4 February 2018

మహాత్మా మరియు అరాచకవాదం (The Mahatma and anarchy)




మహాత్ముడుగా  మారక  ముందు  మోహన్ దాస్  కరంచంద్ గాంధీ అరాచక వాదం  (anarchy) యొక్క బలమైన సమర్ధకుడు. అరాచకవాదం  అనేది స్వచ్ఛంద స్వీయ-పాలన పై ఆధారపడిన ఒక   రాజ్య రహిత సమాజం ను కోరుతుంది. శతాబ్దాలుగా అనేక  మంది తత్వవేత్తలు ఉదా:కు  క్రి.పూ.6 శతాబ్దపు  చైనా తత్వవేత్త లావోజీ,  క్రి.పూ.4 శతాబ్దపు  గ్రీక్ తత్వవేత్తలు డయోజెనస్ మరియు సినిక్స్ మరియు అరిస్టాటిల్ దీనిని సమర్ధించారు. భారత దేశం లో క్రి.పూ.3 శతాబ్దపు నాటి మనుస్మృతిలో కూడా దీని ప్రస్తావన కలదు. జర్మన్ తత్వవేత్త ఇమ్మాన్యుయేల్ కాంట్ అరాచకవాదం లో రాజ్యము  చట్టంచే పాలించబడుతుంది మరియు దానిని "శక్తి లేని స్వేచ్ఛ" అని పిలిచారు.

యుగ యుగాలగా    ఆలోచన ఉనప్పటికీ  ఆధునిక అరాచకవాదం  18 శతాబ్దంలో ఐరోపాలో మొదట ప్రతిపాదించబడింది. బ్రిటీష్ రచయిత మరియు ఆలోచనాపరుడు విలియం గాడ్విన్ ను  దీని  స్థాపకుడిగా భావిస్తారు. ఫ్రెంచ్, రష్యన్ మరియు భారతదేశ మొదటి స్వాతంత్ర్య  పోరాటంతో సహా అనేక విప్లవాలు ఆదర్శాన్ని అనుసరించాయి. కార్ల్ మార్క్స్ యొక్క రచనలలో ఈ భావన కన్పిస్తుంది.  ఆధునిక భారతదేశంలో, మహాత్మా గాంధీ సమకాలీనుడు, గదర్ పార్టీ యొక్క స్థాపకుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా హర దయాల్ 20 శతాబ్దం ప్రారంభంలో మరొక ప్రముఖ అరాచకవాదిగా ఉన్నారు.

గాంధీ, తన ప్రారంభ సంవత్సరాల్లో మరియు ఇంగ్లండ్లో విద్యనబ్యసించినప్పుడు  మరియు దక్షిణాఫ్రికాలో కొంత కాలం నివాసం ఉన్నప్పుడు   ప్రపంచం లోని  గొప్ప ఆలోచనాపరులచే ముఖ్యంగా పశ్చిమ దేశాలకు చెందినవారిచే ప్రభావితులు అయ్యారు.  కాని అతని ఆరాచకవాద భావాలు అతనిని  అతని మూలాలు లేదా ఆధ్యాత్మికత నుండి వేరుపర్చలేదు.

మొట్టమొదట 1880 లో లండన్లో  న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడు గాంధీ సమకాలీన అరాజకవాద వాది, గొప్ప రష్యన్ నవలా రచయిత లియో టాల్స్టాయ్  చే ప్రభావితుడు అయినాడు. "సరళ జీవనం  మరియు స్వచ్ఛప్రయోజనం” అనే  టాల్స్టాయ్ భావన గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది. "జీవితం యొక్క చట్టంగా ప్రేమ", అహింసా సూత్రాలు” మరియు సమస్త మానవజాతిపట్ల ప్రేమ” అనే భావనలు టాల్స్టాయ్ యొక్క రచనలలో లోతుగా పొందుపరచబడ్డాయి. గాంధీ మరియు టాల్స్టాయ్ ఇద్దరు జీవితం యొక్క సమస్యలను పరిష్కరించడానికి ప్రేమ” ఆలోచనను స్వీకరించారు.

టాల్స్టాయ్ "దేవుని రాజ్యం నీలోనే ఉంది" “The Kingdom of God is Within You” అనే గ్రంధం గాంధీ పై ప్రభావాన్ని కల్గిoచినది అది అతనిలోని సంశయవాదంను తొలగించి  అహీంసా వాదం  పట్ల పూర్తి నమ్మకాన్ని ఏర్పరచినది.  వాస్తవానికి, 1909 మరియు 1910 లలో గాంధీ మరియు టాల్స్టోయ్ ఒకరితో ఒకరు లేఖలు  మార్పిడి చేసుకొన్నారు.   లేఖల మార్పిడి ద్వారా గాంధీ టాల్స్టోయ్ ని ఎంతో  గౌరవించేవాడని  మరియు అతనితో తాత్విక భావాలను పంచుకోన్నాడని స్పష్టంగా తెలుస్తుంది, హింస లో ఇరువురికి నమ్మకo ఉంది. 

దక్షిణాఫ్రికాలో గాంధీ రాజ్య రహిత సమాజం పై తన అభిప్రాయాలను రూపొందించారు. బ్రిటీష్ వలసవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో మొట్టమొదట ఇవి  ప్రదర్శించబడినవి. గాంధీ గాడ్విన్ (1756-1836) ద్వారా కూడా ప్రభావితులు అయ్యారు.  1915 లో మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, ఆయన దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం మరియు ఇంపీరియల్ బ్రిటీష్ ఇండియా ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం లేదని గ్రహించారు.

అరాచకవాదం పట్ల  గాంధీ యొక్క నమ్మకాన్ని ప్రభావితం చేసిన ఇతర ఆలోచనాపరులు బ్రిటీష్ వ్యాసకర్త మరియు రచయిత జాన్ రస్కిన్ (1819-1900). అతని పుస్తకం "అన్టో థిస్ లస్ట్" “Unto This Lust” ఈ పుస్తకం మహాత్మా యొక్క తరువాతి జీవితంను అత్యంత ప్రభావితం చేసినది. అదేవిధంగా, హెన్రీ డేవిడ్ తోరేయు Henry David Thoreau, బ్రిటిష్ కవి పెర్సీ షెల్లీ Percy Shelli రచనలు,రోమైన్ రోలాండ్ వ్రాసిన రచనలు  మరియు స్వామి వివేకానంద ద్వారా కూడా గాంధీ జీ ప్రేరణ పొందారు. తన కాలంలోని ఇతర మేధావుల మాదిరిగా కాకుండా గాంధీ తేలికగా తన జ్ఞానాన్నిపొందారు. కాని కఠినమైన స్వీయ-క్రమశిక్షణ ద్వారా మరియు ఇతరుల ఆలోచనలను విస్తృతంగా అద్యయనం చేసి గాంధి తన సొంత సిద్ధాంతాన్ని అవలంబించగలిగారు.

మహాత్మా గాంధీ యొక్క సత్యాగ్రహ భావన మరియు అతని శాసనోల్లంఘన ఉద్యమం అరాచకవాదం పై  అతని  విశ్వాసానికి స్పష్టమైన గుర్తు. గాంధీ రామ్ రాజ్య భావన “స్వేచ్ఛ, న్యాయం, మానవ హక్కులు, సమానత్వం మరియు అహింసాపై ఆధారపడింది (ఇది వేదాలకు మరియు  పాలన యొక్క ప్రాచిన   హిందూ భావనకు దగ్గిరగా ఉంది).

వాస్తవానికి, గాంధీ యొక్క సహనం tolerance అనే భావనకు అర్ధం    సర్వ ధర్మ సమ భావన అంతియేకాని ఒక ధర్మం  పై మరొకటి ఎక్కువ అని కాదు. పరిపాలన tolerance యొక్క వివరణ వేదాల, రామాయణం మరియు మహాభారతంలో పేర్కొన్న వాటికి సమానంగా ఉంది. ఆదర్శవంతమైన సాంఘిక క్రమం యొక్క భావనను జాగ్రత్తగా పరిశీలిస్తే, నాగరిక ప్రపంచంలో సాధ్యమైనంత వరకు రాజ్య  నియంత్రణ లేక  స్వతంత్రంగా పరిపాలిoచేది అని అర్ధం అవుతుంది.    అయితే, గాంధీ జీ ప్రభుత్వం కనీస పాలన చేసి దాని పౌరులకు గరిష్ట స్వేచ్ఛ ఇవ్వాలని విశ్వసించారు.

తన అభిమాన రాజకీయ శిష్యుడు జవహర్లాల్ నెహ్రూ వలే కాకుండా, గాంధీజీ  చాలా లోతుగా ధార్మిక వ్యక్తి. అయితే ఆధ్యాత్మికత, నైతికత మరియు స్వేచ్ఛపై వారి అభిప్రాయాలు  ప్రాచీన జ్ఞానం మరియు శాస్త్రీయ ఆధునికవాదం వంటి వాటితో తరచూ విరుద్ధంగా ఉన్నప్పటికి హింస లేదా ద్వేషం ను ప్రోత్సహించేవి కావు. 

వాస్తవానికి, దైవిక నైతిక నియమావళి యొక్క ప్రధాన ఆధిపత్యం (  అంతిమ అధికారం దేవుని చిత్తo)అందు    మహాత్మాగాంధీ  ఎల్లప్పుడూ విశ్వసించారు. మానవ నిర్మిత శాసనాలు   దైవ  నియమాలను ఉల్లంఘించినట్లయితే, అలాంటి చట్టాన్ని ఎదిరించే హక్కును ప్రజలు కలిగి ఉండాలని ఆయన ఒకసారి చెప్పారు. ఇంకా హిందూ మతం లో అతని విశ్వాసం, స్వేచ్ఛ లేదా సత్యం పట్ల  అతని  అన్వేషణ లో ఎప్పుడు  విరుద్ధంగా లేదు.  అతను రాజకీయాల్లో మత సామరస్యం, అహింస మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఉండాలని  తన చివరి శ్వాస వరకు అన్నారు.
  
స్వాతంత్ర్యం పొందిన తరువాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను రద్దు చేయాలి అని ఆయన చేసిన ప్రసిద్ధ సలహా పౌరులకు నిజమైన స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి ప్రస్తుత పాలనలో ఉన్న నిర్మాణాలు అంగికరించవని ఆయన నమ్మకం యొక్క వ్యక్తీకరణగా మనం భావించవచ్చు. రాజ్య నియంత్రణ కాదు స్వీయ నియంత్రణ ఉండాలి అనేది అతని నమ్మకం. అయినప్పటికీ   ప్రభుత్వం కూడా తన నియంత్రణను కోల్పోటానికి అంగికరించ లేదు. వాస్తవానికి, ప్రతి ప్రభుత్వo ఎక్కువ రాజ్యనియంత్రణ కొరుకొంది.  అధిక రాజ్య నియంత్రణ కల సోవియెట్ నమూనా  నిజానికి పౌరుల స్వేచ్ఛ భావనను దెబ్బతీసింది.

ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితిలో రాజ్య నియంత్రణ అధికం అయ్యింది. జయప్రకాశ్ నారాయణ్ మరియు ఇటీవలే అన్నా హజారే అరాజకవాదం  యొక్క గాంధీ భావనను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేసారు.

ప్రస్తుత ప్రభుత్వం అందరికి న్యాయం మరియు అభివృద్ధి(సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ) అనే నినాదం తో అధికారంలోకి వచ్చింది. అయితే, అంతర్గత పార్టీ ఒత్తిళ్లు మరియు వైరుధ్యాలు ఈబావన ను దూరం చేసినవి.  ప్రభుత్వం ప్రతిరోజూ ప్రజల మీద ఆంక్షలు విధించడం లేదా ప్రజల సైద్ధాంతిక భావాలను అణిచి వేసేందుకు ప్రయత్నిoచడం ప్రజలు గమనిస్తున్నారు.

మహాత్మాగాంధీ చెప్పినట్లు కేవలం నినాదాల ద్వారా కాదు, నియంత్రణను కోల్పోడం ద్వారా రామ్ రాజ్యం వస్తుంది.  రామాయణ యొక్క సారాంశం సమాన న్యాయం, స్వీయ త్యాగం మరియు ఆలోచన, చర్యలలో వినయంఉండాలి. ఈ ఆదర్శాల కోసం  గాంధీ పట్టుబట్టారు సబ్కా సాథ్. సబ్కా వికాస్. సబ్కా విచార్. మనం  ఎప్పుడు పొందుతాం?

No comments:

Post a Comment