19 November 2021

అత్తిపండు/అంజీరా

 



అత్తిపండుకు మరో పేరు అంజీరా. పేరు ఏదైనా అత్తి పండ్లలో ఉండే రుచి, పోషకాలు ఒకేలా ఉంటాయి. అందుకే రోజూ తప్పనిసరిగా రెండు అత్తిపండ్లను తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

అత్తిపండ్లలో మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్ ఎ, విటమిన్ బి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. ఇవి ఆరోగ్యపరంగానే కాకుండా సౌందర్యపరంగా కూడా కాపాడుతుంటాయి. ముఖ్యంగా చర్మ కాంతిని పెంచడంలో, ముఖంపై మొటిమలు తగ్గించడంలో, మచ్చలను మాయం చేయడంలో, చర్మాన్ని మృదువుగా మార్చడంలో అత్తిపండ్లు అద్భుతంగా సహాయపడతాయి. అత్తిపండ్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది.

ఇమ్యూనిటీ కోసం..

అత్తి పండ్లను తినడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండల్లో కేలరీలు తక్కువగా ఉండి.. శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన శక్తిని అందిస్తాయి. అలా మనిషి బరువును నియంత్రించడంలోనూ సహాయపడుతాయి. ఈ పండ్లను తినడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. ఈ సమయంలో అత్తిపండ్లను తినడం చాలా ఉత్తమం అని వైద్యులు కూడా చెబుతున్నారు. కారణం.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో అత్తిపండ్లు చాలా సహాయపడుతాయట. ఇందులో ఉన్న ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, సల్ఫర్ వంటివి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు... శరీర అలసట, బలహీనతను అత్తిపండు దూరం చేస్తుందట.

​డయాబెటీస్‌కి మేలు..

అత్తిపండ్లను తినడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. కండరాలు బలంగా మారుతాయి. డయాబెటిక్ రోగులు ఇవి తినడం చాలా మంచిదంటున్నారు వైద్యులు. మధుమేహాన్ని నియంత్రిస్తుందట. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. మహిళల్లో రుతుక్రమం సరిగ్గా జరిగేలా, పురుషుల్లో వీర్యాభివృద్ధి జరిగేలా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. మీరు ప్రతిరోజూ రాత్రి సమయాల్లో ఎండిన అత్తి పండ్లను నీటిలో నానబెట్టి, ఆపై ఉదయం తింటే శరీరంలోని టాక్సిన్స్ పూర్తిగా తొలగిపోతాయి.

​నోటిలో పుండ్లకి మందులా..

అత్తి పండులో పొటాషియం, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హైపర్ టెన్షన్‌ను కంట్రోల్ చేస్తుంది. చాలామందికి శారీరక బలహీనత వల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

​నిద్రలేమి దూరం..

అత్తిపండు నిద్రలేమి సమస్య కూడా నివారిస్తుంది. ఇందులోని ట్రిప్టోఫాన్‌ హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. అందుకే నిద్రలేమితో బాధపడేవాళ్లు రోజూ రాత్రిపూట రెండుమూడు అత్తిపండ్లు తిని పాలు తాగితే మంచిది

​మలమద్ధకాన్ని దూరం.

అత్తిపండ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. కనుక వీటిని మూల వ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చు. ఒక ఎనామిల్ పాత్రను వేడి నీళ్లతో శుభ్రపరిచి చన్నీళ్లు తీసుకొని మూడు, నాలుగు ఎండు అత్తి పండ్లను రాత్రంతా నానేయాలి. ఉదయం పూట నాని ఉబ్బిన పండ్లను తినాలి. ఇలాగే మళ్లీ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. ఇలా రెండు, మూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే మలబద్ధకం వ్యాధి తగ్గుతుంది.

​శృంగారానికి సన్నద్ధం చేసేలా..

అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. అధిక బ్లడ్ ప్రెజర్‌తో బాధపడే వారికి ఇది ఫర్ఫెక్ట్ ఫ్రూట్. హై బ్లడ్ ప్రెజర్‌తో బాధపడేవారు.. వారి రెగ్యులర్ డైట్‌లో పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది.

​బ్లాక్ హెడ్స్ దూరం చేసే స్క్రబ్‌లా..

అత్తి పండ్లకు ముఖం మీద ఉన్న నల్ల మచ్చలను తక్షణమే వదిలించుకునే శక్తి ఉంటుంది. రెండు అత్తి పండ్లను తీసుకుని పేస్ట్‌గా రుబ్బుకోవాలి. దానికి ఒక చెంచా తేనె కలిపి ముఖం మీద రాయండి. తరువాత 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ముఖం కడుక్కోవాలి. వారంలో దీన్ని వరుసగా మూడుసార్లు చేయవచ్చు. స్క్రబ్ ముఖం మీద ఉన్న మలినాలను వదిలించుకోవడానికి మీరు అత్తిపండ్లను స్క్రబ్‌గా ఉపయోగించాలని అనుకుంటే, అది అద్భుతమైన ప్రయోజనాలను కూడా ఇస్తుంది. అత్తి పండ్లను మధ్యలో పేస్ట్ లాగా రుబ్బాలి, అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి, స్క్రబ్ చేసి ముఖం కడుక్కోవాలి. మీరు వెంటనే ప్రయోజనాన్ని పొందుతారు,

​కళ్ళ కింద వలయాలకి..

అత్తి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఇది సూర్యుడి ఎండ వల్ల ఏర్పడ్డ కళ్ళ కింద చీకటి వలయాల రూపాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఉత్తమ ఎరుపును ఇస్తుంది. అత్తి పండ్లను పేస్ట్ చేసి కొద్దిగా పెరుగు, తేనెతో బాగా కలిపి ముఖం మీద రాయండి. అరగంట పాటు అలాగే ఉంచి, ఆపై ముఖం కడుక్కోవాలి. తర్వాత మీ ముఖం మీద నలుపు వలయాలు ఎలా పోయాయో గమనించండి

​జుట్టు రాలుట దూరం..

జుట్టు పెరుగుదల, జట్టు ఆరోగ్యానికి అత్తి పండ్ల ఉత్తమ పరిష్కారం. అందులోని విటమిన్లు, ఖనిజాలు చాలా పోషకాలను అందిస్తాయి. కాబట్టి రోజుకు రెండు అత్తిపండ్లు తినడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

 

No comments:

Post a Comment