.
డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ అద్యక్షతన రాజ్యాంగ
నిర్మాణానికి ఏర్పడిన భారత రాజ్యాంగ నిర్మాణ సంఘం లో మొత్తం 389 మంది సభ్యులు కలరు. రాజ్యoగ పరిషత్ కు 15 మంది స్త్రీలు ఎన్నికైనారు. వారిలో ప్రముఖురాలు ముస్లిం స్త్రీ
బేగం ఐజాజ్ రసూల్.
రాజ్యాంగ నిర్మాణ సంఘం 23 ప్రధానమైన సబ్-కమిటీలు గా ఏర్పడింది. ఇందులో
ప్రధానమైనవి 8 మేజర్ కమిటీలు, మిగతావి మైనర్ కమిటీలు.
మేజర్ కమిటీలలో ప్రధానమైనది రాజ్యాంగ ముసాయిదా (డ్రాఫ్ట్)
కమిటి. దీనికి డాక్టర్ BRఅంబేద్కర్ అద్యక్షత వహించారు. డ్రాఫ్ట్ కమిటిలో మొత్తం
7గురు సబ్యులు ఉన్నారు. వారు వరుసగా గా
పండిట్ గోవింగ్ వల్లభ పంత్, KM మున్షి, అల్లాడి కృష్ణ స్వామి అయ్యంగార్, ఎం.
గోపాల స్వామి అయ్యంగార్, BL మిట్టర్, మొహమ్మద్ సాదుల్లా(మాజీ అస్సాం ముఖ్య
మంత్రి) , DP ఖైతాన్.వీరిలో BL
మిట్టర్ రాజీనామా పలితంగా మాధవ్ రావు ఆపదవిని పొందారు. DP ఖైతాన్ మరణిoచినందున TT క్రిష్ణామాచారి ఆ పదవి పొందారు. రాజ్యంగ
నిర్మాణ సంఘం కు రాజ్యంగ సలహాదారు BN రావు.
డ్రాఫ్ట్ కమిటి తయారుచేసిన రాజ్యాంగం 26 నవంబర్ 1946 నవంబర్
న అమోదించబడినది. 26-1-1950 నుంచి నూతన రాజ్యాoగం అమలు లోనికి వచ్చింది భారత దేశం
రిపబ్లిక్ గా అవతరించినది.
భారత రాజ్యాంగ నిర్మాణం లో తోడ్పడిన ముస్లిం సబ్యుల జీవిత
చరిత్రలను పరిశీలించుదాము.
భారత రాజ్యాంగ పరిషత్
మహిళా సబ్యులలో ప్రముఖురాలు బేగం ఐజాజ్
రసూల్.
