13 April 2016

భారతీయ ఉన్నత విద్య వ్యవస్థ గురించి కొన్ని విశేషాలు- ఇండియా ర్యాంకింగ్స్ 2016.(India Rankings 2016)





భారత దేశం లో ప్రతి తొమ్మిది మంది   పిల్లలలో ఒకరు స్కూల్ చదువు పూర్తి చేసి కళాశాల లో చేరతున్నాడు.
అమెరికా తో పోలిస్తే ఇండియా లో  భారతదేశం లో ఉన్నత విద్యా రంగం లో ఎన్రోల్మెంట్ శాతం చాలా తక్కువ అది 11% గా  ఉంది.
 • ఒక సర్వే ప్రకారం భారత దేశం లో ప్రతి పది మంది మానవీయ శాస్త్రాల(Arts) డిగ్రీ విద్యార్ధులలో ఒకరు మరియు ప్రతి నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధుల లో  ఒకరు  మాత్రమే ఉద్యోగం  కలిగి ఉన్నారు.
  ఉన్నత విద్య సంస్థలలో అద్యాపకుల  డ్రాప్-అవుట్ రేట్(మద్య లో వైదోలిగే వారు) చాలా అధికం మరియు  IIT ల వంటి విద్య సంస్థలలో 'ఆచార్యుల’    డ్రాప్-అవుట్ రేట్   20-30% వరకు ఉంది.
అక్రిడిటేషన్ కౌన్సిల్ మరియు నేషనల్ అసెస్మెంట్(NAAC-నాక్) నిర్వహించిన  సర్వే 70% ప్రకారం 70% విశ్వవిద్యాలయాలు మరియు 90% కళాశాలలు తక్కువ విద్యా ప్రమాణాలు కలిగి ఉన్నాయి.
దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు ఐదేళ్లలో కనీసం ఒకసారి వారి జాతీయ విద్యాప్రణాళిక (national curriculum) ను సవరించు తున్నాయి.
భారతదేశం లో ప్రభుత్వం అధికారం మరియు పెరుగుతున్నఇతర ఏజన్సీల నియంత్రణ విద్యా వ్యవస్థ యొక్క ప్రమాణాలను తగ్గించింది మరియు అవినీతి కి దారితీసింది.
ఇటువంటి పరిస్థితులలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తొలిసారిగా దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ కళాశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది. నాలుగు క్యాటగిరీల్లో టాప్ 100 జాబితాతో ఇండియా ర్యాంకింగ్స్-2016 విడుదల చేసింది.
ఇప్పటివరకు దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకింగ్ విధానం లేదని తొలిసారిగా ప్రకటించడం ద్వారా వివిధ కోర్సుల్లో చేరడానికి విద్యార్థులకు విద్యాసంస్థ అయితే బాగుంటుందనే దానిపై అవగాహన ఉంటుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ తెలిపారు.
దేశంలోని మొత్తం 3600 ఉన్నత విద్యా సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించామని, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ సంస్థ ర్యాంకుల ప్రక్రియలో చురుకైన పాత్ర పోషించిందని తెలిపారు. విద్యా సంస్థల్లో బోధన/అభ్యాసంపరిశోధన, వృత్తిపరమైన (ప్రొఫెషనల్) ప్రావీణ్యత, ఎక్కువ సంఖ్యలో పట్టభద్రులు ఉత్తీర్ణులు కావడం, ఉపాధి అవకాశాలు (ప్లేస్మెంట్స్) లభించడం, సమాజంలో విద్యా సంస్థపై ఉన్న సాధారణ అభిప్రాయం.. ఇలా ఆరు అంశాల్లో ఆయా విద్యా సంస్థలకు లభించిన మార్కుల శాతాన్ని బట్టి ర్యాంకులను ప్రకటించామని తెలిపారు.
ర్యాంకింగ్లో వెనకబడిపోయిన విద్యా సంస్థలు ఇప్పుడు వచ్చిన ర్యాంకులను స్ఫూర్తిగా తీసుకుని ఆరోగ్యకరమైన పోటీ ద్వారా భవిష్యత్తులో మెరుగైన స్థానాన్ని పొందడానికి వీలు కలుగుతుందన్నారు. ఇదే తొలిసారి అయినప్పటికీ ఇకపై ప్రతి సంవత్సరం ర్యాంకులను ప్రకటిస్తామని, తద్వారా ఆయా విద్యా సంస్థలు పనితీరును మెరుగుపర్చుకోవడంతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్పష్టత ఏర్పడుతుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా మన విద్యా సంస్థల ర్యాంకులను బట్టి గుర్తింపు లభిస్తుందని అన్నారు. 

టాప్ 10 ఇండియా ర్యాంకింగ్స్ 2016 లిస్ట్
ర్యాంక్
యూనివర్సిటి
ఇంజినీరింగ్
మ్యానేజ్మెంట్
ఫార్మసి
1.      
ఇండియన్ ఇనిస్తిత్యుట్ అఫ్ సైన్సెస్, బెంగలూరు
ఐఐటీ మద్రాస్.                            
 ఐఐఎం బెంగళూరు ,
కర్ణాటక
మణిపాల్ కాలేజ్ అఫ్ ఫార్మాసుటికల్స్,మణిపాల్ 
2.
ఇనిస్తిత్యుట్ అఫ్ కెమికల్ టెక్నోలజి, బొంబాయి
ఐఐటీ బాంబే                        
ఐఐఎం అహ్మదాబాద్
యునివేర్సితి ఇనిస్తిత్యుత్ అఫ్ ఫార్మాసుటికల్స్,చండీగర్ 
౩.
జే.ఎన్.యు. న్యూడిల్లి
ఐఐటీ ఖర్గపూర్                         
ఐఐఎం
కలకత్తా
జామియా హందర్డ్ , డిల్లి.
4
యునివేర్సితి అఫ్ హైదరాబాద్
ఐఐటీ ఢిల్లీ                                
ఐఐఎం
లక్నో
పూనా కాలేజ్ అఫ్ ఫార్మసి, పూణే
5
తేజపూర్ యునివేర్సితి, అస్సాం
ఐఐటీ కాన్పూర్                         
ఐఐఎం ఉదయ్‌పూర్, రాజస్తాన్
ఇనిస్తిత్యుత్ అఫ్ ఫార్మసి నిర్మా యునివేర్సితి, అహ్మదాబాద్.
6
యూనివెర్సిటి అఫ్ డిల్లి, డిల్లి.
ఐఐటీ రూర్కీ                             
ఐఐఎం
కోజికోడ్
కేరళ
బొంబాయి కాలేజ్ అఫ్ ఫార్మసి బొంబాయి
7
బి.హెచ్.యు.వారణాసి
ఐఐటీ హైదరాబాద్                      
ఇంటర్ నేషనల్ ఇనిస్తిత్యుత్ అఫ్ మ్యానేజ్మేంట న్యూ డిల్లి.
బిట్స్, రాంచి
8
ఇండియన్ ఇనిస్తిత్యుత్ అఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నా నాలజి
ఐఐటీ గాంధీనగర్, గుజరాత్
ఇండియన్ ఇనిస్తిత్యుత్ అఫ్ ఫారెస్ట్ మ్యానేజ్మెంట్ ఇండోర్
అమ్రిత స్కూల్ ఫార్మసీ కొచ్చి, కేరళ
9
బిట్స్ పిలాని
ఐఐటీ రొపౌర్ పంజాబ్
ఐఐటీ కాన్పూర్
జేఎస్ఎస్. కాలేజీ అఫ్ ఫార్మసి ఉదకమంద్, తమిళనాడు.
10
ఆలీగర్ ముస్లిం యూనివెర్సిటి, ఆలీగర్
ఐఐటీ పట్నా              


ఐఐఎం ఇండోర్
జేఎస్ఎస్. కాలేజీ అఫ్ ఫార్మసి, మైసూరు

అర్చిటేక్చర్ రంగం లో కాలేజి లు ఆసక్తి చూపనందున వాటికి ర్యాంకులు  ఇవ్వలేదు. వర్సిటీలు, ఇంజినీరింగ్ విభాగాల్లో టాప్-100 స్థానాలను, మేనేజ్‌మెంట్, ఫార్మా విద్యా సంస్థల్లో టాప్-50 విద్యాసంస్థల ర్యాంకులను హెచ్‌ఆర్‌డీ శాఖ ప్రకటించింది

టాప్ ర్యాంకులన్నీ ఐఐటీలవే
 
ఇంజనీరింగ్ విభాగంలో ఒకటి నుంచి 12వ ర్యాంకు దాకా ఐఐటీలే సాధించాయి. మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వ రంగంలోని ఐఐఎంలే తొలి పది ర్యాంకులనూ కైవసం చేసుకున్నాయి.

ఉభయ తెలుగు రాష్ట్రాల లోని విద్య సంస్థల ర్యాంకింగ్:
మొత్తం 16సంస్థలకు ర్యాంకింగ్స్2016 లో చోటు లబించినది.
విశ్వవిద్యాలయాల కేటగిరీలో వంద యూనివర్సిటీల జాబితా లో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు విశ్వవిద్యాలయాలకే ఈ జాబితాలో స్థానం లభించింది. ఇందులో మూడు తెలంగాణకు, మూడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఉన్నాయి.
తెలంగాణా:యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకి నాలుగో స్థానం, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ వరుసగా 23, 33వ స్థానాలు దక్కించుకొన్నాయి

ఇంజినీరింగ్ విభాగం :
ఐఐటి హైదరాబాద్ 7వ ర్యాంక్,NITT వరంగల్ 28 ర్యాంక్, సి.బి.ఐ.టి. 71 వ ర్యాంక్,
ఆంధ్ర ప్రదేశ్ నుంచి కే.ల్.యునివేర్సిటి 59 ర్యాంక్, శ్రీ రామకృష్ణ రాజు ఇంజనీరింగ్ కాలేజీ,భీమవరం 73 వ ర్యాంక్, విజ్ఞాన్ ఇంజినీరింగ్  కాలేజీ 88 వ ర్యాంక్ పొందినవి.
మ్యానేజ్మెంట్ విభాగం లో  ఇనిస్తిత్యుత్ అఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్  38వ ర్యాంక్ పొందినది.
ఫార్మా రంగం లో తెలంగాణా లో యూనివర్శిటీ అఫ్ ఫార్మాసుటికల్ సైన్సెస్, వరంగల్  16వ స్థానం పొందినది. ఆంధ్ర ప్రదేశ్ లో రాఘవేంద్ర ఇనిస్తిత్యుత్ అఫ్ ఫార్మాసుటికల్ ఎడుకేషన్ అండ్ రిసర్చ్ (RIPER) అనంతపూర్ కు 20వ ర్యాంక్ లబించినది
విమర్శ:


కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించిన ర్యాంకింగ్ 2016 పై అనేక విమర్శలు తలఎత్తినవి. సౌకర్యాలు లేని IIM-ఉదయపూర్  IIM-కోజికోడే, IIM-ఇండోర్ కన్నా ఎక్కువ ర్యాంక్ లబించడం విమర్శకులను ఆశ్చర్య పరిచినది. అదేవిదoగా డిల్లి లో డిల్లి యూనివర్సిటి, జే.ఎం.యు. తరువాత విధ్యార్ధులను ఎక్కువగా ఆకర్షించే జామియా మిలియా కు 83వ స్థానం లబించడం అందరిని ఆశ్చర్య పరిచినది.  IIFT కు విశ్వవిద్యాలయ స్థాయిలో 81 వ ర్యాంక్ లబించడం అనేక విమర్శకులకు దారి తీసింది. IIFT కేంద్ర కామర్స్ మరియు పరిశ్రమల శాఖ అద్వర్యం లో నడుస్తుంది అది నిజానికి ఒక మ్యానేజ్మెంట్ ఇనిస్తిత్యుషణ్. ర్యాంకింగ్స్ 2017 నాటికి ఈ లోపాలన్నీ సరిద్దిడ్డ బడతాయని ఆశించుదాము.

No comments:

Post a Comment