్వాదినం చేసుకోంది.
·       2014 లోక్ సభ సబ్యులలో మొత్తం 543 మందిలో 25-40 ఏళ్ల మద్య వయస్సు వారు 13%, 41-55 మద్య వయస్సు ఉన్నవారు 40% అనగా 55 కన్నా తక్కువ ఉన్న వారు 53% ఉన్నారు. 56నుంచి 70 వయస్సు ఉన్నవారు 39%,71 పైన వయస్సు వారు 7% ఉన్నారు.
·       40కన్నా తక్కువ వయస్సు ఉన్నవారు 71మండి ఎం‌పిలు ఉన్నారు. 55 కన్నా తక్కువ ఉన్నవారు 216 మంధి ఉన్నారు.
·       బి‌జే‌పి కి చెందిన ఎల్‌కే అద్వానీ అందరి కన్నా అధికంగా వయస్సు ఉన్న ఎం‌పి 86 సంవత్సరాలు.
·       బి‌జే‌పి కి చెందిన నజ్మా హెఫ్తుల్ల స్త్రీ సబ్యులలో అందరికన్నా అధికంగా వయస్సు ఉన్న ఎం‌పి 74 సంవత్సరాలు.
·       దేశంలో మెజారిటీ దృష్ట్యా మొదటి ఐదు స్థానాలు సాదించిన వారు బి‌జే‌పి అబ్యర్ధులు.
·        ఒకే ఒక ఎగ్జిట్ పోల్ టుడేస్ చాణక్య నిజమాయినది. . ఇది న్యూస్ 24 కోసం ఎగ్జిట్ పోల్ నిర్వహించినది. ఎగ్జిట్ పోల్ లో యూ‌పి‌ఏ కు 70 స్థానాలు ఎన్‌డి‌ఏ కు 340 స్థానాలు వస్తాయని చెప్పింది.
·       2014 లోక్ సభ ఎన్నికలలో లోక్ సభ కు కేవలం 3 ఇండిపెండెంట్లు మాత్రమే ఎన్నికైనారు
·       బి‌జే‌పి ధాటికి బి‌ఎస్‌పి,డి‌ఎం‌కే,ఎన్‌సి, సహా దేశవ్యాప్తంగా 1850 రాజకీయా పక్షాలు సున్నా ఫలితాలను సాదించాయి.
·       2014 లోక్ సభ ఎన్నికలలో అత్యధికం ధనం కలిగిన కోటీశ్వర్లు 10 మండి పోటీ చేయగా వీరిలో ఇరువురు మాత్రమే ఎన్నికైనారు.
·       మహారాష్ట్ర నుండి ఎన్నికైన 48 మండి లోక్ సభ సబ్యులలో 29 మండి కొత్తవారు.
·       2014 లోక్ సభ ఎన్నికలలో ఎన్నికైనవారిలో 75%మండి పట్టబద్రులు(2009 లో 79%) పి‌జి చేసినవారు 28%, మెట్రికులేషన్ అర్హతగా ఉన్నవారు10% మంది (2009 లో 17%). డాక్టరేట్ కలిగిన వారు6% మండి.(2009 లో 3%)
·       మేట్రిక్యులేషన్ అర్హత లేనివారు 13% (2009 లో 3%)
·       వ్యవసాయం వృత్తిగా ఉన్న ఎం‌పి లు 27%(2009 లో 27%), సాంఘిక సేవ వృత్తిగా ఉన్న ఎం‌పి లు 24%,(2009 ల0 8%) వ్యాపారం వృత్తిగా ఉన్న వారు 20%(2009 లో 15%)గా  ఉన్నారు.
·       16వ లోక్ సభ లో 38 మండి లాయర్లు, 24మండి డాక్టర్లు, 18 మండి కళాకారులు. 
·       రాజస్తాన్ నుండి కేవలం ఒక మహిళా మాత్రమే లోక్ సభ కు ఎన్నికైనది.
·       హర్యానా నుంచి లోక్ సభ కు ఒక్క మహిళా కూడా ఎన్నిక కాలేదు.
·       మన్మోహన్ మంత్రి వర్గం లోని కేవలం  3గురు కాబినెట్ మంత్రులు, 3స్టేట్ మంత్రులు,8 మండి సహాయ మంత్రులు మాత్రమే విజయం సాదించారు.
·       సిక్కిం కు చెందిన పవన్ చాంలింగ్ వరుసగా 5సారి ముఖ్య మంత్రి స్థానాన్ని అడిస్టించబోతున్నారు. ఇది ఒక రికార్డ్.     
·       16వ లోక్ సభ కు ఎన్నికైన సబ్యులలో ప్రతి ముగ్గురిలో ఒకరికి అనగా 186 మందికి అనగా 34% మందికి క్రిమినల్ రికార్డ్ ఉంది. (2009 లో 30%, 2004 లో 24%)
·       బి‌జే‌పి కి చెందిన మొత్తం సబ్యులు 282 లో 35% అనగా 98 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
·       ఆర్‌జే‌డి కి చెందిన మొత్తం 4గురు సబ్యులపై క్రిమినల్ రికార్డులు కలవు.
·       కాంగ్రెస్స్ కు చెందిన 44 మందిలో 8 మండి పై క్రిమినల్ కేసులు గలవు.
·       ఎన్‌సి‌పి కు చెందిన 5లో 4గురి పై క్రిమినల్ కేసులు కలవు.
·       ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే కు చెందిన 37 మండి లో 6 పై పోలీస్ కేసులు కలవు,
·       శివ సేన కు చెందిన 18 మండి లో 15 మండి పై కేసులు కలవు.
·       తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 34 మండి లో 7గురి పై క్రిమినల్ కేసులు కలవు,
·       మహారాస్త్ర,యూ‌పి,బిహార్ కు చెందిన అబ్యర్ధులు ఎక్కువుగా క్రిమినల్ రెకార్డ్ కలిగి ఉన్నారు.
·        క్రిమినల్ చరిత్రగలవారు, క్రిమినల్ చరిత్ర లేని వారి కన్న రొందింతలు అధికంగా ఎన్నికలలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. క్రిమినల్ చరిత్రగలవారికి 13% లేనివారికి 5 శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి. (ఏ‌డి‌ఆర్,అహ్మదాబాద్  రిపోర్ట్)
·       టి‌డి‌పి,టి‌ఆర్‌ఎస్,వై‌ఎస్‌ఆర్‌సి‌పి కి చెందిన పార్టీల అబ్యర్ధులు సగటున 50కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నాఋ.
·       దేశం లో కల్ల అత్యంత ధనిక లోక్ సభ సబ్యుడు గల్లా జయదేవ (టి‌డి‌పి) 683 కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడు.
·       82% లోక్ సభ సబ్యులకు ఒక కోటి అంతకన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.
·       బి‌జే‌పి కి చెందిన వారిలో 237 మండి అనగా 84% కోటీశ్వరులు.
·       బి‌జే‌పి కి చెందిన ఎం‌పి లు సరాసరి 11 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు.
·       కాంగ్రెస్స్ కు చెందిన వారిలో 35 మండి కోటీశ్వరులు
·       కాంగ్రెస్ కు చెందిన ఎం‌పిలు 16 కోట్ల ఆస్తిని సగటున కలిగి ఉన్నారు.
·       సి‌పి‌ఐ‌ఎం కు చెందిన ఎం‌పి లు సగటున 79 లక్షల ఆస్తిని కలిగి ఉన్నారు.
·       తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎం‌పి దేశం లో కల్లా అత్యంత బీదవాడు –కేవలం 5 లక్షల ఆస్తిని కలిగి ఉన్నాడు.
·       2014 ఎన్నికల లో దేశవ్యాప్తంగా 1687 పార్టీలు రిజిస్టర్ చేసుకొన్నవి.వీటిలో 53 పార్టీలు పోటీచేసినవి,వీటిలో 14 జాతీయ పార్టీలు,39 ప్రాంతీయ పార్టీలు.
·       2014 లోక్ సభ ఎన్నికలలో అతితక్కువ మెజారిటీ తో గెల్చిన 50 మండి పార్లమెంట్ సబ్యులలో కాంగ్రెస్స్ వారు 14మంది, బి‌జే‌పి వారు 13మంది కలరు.
·       అత్యధిక మెజారిటీ తో గెల్చిన 50 మందిలో బి‌జే‌పి వారు 36 మండి, కాంగ్రెస్ వారు 2 కలరు.
·       యూ‌పి,బిహార్ లోనే మొత్తం 120 స్థానాలలో బి‌జే‌పి 93 స్థానాలు గెల్చుకోంది.
·       మద్య ప్రదేశ్ లో 6గురు బి‌జే‌పి అబ్యర్ధులు 3లక్షలకు పైగా మెజారిటీ తో గెల్చినారు.
·       16వ లోక్ సభ కు ఎన్నికైన ఏకైక జంట –బిహార్ కు చెందిన రాజేశ్ రంజన్ గా పిలువబడే పప్పు యాదవ్ మధేపుర-ఆర్‌జే‌డి మరియు అతని భార్య రంజిత్ రంజన్ – సుపాల్-కొంగ్రెస్
·       16వ లోక్ సభకు మొదటి సారి ఎన్నికైన మొత్తం 543 ఎం‌పి లలో 58% అనగా 315 మంది మొదటి సారి ఎన్నికైనవారు.
·       ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే నుంచి 92% ఎం‌పిలు మొదటి సారి ఎన్నికైన వారు. శివసేన నుంచి (67%) బి‌జే‌పి నుంచి (59%) తృణమూల్ కాంగ్రెస్ (56%) నుంచి ఎన్నికైనారు.  
·       కాంగ్రెస్స్ నుంచి 44 మందిలో 9 మండి కొత్తగా ఎన్నికైన వారు.
·       62మండి మహిళా ఎం‌పిలలో 40మంది మొదటి సారి ఎన్నికైన వారు.
·       మొదటి సారి ఎన్నికైనవారిలో 12మంది 30సంవత్సరాలలోపు,48 మంది 31-40 సంవత్సరాలలోపు వారు.
·       పార్లమెంట్ కు తిరిగి ఎన్నుకోబడిన 226 మండి ఎం‌పిలలో నలుగురు 9సార్లు,నలుగురు 8సార్లు,ఎన్నికైనారు.
·       మహిళా ఎం‌పి లలో అత్యధిక పార్లమెంట్ అనుభవం ఉన్న ఎం‌పి శ్రీమతి సుమిత్ర మహాజ (8సార్లు)
·       15వ లోక్ సభ నుంచి 16వ లోక్ సభ కు ఎన్నికైన171 మండి లో సగం మండి బి‌జే‌పి నుంచి, 31 మండి కాంగ్రెస్ నుంచి ఎన్నికైనారు.  
మాజీ అధికారులు:
·       ఎన్నికైనవారు:
1.మాజీ హోం సెక్రెటరీ ఆర్‌కే సింగ్, 2.మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వి‌కే సింగ్, 3.మాజీ ముంబై పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ , 4.మాజీ రాజస్థాన్ డి‌జి‌పి హెచ్‌సి మీనా మొదలగు వారందరూ బి‌జే‌పి టిక్కట్ పై లోక్ సభ కు ఎన్నికైనారు.
సినిమా రంగం:
·       గెల్చిన వారు -హేమా మాలిని (బి‌జే‌పి –మధుర-యూ‌పి) శత్రుఘ్న్ సిన్హా (బిహార్-బి‌జే‌పి-పాట్నా సాహిబ్-బిహార్ ) పరేశ్ రావల్ (ఈస్ట్ అల్లహాబాద్-యూ‌పి-బి‌జే‌పి) వినోద్ ఖన్నా (బి‌జే‌పి-పంజాబ్ –గురుదాస్ పూర్) కిరణ్ ఖేర్ (బి‌జే‌పి-చండీగర్)మూన్-మూన్-సేన్ (టి‌ఎం‌సి-వెస్ట్ బెంగాల్) ఇన్నోసెంట్  (కేరళ-ఇండిపెండెంట్) మనోజ్ తివారీ (డిల్లీ నార్త్ –బి‌జే‌పి)
·       ఓడిన వారు – రాజ్ బబ్బర్,నగ్మా,గుల్ పనాగ్ ,జయప్రధ, జావేద్ జాఫ్రీ, స్మృతి ఇరానీ,రవి కిషేన్, కునాల్ సింగ్,రాఖీ సావంత్,
క్రీడాకారులు
·       గెల్చినవారు: రాజవర్ధన్ రాథోర్(షూటింగ్)
·       ఒడినవారు- దిలీప్ తిర్కే (హాకీ),మహమ్మద్ కైఫ్ (క్రికెట్) బైచుంగ్ భుటియా (పూట్ బాల్)

ప్రముఖ కుటుంభాల నుంచి
విజేతలు:
గాంధీ కుటుంభము : సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మేనకా గాంధీ, వరుణ్ గాంధీ
కే‌సి‌ఆర్ కుటుంబం నుంచి : కే‌సి‌ఆర్, కవిత,కే‌టి‌ఆర్,హరీష్ రావు
ములాయం కుటుంభం నుంచి: ములాయం సింగ్,డింపల్ యాదవ్(కోడలు) అక్షయ్ యాదవ్(మేనల్లుడు) ధర్మేంద్ర యాదవ్(మేనల్లుడు)
జగన్ కుటుంబం: జగన్, అవినాష్ రెడ్డి (కజిన్) వై‌వి సుబ్బా రెడ్డి (బాబాయి) పి‌ఆర్ రెడ్డి
ప్రముఖ వ్యక్తుల కుమారులు/కుమార్తెలు
విజేతలు:
దుష్యంత్ సింగ్ (వసుందర రాజే కుమారుడు), సుప్రియా సులె (శరద్ పవార్ కుమార్తె) గౌరవ్ (తరుణ్ గొగోయి కుమారుడు) జయంత్ (యశ్వంత్ సింహా కుమారుడు) దీపిండర్ (హరియాణ సి‌ఎం కుమారుడు )అబిజిత్ ముఖర్జీ (రాష్టపతి కుమారుడు)


ఆంధ్ర ప్రదేశ్ ఫలితాల విశేషాలు
·       తెలుగు దేశం స్థాపకుడు ఎన్‌టి‌ఆర్ స్వస్థలం గుడివాడ లో టి‌డి‌పి ఒడి పోయినది. వైకాప కు చెందిన కొడాలి నాని అక్కడి నుండి విజయం సాదించారు.
·       వై కా పా అబ్యర్ధి అల్లా రామ కృష్ణా రెడ్డి మంగళగిరి నుంచి కేవలం 12 వొట్ల తేడాతో అది పోస్టల్ బ్యాలట్ల సహాయం తో గెలిచారు.
·       అనంత పురం జిల్లా నుంచి జే‌సి బ్రదర్స్ ఇరువురు గెలిచినారు.జే‌సి దివాకర రెడ్డి పార్లమెంట్ కు, జే‌సి ప్రభాకర రెడ్డి అసెంబ్లీ కి గెలిచారు.
·       పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రి వర్గం లో పనిచేసిన పల్లం రాజు,పనబాక లక్ష్మి,కే‌సి దేవ్ ,కిల్లి కృపా రాణి తమ డిపాజిట్లను కోల్పోయారు. పురందేశ్వరి,కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ఓడిపోయినారు.
·       ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జయ సమైక్యాంద్ర పార్టీ ఖాతాను తెరవలేదు. అతని తమ్ముడు పీలేరు నుంచి పరాజయం పొందినారు.
·       వైకాపా కు చెందిన శోభ నాగి రెడ్డి చరిత్ర సృష్టించారు. ఆమె మరణించిన తరువాత కూడా అసెంబ్లి ఎన్నికలలో విజయం సాధించారు.
·       బొత్చ కుటుంబానికి చెందిన నలుగురు ఎన్నికలలో పరాజయం పాలయ్యారు.
·       తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు పొన్నాల భారీ తేడా తో ఎన్నికలలో ఓడిపోయినారు.
·       జగన్ తొలి సారిగా అసెంబ్లీ లో అడుగు పెట్టబోతున్నారు.
·       లోక్ సత్తా పార్టీ అద్యక్షుడు జే‌పి మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికలలో ఓడిపోయినారు.
·       వైకాపా అద్యక్షురాలు విజయమ్మ విశాఖ పట్టణం నుంచి ఎన్నికలలో ఓడిపోయినారు.
·       ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్స్ పార్టీ అద్యక్షులు రఘువీరా రెడ్డి ఎన్నికలలో పరాజయం పోయిందినారు. డిపాజిట్ కోల్పోయినారు. ఆనం కూడా డిపాజిట్ కోల్పోయినారు.
·       మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర తెనాలి నుంచి ఒడి పోయినారు.మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి కూడా ఓడిపోయినారు.  
·       గల్లా అరుణకుమారి ఓడిపోగా, ఆమె కుమారుడు గల్లా జయదేవ గుంటూర్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికైనారు.
·       సినీ తారలు బాల కృష్ణా, రోజా ఎన్నికైనారు.
·       శ్రీకాకులం  జిల్లా లో ధర్మాన ఇద్దరి సోదరుల పరాజయం
·       అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్ పరాజయం. 
·       14 మండి రాష్ట్ర మంత్రులు ఓడిపోయినారు.
·       టి‌జి వెంకటేష్, ఎరాసు ప్రతాప రెడ్డి,కన్నా,ఆనం ఎన్నికలలో ఓడిపోయినారు.
·       జే‌ఎస్‌పి, లోక్ సత్తా పార్టీలకు ఈ ఎన్నికలలో ఘోర పరాజయం సంభవించినది.
·       సీమాంద్ర నుండి బి‌జే‌పి ఈ సారి అత్యాదికంగా 4 స్థానాలు సాదించి రికార్డ్ స్థాపించినది.
·       ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో కేవలం 3 పార్టీలే ప్రాతినిద్యం వహి స్థాయి. టి‌డి‌పి(102),బి‌జే‌పి(04)వై‌సి‌పి (67) ఇద్దరు ఇండిపెండెంట్ లు మొత్తం అసెంబ్లీ సబ్యుల సంఖ్య 175.
·       సీమాంద్ర నుండి ఎన్నికైన 82 ఎం‌ఎల్‌ఏ లు,11మండి ఎం‌పిలు, తెలంగాణా నుండి ఎన్నికైన 63 మండి ఎం‌ఎల్‌ఏ లు, 8 ఎం‌పి లకు క్రిమినల్ రెకార్డ్ ఉంది.
·       సీమాంద్రాలో వైకాపా గెల్చిన 13 చోట్ల దాని మెజారిటీ 2వేల లోపే. మంగళగిరి లో కేవలం 12 వొట్ల తేడాతో గెల్చినది.
·       సీమాంద్రా లో కాంగ్రెస్స్ 150 నియోజక వర్గాలలో డిపాజిట్లు కోల్పోయినది.
·       సీమాంద్రా లో  150 నియోజక వర్గాలలో కాంగ్రెస్స్ అబ్యర్ధులు 5వేల తక్కువ ఓట్లు సాదించగా,వారిలో ఎక్కువ మండి 2000 వోట్లు కూడా సాదించలేదు , కేవలం డజనుకు పైగా అబ్యర్ధులు మాత్రమే 10వేలకు పైగా ఓట్లు సాదించారు.
·       సీమాంద్ర లోని 8 నియోజక వర్గాలలో కాంగ్రెస్స్ అబ్యర్ధులు ఒక వెయ్యికన్న తక్కువ ఓట్లు సాదించిరి.
·       1978 నుంచి ఎన్నికలలో గెలుస్తూ వచ్చిన శతృచర్ల 2014 ఎన్నికలలో మొదటి సారి ఓడిపోయినారు.
·       ఆంధ్ర ప్రదేశ్ నుంచి పోటీచేసిన 175 మంది కాంగ్రెస్ సబ్యులలో ఒకరికే డిపాజిట్ లు దక్కినవి.
·       టీడీపీ 1,40,94,545 ఓట్లు రాబడితే వైఎస్సార్ కాంగ్రెస్ 1,39,91,280 ఓట్లు సాధించింది. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం లక్ష మాత్రమే
·       అసెంబ్లీ ఎన్నికల్లో టి‌డి‌పి, వైకాపా పార్టీ కి మద్య ఓట్ల తేడా కేవలం 1.96 శాతం మాత్రమే
·       వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రం లో  45 శాతం ఓట్లు సాధించినది.
·       జాతీయస్థాయిలో టీడీపీతో సమానంగా వైఎస్సార్ కాంగ్రెస్ 2.5 శాతం ఓట్లు సాధించింది.
·       అత్యధిక ఓట్లు సాధించిన పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయస్థాయిలో పదో స్థానంలో నిలిచింది.
·       స్వల్ప ఓట్ల తేడాతో వైకాపా   30కి పైగా స్థానాలలో ఓడిపోయినది.
·       తెలుగు దేశం తరుపున సీమాంద్ర లో ముస్లిం లు ఎవరు ఎన్నిక కాలేదు,  పీలేరు నుంచి పోటీ చేసిన ఒకే ఒక అబ్యర్ధి ఓడిపోయినాడు.
·       కడప,కర్నూల్,చిత్తోర్, నెల్లూరు,ప్రకాశం జిల్లాలలో వైకాపా కు టి‌డి‌పి కన్నా అధికంగా వోట్లు లబించినాయి.ఈ 5జిల్లాలలోని 60అసెంబ్లీ,9ఎం‌పి స్థానాలలో వైకాపా 41 అసెంబ్లీ,7ఎం‌పి స్థానాలు దక్కించుకొన్నది.
·       మిగిలిన 8జిల్లాలలోని 115అసెంబ్లీ స్థానాలు 16ఎం‌పి స్థానాలలో కేవలం 1ఎం‌పి,26 అసెంబ్లీ స్థానాలను వైకాపా సాదించినది.
·       శ్రీకాకులము,విజయనగరం,విశాఖ,తూర్పు,పశ్చిమ గొదావరి మొదలగు 5 జిల్లాలలో 68అసెంబ్లీ,10 ఎం‌పి స్థానాలలో టి‌డి‌పి 50 అసెంబ్లీ స్థానాలను,7ఎం‌పి స్థానాలు గెల్చుకొన్నది. బి‌జే‌పి 9ఎం‌ఎల్‌ఏ స్థానాలు,2ఎం‌పి స్థానాలు గెల్చుకొన్నది. ఈ జిల్లాలలో కేవలం 1ఎం‌పి,14అసెంబ్లీ స్థానాలు గెల్చుకొన్నది.
·       కృష్ణ,గుంటూర్ జిల్లాలలో టి‌డి‌పి, వైకాపా సమానంగా వోట్లు సాధించిన టి‌డి‌పి 22 అసెంబ్లీ స్థానాలు,బి‌జే‌పి 1అసెంబ్లి స్థానం, వైకాపా 10అసెంబ్లీ స్థానాలు గెల్చుకొన్నది.
·       మొత్తం మీద రెడ్లు,ముస్లింలు, క్రైస్తవులు,అధికంగా ఉన్న చోట్ల వైకాపా విజయం సాదించినది,
·       కాపు,కమ్మ,బ్రాహ్మణ,రాజులు,బి‌సి లు అధికంగా ఉన్న చోట టి‌డి‌పి విజయం సాదించినది. బి‌జే‌పి కూడా ఈ ప్రాంతాలలోనే విజయం సాదించినది.
·       సీమాంద్ర లో 2కోట్ల 90 లక్షల మండి ఓటు హక్కు వినియోగించుకోగా, కాంగ్రెస్ కేవలం 8లక్షల ఓట్లు మాత్రమే సాదించినది,
·       విజయనగరం,కర్నూల్ జిల్లా మినహా మిగతా 11జిల్లాలలో ఆపార్టీకి  లక్షలోపు మాత్రమే వోట్లు వచ్చినాయి.
·       1952 తరువాత మొదటిసారిగా ఆ పార్టీ సీమాంద్ర  లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేక పోయినది.
·       సీమాంద్ర లో వామపక్షాలు,సమైక్యాంద్ర పార్టీ, లోక్ సత్తా పార్టీ తుడుచుకు పెట్టి పోయినాయి.  
·       తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి మంత్రివర్గాన్ని టి‌ఆర్‌ఎస్ ఏర్పర్చబోతున్నది.
·       తెలంగాణ నుంచి గెల్చిన వారిలో ఈ.రాజేందర్, ఎర్రబిల్లి దయాకర్, గీతా రెడ్డి, కవిత, హరీష్ రావు,
తారక రామారావు, రేవంత రెడ్డి, గ.నాగేశ్,వినోద్ కుమార్, గుట్ట సుకెందర్ రెడ్డి, దత్తాత్రేయ,చెన్నమ నేనీ రేమేష్ బాబు, జీవన్ రెడ్డి,గంప గోవర్ధన్,చిన్న రెడ్డి, కొండా సురేఖ ముఖ్యులు.
కే‌సి‌ఆర్ అసెంబ్లీ, పార్లమెంట్ రెండిటినుంచి విజయం సాదించారు.
·       తెలంగాణా లో ఓడిన ప్రముఖులలో జగ్గారెడ్డి(సంగారెడ్డి అసెంబ్లీ) మధు యస్కీ(నిజామాబాద్ పార్లమెంట్) పొన్నం ప్రభాకర్ (కరీంనగర్ పార్లమెంట్) దామోదరం నరసింహా ,డి.శ్రీనివాస్,విజయ శాంతి,నామా నాగేశ్వర రావు,మంధ కృష్ణ మాదిగ,జయపాల్ రెడ్డి  ముఖ్యులు  
·       తెలంగాణా లో సెటిలర్లు అధికంగా ఉన్న 41 నియోజక వర్గాలలో 15 స్థానాలలో టి‌డి‌పి+బి‌జే‌పి విజయం సాదించింది (బి‌జే‌పి=5,టి‌డి‌పి=10 నియోజక వర్గాలు) 10స్థానాలలో టి‌ఆర్‌ఎస్,5స్థానాలలో కాంగ్రెస్,3స్థానాలలో వైకాపా,ఒక స్థానం లో మజ్లిస్,ఒక స్థానం లో సి‌పి‌ఎం,ఒక స్థానం లో స్వతంత్ర అబ్యర్ధి విజయం సాదించారు.
·       తెలంగాణ లో టి‌ఆర్‌ఎస్ 27 స్థానాలలో 25వేలకు పైగా మెజారిటీ సాదించినది. (కానీ కే‌సి‌ఆర్ కు 19వేల మెజారిటీ మాత్రమే లబించినది)కాంగ్రెస్స్ ఏ స్థానం లోనూ 25 వేల మెజారిటీ సాదించలేదు. టి‌డి‌పి 6నియోజక వర్గాలలో,ఎం‌ఐ‌ఎం 5స్థానాలలో, బి‌జే‌పి 3 స్థానాలలో, 25 వేల పైగా మెజారిటీ సాదించినవి.
·       తెలంగాణా లో బి‌జే‌పి పోటీచేసిన 45 అసెంబ్లి స్థానాలలో 23 స్థానాలలో 3వ స్థానం లో ఉంది.
·       బి‌జే‌పి+టి‌డి‌పి ఎలయన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల 20 స్థానాలలో 15 స్థానాలలో గెల్చినది.
·       తెలంగాణా లో బి‌జే‌పి తాను పోటీచేసిన పార్లమెంట్ స్థానాలలో ఒక పార్లమెంట్ (సికిందేరాబాద్)స్థానం లోనే గెల్చింది. మిగతా 6 స్థానాలలో 3వ స్థానం లో ఉంది.
·       బి‌జే‌పి పోటీచేసిన 7 లోక్ సభ స్థానాలలో కొంగ్రెస్ 2వ స్థానం లో ఉంది.
·       హైదరాబాద్ లోక్ సభ స్థానం లో బి‌జే‌పి 2వ స్థానం లో ఉంది.
·       తెలంగాణలో మొత్తం పోలైన ఓట్లు 1.95 కోట్లు కాగా 66 లక్షలకుపైగా ఓట్లను టీఆర్ఎస్,నలభై తొమ్మిది లక్షల ఓట్లు కాంగ్రెస్‌కు దక్కాయి.
·       టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు మధ్య ఓట్లలో తేడా 17 లక్షలకుపైగా ఉంది.
·       తెలంగాణలో టీడీపీకి 28 లక్షలకుపైగా ఓట్లు వస్తే, బీజేపీ అందులో సగానికి సగం దాదాపు 14 లక్షల ఓట్లను దక్కించుకుంది. టీడీపీ, బీజేపీలకు కలిపి తెలంగాణలో దాదాపు 42 లక్షల ఓట్లు వచ్చాయి.
·       వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఆరున్నర లక్షల ఓట్లు లభించాయి.
·       ఎమ్.ఐ.ఎమ్.కు సుమారు ఏడు లక్షల ఓట్లు వచ్చాయి.