7 November 2021

ఫిరోజ్ గాంధీ

 


ఫిరోజ్ గాంధీ (జన్మనామం: ఫిరోజ్ జహంగీర్ ఘండి)  (1912 సెప్టెంబరు12   - 1960 సెప్టెంబరు 8) భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, పాత్రికేయుడు. అతను ది నేషనల్ హెరాల్డ్ది నవజీవన్ వార్తాపత్రికలను ప్రచురించాడు. అతను 1950 నుండి 1952 ల మధ్య కాలంలో భారతదేశ ప్రాంతీయ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. తరువాత లోక్‌సభ సభ్యునిగా, పార్లమెంటులో దిగువ సభలో సభ్యునిగా పనిచేసాడు. అతని భార్య ఇందిరా నెహ్రూ, పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ ఇద్దరూ భారత దేశానికి ప్రధానులుగా పనిచేసారు.

ప్రారంభ జీవితం

అతని జన్మనామం ఫిరోజ్ జహంగీర్ ఘండీ. అతను పార్శీ కుటుంబంలో జహంగీర్ ఫెరెడూన్ ఘండీ, రతిమయి దంపతులకు జన్మించాడు. వారు బొంబాయిలోని ఖేట్వాడీ మొహల్లా లోని నౌరోజీ నాటక్‌వాలా భవన్ లో నివసించేవారు. అతని తండ్రి జహంగీర్ కిల్లిక్ నిక్సాన్ లో మెరైన్ ఇంజనీరుగా పనిచేసేవాడు. తరువాత వారెంటు ఇంజనీరుగా పదోన్నతి పొందాడు.  ఫిరోజ్ ఐదుగురు సహోదరులలో చివరివాడు. అతనికి జొరాబ్, ఫరీదున్ జహంగీర్ అనే ఇద్దరు అన్నయ్యలున్నారు. తెహ్మినా కేర్షష్ప్, ఆలూ దస్తూర్ అనే అక్కలున్నారు. ఈ కుటుంబం భరుచ్ (ప్రస్తుతం దక్షిణ గుజరాత్) నుండి బొంబాయిలోని కోట్పరివాడ్ లోని తాతగారింటికి వలస వెళ్లారు.

1920 ల ప్రారంభంలో తన తండ్రి మరణం తరువాత, ఫిరోజ్, అలహాబాదులోని మాతృసంబంధిత అత్త గారింటికి జీవించడానికి వెళ్లాడు. అతని అత్త అవివాహిత, నగరంలోని లేడీ డఫెరిన్ హాస్పిటల్‌లోని సర్జన్ గా పనిచేసేది.  అతను విద్యా మందిర్ హైస్కూల్లో చదివి, తరువాత బ్రిటిష్ సిబ్బంది పనిచేస్తున్న ఎవింగ్ క్రిస్టియన్ కాలేజీలో పట్టభద్రుడయ్యాడు.

కుటుంబం, వృత్తి

1930 లో కాంగ్రెస్ స్వాతంత్ర్య సమరయోధుల విభాగం వానర సేన ఏర్పడింది. ఫిరోజ్ కమలా నెహ్రూఇందిరా లను కలుసుకున్నాడు. 1930లో ఎవింగ్ క్రిస్టియన్ కళాశాల బయట నిరసనలు చేస్తున్న మహిళా ప్రదర్శనకారుక మధ్య ఎండ వేడికి తట్టుకోలేక కమలా నెహ్రూ మూర్చపోయింది. ఫిరోజ్ ఆమె క్షేమ సమాచారములు తెలుసుకోవడానికి వెళ్ళాడు. మరుసటి రోజు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేరడానికి చదువు మానేశాడు. 

మహాత్మా గాంధీ స్ఫూర్తితో, ఫిరోజ్ స్వాతంత్ర్య ఉద్యమంలో చేరిన తరువాత తన ఇంటిపేరును "ఘండి" నుండి "గాంధీ"గా మార్చుకున్నాడు. అతను భారత రెండవ ప్రధానమంత్రి, అలహాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన లాల్ బహదూర్ శాస్త్రితో పాటు 1930లో ఫరీదాబాదు జైలులో 19 నెలల జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుండి విడుదలైన తరువాత అతను యునైటెడ్ ప్రావిన్స్ (ఇప్పుడు ఉత్తర ప్రదేశ్) లో కర్షక విప్లవం నో-రెంట్ ప్రచారంలో పాల్గొన్నాడు. 1932, 1933 లలో నెహ్రూతో కలిసి పనిచేస్తున్నప్పుడు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించాడు.


ఫిరోజ్ 1933లో మొదటి సారి ఇందిరను వివాహం చేసుకోవడానికి ప్రతిపాదించాడు. కాని ఇందిరతో పాటు ఆమె తల్లి ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. అప్పటికి ఆమెకు 16 సంవత్సరాలు మాత్రమే కనుక అంగీకరించలేదు. అతను నెహ్రూ కుటుంబానికి ముఖ్యంగా ఇందిరా తల్లి కమలా నెహ్రూకు సన్నిహితంగా ఉండేవాడు. 1934 లో భోవాలిలోని క్షయ చికిత్సా కేంద్రంలో ఆమెను కలిసాడు. 1935 ఏప్రిల్‌లో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు ఐరోపా పర్యటనకు ఏర్పాట్లు చేయడంలో సహాయపడ్డాడు. బాడెన్‌వీలర్‌లోని క్షయ చికిత్సా కేంద్రంలో ఆమెను సందర్శించాడు. చివరికి లాసాన్ వద్ద 1936 ఫిబ్రవరి 28న ఆమె మరణించే సమయంలో ఆమె దగ్గర ఉన్నాడు. తరువాతి సంవత్సరాల్లో ఇందిరా, ఫిరోజ్ ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు ఒకరికొకరు దగ్గరయ్యారు. వారు హిందూ ఆచారాల ప్రకారం 1942 మార్చిలో వివాహం చేసుకున్నారు.


ఇందిర తండ్రి జవహర్‌లాల్ నెహ్రూ ఆమె వివాహాన్ని వ్యతిరేకించాడు. యువ జంట వివాహాన్ని నిరాకరించడానికి మహాత్మా గాంధీని సంప్రదించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. వివాహం జరిగిన ఆరు నెలల లోపు క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈ జంటను 1942 ఆగస్టులో అరెస్టు చేసి జైలులో పెట్టారు. అలహాబాద్‌లోని నైని సెంట్రల్ జైలులో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆ తరువాత ఐదేళ్ళు సౌకర్యవంతమైన గృహంలో దాంపత్య జీవితం గడిపారు. ఈ దంపతులకు 1944లో రాజీవ్ గాంధీ, 1946లో సంజయ్ గాంధీలు జన్మించారు.

స్వాతంత్ర్యం తరువాత, జవహర్ లాల్ భారతదేశపు మొదటి ప్రధాని అయ్యాడు. ఫిరోజ్, ఇందిర వారి ఇద్దరు చిన్న పిల్లలతో అలహాబాద్‌లో స్థిరపడ్డారు. ఫిరోజ్ ది నేషనల్ హెరాల్డ్ అనే వార్తాపత్రికకు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు.

ప్రాంతీయ పార్లమెంటు సభ్యుడైన తరువాత (19501952), ఫిరోజ్ 1952 లో స్వతంత్ర భారతదేశపు మొదటి సాధారణ ఎన్నికలలోఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలి నియోజకవర్గం నుండి గెలిచాడు. ఇందిరా ఢిల్లీ నుండి వచ్చి   ఎన్నికల ప్రచార నిర్వాహకురాలిగా పనిచేసింది. ఫిరోజ్ త్వరలోనే స్వంతంగా ఒక శక్తిగా అవతరించాడు. తన మామ ప్రభుత్వాన్ని విమర్శించాడు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు.


స్వాతంత్ర్యం తరువాత సంవత్సరాలలో అనేక భారతీయ వ్యాపార సంస్థలు రాజకీయ నాయకులకు సన్నిహితంగా మారాయి. ఇప్పుడు వాటిలో కొన్ని వివిధ ఆర్థిక అవకతవకలను ప్రారంభించాయి. 1955 డిసెంబరులో ఫిరోజ్ బహిర్గతం చేసిన ఒక కేసులోఒక బ్యాంక్, బీమా సంస్థ ఛైర్మన్‌గా రామ్ కిషన్ డాల్మియా ఈ కంపెనీలను బెన్నెట్, కోల్మన్లను స్వాధీనం చేసుకోవడానికి నిధులు సమకూర్చడానికి, బహిరంగంగా ఉన్న సంస్థల నుండి చట్టవిరుద్ధంగా డబ్బును వ్యక్తిగత ప్రయోజనం కోసం బదిలీ ఎలా చేసాడో వెల్లడించాడు.

1957 లో అతను రాయ్ బరేలి నుండి తిరిగి ఎన్నికయ్యాడు. 1958 లో పార్లమెంటులో ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎల్ఐసి బీమా సంస్థకు సంబంధించిన హరిదాస్ ముంధ్రా కుంభకోణాన్ని లేవనెత్తాడు. ఇది నెహ్రూ ప్రభుత్వం స్వచ్ఛమైన ప్రతిష్ఠకు పెద్ద ఇబ్బంది కలిగించింది. ఇది చివరికి ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి రాజీనామాకు దారితీసింది. ఇందిరతో అతని విభేదాలు అప్పటికి ప్రజలకు తెలిసాయి. ఈ విషయంపై మీడియా ఆసక్తిని పెంచాయి.

ఫిరోజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌తో ప్రారంభించి అనేక సంస్థలను జాతీయం చేసే కార్యక్రమాలు ప్రారంభించాడు. జపాన్ రైల్వే ఇంజిన్ ధర కంటే రెట్టింపు ధరను వసూలు చేస్తున్నందున టాటా ఇంజనీరింగ్, లోకోమోటివ్ కంపెనీ (టెల్కో) ను జాతీయం చేయాలని ఒక దశలో అతను సూచించాడు. టాటా కుటుంబం కూడా పార్సీ అయినందున ఇది పార్సీ సమాజంలో కలకలం రేపింది. అతను అనేక ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని సవాలు చేస్తూనే ఉండేవాడు.  పార్లమెంటు సభ్యుడిగా మంచి గౌరవం పొందాడు.

మరణం, వారసత్వం

ఫిరోజ్ 1958 లో గుండెపోటుతో బాధపడ్డాడు. ప్రధానమంత్రి అధికారిక నివాసమైన తీన్ మూర్తి భవనంలో తన తండ్రితో కలిసి ఉన్న ఇందిర ఆ సమయంలో భూటాన్ పర్యటనలో ఉన్నందున అతనికి దూరంగా ఉంది. ఆమె కాశ్మీర్‌లో అతనిని చూసుకోవడానికి తిరిగి వచ్చింది. ఫిరోజ్ 1960 లో ఢిల్లీలోని విల్లింగ్‌డన్ ఆసుపత్రిలో రెండవసారి గుండెపోటు రావడంతో మరణించాడు. అతనికి దహన సంస్కారాలు జరిగాయి. అతని చితా భస్మాన్ని అలహాబాద్‌లోని పార్శీ శ్మశానవాటికలో ఉంచారు. అతని తరువాత రాయ్ బరేలి లోక్‌సభా నియోజకవర్గం సీటును అతని కోడలురాజీవ్ గాంధీ భార్య అయిన సోనియా గాంధీ 2004, 2009, 2014, 2019లలో ప్రాతినిధ్యం వహించింది.

అతను ఉన్నత విద్య కోసం రాయబరేలీలో పాఠశాలను ప్రారంభించాడు. దానికి "ఫిరోజ్ గాంధీ స్కూలు"గా అతని పేరుతో పెట్టబడింది. ఉత్తర ప్రదేశ్ లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ యొక్క ఊంచహార్ థర్మల్ పవర్ స్టేషన్ కు "ఫిరోజ్ గాంధీ ఊంచహర్ థర్మల్ పవర్ ప్లాంటు" అని ఎన్.టి.పి.సి నామకరణం చేసింది.

 

No comments:

Post a Comment