30 November 2021

మాటీల్ మొఘన్నమ్, "ది పాలస్తీనియన్ గాంధీ Matiel Moghannam, “The Palestinian Gandhi

 


.

మాటీల్ టూమీ మొఘన్నమ్ Matiel Toomey Moghannam (ఫిబ్రవరి 15, 1899 - ఆగష్టు 11, 1992) బ్రిటిష్ మాండేట్ (Mandate) సమయంలో పాలస్తీనా మహిళా ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తి. లెబనాన్‌లో జన్మించిన ఆమె చిన్నతనంలో యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లినది. 1920లలో పాలస్తీనాలోని జెరూసలేంకు వెళ్లి, అక్కడ ప్రముఖ న్యాయవాది మరియు నేషనల్ డిఫెన్స్ పార్టీ సభ్యుడైన మొఘన్నమ్ ఎలియాస్ మొఘన్నమ్‌ Moghannam Elias Moghannam ను వివాహం చేసుకుంది.

1929లో, అల్-బురాక్ (పశ్చిమ గోడ) అల్లర్ల తర్వాత, మాటీల్ పాలస్తీనా మహిళా ఉద్యమంలో క్రియాశీలకంగా మారారు మరియు అరబ్ ఉమెన్స్ ఎగ్జిక్యూటివ్ మరియు అరబ్ ఉమెన్స్ అసోసియేషన్- జాతీయవాద, స్త్రీవాద సంస్థలు రెండింటిలోనూ వాహిదా అల్-ఖలిదీతో కలిసి సహ వ్యవస్థాపకురాలు అయింది.. వారి ప్రాథమిక ఉద్దేశ్యాలు బాలికల విద్యను మరియు మహిళల సామాజిక మరియు ఆర్థిక స్థితిని ప్రోత్సహించడం. మాటిల్ మరియు వాహిదా అల్-ఖలిదీ బ్రిటిష్ మాండేట్ ను నిరసించారు మరియు పాలస్తీనా జాతీయ వాదానికి మద్దతును ఇచ్చారు.

 తారాబ్ అబ్ద్ అల్-హదీతో కలిసి, మాటీల్ పాలస్తీనా అరబ్ మహిళల మొదటి కాంగ్రెస్‌ను నిర్వహించాడు మరియు అక్టోబర్ 1929లో, హైకమిషనర్ లార్డ్ ఛాన్సలర్‌తో సమావేశమైన పాలస్తీనా మహిళా ప్రతినిధి బృందం యొక్క మొదటి ఇద్దరు అధికారిక ప్రతినిధులు అయ్యారు.

15 ఏప్రిల్ 1933న పవిత్ర స్థలాలకు అరబ్ మహిళల అహింసా మార్చ్ సందర్భంగా మాటీల్ మసీదు ఆఫ్ ది డోమ్ ఆఫ్ ది రాక్ వద్ద కూడా మాట్లాడారు.మాటీల్ "ది అరబ్ ఉమెన్ అండ్ ది పాలస్తీనియన్ ప్రాబ్లమ్" (లండన్: హెర్బర్ట్ జోసెఫ్, 1937) రచించారు.

1938లో, ప్రముఖ స్త్రీవాది హుదా షరావి నేతృత్వంలో కైరోలో జరిగిన మొదటి అరబ్ మహిళా కాంగ్రెస్‌లో మాటీల్ పాల్గొంది.

1939లో, మాటియల్ రమల్లాలో రిలీఫ్, చారిటి  కార్యకలాపాలను అందించడానికి మరియు మహిళలకు కుట్టు మరియు ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్‌లను అందించడానికి మాటీల్ అరబ్ ఉమెన్స్ యూనియన్ సొసైటీని స్థాపించారు,

1980లో, మాటీల్ USAలోని వర్జీనియాకు తిరిగి వచ్చింది, మాటిల్ 1992లో గుండె పోటు తో మరణించింది.

 

సూర్యకాంతి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు Health Benefits of Sunlight

 



 

మొక్కలు మరియు వ్యవసాయ అభివృద్ధిని ప్రేరేపించడం నుండి   ప్రజలను ఆరోగ్యంగా ఉంచడం వరకు  సూర్యరశ్మి పాత్ర విలువైనది. చాలా మంది వ్యక్తులు సూర్యరశ్మి యొక్క అనుభూతికి  ఇష్టపడతారు మరియు దాని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలవు,

అయితే సూర్యరశ్మి ఒక మిశ్రమ వరం. సూర్యుడి నుండి వచ్చే అతి ఎక్కువ UV రేడియేషన్ చర్మ క్యాన్సర్‌కు కారణమవుతుందని తెలుసుకున్న ప్రజలు ఇప్పుడు ఎండలో గడపడం పట్ల మరింత జాగ్రత్తగా ఉన్నారు. అయినప్పటికీ, ప్రజలు సూర్యరశ్మి యొక్క ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు వీలుగా సూర్యరశ్మి ని తగినంతగా పొందేలా చూసుకోవాలి. సూర్య రశ్మి ప్రజలు ఆరోగ్యకరమైన విటమిన్ డి స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.

సూర్యరశ్మిని పొందడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు:

1.  విటమిన్ డి స్థాయిలు పెరిగుట:

విటమిన్ డి శరీరంలో అనేక ముఖ్యమైన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇది వాపును తగ్గిస్తుంది మరియు కణాల విస్తరణను నియంత్రిస్తుంది. సూర్యుడు విటమిన్-డి యొక్క ఉత్తమ సహజ ప్రదాత, మరియు సూర్య కాంతి ప్రయోజనాలను పొందడానికి వారానికి కొన్ని సార్లు 5-15 నిమిషాల పాటు ఎండలో గడపండి.  15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండబోతున్నట్లయితే సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలని నిర్ధారించుకోండి.

 

2. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది:

విటమిన్-డి రోగనిరోధక వ్యవస్థకు కూడా ముఖ్యమైనది, మరియు సూర్యరశ్మి రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ -వ్యాధి, అంటువ్యాధులు, కొన్ని ప్రాణాంతకత మరియు శస్త్రచికిత్స తర్వాత వచ్చే సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది

 

౩.ఎముకల బలాన్ని కాపాడుతుంది:

విటమిన్-డిని పొందడానికి ఆరుబయట ఉండటం అత్యుత్తమ (మరియు సరళమైన) పద్ధతుల్లో ఒకటి. మనం సూర్యరశ్మికి గురైనప్పుడు, మన శరీరాలు విటమిన్ డిని ఉత్పత్తి చేస్తాయి.ప్రతిరోజూ సూర్యరశ్మిలో సుమారు 15 నిమిషాలు సరిపోతుంది. మరియు, విటమిన్-డి శరీరం లో  కాల్షియంను నిర్వహించడానికి సహాయపడుతుంది మరియు పెళుసుగా, సన్నగా లేదా వికృతమైన ఎముకలను నివారిస్తుంది. కాబట్టి, ఎండలో స్నానం చేయడం మంచిది..

 

4.డిప్రెషన్‌తో పోరాడుతుంది:

బయట వెలుతురులో ఉండటం వల్ల మంచి అనుభూతి కలుగుతుందని శాస్త్రీయ వివరణ ఉంది. సూర్యరశ్మి శరీరంలో సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది, ఇది మానసిక స్థితిని మెరుగుపరిచే హార్మోన్ మరియు రిలాక్స్‌ గా మరియు కంపోజ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

 

5.బరువు తగ్గడంలో సహకరిస్తుంది:

2014 లో జరిగిన అధ్యయనం ప్రకారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు 30 నిమిషాల పాటు బయటికి వెళ్లడం వల్ల బరువు తగ్గడం జరుగుతుంది. ఉదయాన్నే సూర్యరశ్మి మరియు బరువు తగ్గింపు మధ్య లింక్ ఉన్నట్లు కనిపిస్తుంది.


6.ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడవచ్చు:

జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన 30,000 మంది స్వీడిష్ మహిళలపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం  సూర్యరశ్మిలో  ఎక్కువ సమయం గడిపిన వ్యక్తులు తక్కువ ఎక్స్‌ పోజర్ ఉన్నవారి కంటే 6 నెలల నుండి రెండు సంవత్సరాల వరకు ఎక్కువగా జీవించారని కనుగొన్నారు.

 

22 November 2021

భారతీయ ముస్లిం స్వాతంత్ర్య సమరయోధులు Indian Muslim Freedom Fighters

 

ఇటివల గత కొన్నేళ్లుగా రైట్ వింగ్‌ శక్తులు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ముస్లింలకు ఎలాంటి పాత్ర లేదని పేర్కొంటూ భారతీయ ముస్లింల పట్ల ప్రదర్శిస్తున్న  ఆవహేళనలు దాదాపు ప్రతిచోటా రోజువారీ దృశ్యంగా మారాయి. భారత దేశం మరియు దాని స్వేచ్ఛ కోసం తమ పూర్వీకులు ఏమి త్యాగం చేశారనే దాని గురించి చాలా మంది ముస్లిములకు నిజంగా తెలియదు.

1947 స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు 1857 మొదటి స్వాతంత్ర్య పోరాటంలో కూడా ముస్లింల త్యాగాల గురించి మన యువ తరానికే కాదు, చాలా మంది విద్యావంతులతోపాటు మన పెద్దలకు కూడా కనీస అవగాహన లేదు. ముస్లింలు నాయకత్వం వహించి పోరాడారు.

తిరుగుబాటుకు చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్, అహ్మదుల్లా షా, బర్కత్ ఖాన్, ఖాన్ బహదూర్ ఖాన్ రోహిల్లా, బేగం హజ్రత్ మహల్‌తో పాటు అనేక మంది నాయకత్వం వహించారు. మరియు వారందరూ 1857 తిరుగుబాటులో పాల్గొన్నందుకు భారీగా మూల్యం చెల్లించారు.

చివరి మొఘల్ చక్రవర్తి పదవీచ్యుతుడయ్యాడు మరియు బర్మాలోని రంగూన్‌కు బహిష్కరించబడ్డాడు, అక్కడ అతను తన జీవితంలోని మిగతా సంవత్సరాలు జైలు శిక్షలో గడిపాడు. ఢిల్లీలో తిరుగుబాటు దళాలకు నాయకత్వం వహించిన బహదూర్ షా జఫర్ కుమారులు, అతని పెద్ద కుమారుడు మీర్జా మొఘల్‌తో సహా ఆరుగురు మొఘల్ యువరాజులు నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు.

బ్రిటిష్ వలస పాలకుల చేత 1857 తిరుగుబాటుకు చెందిన అనేకమంది ఇతర నాయకులు కూడా ఉరితీయబడ్డారు. బరేలీ మరియు రోహిల్‌ఖండ్‌లలో బ్రిటిష్ దళాలను ఓడించి, వారిని హిమాలయాలకు తరిమికొట్టిన ఖాన్ బహదూర్ ఖాన్ రోహిలా, తాంతియా తోపే, నానా సాహెబ్ మొదలగు స్వాతంత్ర్య ఉద్యమ నాయకులకు  ముఖ్యమైన సహాయాన్ని అందించాడు. ఖాన్ బహదూర్ ఖాన్ రోహిలా చివరకు బరేలీలోని కొత్వాలి సమీపంలో ఉరి వేసుకుని చనిపోయాడు. మోల్వీ అహ్మదుల్లా షాకు కూడా ఇదే విధమైన శిక్ష లబించినది మరియు మోల్వీ అహ్మదుల్లా షా శరీరం బ్రిటీష్ వారి మిత్రుడిచే ద్రోహంగా చంపబడిన తరువాత రోజుల తరబడి వేలాడుతూనే ఉంది.

ఉత్తర భారతదేశంలోని ఒక ముఖ్యమైన నగరమైన అలహాబాద్ నుండి బ్రిటిష్ దళాలను ఓడించి, తరిమికొట్టిన మోల్వి లియాఖత్ అలీ, వలస పాలకులు పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాలపై తిరిగి నియంత్రణ సాధించకముందే హిందూ మరియు ముస్లిం తిరుగుబాటుదారుల సహాయంతో అక్కడ పాలించారు. అండమాన్ దీవుల్లో కొన్నాళ్లు అమానవీయ పరిస్థితుల్లో ఉండి చివరికి మరణించాడు. స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన మరొక ప్రఖ్యాత నాయకుడు మరియు తన  కాలంలోని గొప్ప పండితుడు అయిన అల్లామా ఫజల్ హక్ కూడా అండమాన్ దీవులలోని కాలాపానిలో చాలా సంవత్సరాలు గడిపాడు, అక్కడ చాలా క్లిష్ట పరిస్థితుల్లో మరణించాడు.

1857 తిరుగుబాటులో  బ్రిటీష్ సైనికులు ద్వారా లక్షలాది మంది ముస్లింలు నరికి చంపబడ్డారు. అనేక నగరాలు లేదా నగరాల్లో కొంత భాగం పూర్తిగా నేలమట్టం చేయబడినవి  మరియు ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఢిల్లీలోని ముస్లింలు తమ ఇళ్ల నుండి బలవంతంగా బయటకు వెళ్లగొట్టబడ్డారు మరియు తరువాతి మూడు సంవత్సరాల వరకు తిరిగి రానివ్వలేదు. జామా మసీదు, మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఐకానిక్ మసీదు సైనిక బ్యారక్‌లుగా మార్చబడింది మరియు మూడు సంవత్సరాల తరువాత అవమానకరమైన నిబంధనలతో తిరిగి ఇవ్వబడింది.

ఢిల్లీలోని మరో గొప్ప మసీదు, చాందినీ చౌక్‌లోని ఫతాపురి జమా మసీదు, ఒక హిందూ వ్యాపారికి తక్కువ ధరకు విక్రయించబడింది. డిల్లి పట్టణంలోని ముస్లింలు తమ ప్రార్థనా స్థలాన్ని తిరిగి కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తాన్ని వెచ్చించే వరకు ఇది అతని నియంత్రణలో ఉంది. వారి ఇళ్లను, భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంది. ముస్లిం భూస్వాములు వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నందున మరియు వారు పేదలుగా మార్చబడినందున వారు తీవ్రంగా దెబ్బతిన్నారు.

అయితే, 20వ శతాబ్దపు ప్రథమార్ధంలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ముస్లిం నాయకులు చేసిన ఈ త్యాగాలు గురించి కనీసం ముస్లిం యువ తరానికి ఎలాంటి ఆలోచన లేదు.

ఒక ప్రముఖ చరిత్రకారుడు మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో ముస్లింలు చేసిన త్యాగాల గురించి రాస్తూ, “1857లో బ్రిటిష్ దళాలు నగరాన్ని తిరిగి ఆక్రమించినప్పుడు, ముస్లింలను చంపడంలో మరియు వారి ఆస్తులను దోచుకోవడంలో వారికి పూర్తి స్వేచ్ఛ లభించింది. నగరవాసులు వెంటనే వారి ఇళ్ళు మరియు వ్యాపారాలను ఖాళీ చేయాలని మిలటరీ ఆదేశించింది. శతాబ్దాల కాలంగా తమ తండ్రులు మరియు పూర్వీకులు ఎంతో శ్రమకోర్చి నిర్మించి, తమ జీవితమంతా గడిపిన పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడానికి ఢిల్లీ ప్రజలు బలవంతం చేయబడిన అత్యంత దారుణమైన దృశ్యం ఇది.

ఢిల్లీలో నివసిస్తున్న లక్షలాది మంది ముస్లింలలో, ప్రఖ్యాత ఉర్దూ మరియు పర్షియన్ కవి మీర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్ మాత్రమే జీవించడానికి అనుమతించబడ్డారని చెబుతారు. ఢిల్లీ పతనం నుండి బయటపడిన మొఘల్ కోర్టులోని  వారిలో  అతను ఒకడు. మిగతా వారందరూ చంపబడ్డారు లేదా ఢిల్లీ నుండి తరిమివేయబడ్డారు, వారి ఇళ్లు మరియు వ్యాపారాలు దోచుకున్నారు మరియు ధ్వంసం చేశారు.

 “కాంగ్రెస్ నేతృత్వం లో జరిగిన వలసవాద వ్యతిరేక పోరాటంలో ముస్లింలు కూడా అంతర్భాగంగా ఉన్నారు. జస్టిస్ తయాబ్జీ నుండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వరకు, దాదాపు తొమ్మిది మంది ముస్లిం నాయకులు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. మహాత్మా గాంధీ, నెహ్రూ మరియు పటేల్ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించడమే కాదు, మహమ్మద్ అలీ జౌహర్, షౌకత్ అలీ, మౌలానా ఆజాద్, డాక్టర్ ముఖ్తార్ అన్సారీ, హకీమ్ అజ్మల్ ఖాన్, మౌలానా మహమూద్ హసన్ మరియు అనేక అగ్రశ్రేణి ముస్లిం నాయకులు సమానంగా గౌరవించబడ్డారు మరియు గొప్ప ప్రజాదరణ పొందారు. స్వాతంత్ర్య ఉద్యమం కోసం సాధ్యమైన ప్రతి త్యాగం వారు చేసారు.  వారు మరియు వారి త్యాగాలు లేకుండా, దేశం స్వాతంత్ర్యం పొందినదని ఊహించలేము

స్వాతంత్ర్య ఉద్యమం మరియు దానిలో ముస్లింల పాత్ర విశేషమైనది.. ముస్లిం వ్యతిరేక ప్రచారం అత్యధికంగా ఉన్న ఈ సమయంలో భారత ముస్లిముల వారసత్వం, చరిత్ర మరియు జాతి స్వాతంత్ర్యం కోసం ముస్లిం పూర్వీకులు చేసిన త్యాగాల గురించి ముస్లిం యువ తరం మరియు యువత తెలుసుకోవాలి.

 

 

మెంతి కూర బ్లడ్ షుగర్‌ని తగ్గిస్తుంది, మలబద్ధకం మరియు వెన్నునొప్పిని తగ్గిస్తుంది Methi or fenugreek helps lower blood sugar, eases constipation and backache

 


మెంతులు లేదా మెంతి లేదా మెంతికూర భారతీయులకు పరిచయం అవసరం లేదు. రోగనిరోధక శక్తి, జీవనశైలి వ్యాధులు మొదలైన వాటి గురించి అవగాహన పెరగటం తో ప్రజలు మెంతి యొక్క శక్తిని అన్వేషిస్తున్నారు.

మెంతి గింజలు చేదుగా ఉంటాయి మరియు వాటిని నానబెట్టి లేదా పొడి చేసి లేదా నీటితో మింగాలి.

మెంతులు లేదా మెంతి ఆకులు లేదా మొలకెత్తిన గింజలు అనేక అనారోగ్యాలు మరియు లోపాల నుండి మిమ్మల్ని బలపరిచే విటమిన్లు కలిగి ఉన్నాయి..

పొత్తికడుపు లేదా వెన్నునొప్పి, ముఖ్యంగా బహిష్టు సమయంలో లేదా ప్రసవం తర్వాత లేదా కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఇంట్లో ఉన్న స్త్రీలు ఒక చెంచా మెంతి గింజలను నీటితో మింగాలని పెద్దలు సిఫార్సు చేస్తారు.. Diabetes.co.uk మెంతి యొక్క యాంటీ-డయాబెటిక్ లక్షణాలను ప్రశంసించింది.

గత కొన్ని సంవత్సరాలుగా, మెంతులు యొక్క ఔషధ మరియు క్రియాత్మక లక్షణాలపై అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. సౌదీ అరేబియాలోని సౌద్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం మెంతి దానా లేదా మెంతి గింజలు ఔషధ విలువలను కలిగి ఉన్నాయి. యాంటీడయాబెటిక్, యాంటీఫెర్టిలిటీ, యాంటీకాన్సర్, యాంటీమైక్రోబయల్, యాంటీపరాసిటిక్, చనుబాలివ్వడం ఉద్దీపన మరియు హైపోకొలెస్టెరోలెమిక్ ప్రభావాలను కలిగి ఉన్న మెంతులు గురించి చర్చించబడ్డాయి.

మెంతికూరలో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి మరియు దాని విలువైన బయోయాక్టివ్ భాగాల కారణంగా మంచి చికిత్సా మరియు అప్లికేషన్‌ను కలిగి ఉంది. యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్, హైపోగ్లైసీమిక్ యాక్టివిటీ, హైపోకొలెస్టెరోలేమిక్ యాక్టివిటీ మెంతికూరలోని ప్రధాన ఔషధ గుణాలు వివిధ అధ్యయనాల్లో నిరూపించబడ్డాయి. వీటి ఆధారంగా, అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు, మెంతులు సిఫార్సు చేయబడతాయి మరియు మన రోజువారీ ఆహారంలో భాగంగా ఉంటాయి

డయాబెటిస్ మరియు కొలెస్ట్రాల్ చికిత్సకు మెంతులు Fenugreek to treat Diabetes and Cholesterol:

మెంతి యొక్క సంభావ్య యాంటీ-డయాబెటిక్ ప్రయోజనాలను పరిశోధించడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. మానవులలో టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్‌తో సంబంధం ఉన్న జీవక్రియ లక్షణాలు మెంతి (మెంతులు) వాడకం ద్వారా ప్రభావితమయ్యాయి మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సానుకూలంగా తగ్గుతున్నట్లు కనిపించాయి మరియు రోగి యొక్క గ్లూకోస్ టాలరెన్స్ మెరుగుపడింది

ఒక అధ్యయనంలో, ఇన్సులిన్-ఆధారిత (టైప్ 1) మధుమేహం ఉన్న రోగుల రోజువారీ ఆహారంలో 100 గ్రాముల డీఫాటెడ్ మెంతి గింజల పొడిని జోడించడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్, LDL లేదా 'చెడు' కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్‌లు తగ్గుతాయని పరిశోధకులు కనుగొన్నారు

గర్భధారణ సమయంలో మరియు ప్రసవ సమయంలో తల్లి పాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడటానికి శతాబ్దాలుగా వాటిని నర్సింగ్ తల్లులు ఉపయోగిస్తున్నారు. మెంతులు యొక్క యాంటీవైరల్ లక్షణాలు జలుబు మరియు గొంతు నొప్పికి శక్తివంతమైన మూలికా ఔషధంగా మారడంలో సహాయపడతాయి; కీళ్లనొప్పులు, జుట్టు రాలడం, మలబద్ధకం, కడుపు నొప్పి, మూత్రపిండ వ్యాధులు, గుండెల్లో మంట, పురుషుల నపుంసకత్వం మరియు ఇతర రకాల లైంగిక సమస్యల చికిత్సలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

పచ్చి కూరగాయ లేదా మొత్తం గింజలు లేదా పొడి గింజలుగా మెంతి తినండి. ఎండిన విత్తనాల కంటే మొలకెత్తిన మెంతి గింజలు ఎక్కువ ప్రయోజనకరమైనవి, ఎందుకంటే మెంతి గింజల్లోని వివిధ భాగాల జీవ లభ్యత అంకురోత్పత్తి ద్వారా పెరిగింది.

హెచ్చరిక:

దయచేసి మెంతులు లేదా మెంతి అధిక మోతాదులో  తీసుకోకండి. విషపూరితం ఏర్పడవచ్చు. సూచించిన మధుమేహం మందులతో పాటు మీరు దీనిని తీసుకోవచ్చో లేదో మీ డాక్టర్ మరియు మధుమేహ ఆరోగ్య సంరక్షణ వైద్యుడిని సంప్రదించండి..

19 November 2021

వాకింగ్-తప్పక తెలుసుకోవలసిన విషయాలు

 


"ఫాద‌ర్ ఆఫ్ మెడిసిన్ " గా పిలువబడే గ్రీక్ వైద్య పితామహుడు హిపోక్రాట్స్ ప్రకారం  “వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్‌”.. ప్ర‌తి రోజూ క‌నీసం  30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని హిపోక్రాట్స్  చెప్పారు.

 

వాకింగ్-వలన ప్రయోజనాలు:

1. వాకింగ్ రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, కంగారు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వచ్చే దెమెంతియా, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

 

2. నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. కంటికి సంబంధించిన ప‌లు నాడులు కాళ్ల‌లో ఉంటాయి. అందుక‌నే కాళ్ల‌తో వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. నిత్యం వాకింగ్ చేస్తే క‌ళ్ల‌పై అధిక ఒత్తిడి త‌గ్గ‌డంతోపాటు గ్ల‌కోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట‌.

 

3. అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ ప్రకారం చెబుతోంది. నిత్యం వాకింగ్ చేస్తే గుండె స‌మ‌స్య‌లు, హార్ట్ ఎటాక్‌లు రావ‌ట‌. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయ‌ట‌. దీంతోపాటు శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంద‌ట‌.

 

4. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో అదే ఆక్సిజ‌న్ ర‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అలాగే ఇత‌ర ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

 

5. డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేస్తే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌. వాకింగ్ చేసిన వారిలో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వ‌చ్చాయ‌ని సైంటిస్టులు గుర్తించారు. అందువ‌ల్ల రోజూ వాకింగ్ చేస్తే డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

 

6. నిత్యం క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగే జీర్ణ‌ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. విరేచ‌నం రోజూ సాఫీగా అవుతుంది.

 

7. నిత్యం 10వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. దీంతోపాటు కండ‌రాలు దృఢంగా మారుతాయ‌ట‌.

 

8. నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి. అవి అంత త్వ‌ర‌గా అరిగిపోవు. అలాగే ఎముక‌ల్లో సాంద్ర‌త పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చ‌ర్లు, కీళ్ల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇందుకు రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి.

 

9. బ్యాక్ పెయిన్‌తో స‌త‌మ‌త‌మ‌య్యేవారికి వాకింగ్ చ‌క్క‌ని ఔష‌ధం అనే చెప్ప‌వ‌చ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కింద‌కు వాకింగ్ వ‌స్తుంది. క‌నుక న‌డుంపై పెద్ద‌గా ఒత్తిడి ప‌డ‌దు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి నొప్పి త‌గ్గుతుంది. క‌నుక వెన్ను నొప్పి ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.

 

10. నిత్యం వాకింగ్ చేయడం వ‌ల్ల ఎప్పుడూ డిప్రెష‌న్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వ‌స్తార‌ట‌. వారు హ్యాపీగా ఉంటార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి, క‌నుక నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.