7 April 2016

పనామా పేపర్స్విదేశీ కంపెనీలు  స్థాపించి తద్వారా పన్నులు ఎగ్గొట్టి లక్షల కోట్ల రూపాయలను అక్రమంగా దాచుకుంటున్న ప్రపంచ ప్రముఖుల వివరాలతో కూడిన రహస్య పత్రాలు పనామా పేపర్స్ పేరుతో వేలుబడినవి. ప్రపంచంలో వందలాది నల్లధనం అక్రమార్కుల బాగోతాలు పనామా పేపర్స్‌ తో బయట పడ్డాయి. అధికార దుర్వినియోగం, అక్రమ లావాదేవీలు, పన్ను ఎగవేతకు పాల్పడి కోట్లకొద్ది ప్రజాధనాన్ని పరాయి దేశాల్లో దాచిపెట్టిన నల్ల కుబేరుల తతంగాన్ని బట్టబయలు చేశాయి. పలువురు ప్రపంచ రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖుల గుట్టు   రట్టైనది.
    
నల్లడబ్బుకు స్వర్గధామమైన పనామాలోని మొసాక్‌ ఫొన్సెకాకు చెందిన కోటి 15 లక్షల పత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. జర్మనీకి చెందిన 'సుడియుషె జీతంగ్‌'పత్రిక, ఇంటర్నేషనల్‌ జర్నలిస్ట్స్‌ కన్సార్టియం (ఐసీఐజే)లు గత 40 ఏళ్ల వ్యవధిలో జరిగిన ఆర్థిక నేరాలకు సంబంధించి దాదాపు కోటి 15 లక్షల రహస్య పత్రాలను వెలికితీసి ప్రపంచానికి తెలియజేసినవి. ఇప్పుడు వెలువరించిన పత్రాల పరిమాణం 2.6టీబీ (టెరాబైట్స్‌). పరిమాణం పరంగా పనామా పేపర్స్-11.5 మిలియన్ పత్రాలు చరిత్రలో అతిపెద్ద అంతర్గత  సమాచారం లీక్  మరియు  వాటి వెల్లడి అత్యంత భారి పేలుడు తో సమానమని కన్సార్టియం వెల్లడించినది. 

గతంలో వెల్లడించిన రహస్య పత్రాలకంటే ఇది ఎన్నో రెట్లు అధికం. వెలికితీసిన  పత్రాల సైజు విషయంలోనూ ఈ కుంభకోణం సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో విడుదలైన ప్రముక లీకుల పరిమాణం చూస్తే
* 2010లో వికీలీక్స్‌ బహిర్గతం చేసిన రహస్య పత్రాల సైజు 1.7 జీబీ
* 2013లో బోగస్‌ సంస్థల గురించి విడుదల చేసిన నివేదిక సైజు 260 జీబీ
* 2014లో లక్సెంబర్గ్‌ పత్రాల లీక్‌ సైజు 4 జీబీ
* 2015లో వెలువరించిన పత్రాల పరిమాణం 3.3జీబీ

భారీ మొత్తంలో లభించిన రహస్య పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే బయటికి విడుదల చేశారట. అందుకు వివిధ దేశాలకు చెందిన 100 మీడియా సంస్థల నుంచి 370 మంది ప్రత్యేక రిపోర్టర్లు పనిచేశారు.
పనామా పేపర్స్ వెల్లడి పై  పలు దేశాల్లో ప్రకంపనలు పుడుతున్నాయి. ICIJ ప్రకారం పనామా పేపర్స్ లీక్ 12 ప్రస్తుత మరియు మాజీ ప్రపంచ నాయకుల - పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యుల తో సహా  మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క సహచరుల, ఐస్-లాండ్ ప్రధాని -ఆఫ్ షోర్ హోల్డింగ్స్ బహిర్గతం చేసినవి.

'పనామా పేపర్స్' ప్రచురించిన ఆఫ్షోర్ (off shore) ఒప్పందాల్లో అనేక మంది ప్రపంచ రాజకీయ నాయకులు ఉన్నారు. పనామా పేపర్స్ ఐస్లాండ్ మరియు పాకిస్తాన్, సౌదీ అరేబియా రాజు మరియు అజర్బైజాన్ అధ్యక్షుడి  పిల్లలు  నియంత్రణలో ఉన్న  విదేశీ కంపెనీలను అవి  బహిర్గతం చేసినవి. అందులో అమెరికా ప్రభుత్వం బ్లాక్ లిస్టు చేసిన కనీసం 33 మంది వ్యక్తుల మరియు సంస్థలు పేర్లు  కుడా ఉన్నాయి. వారు మెక్సికన్ డ్రగ్  లార్డ్స్, హిజ్బుల్లాహ్ లేదా ఉత్తర కొరియా మరియు ఇరాన్ వంటి  రోగ్ దేశాలు మరియు  తీవ్రవాద సంస్థలతో వ్యాపారo చేసిన సాక్ష్యం వెల్లడైంది అని డేటా ప్రచురించిన  ICIJ కనసార్టియం అన్నది.

పనామా పేపర్స్ లో చైనా ప్రెసిడెంట్, పాలిట్ బ్యూరో లోని ఎనిమిది మంది ప్రస్తుత లేదా పూర్వ సబ్యుల కుటుంభ సబ్యుల పేర్లు కుడా చోటు చేసుకొన్నవి. అర్జెంటైనా అద్యక్షుడు అతని తండ్రి సోదరుని పేర్లు ప్రముఖ ఫుట్-బాల్ క్రీడాకారుడు మెస్సి, జాకి చాన్ మరియు  ఉక్రేరియాన్ అధ్యక్షుని పేర్లు ఇందులో కలవు. బ్రిటిష్ ప్రధాని కామరూన్ తండ్రి పేరు కుడా ఈ జాబితా లో చోటు చేసుకోంది.

పనామా పేపర్స్ లో   ఇంగ్లాండ్ యొక్క అత్యంత ప్రసిద్ధి చెందన బంగారు దోపిడీ, బ్రెజిల్ లో నడుస్తున్న రాజకీయ నగదు బదిలీ వ్యవహారం మరియు అంతర్జాతీయ సాకర్ ను  పాలించే FIFA ప్రధాన కుంభకోణాలను  గురించిన వివరాలు ఉన్నాయి.

అంతేకాదు పనామా పేపర్స్  ప్రపంచంలోని 140 ఇతర రాజకీయ నాయుకులు, ప్రజా అధికారులు  దాచిన ఆర్ధిక లావాదేవీల యొక్క వివరాలు  మరియు న్యాయ సంస్థలు  మరియు పెద్ద బ్యాంకులు ఒక గ్లోబల్ పరిశ్రమగా ఆర్ధిక అవకతవకలకు పాల్పడే వారికి ఏవిధంగా సహాయం చేస్తున్నాయి అనేది మరియు మాదక ద్రవ్యాలవిక్రేతలు  అలాగే బిలియనీర్లు మరియు ప్రముఖు క్రీడకారులు , సెలబ్రటిల  రహస్యంగా ఆర్ధిక లావాదేవిల వివరాలు అందిస్తున్నవి.  

మొసాక్ ఫోన్సెకా అనే కంపెనీను రామన్‌పోన్సెకా, జర్మన్ జాతీయుడైన జూర్గెన్ మొసాక్ దీనిని ఉమ్మడిగా ప్రారంభించారు. ఈ తరహా సేవలందించే కంపెనీలు చాలానే ఉన్నప్పటికీ పెద్ద కంపెనీగా దీనికి గుర్తింపు ఉంది. ఫోన్సెకా వ్యవహారాలన్నీ అత్యంత రహస్యం. పనామాలోని వాణిజ్య ప్రాంతంలో ఓ సాదాసీదా భవనం దీని కేంద్ర కార్యాలయం. రహస్య ఖాతాలకు నెలవైన దేశాల్లో దీని కార్యకలాపాలు సాగుతాయి. అన్నిటిపైనా ముసుగు వేయడం ఈ కంపెనీ ప్రత్యేకత.
విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న బడాబాబులకు సంబంధించిన సమాచారం పనామా కేంద్రంగా పనిచేసే న్యాయసేవల సంస్థ మొసాక్ ఫోన్సెకా నుంచి బయటకు పొక్కింది. దీంతో వీటిని పనామా పేపర్స్ అని పిలుస్తున్నారు. 500కు పైగా బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలు ఈ కంపెనీ సేవలను వినియోగించుకున్నాయి. పన్ను ఎగవేయడం, నల్లధనాన్ని నకిలీ కంపెనీల ద్వారా తెల్లధనంగా మార్చుకోవడం, భద్రంగా దాచుకోవడం వంటి విషయాల్లో ఈ న్యాయసంస్థ సేవలు అందిస్తుంది. మౌలికంగా ఇది పనామా కంపెనీ అయినప్పటికీ 42 దేశాల్లో దీనికి శాఖలున్నాయి. ముఖ్యంగా పన్ను ఎగవేతదారులను ఆకర్షించే స్విట్జర్లాండ్, సైప్రస్, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ వంటి దేశాల్లో ఇది తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
మొసాక్ ఫోన్సెకా కంపెనీ డాటాబేస్ నుంచి ఈ సమాచారాన్ని ఆగంతకుడు బయటకు లాగాడు.ఎవరో ఓ లోపలిమనిషి ఈ పత్రాల చెదల పుట్టను పగులగొట్టి ఉంటాడని భావిస్తున్నారు. ఫోన్సెకా సంస్థ సర్వర్‌లో మూలుగుతున్న ఈ పత్రాల గుట్టను ఓ అజ్ఞాతవ్యక్తి జూడాయిచ్ జైటుంగ్ అనే జర్మనీ పత్రికకు అందజేస్తే అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల కన్సార్షియం (ఐసీఐజే) ప్రపంచ వ్యాప్తంగా మీడియాకు వీటిని పంపిణీ చేసింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విదేశీ ఖాతాల్లో డబ్బులు దాచుకున్న పెద్దల పేర్లు వీటిద్వారా బయటకు వచ్చాయి.
 పనామా పేపర్స్  లో అనేక మంది భారతీయులు ఉన్నారు. 2004 లో భారతదేశం  సరళీకృత బదలాయింపు పథకం (Liberalised Remittance Scheme) క్రింద చట్టబద్ధంగా విదేశాలలో ఉన్న సంస్థలలో పెట్టుబడులును పెట్టడానికి మొదట కంపేననీలను ఆ తరువాత వ్యక్తులను అనుమతిoచినది.
భారత్ లో 500 మంది పేర్లను పనామా పేపర్స్ బట్టబయలు చేయగా అందులో అమితాబ్, ఐశ్వర్యారాయ్ పేర్లు ఉన్నాయి. ఇంకా  ఇందులో ఇండియా బుల్స్ అధినేత   సమీర్ గెహ్లాట్, బహామాస్, న్యూజెర్సీ మరియు యునైటెడ్ కింగ్డమ్ లో ఆస్తులు కలిగి ఉన్న౦దుకు మరియు డిఎల్ఎఫ్ కు చెందిన కే.పీ. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో నమోదు అయిన కంపనిల గురించి, వినోద్ అదానీ పారిశ్రామికవేత్త గౌతం అదానీ యొక్క అన్నయ్య, లోక్  సత్తా పార్టీ అనురాగ్ కేజ్రీవాల్,  పశ్చిమబెంగాల్, రాజకీయ వేత్త శిశిర్ బజోరియా కూడా పన్నురహిత స్వర్గాలైన(tax heavens) ప్రాంతాలలో   కంపెనీలు ఏర్పాటు చేసారని ఈ పేపర్స్ ద్వారా వెల్లడైనది. గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఇక్బాల్ మిర్చి కుటుంభ సబ్యులు సైప్రస్,టర్కీ,మొరాకో, స్పెయిన్ లో ఆఫ్-షోర్ రూట్ ద్వార ఆస్తులు కొన్నారని వెల్లడైనది.

ఇండియన్ ఎక్ష్ప్రెస్స్(express) పత్రిక మరియు అనేక ప్రపంచ వార్తాపత్రికలు  దాదాపు ఎనిమిది నెలల పాటు పరిశోధనలు జరిపినారు.  ఇండియన్  ఎక్స్ప్రెస్ పత్రిక సంప్రదించిన అనేక మంది  వ్యక్తులు ఈ నివేదికను కొట్టివెయగా  ఇతరులు   దేశంలోని చట్టాలకు లోబడి   పని చేసినట్టు  చెప్పారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పనామా కంపెనీల్లో డైరెక్టర్లని పనామా పేపర్స్ పేర్కొనగా దానిపై స్పందించిన అమితాబ్ తన పేరు తప్పుగా ఉదహరింప బడినది(misused) అని పేర్కొనగా, ఐశ్వర్య రాయ్ మీడియా సలహాదారు సమాచారాన్ని అసత్యమని చెప్పారు.
తొలి జాబితాలో పలువురు దేశాధినేతలు, మాజీ ప్రధానులు, సెలబ్రిటీల పేర్లు వెల్లడి కాగా, వారిలో అత్యధికులు తమకు నల్లధనంతో సంబంధం లేదని వ్యాఖ్యానించినారు.
ప్రపంచ దేశాల్లో కలకలం రేపిన 'పనామా పేపర్స్' మలి జాబితా కుడా విడుదలైంది. 'పనామా పేపర్స్' మలి జాబితా లో ఉన్న భారతీయుల్లో మాజీ క్రికెటర్ అశోక్ మల్హోత్రా, క్రాంప్టన్ గ్రీవ్స్ చైర్మన్ గౌతమ్ థాపర్, కరణ్ థాపర్ మొహ్రాసన్స్ జ్యూయెలర్స్ అధినేత అశ్వనీ కుమార్ గౌతమ్ సీంగల్, మధ్యప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ప్రకాశ్ సంఖ్లా, పుణెలోని సవా హెల్త్‌కేర్‌ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న వినోద్‌ రామచంద్ర జాదవ్, రంజీవ్‌ దహుజా, కపిల్‌ సైన్‌ గోయల్‌‌, వివేక్ జైన్‌, సతీష్ గోవింద్ సంతని, విశాల బహదూర్, హరీష్ మొహనాని తదితరుల పేర్లున్నాయి.

నల్లధన కుబేరుల 3వ జాబితాలో గతం లో రాడియా టేప్స్ తో ప్రసిద్ది చెందిన నీరా రాడియా  హైదరాబాద్ కు మోటూరి శ్రీనివాస ప్రసాద్‌, వోలం భాస్కరరావు, భావనాశి జయకుమార్‌ పేర్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

పనామా పేపర్స్ జాబితాలో తాజాగా బాలీవుడ్ జంట హీరో సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పేర్లు దర్సనం ఇవ్వడం మరో సంచలనానికి దారితీసింది. వీరితోపాటు, కరీనా సోదరి కరిష్మా కపూర్పారిశ్రామికవేత్త, వీడియో కాన్ వేణుగోపాల్ ధూత్‌కు చెందిన సంస్థలు, పుణే కు చెందిన రియల్లర్ చోర్దియా కుటుంబం ఓ విదేశీ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. ఈ జాబితాలో మరో పది పేర్లు దర్శనమిచ్చాయి. ఢిల్లీకి చెందిన టైర్ డీలర్, ఒక దుకాణం యజమాని, ఒక ఆస్ట్రేలియన్ గని బిలియనీర్ కుమార్తె, ఒక వస్త్రాల ఎగుమతిదారుడు, ఇంజనీరింగ్ కంపెనీ యజమాని, లోహాలు సంస్థ డైరెక్టర్లుఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నారు.
పనామా పత్రాలపై ప్రముఖుల స్పందన:
ఫ్రాంస్ అద్యక్షుడు హోలండే:
ప్రపంచంలోనే అతిపెద్ద స్కాంగా వెలుగులోకి వచ్చిన పనామా పేపర్స్ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే స్పందించారు. పనామా పేపర్స్ ఘటనపై తమ ప్రభుత్వం తప్పక దర్యాప్తును ముమ్మరం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కేసులో చట్టపరమైన విచారణను చేపడతామని వెల్లడించారు. ఇంత పెద్ద కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన వారికి ఈ సందర్భంగా హోలాండే కృతజ్ఞతలు తెలిపారు. పన్ను ఎగవేతదారులకు రక్షణ కల్పించే దేశాల జాబితాలో పనామాను మళ్లీ చేర్చక తప్పదని ఫ్రాన్స్ ప్రకటించింది. 
పనామా పేపర్స్' పై స్పందించిన అరుణ్ జైట్లీ
నల్లధనం కుబేరుల వివరాలను వెల్లడిచేసిన పనామా పేపర్స్ పై   ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  ఈ వ్యవహారంపై దర్యాప్తు  జరిపించాల్సింది  కోరారని తెలిపారు.  
అక్రమ ఖాతాదారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదని , కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఈ కేసులను  పర్యవేక్షించేందుకు మల్టీ ఏజెన్సీ గ్రూప్ ను    రూపిందించనట్టు ఆర్ధిక  మంత్రి తెలిపారు. ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), ఫైనాన్షియల్ ఇటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) వంటి విభాగాలు ఇందులో ఉంటాయని వివరించారు. ఆర్బీఐకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ఇది పనిచేస్తుందన్నారు.
RBI గవర్నర్ రఘురామ్ రాజన్:  ప్రతి భారతీయుడు చట్టబద్ధంగా ఒక సంవత్సరం కాల వ్యవధిలో సుమారు రూ.1.60 కోట్లు విదేశాలకు పంపించవచ్చని రఘురామ్ రాజన్ చెప్పారు. పనామా పేపర్స్ నేపథ్యంలోఅది వెల్లడించిన 500 మందిలో ఎందరు చట్టవిరుద్ధంగా నియమిత మొత్తాలకు మించిన పెట్టుబడులు పెట్టానే విషయమై విచారణలే తేలుతుందన్నారు. పనామా జాబితాపై తొందరపాటు తగదని రిజర్వ్‌ బ్యాంక్ అధికారులు హెచ్చరించారు
'పనామా పేపర్స్' పైన లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. విదేశీ రహస్య ఖాతాల్లో భారతీయులకు 700 బిలియన్‌ డాలర్ల పై చిలుకు డబ్బు ఉందని, పనామాలోని మొసాక్‌ ఫొన్సెకా నుంచి ఇప్పుడు బయటపడ్డ బ్లాక్ మనీ కేవలం కొద్దిగా మాత్రమేనని అన్నారు. ఇక మీద దేశం నుంచి డబ్బు చట్ట విరుద్ధంగా బయటికి పోకుండా ఉండాలన్నారు. విదేశాలలో మూలుగుతున్న 700 బిలియన్‌ డాలర్ల బ్లాక్ మనీతో పాటు మన దేశంలో 20 వేల టన్నుల బంగారం రూపంలో ధనం వృథాగా పడి ఉందని చెప్పారు. 
పాకిస్తాన్ లో అయితే, నవాజ్ షరీఫ్ కుమారుడు హుస్సేన్ దేశం యొక్క అతిపెద్ద ప్రైవేటు ప్రసారకులు జియో టి.వి. తో మాట్లాడుతూ తన కుటుంబం తప్పూ చేయలేదని చెప్పారు. ప్రధాని నవాజ్ షరీఫ్ పనామా పేపర్స్ వెల్లడించిన విషయాలపై విచారించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసారు.
కాని ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ షరిఫ్ విదేశాలలో దాచుకొన్న దానం బహిర్గతం అయినది అతని పై చర్య తీసుకోవాలన్నారు.
రష్యా అద్యక్షుడు పుతిన్‌లాంటి కొందరి పేర్లన్లు ఈ జాబితాలో నేరుగా ప్రస్తావించలేదు. ఆయన అనుచరులు రహస్యంగా 200 కోట్ల అమెరికా డాలర్లను విదేశీ ఖాతాలకు తరలించారని పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు బూటకపు కంపెనీలను వినియోగించారని తెలుస్తున్నది. రష్యాలో ప్రభుత్వ రంగ మీడియా సంస్థలు అంశంపై మౌనంగా ఉన్నాయి. పుతిన్ పరిపాలనను, రష్యా ను అస్థిరం చేయడానికి పన్నిన పన్నాగం గా పుతిన్ సమర్ధకులు దీనిని పేర్కొన్నారు.

చైనా పేపర్స్ దీనిపై స్పందించ లేదు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కుటుంబ సభ్యులకు కూడా విదేశీ ఖాతాలతో సంబంధం ఉన్నట్టు బయటపడింది.సోషల్ మీడియా పై సెన్సార్ విధించారు. ప్రబుత్వ వార్త సాధనాలు పనామా పేపర్స్  లీక్ నాన్-వెస్ట్ దేశాల నాయకుల పై వెస్ట్ దేశాల పేపర్స్ సాగిస్తున్న విచక్షణ తో కూడిన అసత్య ప్రచారం  అని పేర్కొన్నాయి.

సిరియా అధ్యక్షుడు అసాద్ యొక్క  ఇద్దరు కజిన్స్, ఈజిప్ట్ మాజీ అద్యక్షుడు హోశ్ని ముబారక్ కుమారుని పేరు మరియు లిబియా కల్నల్ గడాఫీ పేరు ఇందులో ఉంది.

ఉక్రెయిన్ అద్యక్షుడు చట్టపరంగా తానూ ఎలాంటి తప్పు చేయలేదని అన్నాడు.

వైట్ హౌస్ పనామా పేపర్స్ పై స్పందిస్తూ  అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలలో పారదర్సకత (ransparency) ఉండాలని పేర్కొన్నది.అంతకు మించి వ్యాఖ్యానించడానికి నిరాకరించినది. అద్యక్షుడు ఒబామా ట్యాక్స్ ఎగవేత ప్రధాన సమస్య అని కాంగ్రెస్స్ అమెరికన్ కంపెనీలు ట్యాక్స్ ఎగవేయకుండా చర్యలు గైకోనాలని కోరినాడు. 

ఐస్-లాండ్ ప్రధాని రాజీనామా చేసినాడు.

బ్రిటన్ లో ప్రధాని కామెరూన్ పై వత్తిడి అధికమైనది,ప్రతిపక్ష లేబరు  పార్టీ టాక్స్ హేవెంస్ (tax heavns) ను నియంత్రిచమని అధిక ధనవంతులు  పాల్పడుతున్న టాక్స్ఎగవేతను అరికట్టమని కోరినది.

మోస్సాక్ ఫోన్సెకా సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన క్లైంట్స్ కోసం 240000 ఆఫ్-షోర్ కంపనీస్ ఏర్పాటు చేసింది. తన 40 ఏళ్ల చరిత్ర లో ఎప్పుడు దాని ఆర్ధిక లావాదేవిల మీద విచారణ జరగలేదని పేర్కొన్నది. మోస్సాక్ ఫోన్సెకా సంస్థ తానూ ఎలాంటి  తప్పుచేయలేదు అని పేర్కొన్నది.

న్యాయవాద సంస్థ ఫోన్సెకా ప్రతినిధులు మాత్రం ఈ లీకులపై మండిపడుతున్నారు. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన రామన్ ఫోన్సెకా ఇలా పత్రాలను లీకు చేయడం నేరమని, ఇది చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. కంపెనీలను ఆకర్షించడంలో పనామాకు గల పెద్దపేరును చూసి కొన్నిదేశాలు ఓర్వలేకపోతున్నాయని ఫోన్సెకా అన్నారు. సంస్థ అద్యక్షుడు రామన్ ఫోన్సెకా  తమ డేటా బేస్ హాకింగ్ కు గురి అయినదని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి పనామా  దేశ అటార్నీ జనరల్ దగ్గర ఫిర్యాదు నమోదు చేశారు. పనామా పేపర్స్ లీక్ ప్రైవసీ మీదా దాడి గా, పనామా ప్రభుత్వం పై జరిపిన దాడిగా  పేర్కొన్నారు.

పనామా దేశ ప్రబుత్వం తమ భూభాగంపై లోపాయికారీ ఒప్పందాలను ఎంతమాత్రం సమర్థించమని, చట్టపరమైన దర్యాప్తుల్లో పూర్తి సహకారం అందిస్తామని పనామా ప్రభుత్వం ప్రకటించింది. ఆఫ్‌షోర్ కంపెనీల పారదర్శకతను పెంచేందుకు పనామా ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుంది. ఆర్థిక నేరాలపై విచారణ చేపట్టేందుకు ఆయా దేశాలతో పనామా పనిచేస్తుందని ఆ దేశాధ్యక్షుడు జువాన్ కార్లోస్ వరేలా స్పష్టం చేశారు. పనామా పత్రాల అంశాన్ని పరిశీలించేందుకు వ్యక్తిగత కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కార్లోస్ స్పష్టం చేశారు. ఆ దేశ విదేశాంగ శాఖ ఆ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. అందులో స్వదేశీ, విదేశీ నిపుణులు సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆఫ్‌షోర్ కంపెనీల పనితీరును కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఆర్థిక, న్యాయ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు కమిటీ నియమావళిని సూచిస్తుందన్నారు. సంపన్న దేశాల మీడియా సంస్థలు తమ దేశంపై దాడి చేస్తున్నాయని కార్లోస్ అభిప్రాయపడ్డారు.

గుట్టుగా సాగే నకిలీ వ్యాపారాలకు పనామా పట్టుగొమ్మగా మారిందంటూ 34 దేశాల ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) చేసిన తీవ్ర ఆరోపణలను పనామా ఖండించింది. తనమీద అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారంటూ పనామా నిరసన తెలిపింది

మరోవైపు పలు దేశాలు ఫ్రాన్స్, న్యుజిలాండ్, ఆస్ట్రియా, స్వీడన్, నేదర్లండ్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా,   అమెరికా దేశాలు  ఈ ఆరోపణలపై స్వీయ విచారణలకు ఆదేశాలు జారీ చేశాయి.,.  

. 
No comments:

Post a Comment