అల్లామా సయ్యద్ సులేమాన్ నద్వీ 1884 నవంబర్ 22న బీహార్‌లోని నలంద జిల్లాలోని దేస్నా గ్రామంలో జన్మించారు.
సయ్యద్ సులేమాన్
నద్వీ, నద్వా లక్నో నుండి శిక్షణ పొందాడు మరియు అక్కడ మాస్టర్ అయ్యారు. సయ్యద్ సులేమాన్ నద్వీ సుప్రసిద్ధ ఉర్దూ కవి, సీరత్ నిగర్ (జీవిత
చరిత్ర రచయిత), ఆలిమ్ (జ్ఞానం కలవాడు), మోరిఖ్ (చరిత్రకారుడు) మరియు ముస్నిఫ్
(రచయిత).
సయ్యద్ సులేమాన్ నద్వీ భారతదేశ స్వాతంత్ర్య యుద్ధంలో చురుకుగా పాల్గొన్నారు, ఖిలాఫత్ మరియు సహాయ నిరాకరణ ఉద్యమంలో ముందున్నారు. సయ్యద్ సులేమాన్ నద్వీ జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపక సభ్యుడు. షేక్ ఉల్ హింద్ మౌలానా మహమూద్ ఉల్ హసన్ అధ్యక్షతన 29 అక్టోబర్ 1920న అలీఘర్‌లో జరిగిన జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపకుల కమిటీలో పాల్గొన్నాడు.
భారత దేశం గర్వపడే
ఉలేమాలలో సయ్యద్ సులేమాన్ నద్వి ఒకరు. సులేమాన్ నద్వి జ్ఞానం మరియు ప్రతిభ వారి ఉస్తాద్
అల్లామా షిబ్లీ నోమాని (R.A) సీరత్-ఉన్-నబీ మొదటి రెండు సంపుటాలు వ్రాసి పూర్తి చేయబడినప్పుడు మిగిలిన
నాలుగు సంపుటాలను సయ్యద్ సులేమాన్ నద్వీ పూర్తి చేశారు.
సయ్యద్ సులేమాన్ నద్వి ని మొదటి ఉస్తాద్‌లు దేస్నాకు చెందిన ఖలీఫ్ అన్వర్ అలీ మరియు ఓఖ్దీకి చెందిన మక్సూద్ అలీ. అనంతరం తన అన్న హకీమ్ సయ్యద్ అబూ హబీబ్ వద్ద శిక్షణ పొందారు. సయ్యద్ సులేమాన్ నద్వి మామ పాట్నా సమీపంలోని ఇస్లాంపూర్‌లో వైద్యుడు మరియు స్థానిక సమాజంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి.
1899లో, సయ్యద్ సులేమాన్
నద్వి ఫుల్వారీ షరీఫ్ (బీహార్)కి వెళ్ళారు మరియు , అక్కడ మౌలానా
మొహియుద్దీన్ మరియు సులేమాన్ ఫుల్వారీలకు శిష్యుడు అయ్యారు.. అక్కడ నుండి, సయ్యద్ సులేమాన్
నద్వి అతను దర్భంగాకు వెళ్లి అక్కడ మదరసా ఇమ్దాదియాలో కొన్ని నెలలు చదువుకున్నారు, 1901లో లక్నోలోని
దారుల్-ఉలూమ్ నద్వతుల్ ఉలమాలో చేరారు ఏడేళ్లు నద్వాలో చదువుకున్నాడు. సయ్యద్
సులేమాన్ నద్వి రిసాలా, అల్-నద్వా సబ్-ఎడిటర్‌గా కూడా నియమించబడ్డారు. సయ్యద్ సులేమాన్ నద్వి మొదటి
వ్యాసం, వకాత్ (సామ్) అబ్దుల్ ఖదీర్ సంపాదకత్వం వహించిన ఉర్దూ జర్నల్ మఖ్జాన్‌లో
ప్రచురించబడింది.
మౌలానా షిబ్లీ
నోమాని లక్నోకు వచ్చి 'నద్వా సెక్రటరీ'గా నియమించబడ్డారు. మౌలానా షిబ్లీ
నోమాని ప్రభావం వీరి పై ఉంది. 1906 లో, సులేమాన్ నద్వీ నడ్వా
నుండి పట్టభద్రుడయ్యారు. సులైమాన్ నద్వీ మరియు అబుల్ కలాం ఆజాద్ ఇద్దరూ మౌలానా
షిబ్లీ నోమానీకి ఇష్టమైన విద్యార్థులు. 1908లో, సులేమాన్ నద్వీ
దార్-ఉల్-ఉలూమ్ నద్వాలో ఆధునిక అరబిక్ మరియు వేదాంతశాస్త్ర బోధకుడిగా
నియమితులయ్యారు.
సులేమాన్ నద్వీ ను సీరత్-ఉన్-నబీ, అరబ్-ఓ-హింద్ కే త'అల్లుకత్, హయత్-ఎ-షిబ్లీ, రహ్మత్-ఎ-ఆలమ్, నుకుష్-ఎ-సులైమాన్, హయత్ ఇమామ్ మాలిక్, అహ్ల్-ఉస్-సున్నహ్వాల్ జమా వంటి అనేక పుస్తకాలను రచించారు. 'ఆహ్, యాద్ 'రిఫ్తేగన్, సైర్ ఆఫ్ఘనిస్తాన్, మఖలాత్-ఎ-సులైమాన్, దురూస్-అల్-అదాబ్ ఖయ్యామ్, ఖుత్బాత్-ఎ-మదారీస్, అర్జుల్-ఖురాన్, హిందువుల విద్యా పురోగతిలో ముస్లిం పాలకుల కృషి ముఖ్యమైనవి. సులేమాన్ నద్వీ కృషిని మెచ్చుకుంటూ, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం 1941లో సులేమాన్ నద్వీ కి గౌరవ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ (DLIT)ని ప్రదానం చేసింది. సులేమాన్ నద్వీ భోపాల్ రాచరిక రాజ్యానికి ఖాజీ అయ్యారు మరియు అక్కడ నుండి వీరి సీరత్-ఉన్-నబీరచన జరిగింది.
సులేమాన్ నద్వీ జూన్
1950లో పాకిస్తాన్‌కు వలస వెళ్లి కరాచీలో స్థిరపడ్డారు. 69 సంవత్సరాల వయస్సులో
కరాచీలో 23 నవంబర్ 1953న మరణించారు.
No comments:
Post a Comment