30 December 2016

ఉర్దూ, ముస్లింలు, మరియు రాజకీయాలు (Urdu, Muslims and Politics)
ఉర్దూ ను రక్షించు కొందాము గంగా జమునా సంస్కృతిని  (గంగ-జమున తెహ్జిబ్ ) కాపాడుకొందాము.
ఉర్దూ లౌకిక బాష సామాన్యుల బాష – దాని పురోభివృద్ది కి తోడ్పడుదాము.

భారతదేశం లో నేడు ఉర్దూ బాష  అదిక మంది ప్రజల మరియు ప్రభుత్వం ఆదరణ పొందలేక పోయినది.  ఉర్దూ దేశ ప్రజల ప్రేమ,  భావోద్వేగల,సహజీవన బాష మరియు  సజీవ బాషభారతదేశం లో ఉర్దూ బాష దేశ మత రాజకీయాలలో  చిక్కుకొoది. ఉర్దూ ముస్లింల బాష గా పిలవబడింది మరియు క్రమంగా ఆ బాష నుండి  అనేక మంది ప్రజలు  దూరం అయినారు.  నిజానికి ఇతర దేశాల నుండి వచ్చిన  మధ్య యుగ ముస్లిం పాలకవర్గం తమతో పాటు పెర్షియన్ మరియు టర్కిష్ తెచ్చింది. ఉర్దూ అనేక శతాబ్దాలుగా దేశంలోని  వివిధ భాషల మరియు మాండలికాల కలయిక భాషగా అభివృద్ధి చెందినది మరియు ఉత్తర భారతం, దేశంలోని దక్కన్ ప్రాంతంలో కమ్యూనికేషన్ కోసం ప్రజల బాష గా మారింది.

ప్రభుత్వo  ఉర్దూ బాషా అభివృద్ధి కి తగిన సహకారం అందించటం  లేదు. ప్రస్తుత ప్రపంచం లో ఉర్దూ అధికార కార్యకలాపాలలో ఉపయోగించే  బాష ప్రతిపత్తిని కోల్పోయినది.  వ్యాపార వర్గాలు ప్రపంచ వ్యాప్తంగా  ఇంగీష్ ను ఉపయోగించ సాగారు. కేవలం దిగువ, మద్య తరగతి ముస్లిమ్స్ మాత్రామే తమ పిల్లలను ఉర్దూ మీడియం లో చదివించ సాగినారు. ఉన్నత వర్గాల వారు ఉన్నత మధ్యతరగతి వారు తమ పిల్లలను ఆంగ్లములో చదివించ సాగినారు.

దేశంలో ముస్లింల సాంఘిక-ఆర్ధిక పరిస్థితులను దృష్తి లో పెట్టుకొని ముస్లిమ్స్ వాణిజ్యపరంగా మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆంగ్లమును  అబ్యసిoచ వలయును అని కొంతమంది వాదిస్తారు. ఉర్దూ లో ముస్లిం మత గ్రంధాలు  మరియు ముస్లిం సంస్కృతి లేదా పవిత్ర భారతదేశ గంగా-జమునా తెహ్జిబ్  పొందుపరచబడ్డాయి కాబట్టి ఉర్దూ భాష ను ప్రోత్సహించి  రక్షించ వలయును అని కొందరు అంటారు.

ఉర్దూ భారతదేశం యొక్క ఒక ప్రాంతీయ భాష కాదు అది మాట్లేడే వారు ఉత్తరభారతం మరియు  దక్కన్ ప్రాంతo వరకు   దేశవ్యాప్తముగా వ్యాపించి ఉన్నారు.   ఉర్దూ భాష కాశ్మీర్ నుంచి పశ్చిమ బెంగాల్, కర్నాటక వరకు ప్రజలు అధిక సంఖ్యలో మాట్లాడుతుంటారు కానీ, కేవలం కాశ్మీర్ లో మాత్రమే అది మొదటి అధికార భాష  మరియు ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్ లో రెండవ భాష హోదా పొందింది.

దేశ విభజన ఉర్దూ బాష అభివృద్దికి ప్రతిబంధక మైనది. విభజన తరువాత ఉర్దూ మూడు దేశాలలో అనగా   భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లో  విభజించబడింది.  బంగ్లాదేశ్ ఉర్దూలో మాట్లాడేవారు శరణార్థులు అయినారు  మరియు పాకిస్తాన్ లో ఉర్దూ ముహాజిర్ ల బాష గా మారింది.

పాకిస్తాన్ లో ఉర్దూ జాతీయ భాష ప్రతిపత్తి పొందినప్పటికీ దాని పరిస్థితి ఇండియా లో ప్రత్యేకించి   దక్షిణ భారతదేశం లో హిందీ లాగ తయారు అయినది.  భారతదేశం లో ఉర్దూ  ముస్లింల బాష గా గుర్తించ బడి సామాజికంగా ప్రతికూల  స్థితి ని పొందినది. 

భారతదేశం లో ఉర్దూ భాదిత బాషగా మారింది. వాణిజ్య, ప్రభుత్వ రంగం లో తన ప్రతిపత్తిని కోల్పోయినది. ఉర్దూ స్థానాన్ని విద్యా సంస్థల్లో ప్రాంతీయ బాషలు మరియు ఆంగ్లము సాదిoచగా ఉర్దూ అనాధగా మిగిలింది.

ఉర్దూ భాషకు మద్దతు ముస్లింలకు మద్దతుగా బావించబడినది. ఉర్దూ కు ప్రభుత్వ మద్దత్తు  రాజకీయాలతో జతచేయబడింది. ముస్లింల ఓటు పొందే లక్ష్యం తో ఉర్దూ ప్రోత్సహింప బడినది. ఇంగ్లీష్ మరియు ఉర్దూ రెండూ కొన్ని సార్లు జయించిన లేదా దేశద్రోహుల భాషగా చిత్రీకరించబడినవి. కానీ ఇంగ్లీష్ సంపన్న భాషగా పరిగణిస్తారు, ఉర్దూ ఇప్పుడు ముఖ్యంగా పేద ముస్లింలు మరియు  పేదల ప్రాథమిక భాషగా భావించబడుతుంది.

ముస్లింలు ఉర్దూను తమ సొంత భాష గా పరిగణిoచడం తప్పు అని కొంతమంది అంటారు. భారతదేశం లో మితవాద రాజకీయాలు ముస్లింలను  లక్ష్యంగా చేసుకొన్నవి మరియు ఉర్దూ దానితో  అనుసంధానింప బడి ప్రగతి పొందలేదు.

ఉర్దూ ప్రమోషన్ కొరకు ప్రచారం తరచుగా దేశం లో ముస్లిం కమ్యూనిటీ మరియు రాజకీయ నాయకత్వం మధ్య ప్రతికూల సంబంధాన్ని సృష్టించింది. ఉత్తర భారతదేశం లో  జాతీయ ఉద్యమం సమయంలో మతతత్వం ప్రబలింది  మరియు దానివలన  దక్షిణ భారతదేశం లో హిందూ -ముస్లిం సంబంధాలు ప్రభావితం అయినాయి. ఉర్దూ ప్రచారం ఉత్తర భారతదేశం బయట రెండు ప్రతికూల పరిణామాలను సృష్టించింది. మొదటిది ముస్లిమ్స్- ముస్లిమేతరులు వేరు అయినారు. రెండవది,  ఉర్దూ బాష కు సహాయం చేయడం  ముస్లిమ్స్ ను సంతృప్తి పరచటం గా హిందువులు ఆరోపించినారు. అందువలన, ఉర్దూ, ముస్లింలు రెండు ప్రతికూలాలను ఎదుర్కోవాల్సి వచ్చినది. ఉర్దూ ముస్లిమ్స్ బాష గా ముద్ర పడి సమాజం మతతత్వ పూరిరితం అయినది. దీనితో ముస్లింలు వివక్ష, మత హింస ఎదుర్కోసాగారు.

నిజానికి, సంస్కృతం పరిరక్షించేoదుకు ఉర్దూ ఉత్తరాది రాష్ట్రాల్లో మూడు భాషా సూత్రం కింద బలి అయినది.  భారతదేశం యొక్క పురాతన భాష గా హిందీని మరియు తల్లిబాష గా  ఒక ఆధునిక భాషగా ఆంగ్ల మరియు సంస్కృతoను  తీసుకువచ్చారు. ముస్లింలకు  ఉర్దూ మాతృబాష కాని  సెన్సెస్ సిబ్బంది వారిని సంప్రదించకుండా వారి మాతృభాషగా  హిందీ గుర్తించారు. తమిళనాడు మరియు దక్షిణ భారత రాష్ట్రాలలో ప్రాంతీయ భాష మరియు ఆంగ్లము స్థానం పొందినవి.  హిందీ ద్వి  భాషా సూత్రం ప్రకారం బయటకు వెళ్ళిపోయిoది మరియు ఈ రాష్ట్రాల్లో ఉర్దూ అవకాశాలను  బాగా ప్రభావితం చేసింది.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఉర్దూ దేశం యొక్క భాష మరియు అది అద్భుతమైన సంస్కృతి మరియు చరిత్ర కలిగి ఉంది మరియు ఉర్దూ  ముస్లిమ్స్ భాష కాదు అని గుర్తించటం  ముఖ్యం. ఉర్దూ కు లౌకిక మూలం ఉంది మరియు  భాషకు మతపరమైన గుర్తింపు ఉండకూడదు. దాని ప్రమోషన్ కోసం ముస్లింలు  మరింతగా పట్టుబట్టిన కొద్ది  ఉర్దూ మత రాజకీయాలు ద్వారా అణిచి వేయబడుతుంది. ఉర్దూ దాని పెరుగుదల మరియు వ్యాప్తి కోసం ఇతర స్క్రిప్ట్స్ అవలంబించవలసిన  అవసరం కూడా ఉంది. భారతదేశం లోని ప్రజలలో అధికశాతం మంది  పెర్సో-అరబిక్ లిపి లో ఉర్దూ ను  చదువలేరు. ఉర్దూ మనుగడకు మరియు వ్యాప్తికి ప్రభుత్వం తోడ్పడాలి.

దేశంలో ఉర్దూ మాటడే ప్రజలు అనేక ప్రాంతాల్లో ఉర్దూ మాట్లేడే చివరి తరం గా మిగలవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో పేదలు ముఖ్యంగా  ముస్లింలు తమ పిల్లలను ఉర్దూ పాఠశాలల్లో చదివించటం విద్యాపరంగా మరియు ఆర్థికంగా లాభదాయకం కాదు అని తెలుసుకోటానికి రెండు తరాల సమయం పట్టవచ్చు. అది ఒక అద్భుతమైన సంస్కృతి మరియు చరిత్ర గల ఉర్దూ బాష కు భారతదేశం లో బహుశా ముగింపు దశ కావచ్చు.
29 December 2016

భారత దేశం లో అరబిక్ ప్రాచుర్యం -


భారత దేశం లో అరబిక్ మాతృభాష గా కలవారు సుమారు 50వేల మంది ఉన్నారనటం ఆశ్చర్యం గా ఉంది కదూ! 2001 భాషాపరమైన వర్గాల వారిపై జరిగిన సెన్సస్ డేటా ప్రకారం, భారతదేశం లో అరబిక్ మాతృభాష గా కలవారు 51.728 మంది ఉన్నారు.

1974 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం డిసెంబర్ 18ని కమ్యూనికేషన్ యొక్క సాధనంగా అరబిక్ బాషా ప్రాధాన్యతను గుర్తిస్తూ ఆ రోజును అరబిక్ దినంగా ప్రకటించినది.  1974 లో ఐక్య రాజ్య సమితి దాని ప్రధాన ఆరు అధికార భాషల్లో ఒకటిగా అరబిక్ ను స్వీకరించింది. అరబిక్ 20 దేశాల వారి మాత్రు బాష –పడమర  ఉత్తర ఆఫ్రికా యొక్క అట్లాంటిక్ తీరం నుండి తూర్పున  ఒమన్ సుల్తానేట్ వరకు  ఉత్తరాన సిరియా నుండి దక్షిణాన సుడాన్ వరకు అరబిక్ వ్యాప్తిలో ఉన్నది.

ప్రపంచీకరణ యుగంలో వాణిజ్య మరియు సాంస్కృతిక రంగాలలో అరబిక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శతాబ్దాల నాటి సంపన్న సంస్కృతి మరియు నాగరికత కలిగిన  భాష; ఇది దివ్య ఖురాన్ మరియు  ప్రవక్త మహమ్మద్(స) ఉపయోగించిన  భాష.

ప్రాచ్య బాషల నిపుణుడు  ఫిలిప్ K.హిట్టి  ప్రకారం : "మధ్య యుగం లో  అనేక శతాబ్దాలుగా నాగరిక ప్రపంచం అంతటా విద్యాభ్యాస మరియు సాంస్కృతిక మరియు ప్రగతిశీల ఆలోచన కల బాష గా అరబిక్  ఉంది. తొమ్మిదవ మరియు పన్నెండవ శతాబ్దాలలో అనేక రచనలు, -తాత్విక, వైద్య, చారిత్రక మత, ఖగోళ మరియు భౌగోళిక  అరబిక్ మాధ్యమం ద్వారా వేలుబడినవి. "


ప్రపంచం పెట్రోల్ దిగుమతి కొరకు  అరబ్ దేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ ఆధారపడటం ఇరవయ్యో శతాబ్దం మొదటి అర్ధభాగంలో గణనీయంగా పెరిగింది. అరబ్బులు మరియు అరబ్బులు కాని వారి మద్య  బలమైన సంబంధాలు ఏర్పడినవి. పలితంగా ప్రపంచ ప్రజలలో అరబిక్ బాష పట్ల, అరబ్ దేశాల పట్ల, అరబ్ సంస్కృతి పట్ల విశేష  ఆసక్తి పెరిగింది.

స్వాతంత్య్రానంతరo, అరబిక్  బాష ప్రాధాన్యం  భారత ప్రభుత్వం గుర్తించినది. అరబిక్ విభాగాలు అనేక కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మరియు కళాశాల అందు  స్థాపించబడ్డాయి. ప్రస్తుతం  అరబిక్ కళాశాలలతో పాటు భారతదేశం లో 40 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలలో అరబిక్ బాషా విభాగాలు ఉన్నాయి.

అరబిక్ కేవలం మదర్సా లేదా ఇస్లామిక్ పాఠశాల లేదా  ఒక మతం భాషగా భావించబడటం లేదు. వ్యాపార ప్రపంచీకరణతో నగదు లావాదేవీల  జ్ఞానం కొరకు అరబిక్  అవసరం ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాలు గుర్తించినవి.  ప్రస్తుతం ప్రపంచీకరణ నేపద్యం లో  అరబిక్ ఒక్క ముస్లిం కమ్యూనిటీ కే  పరిమితo కాలేదు అనేక మంది ముస్లిమేతరులు అరబిక్ బాష ను నేర్చుకొంటున్నారు ఈ రోజుల్లో చమురు సంపన్న అరబ్ దేశాల లోని  బహుళజాతి కంపెనీల్లో పనిచేయుటకు మరియు ఆ దేశాల్లోని  పర్యాటక, ఆతిథ్య మరియు రక్షణ రంగాలలో పనిచేయుటకు అరబిక్ జ్ఞానం అవసరం.


నేడు అనేకమంది  ముస్లిమేతరులు విశ్వవిద్యాలయాలు మరియు కళాశాల లో అరబిక్ బాష అబ్యసిస్తున్నారు. భారత దేశ ప్రసిద్ది కేంద్రీయ  విశ్వవిద్యాలయo జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ముస్లిమేతరలు  గణనీయమైన సంఖ్యలో ప్రతి సంవత్సరం అరబిక్ లో గ్రాడ్యుయేట్ అవుతున్నారు. 

సచార్ నివేదిక పది సంవత్సరాల తర్వాత (Ten years after Sachar Report)
సచార్ కమిటీ నివేదిక ప్రకారం  భారతదేశం లో ముస్లిములు   షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు కంటే వెనుకబడిఉన్నారు.

యుపిఎ-1 ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ రాజేందర్ సచార్ నేతృత్వంలో భారతదేశం లో ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితి చర్చింటానికి ఏర్పాటు చేశారు మరియు అది 2 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధి లో  దాని పరిశీలనలను సమర్పించినది. భారతదేశం లో ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితిపై నవంబర్ 30, 2006 సచార్ కమిటీ తన 403 పేజీల నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టినది.


సచార్ కమిటి నివేదిక ముస్లిం సమాజం ఎదుర్కొoటున్న వైపల్యాలు గుర్తించి పరిస్థితిని  పరిష్కరించేందుకు తగు సిఫార్సులు చేసింది. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కంటే క్రింద  భారతీయ ముస్లింల పరిస్థితి హీనంగా ఉంది. ఇది హైలైట్ చేసిన అనేక విషయాలలో  ప్రధానమైనది భారతీయ జనాభాలో ముస్లిం జనాభా శాతంకు  మరియు ఐఎఎస్, ఐపిఎస్, మరియు పోలీసు కమ్యూనిటీ అందు వారి యొక్క సాధారణ ప్రాతినిధ్యం శాతం  విషయంలో భారీ అసమతుల్యత ఉoడుట.

1.జనాభా వివరాలు:
సంవత్సరం
ముస్లిమ్స్
మొత్తం
ముస్లిమ్స్ శాతం
2001
13.81కోట్లు
102కోట్లు
13.43%
2011
17.22కోట్లు
121కోట్లు
14.2%

2.నెలవారీ తలసరి వ్యయం (ఎంపిసిఇMPCE)


ముస్లిమ్స్
అందరు
2004-05
 రూ. 635/-
రూ. 712/-
2009-10
రూ. 980/-
రూ. 1128/-

3.పనిలో పాల్గొనే శాతం-ముస్లిమ్స్ లో
సంవత్సరం
పురుషులు
స్త్రీలు
2001
47.5%
14.1%
2011
49.5%
14.8%

4.కేంద్ర ప్రబుత్వ విభాగాలు మరియు పబ్లిక్ అండర్ టేకింగ్స లో మైనారిటిల నియామాకాలు.
సంవత్సరం
% శాతం
2006-07
6.93%
2007-08
8.23%
2008-09
9.90%
2009-10
7.28%
2010-11
10.18%
2011-12
6.24%
2014-15
8.57%
·        కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ
5.ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలలో సర్వ శిక్ష అభియాన్ క్రింద ప్రైమరీ స్కూళ్ళ ఏర్పాటు
సంవత్సరం
ఏర్పాటు శాతం%
2006-07
92.45%
2007-08
51.72%
2008-09
97.40%
2009-10
92.91%
2010-11
99.93%
2011-12
85.10%
 *డిపార్టుమెంటు అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ.
6.సెక్స్ రేషియో:
సంవత్సరం
ముస్లిమ్స్ ప్రతి వెయ్యి కి 
ఇతరులు ప్రతి వెయ్యి కి 
2001
936
922
2011
961
943
·        సెన్సస్  2001,2011.
7.పట్టణ ప్రాంతాలలో నివసించేవారు

ముస్లింలు
ఇతరులు
2001
35.7%
27.3%
2011
39.9%
31.14%
 *సెన్సస్  2001,2011.

8. అక్షరాస్యత రేట్

ముస్లింలు
ఇతరులు
2001
59.1%
64.8%
2011
68.5%
73%
 *సెన్సస్  2001,2011
9. 6-14సంవత్సర ల మద్య పిల్లలు  స్కూల్ కి వెళ్ళని వారు

ముస్లింలు
ఇతరులు
2004-05
15.3%
10.2%
2010-11
8.7%
4.4%
 *సెన్సస్  2001,2011
10.మదరసాలలో నమోదు అయిన వారు

ముస్లింలు
2001
10.3లక్షలు
2011
17.1లక్షలు
 *సెన్సస్  2001,2011
11.గ్రాడ్యుఎట్ లు

ముస్లింలు
మొత్తం  
2001
23.9 లక్షలు
3.76కోట్లు
2011
47.52లక్షలు
6.2 కోట్లు
పెరిగిన శాతం%
98.8%
64%
 *సెన్సస్  2001,2011

సచార్ నివేదిక ముస్లిం సమాజం ఎదుర్కొoటున్న అనేక వైపల్యాల శ్రేణిని గుర్తిస్తు పరిస్థితిని  పరిష్కరించేందుకు తగు సిఫార్సులు వధించిన చేసింది. వెనుకబాటు తనంలో భారతీయ ముస్లింలు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కంటే  క్రింద ఉన్నారు.

ప్రభుత్వ డేటా యొక్క ఒక విశ్లేషణ ప్రకారం చాలా సూచికల విషయం లో  సంవత్సరాలు  గడిచిన గణనీయమైన మెరుగుదల లేదు మరియు  కొన్ని సందర్భాలలో నిజానికి పరిస్థితి క్షీణించింది.  ఉదాహరణకు 2005 లో భారతదేశం యొక్క పోలీసు బలగాల లో  ముస్లింల వాటా 7.63% ఉండగా అది  2013 లో 6.27% కి పడిపోయింది. ఆ తరువాత ప్రభుత్వo మతం ఆధారంగా పోలీసు సిబ్బంది డేటా విడుదల నిలిపి వేసింది.

.సచార్ కమిటి నివిదిక తరువాత మరియు ముందు సంవత్సరాలలో  ముస్లింలు అతితక్కువ సగటు నెలవారీ తలసరి వ్యయం (ఎంపిసిఇ) అన్ని వర్గాల కన్న కలిగి ఉన్నారు.  ముస్లిం పురుషులు  పనిలో  పాల్గొనే శాతం 2001 లో 47.5% నుండి 2011 లో 49.5% కు పెరిగింది; ముస్లిం మహిళలు పనిలో  పాల్గొనే శాతం 2011 లో 14.8% ఉండగా అది  2001 లో 14.1% ఉంది.

ఐఏఎస్&ఐ.పి.ఎస్. లో ముస్లిం ఉద్యోగులు


2006
1-1-2016
ఐఏఎస్
3.0%
3.32%
ఐఏఎస్(డైరెక్ట్ )
2.3%
2.73%
ఐఏఎస్(ప్రమోటిస్)
5.0%
4.8%
ఐ.పి.ఎస్.
4.0%
3.19%
ఐ.పి.ఎస్.(డైరెక్ట్)
2.7%
2.91%
ఐ.పి.ఎస్(ప్రోమోటీస్)
7.1%
3.82%
*కేంద్ర హోం శాఖ నివేదిక ప్రకారం.
మొత్తం గా భారతీయ పోలిస్ దళాలలో ముస్లింల శాతం%

ముస్లిమ్స్
టోటల్
ప్రాతినిద్య శాతం
2006
100634
1318296
7.63%
2013
108602
1731537
6.27%
*ఎన్కిఆర్బి(NCRB) నివేదిక. 2013 తరువాత మతం వారిగా గణాంకాలు సేకరించడం నిలిపివేశారు.
అనగా ప్రతి 100 ఐఎఎస్, ఐపిఎస్ లలో కేవలం  3గురు మాత్రమే ముస్లింలు ఉన్నారు.

గణాంకాల ప్రకారం దేశంలోని అగ్రశ్రేణి అధికారులు అయిన ఐఎఎస్, ఐపిఎస్ లలో సచార్ కమిటి ప్రకారం 2006 లొ వరుసగా 3% మరియు 4% గా ఉన్నారు. జనవరి 1, 2016 నాటికి వారు వరుసగా వరుసగా 3.32% మరియు 3.19% ఉన్నారు అని  హోంమంత్రిత్వశాఖ డేటా చూపించుతుంది. సచార్ నివేదిక ప్రకారం IPS లో ముస్లిం అధికారులు తగ్గటానికి ప్రధాన కారణం రాష్ట్రాల నుండి వచ్చే IPS ప్రమోటిల శాతం తగ్గుటయే. ముస్లిం IPS ప్రమోటిల శాతం 2006 లో7.1% ఉండగా అది  2016 ప్రారంభంలో3.82% కు తగ్గింది.

2001 జనాభా లెక్కల ప్రకారం, ముస్లింలు భారతదేశం జనాభాలో 13.43% ఉన్నారు. 2011 లో వారు 14.2% ఉన్నారు. రెండు జనాభా గణనలు మధ్య ముస్లింల జనాభాలో 24,69% పెరుగుదల రికార్డు చెయ్యబడింది.

ముస్లింలలో లింగ నిష్పత్తి మొత్తం గా 2001 మరియు 2011 రెండు సార్లు మెరుగుగా ఉంది.  పట్టణ కేంద్రాల్లో నివసిస్తున్న ముస్లింల శాతం రెండు సెన్ససెస్ లలో జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉంది.