20 April 2016

దివ్య ఖురాన్ అనువాదములు


ఖురాన్ ను  కురాన్ఖొరాన్ఖుర్‌ఆన్ఖొర్ఆన్కొరాన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. కురాన్ అరబ్బీ భాష లో అల్లాహ్ (దేవుడు) ముహమ్మద్ ప్రవక్త ద్వారా మానవాళికి పంపిన ఇస్లాం ధర్మం యొక్క చివరి పవిత్ర గ్రంథము. ఖుర్ఆను గ్రంథం మహాప్రవక్త మహమ్మద్(స)పై రమజాను మాసంలో అవతరించింది. దాదాపు ఇరవైమూడు సంవత్సరాల సుదీర్ఘమైన కాలంలో ఈ గ్రంథం మానవుల అవసరాలకు ఆ కాల పరిస్థితులకు అనుగుణంగా సందేశాలను మోసుకొచ్చింది.
అరబ్బీ భాషలో 'ఖుర్ ఆన్' అనగా 'చదువుట','వల్లె వేయుట' ,'మాటిమాటికి చదివే' గ్రంథం అని అర్ధము.
నేను మీదగ్గర రెండు వస్తువులు వదలిపెట్టి పోతున్నాను. ఈ రెండింటిని దృఢంగా పట్టుకొని ఆచరించేవారు ఎన్నటికీ దారి తప్పలేరు. వాటిలో ఒకటి దైవగ్రంథం (ఖుర్‌ఆన్). రెండవది నా ప్రవచనాలు, సంప్రదాయాలు (హదీసులు) - మహాప్రవక్త ముహమ్మద్ (స)
ముస్లిం ల నమ్మకము ప్రకారము దేవుని సందేశాలు మొదటి ప్రవక్త ఆదమ్ తో ప్రాంభింపబడిషుహుఫ్ ఇ ఇబ్రాహిమ్,  తోరాహ్ (మోషే ధర్మశాస్త్రము, పాతనిబంధన)  జబూర్ (దావీదు కీర్తనలు)ఇంజీల్ (క్రీస్తు సువార్త), వంటివానితో కొనసాగింపబడి, చివరకు మహమ్మదు ప్రవక్తకు తెలుపజేయబడిన ఖురాన్‌తో ముగిసినవి. పైన చెప్పిన గ్రంథాలలోని వివిధ సందేశాలను ఖుర్‌ఆన్ గుర్తిస్తుంది.ఖుర్‌ఆన్ యొక్క సాధికారతను ఖొరానే స్పష్టంగా చెప్పింది. మిగిలిన విషయాన్ని ఇప్పుడు తెలియజేశాము. దీనికి రక్షణకూడా నిశ్చయంగా మేమే అని.
 ఈ ఖుర్ఆను గ్రంథం తన అనుయాయులకు పటిష్ఠమైన విశ్వాసాన్ని కలిగించింది. వారి హృదయాలు దైవభక్తితో పులకించిపోయాయి. ఆ గ్రంథం ద్వారా వ్యక్తమయ్యే ప్రతి ఆజ్ఞను వారు తు.చ. తప్పకుండా పాటించేవారు.

ఖురాన్ అనువాదములు:

కొరాన్ తొలుత అరబిక్ లో అవతరించినది పిదప అనేక ఆసియన్, ఆఫ్రికన్, యురోపియన్ బాషలలోనికి అనువదింప బడినది.
కురాన్ అనువాదం మొదటి నుంచి చాల సమస్య తో కూడుకొన్నది. కురాన్ దైవవాణి కనుక దాన్ని అనువదించలేము అన్న భావన ఉండేది. అందుకు గాను తొలితరం అనువాదకులు అనువాదo తో పక్కనే దాని అరబిక్ మూల ప్రతిని కూడా ఉంచేవారు. పైగా ఒక అరబిక్ పదము నకు అనేక అర్ధాలు కలవు. నిజానికి కురాన్ అనువాదం ఒక మహత్తర కార్యం. 
ముహమ్మద్ ప్రవక్త(స) కాలం లో కురాన్ ఇతర బాష లోనికి అనువదింప బడ లేదు. ఖురాన్ యొక్క మొదటి అనువాదం 7 వ శతాబ్దంలోలి భాగం లో  పెర్షియన్ బాష లోనికి  (సురా అల్- ఫాతిహా) అనువదించినది సల్మాన్  ఫార్సీ. ఆ తరువాత గ్రీక్ బాష లోనికి 855-870 మద్య నిసుతాస్ బైజాన్టియాస్ అనే వానిచే అనువదిoపబడినది.
ఖుర్ఆన్ మొదటి పూర్తి అనువాదాలు పెర్షియన్ బాషలో  10 వ మరియు 12 వ శతాబ్దాల మధ్య జరిగినవి. సమనిడ్ రాజు  మొదటి మన్సూర్ (961-976) ఖురాన్ ను అనువదించమని ఖొరాసాన్  పండితుల సమూహం ను ఆదేశించినాడు. వారు తఫ్సీర్ అల తబరి ని  అరబిక్ నుండి   పెర్షియన్ లోనికి అనువదించారు. తరువాత 11వ శతాబ్దం లో పెర్షియా బాష లో మొదటి కురాన్ తఫ్సీర్ ప్రచురింప బడినది. 12వ శతాబ్దం లో అబూ హఫ్స్ ఒమర్ అల్ నసఫీ కురాన్ ను అరబిక్ నుండి పెర్షియా లోని కి అనువదించి నాడు.

లాటిన్ బాష లో:
1143 లో రాబర్ట్స్ కేటేనేన్సిస్(Robertus Ketenensis) ద్వారా  కురాన్ లాటిన్ బాష లోనికి  అనువదింప బడినది. తొలితరం ఆంగ్ల అనువాదకులు అరబిక్ నుండి కాకుండా ఈ లాటిన్ అనువాదం నుండి అనువాదాలు చేసేవారు.దానితో అవి తప్పుల తడక లాగా ఉండేవి. 13వ శతాబ్ధపు తోలి భాగం లో, 15వ మరియు 16 శతాబ్దం లో ఆ తరువాత 17వ శతాబ్ధపు ప్రారంభం లో అనేక లాటిన్ అనువాదాలు జరిగినవి.
1612-17OO మద్య నివసించిన లుదోవికో మర్రాసి (Ludovico Marracci) అనే అరబిక్ బాష నేర్చిన లాటిన్ పండితుడు 1698 లో కురాన్ ను లాటిన్ బాష లోనికి అనువదించినాడు. ఇది ఇతర యురోపియన్ అనువాదకులకు(ఫ్రెంచ్, జర్మన్) మార్గదర్శకం గా ఉండేది. అందులో ఒకటి మక్కా లో హిజ్రీ 1165 లో ప్రచురింప బడినది.
ఇతర యురోపియన్ బాషల లోని అనువాదాలు:
కురాన్ అనువాదం జరిగిన మొదటి ఆధునిక యురోపియన్ బాష క్యాస్టిలియన్ మరియు అనువదించినది జుయాన్ అంద్రీస్. ఆ తరువాతి దాదాపు డజను కు పైగా అనువాదాలు అతని అనుసరించి జరిగినవి. ఆ తరువాత 1547 లో ఇటాలియన్ లో తరువాత 1616 లో ఇటాలియన్ నుండి  జర్మని లోను, పిదప 1641 లో జర్మని నుండి డచ్ బాషలోనికి అనువదింప బడినది.
1647 లో ఆంద్రీ డు ర్యేర్ చేత  కురాన్  ఫ్రెంచ్ బాషలోనికి అనువదిoప బడినది. 1959 లో ముహమ్మద్ హమిదుల్లాః అనే ముస్లిం ఒరిజినల్ అరబిక్ నుండి ఫ్రెంచ్ బాషలోనికి కురాన్ ను అనువదించాడు. ఇది ఫ్రెంచ్ సరిఅయిన అనువాదం గా పరిగణింప బడి అనేకసార్లు ఫ్రాన్స్,లెబనాన్ లలో పున: ముద్రిత మైనది.
ఆధునిక స్పానిష్ బాషలో నాలుగు సార్లు కురాఅన్ పూర్తిగా అనువదిoపబడినది. అవి దక్షణ అమెరికాలోను, అమెరికాలోను విస్తృతంగా అమలులో ఉన్నవి.
ఆంగ్లము లోనికి లాటిన్ నుండి కురాన్ మొదటిగా 1143 లో మొదటి సారి అనువదిమ్పబడినది. పిదప ఫ్రెంచ్ నుండి ఆంగ్లము లోనికి కురాన్ మొదట అలెక్జాండర్ రాస్ చేత 1649 లో అనువదింప బడినది. అలెక్జాండర్ రాస్ ఆంగ్ల అనువాదం అనేక డచ్,జర్మని అనువాదాలకు మాతృక అయినది. 1734 లో జార్జ్ సేలే మొదటి సారిగా అరబిక్ నుండి ఆంగ్లము లోనికి ప్రత్యక్ష అనువాదం చేసినాడు. ఆతరువాత రాద్వేల్,పాల్మెర్,రిచర్డ్ బెల్, జాన్ అర్బెర్రి ఆంగ్లములోనికి అరబిక్ నుండి అనవదించారు.
మొదటి సారి ఆంగ్లములోనికి అరబిక్ నుండి ఒక ముస్లిం డాక్టర్ మిర్జా అబుల్ ఫజల్ 1910 లో  కురాన్ అనువదించాడు. ముహమ్మద్ అలీ, ముహమ్మద్ పిక్తాల్, యూసుఫ్ అలీ, హిలాలి ఖాన్, డాక్టర్ అమీర్ అలీ, అహ్మద్ అలీ, వహిదుద్దిన్ ఖాన్ ఆంగ్ల అనువాదకులలో ముఖ్యులు.
1716 లో రష్యన్ బాషలోనికి అనువదింప బడినది  
ఆసియా బాషలు:
తుర్కి బాషలోనికి ముహమ్మద్ హంది యజీర్ అనువదించాడు.(1935ప్రింట్ )
మొదటి జపనీస్ కురాన్1920లో రాద్వేల్ ఇంగ్లీష్ కురాన్ అనువాదం పై ఆధారపడి రచించినది సకమోతో కెన్-ఇచి. ఆ     తరువాత 1945 లో  అరబిక్ నుండి మొదట అనువదించినది తోషిహికో ఇజుత్సు.
 చైనా లో      ఇస్లాం 7వ శతాబ్దం లో ప్రవేశించి నప్పటికీ మొదటి చైనా కురాన్ సంపూర్ణ అనువాదం రాద్వేల్ ఆంగ్ల అనువాదం పై ఆధారపడి చేసిన జపాన్ అనువాదం పై ఆధార పడి జరిగింది. 1931 మొదటి చైనా ముస్లిం వాంగ్ జింగ్ జహి కొరాన్ చైనా బాష లోనికి అనువదించినాడు. ఆ తరువాత అనేక అనువాదాలు జరిగినవి.
 ప్రపంచం లో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా లోని అనేక బాషలలో కురాన్ అనువాదం జరిగింది. అందులో ఒకటైన ఇండోనేషియా బాష లో 1960 దశకం లో అనువదింపబడినది.
విల్లియం షెలబేర్ మలై బాష లోనికి అనువదించినాడు అతని అనువాదం పూర్తి కాకుండానే 1948 లో మరణించినాడు.
ప్రధాన భారతీయ భాషలు:
884 లో సింది బాష లోనికి కురాన్ అనువదింప బడినది కాని నేడు అది అలబ్యం.9వ శతాబ్దం లో కష్మీరి బాషలోనికి అనువదింప బడినది ఉర్దూ కురాన్ అనువాదకులలో అహ్మద్ రెజా ఖాన్ మొదటి వారు. వారు అనువదించిన కన్జుల్ ఇమాన్ బాగా ప్రసిద్ది నొందినది.  పిదప ముహమ్మద్ తాహిర్ ఉల్-ఖాద్రి, అబ్డులా:  ప్రసిద్ద ఉర్దూ  కురాన్ అనువాదకులు.
బంగ్లా బాష లో కురాన్ అనువాదకులలో గిరీష్ చంద్ర సేన్ మొదటి సంపూర్ణ అనువాదకులు.అబ్బాస్ అలీ మొదటి ముస్లిం బంగ్లా కురాన్ సంపూర్ణ అనువాదకులు.
హిందీ, గుజరాతి లోనికి కన్జుల్ ఇమాన్ ఉర్దూ అనువాదం అనువదింప బడి ప్రాముఖ్యత పొందినవి.
కురాన్ తమిళ్ అనువాదకులలో షేక్ ముస్తఫా, బెరువాల శ్రీలంక, అబ్దుల్ హమీద్ భకావి ముఖ్యులు.
తెలుగు లో కురాన్ అనువాదకులు:
1.              1925-చిలుకూరి నారాయణ రావు ఖురాన్ షరీఫ్ మద్రాసు
2.              1941-ముహమ్మదు ఖాసిం ఖాన్ ఖురాన్ షరీఫ్ 9 సూరా హైదరాబాద్
3.              1948-మున్షీ మౌల్విముహమ్మద్ అబ్దుల్ గఫూర్, కురానె మజీద్ కర్నూలు
4.              1980-షేక్ ఇబ్రాహీం నాసిర్ అహమ్మదియ్యా కురాన్ , హైదరాబాద్
5.              1985-హమీదుల్లా షరీఫ్ ,దివ్య ఖుర్ ఆన్ జమాతె ఇస్లామి హింద్ హైదరాబాద్
6.              2004-అబుల్ ఇర్ఫాన్ , ఖురాన్ భావామృతం , హైదరాబాద్
7.              2007-యస్.ఎం.మలిక్ , ఖుర్ ఆన్ అవగాహనం అబుల్ అలా మౌదూదీ
8.              2008-డాక్టర్ అబ్దుల్ రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా,సౌదీ అరేబియా
9.              2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ [2870 పేజీలు] (మౌలానా ముహమ్మద్ జునాగడీ) గారి [అహ్ సనుల్ బయాన్] హైదరాబాదు
10.          2010-అబ్దుల్ జలీల్ ,పవిత్ర ఖుర్ ఆన్ ,దారుల్ ఫుర్ ఖాన్,విజయవాడ.862 పేజీలు. 
11.          2012-      డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ సత్తార్,జియాఉల్ ఖురాన్,
                             (
ఆల్లాహ్ అంతిమఆకాశ  పరిశుద్ద గ్రంధము),విశాఖపట్టణం.1100 పేజీలు.                
12.          2012- ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అల్ ఖురానుల్ మజీద్ ,
                         
మౌలానా హాజీ హాఫిజ్ ఖ్వారీ  ఫహీముద్దీన్   అహ్మద్ సిద్దీఖీ ,హైదరాబాద్ 552 పేజీలు. 
         (2013 'ఖుర్ ఆన్ మజీద్' 695 పేజీలు). 
13.           2013 - ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,దివ్యగ్రంధం ఖుర్ ఆన్ ,మౌలానా వహీదుద్దీన్ ఖాన్, 
  
హైదరాబాదు.640 పేజీలు
ప్రొఫెసర్ సత్య దేవ్ వర్మ సంస్కృతం లో 1984 లో తరువాత రజియా సుల్తాన 2010 లో అనువదించినారు.
ఆధునిక  అంతర్జాతీయ బాష అయిన ఎస్పెరాంటో లో మొదట ఇరాన్ కు చెడిన అల్లామా ముజ్తర్ అబ్బాసి కురాన్ ను అనువదించినాడు.  
ఆఫ్రికన్ బాషలైన స్వాహిలి బాష లో షేక్ అలీ ముహసిన్ అల్ బర్వాని కురాన్ అనువదించినారు. హౌసా బాష లో షేక్ ముహమ్మద్ గుమి కురాన్ అనువదించినారు.
2010 నాటికి కురాన్ 112 బాషల లోనికి అనువదింప బడినది.
ఆధారాలు: 
1. వికీ పిడియా
2. తెలుగు ముస్లిం 


15 April 2016

ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం( ISLAMIC WELFARE STATE) .


సంక్షేమ రాజ్య భావన ఆధునిక కాలం లో  చాలా ప్రజాదరణ పొందింది.  సంక్షేమ రాజ్యo లో ప్రభుత్వం ప్రతి పౌరుడి కి  కనీస ప్రమాణాలు లబించేటట్లు  బాధ్యత వహిస్తుంది.  సాధారణంగా సంక్షేమ రాజ్యం ఈ  క్రింది లక్షణాలను లేదా  వీటిలో కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది.
1. నిరుద్యోగులకు సామాజిక భద్రత కల్పన, ప్రజల ఆరోగ్య సమస్యలు, వృద్దులు, వికలాంగుల సమస్యలు తీర్చడం 
2. ఉచిత లేదా సబ్సిడీ పై విద్య మరియు వైద్య సేవలు కల్పన.
3. అందరు పౌరులకు ఆదాయం మరియు సంపద సమాన పంపిణీ మరియు సరి అయిన పన్నుల విధింపు ద్వారా   సామాజిక న్యాయ సాధన.
4. విద్య మరియు నైపుణ్యాల ప్రాతిపదికన అందరికీ పూర్తి సమయ ఉపాధి కల్పన.
5. ప్రబుత్వ రంగ సంస్థల ఏర్పాటు మరియు సరసమైన రేట్లు, సబ్సిడీ రేట్లపై తక్కువ ఆదాయం ఉన్న సమూహాలకు జివితాసర వస్తువుల అవిరామ సరఫరా.
ఇస్లాం లో సంక్షేమ రాజ్యం  మానవజాతి మొత్తం సంక్షేమానికి  ఉపయోగపడుతుంది. ఇస్లాం లో సంక్షేమ రాజ్యం  భావన ఆర్థిక విలువలకు సంభందించినది కాదు నైతిక ఆధ్యాత్మిక, సామాజిక మరియు రాజకీయ విలువలకు సంభందించినది. ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం పౌరుల సామాజిక, ఆర్థిక సంక్షేమo సాదిస్తుంది. అది ప్రజల సంక్షేమం కోసం సమగ్ర సామాజిక భద్రతా వ్యవస్థను, సామాజిక న్యాయం ను కల్పిస్తుంది. అది ప్రజల ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం పాటుపడటం తో పాటు జీవితం యొక్క అన్ని ప్రాధమిక అవసరాలు తీర్చడం చేస్తుంది. ముస్లింలకు  ఇస్లామిక్ తరహా జీవన వ్యవస్థ నేలకోల్పడం తో బాటు ముస్లిమేతరులకు సంపూర్ణ జీవిత మరియు  మతపరమైన స్వేచ్ఛను  ప్రసాదిస్తుంది.
1. ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం పేద మరియు అవసరం ఉన్నవారి కోసం ఆదాయం పంచుతుంది. పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చడం రాజ్యం  బాధ్యత. ఇస్లాం మతం ముస్లింలు మరియు ముస్లిమేతరుల మధ్య వ్యత్యాసం చూపదు. ఖలీఫా ఉమర్ ఒకసారి ఒక జిమ్మీ(ముస్లిమేతరుడు)  యాచించడం చూసాడు. వెంటనే ఖలీఫా ఉమర్ అతనికి పెన్షన్ మంజూరు చేసి జిజియా పన్ను చెల్లించడం నుండి మినహాయింపు ఇచ్చాడు.  ఇస్లాం యొక్క ప్రసిద్ధ సైనికాధికారి ఖాలీద్ హిరా ముస్లిమేతరుల తో  ఒక ఒప్పందం చేసుకొన్నాడు దాని ప్రకారం సాధారణ, పేద మరియు నిరాశ్రయులైన ముస్లిమేతరులకు  ఆర్థిక సహాయం చేసాడు.
2. ప్రవక్త (స) జీవితం యొక్క కనీస అవసరాలు ఈ విధంగా నిర్వచించినారు. వారి  ప్రకారం  “ఆదం పుత్రుడు నివసించడానికి ఇల్లు, శరీరం కప్పుకోవడానికి బట్ట, కొంత రొట్టె ముక్క మరియు త్రాగటానికి నీరు అవసరం”-తిర్మిజి. ప్రవక్త(స) యొక్క హదీసుల ప్రకారం  మానవుడు జీవించడానికి కనిస అవసరాలు అయిన ఆహారం, నీరు, బట్టలు మరియు ఒక ఇల్లు కావాలి.
3. ఇస్లామిక్ రాజ్యం లో నివసిస్తున్న ప్రతి వ్యక్తి తన జీవిత ప్రాథమిక అవసరాలు పొందగలడు.  ఆ ఆవసరాలను ఆతను స్వయంగా తన కుటుంబం కోసం సేకరించలేక పోతే వాటిని అందించ వలసిన బాద్యత ఇస్లామిక్ రాజ్యం దే. అనేక ఇస్లామిక్  న్యాయ నిపుణుల ఇస్లామిక్ రాజ్యం వ్యక్తి  జీవితం యొక్క ప్రాధమిక అవసరాలు అందించాలి అన్నారు. పేదవారికి, అవసరం ఉన్నవారికి,  జబ్బుపడినవారికి, వికలాంగులకు, ముసలివారికి లేదా నిరుద్యోగ వ్యక్తులకు కనీస జీవన  ప్రామాణాలు ఇవ్వవలసిన బాధ్యత ఇస్లామిక్ రాజ్యం పై ఉందని అన్నారు.
4. ఇస్లామిక్ రాజ్య ఆర్థిక సిద్ధాంతం సామాజిక న్యాయం భావన ఆధారంగా పనిచేస్తుంది. ఇస్లామిక్ రాజ్యం  జీవనోపాధి కొరకు అందరు  పౌరులకు సమాన అవకాశాలు అందిస్తుంది. సామాజిక న్యాయం నెరవేర్చుటకు ముందుగా   ఇస్లాం కొద్దిమంది చేతులలో సంపద కేంద్రికరణను ఖండిస్తోంది రెండవది ఇది సమర్థవంతమైన చర్యల ద్వారా సంపద ను సమానంగా న్యాయం గా పంపిణీ చేస్తుంది.  సంపద కేంద్రికరణను నివారించుటకు చట్టవిరుద్ధoగా  మరియు అన్యాయo గా  సంపాదించుట, వడ్డీ, లంచం, వ్యాపారo లో  అక్రమాలు, తప్పుడు తూకాలు, నిధుల దుర్వినియోగం, దొంగతనం మరియు దోపిడీ, ఆటలలో సంపద పొందటాన్ని నిషేధించినది.
సంపద న్యాయంగా  మరియు  సమానంగా పంపిణీ చేయుటకు  ఇస్లాం జకాత్ మరియు స్వచ్ఛంద దానం ప్రవేశపెట్టినది. వారసత్వం మరియు వీలునామా చట్టాల ద్వారా వసూలయ్యే  పన్నులు ఇస్లామిక్ రాజ్యమే తీసుకుంటుంది. సామాజిక ఆర్థిక న్యాయం నెరవేర్చుటకు, ఇస్లాం పేద బంధువుల హక్కులు, పొరుగువారి  హక్కులు, బానిసలు మరియు పనివారు యొక్క హక్కులు,  బాటసారుల హక్కులను తెలియజేస్తుంది. పై సామాజిక హక్కులను  నెరవేర్చడానికి జకాత్ ధనం సరిపోకపోతే ఇస్లాం అనుసరించే వారు  పేదల అవసరాలను తీర్చ వలసి ఉంటుంది.  ప్రవక్త (స) ఒకని ఆదాయం లో జకాత్ తో పాటు నెరవేర్చవలసిన ఇతర పన్నులు కూడా ఉన్నవి అన్నారు. కాబట్టి ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం పేదల అవసరాలు తీర్చడానికి జకాత్ తో పాటు అదనంగా ఆదాయం కోరుతుంది.
5. ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం బలహీనులను రక్షించడానికి   ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అనేక చర్యలు ఇస్లాం తీసుకోంది. ఇస్లామిక్ రాజ్యం లో వడ్డీ పూర్తిగా రద్దుచేయబడింది. లంచం, జూదం, అనాధల సొమ్ము తినడం  ఊహాజనిత వ్యాపారo, నిధుల దుర్వినియోగం, తూకాలు మరియు కొలతలలో అక్రమాలు,  సంపద అక్రమంగా  ఆక్రమించుకోవటం,  మోసపూరిత వ్యాపార పద్ధతులను ఇస్లామిక్ రాజ్యం  లో  నిషేధించారు. అనాథలు, మహిళలు, బానిసలు మరియు పనివారు, కూలీలు మరియు కార్మికులు, అద్దెదారులు , వినియోగదారులు తదితర బలహీన ప్రజల హక్కులకు  ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం లో పూర్తి రక్షణ ఉంటుంది.
6. ప్రజల సంక్షేమం మరియు ఒక దేశం యొక్క అభివృద్ధిలో విద్య మరియు ఆరోగ్యo చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఒక  సంక్షేమ రాజ్యం   తన సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాదిoచుటలో ఈ రెండు రంగాలను విస్మరించజాలదు. అందువలన విద్య మరియు ఆరోగ్యం ను  ఉచితముగా లేదా  సబ్సిడీ రేట్లకు అందించుట ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం ప్రధాన  విధుల్లో ఒకటి. విద్యపై ఇస్లాం  యొక్క ప్రాధాన్యత నిజానికి ప్రవక్త ముహమ్మద్ (స) వెల్లడించిన దివ్య ఖురాన్ యొక్క మొట్టమొదటి ఆయత్ ఇకారా చదువు నుంచి  అర్ధం చేసుకోవచ్చు. ప్రవక్త(స) ముహమ్మద్ విద్య మరియు జ్ఞానం పొందడం ప్రతి ముస్లిం  స్త్రీ, పురుషుని విధి గా పెర్కొన్నారు. ఇస్లాం ఆరోగ్యంపై కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది.  ఇస్లాం ప్రవక్త అనారోగ్యం పాలైన వారిని దర్శించమని  తన అనుచరులకు ఉపదేశించారు. రోగగ్రస్తులకు  ఆరోగ్య మరియు వైద్య చికిత్స అందించడం   ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం మరో ప్రధాన  విధి.

7. అతి ముఖ్యమైన ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం యొక్క ప్రధాన విధి దాని పౌరులకు  ఆధ్యాత్మిక సంక్షేమo ప్రసాదించుట. ఈ విధిని నిర్వర్తించుటకు గాను  ఇస్లాం  సంక్షేమ రాజ్యం దివ్య ఖుర్ఆన్ మరియు సున్నత్ లో వివరించిన ఉన్న ఇస్లామిక్ ప్రభుత్వ వ్యవస్థ ను స్థాపిస్తుంది. ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం లోని ముస్లిం పౌరులు  ఇస్లాం ధర్మం  యొక్క బోధనలకు  అనుగుణంగా తమ జీవితాలను ప్రారంభించాలి మరియు ముస్లిం-మతేతరులకు(non-Muslims) పూర్తి మతపరమైన స్వేచ్ఛ ఇస్తారు. వారు   ఏటువంటి  పరిమితి లేకుండా తమ  ప్రార్థనా  స్థానాల్లో తమ మతాచారాలను పాటించ వచ్చు. ఇస్లామిక్ రాజ్యం  ఇస్లాం ధర్మం  యొక్క వ్యాప్తి కోసం పని చేయాలి, మానవత్వం యొక్క మోక్షానికి పనిచేయడం ఇస్లాం ధర్మం  లో ఉంది. ఈ బోధన  ఒప్పించడం ద్వారా జరగాలి కాని బలవంతపు చర్యలు లేదా ఒత్తిడి ద్వారా జరగదు  మరియు వాటిని ఇస్లాం  నిషేధించినది.