17 June 2019

ఆగ్నేయాసియాలో ఇస్లాం: సంగ్రహ చరిత్ర (Islam in Southeast Asia: A Brief History)
ఆగ్నేయ ఆసియాలో 240 మిలియన్ల మంది ముస్లింలు ఉన్నారు. వీరు మొత్తం  ఆగ్నేయ ఆసియా జనాభాలో 42% ఉన్నారు. మొత్తం ప్రపంచ ముస్లిం జనాభా 1.6 బిలియన్స్ ఉండగా అందులో ఆగ్నేయ ఆసియా ముస్లిమ్స్  25% ఉంటారని అంచనా వేయబడింది. ఆగ్నేయాసియా లోని ముస్లింలు అధిక సంఖ్యలో సున్నీలు  మరియు వీరు షాఫి న్యాయ సంప్రదాయాన్ని అనుసరిస్తారు.

థాయ్లాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, బర్మా, లావోస్, కంబోడియా మరియు వియత్నాంలలో ముస్లింలు మైనారిటి సంఖ్యలో ఉండగా  మూడు ఆగ్నేయాసియా దేశాలు-ఇండోనేషియా, మలేషియా మరియు బ్రూనై ముస్లిం-మెజారిటీ జనాభాను కలిగి ఉన్నవి.

ఇస్లాం మలేషియా మరియు బ్రూనైలో  అధికారిక మతంగా గుర్తింపబడగా  ఇండోనేషియా, థాయిలాండ్ మరియు ఫిలిప్పీన్స్ లో అధికారికంగా గుర్తించబడిన మతాలలో ఇస్లాం ఒకటి. బహస ఇండోనేషియా, మలయ్, జావనీస్, మరానా, మగైందినా, టాసుగ్, థాయ్, చైనీస్ మరియు బర్మీస్  (Bahasa Indonesia, Malay, Javanese, Maranao, Maguindanao, Tausug, Thai, Chinese and Burmese) వంటి వివిధ భాషలను మాట్లాడే అనేక జాతుల సమూహాల నుండి ఆగ్నేయ ఆసియా ముస్లింలు వచ్చారు. మధ్య ప్రాచ్యం లోని  ముస్లింలు, యూదులు మరియు క్రైస్తవుల మధ్య సంబంధాలు మతపరంగా ఉండగా ఆగ్నేయ ఆసియాలోని  ఇస్లాం, బౌద్ధo మరియు క్రైస్తవo మధ్య సంబంధాలు జాతి పరంగా ఉన్నవి. ఇక్కడ ఇండోనేషియన్ మరియు మలేయ్ వాసులు ముస్లింలు; థాయ్/లావోటియన్/కంబోడియన్ వాసులు  బౌద్ధులు; ఫిలిపినో వాసులు  క్రైస్తవులు  మరియు చైనీయులు టావోయిస్ట్/కన్ఫ్యూషియనిస్ట్ లేదా క్రైస్తవులు గా ఉన్నారు. ప్రతి దేశంలో మతపరమైన మెజారిటీ మరియు మైనారిటీల మధ్య సామాజిక సంబంధాలను కూడా జాతి గుర్తింపులు నిర్ణయిస్తాయి.

12 వ శతాబ్దంలో ఆగ్నేయ ఆసియా లో ఇస్లాం హిందూ మహాసముద్రపు జలాలలో, మలక్కా, గల్ఫ్ ఆఫ్ సియామ్, మరియు దక్షిణ చైనా సముద్రం యొక్క జలాలలో ప్రయాణించే భారత దేశం లోని గుజరాతి వ్యాపారులు మరియు మత ప్రచారకుల ద్వారా ప్రవేశించినది. 13 వ శతాబ్దంలో సుమత్రాలోని పసాయి (Pasai) లో మొదటి ఇస్లామిక్ రాజ్యం స్థాపించబడింది. ఇస్లాం అభివృద్దికి ఇస్లాం ధర్మం లోని ప్రేమ మరియు కరుణ, మానవీయ ధోరణులను ప్రచారం చేసే సూఫీలు బాగా తోడ్పడినారు. ఇక్కడ ఇస్లాం అభివృద్ధి హిందూ, బౌద్ధ విశ్వాసాలు మరియు కర్మ పద్ధతులు మరియు ఇస్లాం బోధనల ఎకీకరణం (syncretic) తో జరిగినది.

సోఫనుక్రమ  అమరికలో, జావానీస్ ఉన్నతవర్గాలు (Javanese) తమను ముస్లింలు, హిందువులు మరియు బౌద్ధులుగా ఒకేసారి పరిగణించారు. 15వ మరియు 16వ శతాబ్దాలలో ఇస్లాం ధర్మం భారతీయ మరియు చైనీస్ మూలాలు కలిగిన  వాలిసోంగో (Walisongo) అని పిలవబడే తొమ్మిది మంది ఇండోనేషియా ముస్లిం ఫకిర్ల   రచనల  ద్వారా విస్తరించింది. వీరితో బాటు హంజా ఫన్సురి Hamza Fansuri 1590) షామ్స్ అల్ - దిన్ పసాయి (Shams al-Din of Pasai 1630) వంటి మార్మిక వాదులు మరియు గుజరాత్లోని రాందర్ కు చెందిన అల్-రనిరి (al-Raniri 1658) సంప్రదాయ ఇస్లాం ధర్మ ప్రచారంలో పాల్గొన్నారు.

పోర్చుగీసు వారు వచ్చే సమయానికి, ఇస్లాం ఆగ్నేయాసియా తీర ప్రాంతం లో దృడంగా విస్తరించినది. 17 వ శతాబ్దంలో హద్రామావ్ట్/యెమెన్ (Hadramawt/Yemen) నుండి అరబ్ వ్యాపారులు మరియు పండితులు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. వారు ముహమ్మద్ ప్రవక్త (స)యొక్క వారసులుగా ఈ నాటి  వరకు, కొన్ని ప్రాంతాలలో ఎంతోగా  గౌరవించబడతారు.

ఈ ప్రాతం లోని ముస్లింల హజ్ ప్రయాణాన్ని స్టీమ్ షిప్‌ల రాక మరింత సులభతరం చేసింది. చాలా మంది ఆగ్నేయాసియా ముస్లింలు అరేబియాకు  మతపరమైన అధ్యయనాలను కోసం వెళ్ళడం ప్రారంభించారు. వారి మాతృభూమికి తిరిగి వచ్చిన తరువాత అరబిక్ గ్రంధాలను ప్రాంతీయ భాషల్లో భాషలో అనువదించే  ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమం ఆగ్నేయాసియా ఇస్లామిక్ ప్రధాన స్రవంతి లో సనాతన ఇస్లాం  మరియు అరేబియన్ జీవనశైలి మరియు సంస్కృతిని  మేళవించినది. ఫలితంగా ఈ ప్రాంతంలో రెండు రకాల ఇస్లాం ఉద్భవించింది.

మొదటిది జావనీస్ అబాన్గన్ (abangan) , లేదా మలే లో కున్ తు (kaum tua)  మరియు థాయ్లో కానా కావు(khana kau ). రెండోవది సాంప్రదాయ ఇస్లాం నుండి భిన్న ఇస్లాం కు ఎకికరణం  చెంది బహాస ఇండోనేషియా(Bahasa Indonesia)  లో సాన్త్రి (santri), లేదా మలే లో కామ్ ముడా (kaum muda ) మరియు థాయ్లో ఖానా మాయి (khana mai)  అని పిలుస్తారు. రెండు రకాలు నేటికీ పక్కపక్కనే ఉన్నాయి. అంతేకాకుండా 18 వ శతాబ్దపు ఆగ్నేయాసియా పై   సౌది అరబియా కు చెందిన వాహాబిజం (Wahhabism) మరియు జమాలుద్దిన్ అల్-ఆఫ్ఘానీ మరియు ముహమ్మద్ అబ్దుహ్ (Jamaluddin al-Afghani and Muhammad Abduh) ప్రచారం చేసిన  చెందిన ఆధునిక ఇస్లాం ప్రభావం కలదు.

13 June 2019

“ఆస్ట్రో ఫిజిక్స్లో లో దివ్య ఖురాన్ యొక్క "ఏడు హెవెన్స్" (“Seven Heavens” of Qur’an in Astrophysics)
 Image result for universe

దివ్య  ఖుర్ఆన్ లో ఏడూ ఆకాశాల యొక్క అర్ధం మరియు వాటి నిర్దిష్ట ప్రదేశం గురించి వివరంగా చర్చించ బడినది. ఏడు స్వర్గాలు  మరియు వాటి భాగాల గురించి ఖురాన్ యొక్క వివరణ, గ్రహం, స్టార్, గెలాక్సీ, క్లస్టర్, సూపర్  క్లస్టర్  మొదలైన ఖగోళ భౌతిక శాస్త్రాల వివరణకు చాలా దగ్గరగా ఉంది. దివ్య  ఖురాన్ లో వివరించిన నజుమ్, కవాకిబ్, బురూజ్ , మసాబిహ్, షియాబ్-ఎ [-తైక్బ్, తారిక్ (najm, kawaakib, buruj, masabih, shihaab-a[-thaqib, tariq) తదితరాలు కూడా ఖగోళ శాస్త్రాలలో ఉన్నాయి. "

విశ్వం ఒక రాజ్యం లాగ పనిచేస్తుంది దాని భౌతిక చట్టాలు, దృగ్విషయం మరియు శక్తులు అన్ని  అత్యున్నత సార్వభౌమత్వం కల  ఆల్మైటీ అల్లాహ్  పాలనలో ఉన్నవి.  "నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు మరియు అనేక ఇతర నిర్మాణాల రూపంలో ఉన్న విశ్వం కేవలం ఒక ప్రదేశంగా లేదు.  ఇది బాగా అభివృద్ధి చెందిన మరియు అత్యంత వ్యవస్థీకృత వ్యవస్థ కలిగిన   అల్లాహ్  పాలనా క్రింద ఉన్నది. విశ్వం ఒక దేశం యొక్క పూర్తి స్థాయి పరిపాలనా వ్యవస్థగా ఉంది.  విశ్వము "ముల్క్" లేదా రాజ్యంగా మరియు దేవుడు దాని "మాలిక్" లేదా "హెడ్" గా దివ్య ఖురాన్ 
వివరిస్తుంది.

 విశ్వం కూడా మన  ప్రపంచం లాగా ఉంటుంది. ప్రపంచ౦ ఖండాలను, ఖండాలు దేశాలను, దేశాలు రాష్ట్రాలను, రాష్ట్రాలు జిల్లాలను కలిగి  ఉన్నాయి, జిల్లాలు బ్లాక్స్/నగరాలను, బ్లాక్స్/నగరాలు గ్రామాలను,  గ్రామాలు కాలనీలను  మరియు కాలనీలు గృహాలను  కలిగి ఉన్నాయి. దివ్య ఖురాన్ ప్రకారం విశ్వం, ఒక రాజ్యం లాగా ఉంటుంది మరియు భూమి మీద ఉన్న స్థానం నుండి ఏడు క్రియాత్మక యూనిట్లు, కాస్మిక్ టైర్స్, (సమావాత్ samawaat) ను కలిగి ఉంది.

ప్రధాన పాయింట్లు
1. వాతావరణంతో సహా భూమి యొక్క గురుత్వాకర్షణ క్షేత్రం మొదటి కాస్మిక్ టైర్ను ఏర్పరుస్తుంది. దివ్య  ఖుర్ఆన్ ఈ శ్రేణిలోని అన్ని ప్రధాన భాగాలను మరియు వాటి పనులను వివరిస్తుంది. వీటిలో హానికరమైన కిరణాల నుండి భూమిని కాపాడుకునే సామర్థ్యాలు, మేఘాలు, వర్షాలు మరియు గాలిలో ఎగురుతున్న పక్షులు వంటి వాతావరణంలోని భాగాలు ఉన్నాయి.

2. ప్లానెట్ ఎర్త్ను కలిగి ఉన్న సౌర వ్యవస్థను సూచిస్తున్న "సామా-అల్-దున్య“ Sama-al-dunya ", కాస్మిక్ టైర్ ను దివ్య  ఖురాన్ రెండవ కాస్మిక్ టైర్గా పరిగణిస్తుంది. సౌర వ్యవస్థలోని సన్, ప్లానెట్స్, ఉపగ్రహాలు, ఆస్టెరోయిడ్స్ మరియు మెటియోర్స్ (Meteors). యొక్క అన్ని ప్రధాన భాగాలను దివ్య  ఖురాన్ వివరిస్తుంది.

3. "ఆల్-సమైయ్ దైటిల్ హుబుక్"( కాస్మిక్  టైర్ ఆఫ్ పాత్వేస్ Cosmic Tier of Pathways) గా దివ్య ఖుర్ఆన్లో వివరించిన  మూడో కాస్మిక్ టైర్ మన  గెలాక్సీకి అనుగుణంగా ఉంది, ఇది మిల్కీ వే లేదా మిల్కీ పాత్వేగా పిలువబడుతుంది, మిల్కీ వే అనేక నక్షత్రాలతో కూడిన మన సౌర సిస్టం కలిగి ఉంది.  మన  సూర్యుని ఉన్న గెలాక్సీను పాలపుంత లేదా గాలక్సీ అని పిలుస్తారు.

4. "సమన్ బురుజు Sama’an burujan " మిల్కీ వేతో సహా పలు గెలాక్సీల సమూహాన్ని (Cluster) సూచిస్తుంది. మన క్లస్టర్ పేరు స్థానిక సమూహం.

5. "అ-సమై దత్రిర్-రాజ్ as-samaai daatir-raj”i” " మన సూపర్ క్లస్టర్ (Super cluster)   దిశగా కనిపిస్తుంది, ఇది గ్రేట్ అట్రాక్టర్ను (Great Attractor) కలిగి ఉంటుంది. కాస్మోస్ లో భాగమైన  సూపర్ క్లస్టర్ (Super cluster)  పెద్ద గ్రూప్ అయిన  చిన్న  గెలాక్సీ క్లస్టర్స్  ను  లేదా గెలాక్సీ గ్రూప్స్ ను కలిగి ఉంది. పాలపుంత గెలాక్సీలో (ఇందులో 54 కన్నా ఎక్కువ గెలాక్సీలు ఉన్నాయి) మిల్కీ వే  లోకల్ గ్రూప్ గెలాక్సీలో  భాగం, ఇది లనియాకీ (Laniakea) సూపర్ క్లస్టర్ లో  భాగమైన విర్గో/కన్య(virgo) క్లస్టర్లో భాగం. ఈ సూపర్ క్లస్టర్ 500 మిలియన్ల కాంతి సంవత్సరాలకు పైగా విస్తరించింది, స్థానిక సమూహం 10 మిలియన్ల కాంతి సంవత్సరాలలో విస్తరించింది.

6. క్వాసర్ల (Quasars) కి దగ్గరగా ఉన్న అరబిక్ పదం "టారిక్“ tariq” ", ఇది అనంత  దూరంలో ఉన్న విశ్వంలో అత్యంత మెరుస్తున్న  వస్తువు. ఇది ఆరవ కాస్మిక్ టైర్లో (Cosmic Tier) భాగం కావచ్చు. సూపర్ క్లస్టర్ల కలెక్షన్  కు  ఇంకా పేరు ఇవ్వలేదు. క్వాసర్లు ప్రకాశవంతమైన మరియు అత్యంత సుదూరమైన  తెలిసిన ఖగోళ వస్తువులు మరియు ప్రారంభ విశ్వాన్ని అర్థం చేసుకునేందుకు కీలకమైనవి. 

క్వాజర్లు మిలియన్ల, బిలియన్ల, లేదా ట్రిలియన్ల ఎలక్ట్రాన్ వోల్ట్ల శక్తులను విడుదల చేస్తాయి. ఈ శక్తి గెలాక్సీ లోపల అన్ని నక్షత్రాల కాంతి మొత్తంను  మించిపోయింది. క్వాసర్స్ (Quasars)  విశ్వంలో ఉన్న ప్రకాశవంతమైన వస్తువులు, అవి మిల్కీ వే కంటే 10 నుంచి 100,000 సార్లు ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయి.

7. సెవెంత్ కాస్మిక్ టైర్ అనేది మొత్తం మీద విశ్వం లోని  వెలుపలి   భాగం (outermost) లేదా కొన్ని అద్భుతమైన స్థలాలను కలిగి ఉన్న ప్రాంతం. విశ్వం  యొక్క ఈ ఉన్నత వెలుపలి  భాగం (uppermost) ఇప్పుడు కనపడక (invisible) పోవచ్చు. ఇది కొన్ని కార్యాలయాలు మరియు లాహే మహఫ్జ్ (Lauhe Mahfuz Secured Disc) ను  కలిగి ఉండవచ్చు, ఇది విశ్వం యొక్క అన్ని కార్యక్రమాల కేంద్రంగా ఉండవచ్చు.

సంగ్రహంగా వాతావరణం మరియు భూమి యొక్క గురుత్వాకర్షణ క్షేత్రం మొదటి కాస్మిక్ టైర్, అయిన అది మన సోలార్ సిస్టం  ( రెండోవ కాస్మిక్ టైర్) లో భాగం, తిరిగి అది మన గెలాస్కి మిల్కి వే (మూడోవ కాస్మిక్ టైర్)  లో భాగం, మిల్కీ వే లోకల్ గ్రూప్ (నాలుగో  కాస్మిక్ టైర్ ) లో భాగం, అది లనిఅకే (Laniakea) సూపర్ క్లస్టర్ (ఐదోవ కాస్మిక్ టైర్) లో భాగం, తిరిగి అది క్వసర్ (ఆరోవ కాస్మిక్ స్పియర్ ) లో భాగం మరియు   సెవెంత్ కాస్మిక్ టైర్ అనేది మొత్తం మీద విశ్వం లోని  వెలుపలి   భాగం (outermost) లేదా కొన్ని అద్భుతమైన స్థలాలను కలిగి ఉన్న ప్రాంతం. విశ్వం  యొక్క ఈ ఉన్నత వెలుపలి  భాగం (uppermost) ఇప్పుడు కనపడక (invisible) పోవచ్చు. ఇది కొన్ని కార్యాలయాలు మరియు లాహే మహఫ్జ్ (Lauhe Mahfuz Secured Disc) ను  కలిగి ఉండవచ్చు, ఇది విశ్వం  యొక్క అన్ని కార్యక్రమాల కేంద్రంగా ఉండవచ్చు.

ముగింపు:
రాబోయే కొన్ని దశాబ్దాల్లో, విశ్వం యొక్క మొత్తం నిర్మాణం బాగా అర్ధం అవుతుంది మరియు దివ్య ఖుర్ఆన్ లోని అద్భుతాలను అర్థం చేసుకోవడానికి వీలు అవుతుంది..


4 June 2019

రమదాన్ అంత:కరణ శుద్ధి మరియు బంధాలను పెంచును.
నేడు ప్రపంచవ్యాప్త పరిణామాలలో  మతం ముస్లింలకు వ్యక్తిగత విషయంగా లేదు. ఇస్లాం పేరిట జరిగే  తీవ్రవాద దాడులతో నిరాశ, నిరుత్సాహం, వేదింపులతో ముస్లిం సమాజం కొట్టుమిట్టాడుతుంది. దాదాపు ప్రతి రోజూ వారి విశ్వాసం - అంతర్జాతీయ సంఘటనల్లో చిక్కుకొంటుoది.

మక్కా లో  610 సంవత్సరం లో ఇస్లాం చివరి ప్రవక్త మొహమ్మద్(స) నోట దైవ వాణి  “దివ్య ఖుర్ఆన్” అవతరించందని  ముస్లింలు విశ్వసిస్తారు. రమజాన్ మాస 30 రోజుల పవిత్రత మరియు ప్రాధాన్యత  విశ్వాసులకు  తెలుసు. రమదాన్ నెలలో విశ్వాసి  సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు మరియు లైంగికత, మద్యపానం మరియు చెడు పనుల  నుండి దూరంగా ఉంటారు.

ఈ నెల స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ, స్వచ్ఛoద దానం కు  ప్రతిబింబం. విశ్వాసి ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధిoచుటకు పోరాటం జరుపుతాడు. అల్లాహ్ తన అనుచరులు అబద్ధాలు మరియు ఇతర పాపాత్మకమైన క్రియల  నుండి దూరంగా ఉండకపోతే, ఆహారం మరియు నీటి నుండి దూరంగా ఉండటానికి అంగికరించడని ప్రవక్త మొహమ్మద్(స) అన్నారు.

కోపం, దురహంకారం, అసూయ, ప్రతీకారం వంటి ప్రతికూల లక్షణాలను ఎదుర్కోవటానికి ఒక శక్తివంతమైన అరబిక్ పదం ఉంది. ఆ పదం జిహాద్. దురదృష్టవశాత్తు, ఇస్లాం యొక్క అత్యంత ఆధ్యాత్మిక భావన జిహాద్ నేడు అమాయక ప్రజలను చంపే తీవ్రవాదుల చేతుల్లో తన అర్ధాన్ని కోల్పోయింది. ముంబైలో 26/11 లేదా శ్రీలంకలోని చర్చిలలో జరిగిన దాడుల సమయంలో జరిగినది జిహాద్ కాదు. దివ్య ఖుర్ఆన్ అలాంటి బుద్ధిహీన హింసలను ఆమోదించలేదు. సిరియా, సోమాలియా మరియు ఆఫ్గనిస్తాన్లలో ముస్లింలు ఇతర ముస్లింలను చంపటం జిహాద్ కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యుద్దాలను  "ఆధ్యాత్మిక శుద్ధీకరణ కోసం లోపలికి చూసే" "గొప్ప జిహాద్" తో పోలిస్తే "తక్కువ జిహాద్" గా వర్ణించారు. రమదాన్ ఈ ఆలోచనను ప్రతిబిoబిస్తుంది.

రమదాన్ నెలను  విశ్వాసి చెడు ఆలోచనలు వదిలి మంచి ఉత్తమ ఆలోచనలను జాగృతి పరచటానికి స్వీయ శిక్షణ పొందటానికి వినియోగిస్తాడు.. ప్రవక్త(స) ఇలా అన్నాడు: " విశ్వాసి ఎవరిని అవమానపరచడు,ఎవరిని శాపం పెట్టాడు. అతను అపవిత్రుడు మరియు అనాగరికత తో వ్యవహరించడు. 

."దివ్య ఖురాన్ ముస్లింలు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండమంటుంది. జకాత్ (దాతృత్వం) ఇస్లాం మతం యొక్క ఐదు స్తంభాలలో ఒకటి మరియు ఇది రమదాన్ సమయంలో ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. సంపద కలిగిన ముస్లింలలో జకాత్ తప్పనిసరి. జకాత్ అనేది గొప్ప మరియు పేదల  మధ్య అంతరం తగ్గించే   వంతెనలాంటిది  మరియు సామాజికoగా నిర్లక్ష్యం చేయబడిన  ప్రజల గౌరవం పునరుద్ధరించడానికి ఉంది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు: "నల్లవారిపై తెల్లవారికి లేదా తెల్ల వారిపై నల్ల వారికీ దైవభక్తి మరియు మంచి పనులు చేస్తే తప్ప ఆధిక్యత లేదు." ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిహిత సహాయకులు ఇద్దరు మొదట  బానిసలు ఆ  తరువాత  మొదటి ముస్లిం సమాజంలో అత్యంత  గౌరవం పొందారు.

దివ్య ఖుర్ఆన్ ఇలా అంటుంది: "మేము మిమ్మల్ని మగవానిగా మరియు స్త్రీగా సృష్టించాము మరియు ఒకరికొకరు తెలుసుకునేలా మిమ్మల్ని దేశాలు మరియు తెగలుగా చేశాము." ఈ వచనం మరియు దివ్య ఖుర్ఆన్  శాంతి, స్నేహం వ్యక్తుల మధ్య ప్రేమ లాంటి అనేక ఇస్లాం సందేశాలకు కేంద్రం బిందువు.

 ఆధునిక సమాజ లక్షణాలు అయిన భయం, ద్వేషo మరియు అసమ్మతిని అధిగమించడానికి ఇస్లాం బోధనలు తోడ్పడతాయి. రమదాన్  ఇటువంటి హామీని పునరుద్ధరించడానికి మరియు బంధాలను పెంచటానికి సరైన సమయం.