.
డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ అద్యక్షతన రాజ్యాంగ
నిర్మాణానికి ఏర్పడిన భారత రాజ్యాంగ నిర్మాణ సంఘం లో మొత్తం 389 మంది సభ్యులు కలరు. రాజ్యoగ పరిషత్ కు 15 మంది స్త్రీలు ఎన్నికైనారు. వారిలో ప్రముఖురాలు ముస్లిం స్త్రీ
బేగం ఐజాజ్ రసూల్.
రాజ్యాంగ నిర్మాణ సంఘం 23 ప్రధానమైన సబ్-కమిటీలు గా ఏర్పడింది. ఇందులో
ప్రధానమైనవి 8 మేజర్ కమిటీలు, మిగతావి మైనర్ కమిటీలు.
మేజర్ కమిటీలలో ప్రధానమైనది రాజ్యాంగ ముసాయిదా (డ్రాఫ్ట్)
కమిటి. దీనికి డాక్టర్ BRఅంబేద్కర్ అద్యక్షత వహించారు. డ్రాఫ్ట్ కమిటిలో మొత్తం
7గురు సబ్యులు ఉన్నారు. వారు వరుసగా గా
పండిట్ గోవింగ్ వల్లభ పంత్, KM మున్షి, అల్లాడి కృష్ణ స్వామి అయ్యంగార్, ఎం.
గోపాల స్వామి అయ్యంగార్, BL మిట్టర్, మొహమ్మద్ సాదుల్లా(మాజీ అస్సాం ముఖ్య
మంత్రి) , DP ఖైతాన్.వీరిలో BL
మిట్టర్ రాజీనామా పలితంగా మాధవ్ రావు ఆపదవిని పొందారు. DP ఖైతాన్ మరణిoచినందున TT క్రిష్ణామాచారి ఆ పదవి పొందారు. రాజ్యంగ
నిర్మాణ సంఘం కు రాజ్యంగ సలహాదారు BN రావు.
డ్రాఫ్ట్ కమిటి తయారుచేసిన రాజ్యాంగం 26 నవంబర్ 1946 నవంబర్
న అమోదించబడినది. 26-1-1950 నుంచి నూతన రాజ్యాoగం అమలు లోనికి వచ్చింది భారత దేశం
రిపబ్లిక్ గా అవతరించినది.
భారత రాజ్యాంగ నిర్మాణం లో తోడ్పడిన ముస్లిం సబ్యుల జీవిత
చరిత్రలను పరిశీలించుదాము.
భారత రాజ్యాంగ పరిషత్
మహిళా సబ్యులలో ప్రముఖురాలు బేగం ఐజాజ్
రసూల్.
బేగం ఎజాజ్ రసూల్
మలేర్కోట(Malerkota-Punjab) రాచరిక
కుటుంబంలో జన్మించిన బేగం ఐజాజ్ రసూల్ యువ భూస్వామి నవాబ్ ఐజాజ్ రసూల్ ను వివాహం చేసుకున్నారు. ఆమె రాజ్యాంగ అసెంబ్లీకి ఎన్నికైన
ఏకైక ముస్లిం మహిళ. 1935 భారత ప్రభుత్వం చట్టం అమలుతో, బేగం మరియు ఆమె భర్త ముస్లిం లీగ్ లో చేరారు మరియు ఎన్నికల రాజకీయాలలో ప్రవేశించారు.
1937 ఎన్నికలలో, ఆమె U.P(యునైటెడ్ ప్రావిన్స్) రాష్ట్ర శాసన సభ కు ఎన్నికయ్యారు.
ఆమె భారత రాజ్యాంగ అసెంబ్లీలో ఏకైక ముస్లిం మహిళ మరియు ఆమె యునైటెడ్ ప్రొవిన్స్ కు ప్రాతినిద్యం వహించారు.
రాజ్యంగా నిర్మాణ సభ లో ఆమె చేసిన ప్రసంగాలు ఆమెకు గల చట్ట పరిజ్ఞానం మరియు
ఇతర దేశాల రాజ్యాంగాల గురించి ఆమెకున్న జ్ఞానం తెలుపుతాయి. రాజ్యాంగ పరిషత్
చర్చలలో(Debates of constitute Assambly) ఆమె ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించారు
మరియు అనేక సవరణలను ప్రతిపాదించారు. మంత్రులు నిజమైన ప్రభావవంతం గా
పనిచేయవలేనంటే వారి పదవి కాలం తగినంతగా
ఉండవలేన్నారు. ఈ విషయం లో ఆమె స్విస్ పద్ధతిని అనుసరించమని అన్నారు మరియు
సింగల్ ట్రాన్స్ఫరబుల్ వోట్ ను సూచించారు.
అనేక మంది సభ్యులు వ్యతిరేకించిన ఆమె కామన్వెల్త్ లో భారత సభ్యత్వానికి గట్టి మద్దతు తెలిపారు. ఆమె
మైనారిటీల కోసం ప్రత్యెక నియోజకవర్గాలను
వ్యతిరేకించారు, మరియు శాసనసభల్లో సీట్ల రిజర్వేషన్
గట్టిగా వ్యతిరేకించారు.
ఆమె అభిప్రాయం ప్రకారం " రిజర్వేషన్ అనేది మైజారిటి
నుండి మైనారిటీలను వేరుచేసే స్వీయ-విధ్వంసక ఆయుధం. ఇది మెజారిటీ యొక్క మంచి
సంకల్పం గెలుచుకోడానికి మైనారిటీలకు అవకాశం ఇవ్వదు.ఇది వేర్పాటువాద మరియు
మతతత్వాన్ని పెంచుతుంది మరియు ఎల్లప్పుడూ దానికి దూరంగా ఉండాలి అని అన్నారు."
ఆ రోజులలో భారతదేశంలో, ఉర్దూ మరియు హిందీల కలయిక హిందూస్థానీ హిందీ కంటే ఎక్కువగా
మాట్లాడబడింది. ఆమె హిందూస్థానీని మరియు
దేవనాగరి లిపిని సమర్దించినది.
ప్రాథమిక హక్కుల మీద ఉన్న పరిమితుల గురించి తన ఆందోళనలను
ఆమె వ్యక్తపర్చింది, రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కులు మరియు
నిర్దేశక నియమాలు అన్ని ప్రావీన్స్లలో సమర్ధవంతంగా అమకుచేయడానికి ఒక స్వతంత్ర
సంస్థను ఏర్పాటు చేయాలనీ కోరింది.. ఆమె ఆస్థి హక్కు (ఆర్టికల్ 31 యొక్క నిబంధన) పై
కొన్ని అబ్యoతరాలను వెలిబుచ్చింది.
రాజ్యాంగ అసెంబ్లీ లో ఆమె వాణి, ఆమె ప్రసంగాలు ఆలోచన, ఉద్దేశ్యం, దీర్ఘకాలిక దృష్టి, ఆశావాదం మరియు ప్రభావం యొక్క స్పష్టత
కలిగి ఉన్నాయి అని విమర్శకులు అభిప్రాయపడ్డారు.
1950 లో, భారతదేశంలోని ముస్లిం లీగ్ రద్దు చేయబడింది మరియు బేగం ఐజాజ్
రసూల్ కాంగ్రెస్ లో చేరారు.
స్వాతంత్య్రానికి ముందు మరియు స్వాతంత్ర్యం తరువాత ఆమె తన రాజకీయ జీవితంలో అనేక
ముఖ్యమైన స్థానాలను చేపట్టారు. వివిధ మంత్రిత్వశాఖలను నిర్వహించినారు.
ఆమె 1952 లో రాజ్యసభకు ఎన్నికయ్యారు మరియు 1969 నుండి 1990
వరకు ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యురాలుగా ఉన్నారు. 1969 మరియు 1971 మధ్యకాలంలో ఆమె సోషల్
వెల్ఫేర్ మరియు మైనారిటీల మంత్రిగా పనిచేసారు. ఆమె అనేక పుస్తకాలు మరియు వ్యాసాలను
ప్రచురించారు మరియు 20 సంవత్సరాల పాటు భారతీయ మహిళల హాకీ సమాఖ్య
అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినారు మరియు ఆసియా మహిళల హాకీ ఫెడరేషన్ ప్రసిడెంట్ గా
వ్యవరించారు. 2000 లో ఆమె చేసిన సామాజిక కృషికి ఆమెకు సాంఘిక సేవా రంగంలో పద్మభూషణ్ పురస్కారం లబించినది.
రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటి సబ్యులు : ముహమ్మద్ సాదుల్లా
ఆధునిక ఆస్సాo రాజకీయ నాయకులలో ప్రముఖుడు మరియు అస్సాం తోలి
ప్రధాన మంత్రి(ముఖ్య మంత్రి) మరియు భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటి మెంబెర్ అయిన సయ్యద్
ముహమ్మద్ సాదుల్లా జీవిత చరిత్రను పరిశీలించుదాము.
డ్రాఫ్ట్ కమిటిసబ్యులు- ఎడమనుంచి రెండోవారు ముహమ్మద్ సాదుల్లా
సయ్యద్ ముహమ్మద్ సాదుల్లా
21 మే 1885 లో గౌహాతి లో సయ్యద్ ముహమ్మద్ తయ్యబుల్లా కు జన్మించారు. గౌహాతి లో ప్రాధమిక విద్యాబ్యాసం, కాటన్ కాలేజి, ప్రెసిడెన్సీ కాలేజి నుంచి ఉన్నత విద్యాబ్యాసం
పొందారు. గౌహతి లో లా చదివారు. అసామిస్, బెంగాలి, అరబిక్, పెర్షియన్, ఉర్దూ భాషలలో
నిపుణులు. ఈయన వృత్తిరిత్య న్యాయవాది. న్యాయవాదిగా
తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
1919 లో గౌహాతి
మున్సిపల్ చైర్మన్ గా పనిచేసారు. షిల్లాంగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబెర్ గా
నామినేట్ అయ్యారు. కౌన్సిల్ సమావేశాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈయన మంచి
క్రీడాకారుడు. అస్సాం లో ప్రముఖ వ్యక్తి గా పరిగణింప బడినారు. కలకత్తా హై కోర్ట్
లో ప్రాక్టిస్ చేసారు.
1924 లో
సాదుల్లా అస్సాం గవర్నర్ ఎగ్జిగుటివ్
కౌన్సిల్ లో మంత్రిగా నామినేటె అయ్యారు. 1924 నుంచి 1934 వరకు అస్సాం ఎడ్యుకేషన్
మరియు అగ్రికల్చర్ మినిస్టర్ గా పనిచేసారు. 1928 లో నైట్ హుడ్ సర్ బిరుదును పొందారు. 1935 లో కలకత్తా హై కోర్ట్ లో గవర్నమెంట్ ప్లీడర్ గా
నియమితులు అయ్యారు.
భారత ముస్లింలీగ్ ప్రముఖ నాయకులు మరియు ఆల్ ఇండియా ముస్లిం
లీగ్ ఎక్జుగుటివ్ కమిటి సబ్యులు. కాంగ్రస్ కు ముస్లిం ల్లీగ్ కు మద్య జరిగిన లక్నో
ఒప్పందం లో ప్రముఖ పాత్ర వహించారు. బ్రిటిష్ ఇండియా లో అస్సాం మొదటి ప్రైమ్
మినిస్టర్ (ముఖ్య మంత్రి) గా 1 ఏప్రిల్ 1937 నుంచి 10 సెప్టెంబర్ 1938 వరకు,తిరిగి 17
నవంబర్,1939 నుంచి
25 డిసెంబర్ 1941