సర్ మీర్జా ముహమ్మద్
ఇస్మాయిల్ - అమీన్-ఉల్-ముల్క్, KCIE, OBE (24 అక్టోబర్ 1883 - 5 జనవరి 1959) మైసూర్, జైపూర్ మరియు
హైదరాబాద్ రాజ్యాలకు దివాన్ (ప్రధానమంత్రి)గా పనిచేసిన భారతీయ రాజనీతిజ్ఞుడు.
సర్ మిర్జా ముహమ్మద్
ఇస్మాయిల్ 24 అక్టోబర్ 1883న బెంగుళూరులో ఒక పర్షియన్ కుటుంబంలో జన్మించాడు, సర్ మిర్జా ముహమ్మద్
ఇస్మాయిల్ పర్షియా నుండి వలస వచ్చి మైసూర్ మహారాజా యొక్క ఆశ్రయం పొందాడు. సర్
మిర్జా ముహమ్మద్ ఇస్మాయిల్, అలీ అస్కర్
మనవడు. కృష్ణరాజ వడయార్ IV మరియు మిర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ కళాశాలలో సహవిద్యార్థులు. 1904లో బెంగుళూరు నుండి
పట్టభద్రుడయ్యాక, మిర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ ప్రభుత్వంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్
పోలీస్‌గా పని చేయడం ప్రారంభించాడు.
మిర్జా ముహమ్మద్ ఇస్మాయిల్
మైసూరు మహారాజా కు ప్రైవేట్ సెక్రటరీ
అయ్యాడు, మీర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ పరిపాలనా సామర్ధ్యం పై మైసూరు మహారాజా కు గొప్ప
విశ్వాసం ఉంది. మైసూరు మహారాజా, మిర్జా
ఇస్మాయిల్ కు మార్గనిర్దేశం చేయమని ఎం. విశ్వేశ్వరయ్యను కోరారు. విశ్వేశ్వరయ్య, మీర్జా ఇస్మాయిల్‌కు గురువుగా మారినారు. 1926లో, విశ్వేశ్వరయ్య
సిఫార్సుపై, మైసూరు
మహా రాజా ఇస్మాయిల్‌ను మైసూర్ దివాన్ గా
నియమించారు.
మైసూర్ మహా రాజా నిర్మించిన బెంగుళూరు టౌన్ హాల్‌ను సర్ మిర్జా ఇస్మాయిల్
డిజైన్ చేసారు. భారతదేశంలో మొట్టమొదటి గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమాన్ని కూడా సర్
మిర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ అమలు చేశారు.
సర్ మిర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ ఒక అద్భుతమైన నిర్వాహకుడు మరియు విస్తృత
పర్యటనలు చేపట్టడం మరియు ప్రజల మనోవేదనలను వ్యక్తిగతంగా చూడటం ద్వారా అధికారులకు
స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచాడు.
·
C. P. రామస్వామి అయ్యర్, దివాన్, ట్రావెన్‌కోర్ సర్ మీర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ ను "భారతదేశంలోని
తెలివైన వ్యక్తులలో ఒకరిగా" భావించారు.
·
C. V. రామన్, "సర్ మీర్జా యొక్క కలుపుగోలుతనం మరియు వ్యక్తిగత ఆకర్షణతో పాటుగా సర్ మీర్జా
కున్న జ్ఞానం యొక్క లోతు మరియు మానవ మరియు సాంస్కృతిక విలువల పట్ల సర్ మీర్జా
కున్న చురుకైన భావన అతనిని గొప్ప మరియు అత్యంత విజయవంతమైన నిర్వాహకుడిని
చేసింది" అని వ్యాఖ్యానించారు.
·
సర్ మిర్జా ముహమ్మద్ ఇస్మాయిల్‌కు ఘనమైన నివాళి అర్పిస్తూ :
"చాలా సంవత్సరాలుగా, సంతోషం లోను, దుఖం లోను సర్ మీర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ నాకు నిజమైన
స్నేహితునిగా మిగిలిపోయారు మరియు మద్దతు మరియు సలహా ఇవ్వడానికి సిద్ధంగా
ఉన్నారు. సర్ మిర్జా విలువైన మరియు ఆదరించే జ్ఞాపకంవిడిచి వెళ్ళారు."అని సర్ CV రామన్ అన్నారు.
దివాన్ ఆఫ్ మైసూర్ (1 మే 1926 – 1941) :
సర్ మిర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ మైసూర్ రాజ్యానికి 22వ దివాన్ గా చక్రవర్తి
కృష్ణ రాజ వడియార్ IV, జయచామరాజేంద్ర వడియార్ క్రింద పనిచేసారు.మైసూరు
రాజ్య దివాన్ గా సర్
మిర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ పనిచేసిన పద్నాలుగు సంవత్సరాల కాలం లో మైసూర్ రాజ్యం పరిశ్రమల రంగంలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ
రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించింది. షిమోగాలోని చక్కెర కర్మాగారం మరియు
బదన్వాల్‌లోని ఖాదీ ఉత్పత్తి కేంద్రం సర్ మిర్జా ఇస్మాయిల్ కాలంలో స్థాపించబడిన
ఇతర పరిశ్రమలు. మైసూరు రాజ్యం తరుపున లండన్‌లో ట్రేడ్ కమిషనర్ కూడా నియమించబడినాడు.
సర్ మిర్జా ఇస్మాయిల్ దివాన్‌గా పనిచేసిన కాలంలో బెంగళూరులోని పింగాణీ
కర్మాగారం మరియు గాజు కర్మాగారం, కాగితాల పరిశ్రమలు సిమెంట్, ఉక్కు, ఎరువులు, చక్కెర మరియు
విద్యుత్ బల్బుల కర్మాగారాలు స్థాపించబడ్డాయి. వైశ్యా బ్యాంక్, సిమెంట్ ఫ్యాక్టరీ, కెమికల్ అండ్
ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ మరియు చక్కెర మిల్లులు కూడా స్థాపించ బడినవి.
సర్ మిర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ 1940లో, బెంగుళూరులోని సిటీ
మార్కెట్ సమీపంలో, అతను నిర్మించిన టౌన్ హాల్‌కు చాలా సమీపంలో జామియా మసీదు మసీదుకు
శంకుస్థాపన చేశాడు.
సర్ మిర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ మహాత్మా గాంధీ మరియు జవహర్‌లాల్ నెహ్రూ వంటి
అగ్ర భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో మంచి సంబంధాలను కొనసాగించినాడు
1940లో రాజు కృష్ణరాజ
వడయార్ IV మరణం తరువాత, సర్
మిర్జా ముహమ్మద్ ఇస్మాయిల్, జయచామరాజ వడయార్ పాలనలో కూడా దివాన్‌గా
కొనసాగాడు. అయితే విభేదాల కారణంగా 1941లో రాజీనామా చేశారు
ప్రధాన మంత్రి, జైపూర్ (దివాన్ ఆఫ్
జైపూర్) (1942–1946):
1942లో రాజస్థాన్‌లోని
జైపూర్ రాజ్యంలో ప్రధానమంత్రిగా చేరారు. జైపూర్‌కు వచ్చిన వెంటనే, 1942లో, సర్ మీర్జా
ఇస్మాయిల్ రాజ్యాంగ సంస్కరణలపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రయత్నాలు హెచ్‌హెచ్
మహారాజా సవాయి మాన్ సింగ్ II కీర్తిని మరియు దర్బార్ లోని కాంగ్రెస్ వర్గాల్లో గణనీయంగా పెంచాయి. సర్
మీర్జా ఇస్మాయిల్ జ్ఞాపకార్థం జైపూర్ ప్రధాన రహదారికి మీర్జా ఇస్మాయిల్ రోడ్ అని
పేరు పెట్టారు.
సర్ మీర్జా ఇస్మాయిల్
యొక్క సన్నిహిత మిత్రుడు ఘనశ్యామ్ దాస్ బిర్లా. GD బిర్లా జైపూర్ లోని
ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాడు. జైపూర్‌లో బ్యాంకులు శాఖలను తెరవడానికి
అనుమతించినప్పుడు, GD బిర్లా అధ్యక్షతన యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, 1945లో అక్కడ శాఖను
తెరవడానికి మొదటిసారిగా అనుమతించబడింది. సర్ మీర్జా మార్గదర్శకత్వంలో నేషనల్ బాల్
బేరింగ్ కంపెనీ స్థాపించబడింది.
జైపూర్‌లోని ఛాంబర్
ఆఫ్ కామర్స్ సర్ మీర్జా ఇస్మాయిల్ పాలనను "జైపూర్ పారిశ్రామిక శకం
ప్రారంభం"గా నమోదు చేసింది.
1945లో, సర్ మీర్జా జైపూర్‌లో
ఇంటర్నేషనల్ పెన్ కోసం ఇండియన్ రైటర్స్ కౌన్సిల్‌కు అధ్యక్షత వహించాడు, అక్కడ సరోజినీ
నాయుడు మరియు ఎడ్వర్డ్ మోర్గాన్ ఫోర్స్టర్‌లు అందులో సబ్యులుగా ఉన్నారు. జైపూర్ ప్రధానమంత్రి
పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా సర్ మీర్జా ఇస్మాయిల్ రాష్ట్రానికి మరియు
అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలకు సలహాదారుగా ఉన్నారు. 1949 జైపూర్ మెడికల్
అసోసియేషన్ కోసం భవనాన్ని మంజూరు చేయడంలో సర్ మీర్జా కీలక పాత్ర పోషించాడు.
హైదరాబాద్ దివాన్1946–1947:
మీర్జా ఇస్మాయిల్
భారతదేశ విభజనను పూర్తిగా వ్యతిరేకించి 1945లో, మహమ్మద్ అలీ జిన్నా గ్రేట్
పాకిస్తాన్‌ను నిర్మించడంలో సహాయం చేయడానికి నిరాకరించినాడు.
1946లో, మీర్జా ఇస్మాయిల్
హైదరాబాద్ దివాన్ (సదర్-ఇ-ఆజం ప్రధానమంత్రి అయ్యాడు. 1946-48లో హైదరాబాద్
ప్రిన్స్లీ స్టేట్ ను లెఫ్టినెంట్ జనరల్
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (ఆర్. 1911–48). హైదరాబాద్‌ను పాలించారు. సర్ మీర్జా
ఇస్మాయిల్ హైదరాబాదు చేరిక సమస్యపై తన అత్యుత్తమ నైపుణ్యాలను ప్రదర్శించారు మరియు
హైదరాబాద్ ప్రావిన్స్‌ను భారత ప్రభుత్వానికి చేర్చే సమస్యను సామరస్యపూర్వకంగా
పరిష్కరించడానికి భారత ప్రభుత్వంతో ఒక సంవత్సరం పాటు "స్టాండ్‌స్టిల్"
ఒప్పందంపై చర్చలు జరిపారు.
నవాబ్ మెహదీ నవాజ్
జంగ్, బారిస్టర్ అక్బర్ అలీ ఖాన్, ప్రముఖ సంపాదకులు
సోహైబుల్లా ఖాన్, నవాబ్ అలీ యావర్ జంగ్ మరియు ఇతర భారత సమర్ధకులు సర్ మీర్జా ఇస్మాయిల్ చేస్తున్న శాంతి ప్రయత్నాలను
సమర్థించారు మరియు నిజాం వైఖరిని ఘర్షణ నుండి సమన్వయానికి మార్చడానికి
ప్రయత్నించారు. మోహన్‌దాస్ కె. గాంధీ హత్యతో, నిజాం భారతదేశంలో
చేరడాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రవాద వైఖరిని గైకొన్నాడు. ఫలితంగా, సర్ మీర్జా
ఇస్మాయిల్ తన పదవికి రాజీనామా చేశాడు.1948లో పోలిస్ ఆపరేషన్ పోలోను ప్రారంభమైనది మరియు 1948లో హైదరాబాద్
ఇండియన్ యూనియన్‌లో భాగమైంది
రౌండ్ టేబుల్
సమావేశం (నవంబర్ 1930 - జనవరి 1931 )
సర్ మీర్జా ముహమ్మద్
ఇస్మాయిల్ మొత్తం 3 (*1 రౌండ్ టేబుల్
సమావేశం:
*2వ రౌండ్ టేబుల్
సమావేశం *3వ రౌండ్ టేబుల్ సమావేశం) రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు.
సన్మానాలు:
ది నైట్ కమాండర్ ఆఫ్
ది ఇండియన్ ఎంపైర్ ఆర్డర్
సర్ మీర్జా ముహమ్మద్
ఇస్మాయిల్ భారతదేశానికి చేసిన సేవలకు
బ్రిటిష్ ప్రభుత్వం 1922లో OBEగా నియమించబడ్డాడు మరియు 1924లో CIEగా నియమితుడయ్యాడు. సర్
మీర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ 1930లో నైట్‌హుడ్
పొందారు మరియు 1936లో KCIEగా నియమితుడయ్యాడు. 1938లో, సర్ మీర్జా ముహమ్మద్
ఇస్మాయిల్ వెనెరబుల్ ఆర్డర్ ఆఫ్ ది హాస్పిటల్ ఆఫ్ సెయింట్ జాన్ ఆఫ్ జెరూసలేం
అసోసియేట్ కమాండర్‌గా నియమించబడ్డాడు..
పుస్తకాలు:
సర్ మీర్జా
ఇస్మాయిల్ తన జ్ఞాపకాలను “మై పబ్లిక్ లైఫ్” పేరుతో 1954లో తన మరణానికి
ముందు 5 జనవరి 1959న బెంగుళూరులోని తన ఇల్లు విండ్సర్ లాడ్జిలో ప్రచురించాడు.
కుటుంబ జీవితం:
మీర్జా ఇస్మాయిల్ జీవిత
భాగస్వామి ని పేరు జీబుందే బేగం షిరాజీ. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఒక కుమారుడు మరియు ఇద్దరు కుమార్తెలు. వారు హుమాయున్
మీర్జా మరియు షా తాజ్ బేగం మరియు గౌహర్ తాజ్ బేగం.
సర్ మీర్జా మనవడు, అక్బర్ మీర్జా ఖలీలీ
(షా తాజ్ బేగం కుమారుడు) 1959లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరారు మరియు 1994లో పదవీ విరమణ
చేశారు. వివిధ సమయాల్లో, అక్బర్ మీర్జా ఖలీలీ ఇరాన్, ఇటలీ మరియు
ఆస్ట్రేలియాలో రాయబారిగా పనిచేశాడు. పదవీ విరమణ తర్వాత కూడా, అక్బర్ మీర్జా ఖలీలీ
చాలా సంవత్సరాలు మధ్యప్రాచ్య వ్యవహారాలపై భారత ప్రభుత్వానికి సలహాదారుగా
పనిచేశాడు.
సర్ మిర్జా మనుమలు అఘా
షాహి మరియు అఘా హిలాలీలు విభజన సమయంలో పాకిస్తాన్‌కు వలస వెళ్లి ఆ దేశ విదేశాంగ
కార్యదర్శులు అయ్యారు.
No comments:
Post a Comment