ట్యూషన్ ను ఆంగ్లం లో షాడో ఎడ్యుకేషన్ (చాయా చదువు) అని
పిలుస్తారు.
2007-08 లో భారత దేశం లో ప్రేవేట్ ట్యూషన్ వ్యాపారం
సంవత్సరానికి $6.4 బిలియన్లు ఉంది మరియు వచ్చే నాలుగు సంవత్సరాలలో దాని పెరుగుదల
సంవత్సరానికి 15% ఉంటుంది. భారత దేశo లో దారిద్య రేఖ పరిమితి(poverty line) పట్టణాలలో 965రూపాయలుగా,
పల్లె ప్రాంతాలలో 781 రూపాయలుగా ఉంది. భారత దేశం లోని గ్రామీణ మరియు పట్టణ
విద్యార్ధులు సాలిన తలసరి 1456 రూపాయలనుంచి 2349 రూపాయల వరకు ప్రేవేట్ ట్యూషన్ పై
ఖర్చు పెడుతున్నారు.(NSSO సర్వే)
ADB
రిపోర్ట్ ప్రకారం ప్రాధమిక స్థాయి
విద్యార్ధులు 63% మరియు హై-స్కూల్ విద్యార్ధులు 83% విద్యార్ధులు భారత దేశం లో
ప్రైవేట్ ట్యూషన్ కు హాజరు అగుచున్నారు.
NSSO సర్వే ప్రకారం స్కూల్ దశను దాటి జాతీయ స్థాయి లో 20%
గ్రాడ్యుయేట్ విద్యార్ధులు మరియు 13% పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్ధులు ప్రవేట్
ట్యూషన్స్ కు హాజరు అవుతున్నారు.
.దాదాపు భారత దేశం లోని అన్ని రాష్ట్రాలలో
ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలలో ప్రవేట్ ట్యూషన్ వ్యాపారం బాగా సాగు తున్నది. NSSO సర్వే ప్రకారం త్రిపుర లో 81% మంది విద్యార్ధులు మరియు
వెస్ట్ బెంగాల్ లో 78% విద్యార్ధులు (స్కూల్ విద్య మరియు కాలేజి విద్య) ట్యూషన్
తీసుకొంటున్నారు భారత దేశం లోని ప్రతి నలుగురు విద్యార్ధులలో ఒకడు ట్యూషన్
కు హాజరు అవుతున్నాడు మరియు కొన్ని రాష్ట్రాలలో ప్రతి నలుగురు విద్యార్ధులలో ముగ్గురు
లేదా 75% మంది NSSO సర్వే ప్రకారం ట్యుషన్ కు హాజరు అగుచున్నారు. వ్యక్తిగతంగా
లేదా సమూహంగా, లేదా ఇంటివద్ద లేక వేరొక స్థలం లో ట్యూషన్ కు హాజరవుట అలవాటుగా
మారింది. స్కూల్ మరియు కాలేజి లలో విద్యా ప్రమాణాల క్షిణత కు ఇది అద్దం పడుతుంది.
వెస్ట్ బెంగాల్ లో 89% మంది సెకండరి మరియు
హయ్యర్ సెకండరి విద్యార్ధులు – బాలురు ప్రేవేట్ ట్యూషన్ కు హాజరు అగుచున్నారు. ఇది
జాతీయ స్థాయి లో 37.8% గా ఉంది. త్రిపుర లో 87%, బీహార్ లో 67.2%, ఒరిస్సా లో
63.4% గా ఉంది. ప్రైమరీ స్థాయి లో త్రిపుర లో 78.3%, వెస్ట్ బెంగాల్ లో 71.1%,
దామన్ మరియు దియు లో 58.8%,చండీగర్ లో 49.4%, బీహార్ లో 46.8% మరియు ఒరిస్సా లో
45% మంది విద్యార్ధులు ప్రేవేట్ ట్యూషన్
తీసుకొంటున్నారు.
NSSO
సర్వే ప్రకారం డిల్లి లో 32.2% బాలురు మరియు బాలికలు 36.6% మంది ప్రైమరీ స్థాయి లో
ట్యూషన్ కు హాజరు అగుచున్నారు.
భారత దేశం లో గత కొద్ది సంవత్సరాలుగా స్కూల్,కాలేజి రంగంలో
విద్య ప్రమాణాలు క్షిణించడం తో ప్రేవేట్ ట్యూషన్ వ్యాపారం బాగా అభివృద్ధి
చెందినది. తల్లి తండ్రులు తమ పిల్లలకు చదువుతో బాటు ట్యూషన్ ఉంటె బాగా రాణిస్తారని
పోటి పరిక్షలలో ఉత్తిర్నత సాధించుతారని విశ్వసిస్తున్నారు.
నోబుల్ గ్రహీత అమర్త్య సేన్ ప్రకారం ప్రైవేట్ ట్యూషన్
పెరుగు తున్న ఆదాయాల పలితం మరియు తప్పినిసరి అనే భావన పలితంగా అభివృద్ధి
చెందుతుంది. టీచర్ల సెలవలు, నిర్ణిత సమయం లో సిలబస్ పూర్తి చేయక పోవటం వలన
ప్రైవేట్ ట్యూషన్స పెరుగు తున్నవి.ప్రాధమిక
స్థాయి రెగ్యులర్ క్లాసులలో చెప్పక పోవటం వలననే ప్రైవేట్ ట్యూషన్లు పెరుగుతున్నవి.
78%
పేరెంట్స్ ట్యూషన్ అనివార్యమని
బావిస్తున్నారు. 54% మంది ట్యూషన్ ఖర్చులు భరించ లేక తమ పిల్లలను ట్యూషన్
కు పంపుట లేదు.
కాని
యు.పి. లో ట్యూషన్ పై ఆధారం చాల తక్కువ. ప్రైమరీ లెవెల్ లో బాలురు 12.2% ట్యూషన్
కి హాజరు అవుతున్నారు. జాతీయ స్థాయి లో అది 23.1% ఉంది. అప్పర్ ప్రైమరీ స్థాయి లో 13.7%
బాలురు లో ఉండగా జాతీయ స్థాయి లో అది 28% ఉంది. యు.పి. లో గ్రాడ్యుయేట్ స్థాయి లో
15.8% మరియు పోస్ట్-గ్రాడ్యుయేట్ స్థాయి లో 9.5% మంది ట్యూషన్ కు హాజరు
అగుచున్నారు. అది జాతీయ స్థాయి లో వరుసగా 20.3% మరియు 13% ఉంది.
ట్యూషన్ సమస్య ఒక్క ఇండియా కే పరిమితం కాలేదు. ఒక
రీసెర్చ్ పేపర్ ప్రకారం అనేక అభివృద్ధి
చెందిన దేశాలలో ఉదా: మిడిల్ స్కూల్ పూర్తి అయ్యేటప్పటికి 70% జపాన్ విద్యార్ధులు
మరియు సీనియర్ సెకండరీ స్థాయి దాటేటప్పటికి మలేషియా లో 83% విద్యార్ధులు ట్యూషన్
కి హాజరు అగుచున్నారు. సౌత్ కొరియా లో 83.1% ప్రైమరీ విద్యార్ధులు, 92.8% మిడిల్ స్కూల్
విద్యార్ధులు, 87.8% హై-స్కూల్ విద్యార్ధులు ప్రైవేట్ ట్యూషన్ కు హాజరు
అగుచున్నారు.
గ్రామీణ భారత స్కూల్స్ లో కొత్త ఎన్రోల్మెంట్ లో దాదాపు 25%
మంది ప్రైవేట్ స్కూల్స్ లో జేరుతున్నారు.
ప్రాధమిక
స్థాయి లో ప్రవేట్ ట్యూషన్స్ ఎక్కువ అయినది.
రైట్ టూ ఎడ్యుకేషన్ మరియు సర్వ శిక్ష అభియాన్ విస్తృతంగా అమలు అవుతున్నప్పటికి భారత దేశం లోని 99% పల్లెలలో
కొత్తగా స్కూల్ లో చేరేవారిలో 25% ప్రేవేట్ స్కూళ్ళ లలో జేరుతున్నారు.ASER
రిపోర్ట్ ప్రకారం 6-14 సంవత్సరాల మద్య వయస్సు గల పిల్లలలో 29% మంది ప్రైవేట్
స్కూళ్ళ లలో జేరుతున్నారు. ఇది 2006-13 మద్య 13% పెరుగుదల గా ఉంది. ఈ పెరుగుదలకు
ప్రధాన కారణం ప్రైవేట్ స్కూళ్ళ పై పేరెంట్స్ కు మంచి అభిప్రాయం ఉండుటయే అన్నది
వాస్తవం.
ప్రేవేట్
ట్యూషన్ అభివృద్ది చెందటానికి ప్రబుత్వ
స్కూల్స్ లో విద్యా క్వాలిటీ సరిగా లేకపోవడమే కారణం కాదు. ఉదా: కేరళలో ఎలిమెంటరీ
విద్యార్ధులలో 68.6% మంది ప్రైవేట్ స్కూల్స్ లో మరియు త్రిపురా లో 70% మంది
ప్రేవేట్ స్కూల్స్ లో ఎన్రోల్ అయినారు. ఎలిమెంటరీ విద్యార్ధులలో పుదుచేర్రి లో
53.3% మంది, హర్యానా లో 51.4% మంది, యు.పి. లో 49% మంది, పంజాబ్ లో 46.7%, జే.కే.
లో 45.5%, మేఘాలయా లో 45.3% ప్రేవేట్ స్కూల్స్ లో ఉన్నారు. అదేవిధం గా ప్రేవేట్
స్కూల్స్ లో ప్రవేట్ ట్యూషన్ కు పోయేవారి సంఖ్య 24.1% కు పెరిగింది.
దీనితో
ప్లానింగ్ కమిషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధమిక విద్య పై వ్యయం విషయం లో
పునరాలోచన చేయవలసిన అవసరం ఉంది. మొదటి తరం పిల్లలు ఎక్కువగా చేరటం వలన లెర్నింగ్
ప్రమాణాలు ప్రబుత్వ పాఠశాల లలో ఇంకా ఒక దశాబ్దం వరకు తక్కువుగా ఉండవచ్చు.
ఎలిమెంటరి పిల్లలలో చదేవే శక్తీ, బేసిక్
మ్యాథ్ ను నేర్చుకొనే శక్తీ ప్రేవేట్ స్కూల్స్ ద్వారా 38.8% నుంచి 40.2% కు
పెరుగుట గమనించాల్సిన విషయం.
ప్రేవేట్ ట్యుషన్ పెరుగుదలకు పట్టనికరణ పెరుగుట, ఆదాయాలు
పెరుగుట, బయట ప్రపంచం గురించి వివరాలు తెలుయుట
కారణాలుగా చెప్పవచ్చును. అదేవిధం గా ప్రచార సాధనల ద్వార తెలియని విషయాలు
తెలియుట మరియు విద్యా పరిస్థితుల పై పట్టణాల ప్రభావం పల్లెలపై ఉండుట కుడా చెప్పవచ్చును.
No comments:
Post a Comment