23 June 2018

టైమ్ బ్యాంక్: స్విస్ టైమ్ బ్యాంక్Related image time bank
స్విట్జర్లాండ్ లో  చదివిన ఒక భారతీయ విద్యార్థి సామాజిక సేవారంగం లో అనుభవాలు:
నేను స్విట్జర్లాo చదువు కోనేటప్పుడు, నేను చదివే స్కూలు దగ్గర ఇల్లు   అద్దెకు తీసుకున్నాను. ఇల్లు యజమానురాలు  క్రిస్టినా 67 ఏళ్ల ఒంటరి వృద్ధ మహిళ. ఆమె పదవీ విరమణ ముందు ఒక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా  పనిచేసింది. స్విట్జర్లాండ్ లో పింఛను చాలా ఎక్కువ. అది ఆమె అవసరాలకు తగినట్టుగా ఉండేది. ఎటువంటి ఆందోళన, చీకు-చిoతలు  లేక ప్రశాంతం జీవనం గడిపేది.   

అయినప్పటికీ ఒక 87 ఏళ్ల ఒంటరి  వృద్దుని యొక్క శ్రద్ధ వహించడానికి ఆమె "పని" లో చేరింది. నేను కుతూహలం తో ఆమెను  “ ఈ వయస్సులో డబ్బు కోసం పని చేస్తున్నావా”  అని అడిగాను. ఆమె సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది: "నేను డబ్బు కోసం పని చేయటం లేదు, కానీ నేను నా సమయాన్ని" టైమ్ బ్యాంక్ "లో ఉంచాను మరియు వృద్ధాప్యంలో నేను మంచాన పడినప్పుడు , దాన్ని నేను వెనక్కి తీసుకోoటాను. "

నేను "టైమ్ బ్యాంక్" భావన గురించి మొదటిసారి విన్నప్పుడు, నేను చాలా ఆసక్తి తో  క్రిస్టినాను  దాని పూర్తి వివరాలు పూర్తిగా అడిగాను. "టైమ్ బ్యాంక్" అనేది స్విస్ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అభివృద్ధి చేసిన వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం. వ్యక్తులు తాము యవ్వనం లో ఉన్నప్పుడు వృద్ధుల పట్ల శ్రద్ధ తీసుకునే సమయాన్ని టైం time బ్యాంక్ లో దాచిపెడతారు. దాన్ని వారు వృద్ధులు, అనారోగ్యం పాలు అయినప్పుడు  వాడు కొంటారు. టైంtime బ్యాంక్ లో చేరే దరఖాస్తుదారులు(వ్యక్తులు)  ఆరోగ్యంగా ఉండాలి, బాగా కమ్యూనికేట్ చేయడం మరియు ప్రేమతో ప్రవర్తించడం లో నిపుణుత ప్రదర్సించడం అదనపు ఆర్హత. ప్రతిరోజు వారు తమ విరామ  సమయాన్ని సహాయం అవసరమైన వృద్ధులను చూసుకోవడానికి కేటాయిస్తారు.  వారి సేవా గంటలు సామాజిక భద్రతా వ్యవస్థ యొక్క వ్యక్తిగత ఖాతాలలో జమ చేయబడతాయి.

క్రిస్టినా వృద్దులకు సహాయం  చేయటం, వారు నివసించే  గదిని శుబ్రపర్చడం, వృద్ధులు షాపింగ్ చేయడం లో సహాయ పడటం, వృద్ధులతో ప్రేమ తో  మాట్లాడటానికి వారానికి, రెండు గంటలపాటు పని చేసేది. ఒప్పందం ప్రకారం, ఆమె సేవ యొక్క ఒక సంవత్సరం ముగిసిన తరువాత, "టైమ్ బ్యాంక్" ఆమె పని గంటలను లెక్కించి ఆమె కు "టైమ్ బ్యాంక్ కార్డు" ను జారీ చేస్తుంది. ఆమెకు అవసరమైనప్పుడు ఆమె "టైమ్ బ్యాంక్" నుండి "టైమ్ బ్యాంక్ కార్డు" ను "టైమ్ అండ్ వడ్డీ " తో  ఉపసంహరించుకోని  ఉపయోగించవచ్చు. సమాచారం వెరిఫికేషన్ అయిన తర్వాత, "టైం బ్యాంక్" స్వచ్చంద సేవకులను ఆమె ఆసుపత్రి పనులు  లేదా ఇంటి పనులు  చేయడానికి నియమించు తుంది.  

ఒకరోజు, నేను పాఠశాలలో ఉన్నప్పుడు ఇల్లు యజమానురాలు నుంచి పిలుపు వచ్చింది. కిటికీను తుడిచిటప్పుడు ఆమె స్టూల్ నుండి పడిపోయింది. నేను వెంటనే సెలవు తీసుకొని చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి పంపాను. ఆమె చీలమండ విరిగింది మరియు ఆమెకు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పారు. ఆమెను జాగ్రత్తగా చూసుకోవడానికి నేను ఒక రోజు  సెలవు కు దరఖాస్తు చేసుకోబోతున్నాను. వెంటనే  ఆమె తన గురించి ఆందోళన చెందనవసరం లేదని నాతో  అన్నది. ఆమె అప్పటికే "టైమ్ బ్యాంక్" నుండి విత్-డ్రాయాల్ అభ్యర్థనను సమర్పించింది.

రెండు గంటల కన్నా తక్కువ సమయంలోనే , "టైమ్ బ్యాంక్" క్రిస్టనా కోసం శ్రద్ధ వహించడానికి ఒక మేల్-నర్సింగ్ వర్కర్ ని   పంపించింది. మరుసటి నెల వరకు ప్రతి రోజు మేల్-నర్స్ ఆమె ను బాగా చూసుకున్నాడు. ఆమెతో మాట్లాడాడు మరియు ఆమె కోసం రుచికరమైన భోజనం తయారుచేసాడు. క్రిస్టినా ఆరోగ్యం బాగుపడినది. ఆరోగ్యం బాగుపడిన తరువాత క్రిస్టినా తిరిగి పనికి వెళ్ళింది. ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు "టైమ్ బ్యాంక్" లో సమయాన్ని ఆదా చేసుకోవాలని అనుకుంటుంది మరియు ఆమెకు బాగాలేనప్పుడు  దానిని ఖర్చు చేస్తానని  చెప్పింది.

నేడు  స్విట్జర్లాండ్లో, వృద్ధాప్యంలో సహాయం చేయడానికి "టైం  బ్యాంకులు" ఒక సాధారణ పద్ధతిగా మారినవి. ఇది దేశ పింఛను ఖర్చులను ఆదా చేస్తుంది, దానితో పాటు కొన్ని ఇతర సామాజిక సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. చాలామంది స్విస్ పౌరులు ఈ రకమైన ఓల్డ్-ఏజ్ పెన్షన్లకు బలపరుస్తారు. స్విస్ పెన్షన్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, స్విస్ యువకుల లో సగం మంది ఈ తరహా వృద్ధుల సంరక్షణ సేవలో పాల్గొనాలని కోరుకొంటున్నారు. "టైమ్ బ్యాంక్" పెన్షన్కు మద్దతుగా స్విస్ ప్రభుత్వం కూడా చట్టంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది..


17 June 2018

నమాజ్ పై మహాత్మా గాంధీ యొక్క అభిప్రాయాలు
మహాత్మా  గాంధీ అభిప్రాయం లో ముస్లింలు  నమాజ్  చదవకుండా ఎవరు అడ్డుకోలేరు. నమాజ్ చదవకుండా ఆటoక పరచడం మన రాజ్యాంగంలో పొందుపరచబడిన లౌకికవాదం యొక్క ప్రధాన లక్షణం అయిన “సర్వ ధర్మ సమ భావన“ కు వ్యతిరేకం అని ఆయన భావన.


ఫిబ్రవరి 29, 1920 న హిందూ-ముస్లిం యూనిటి పత్రిక లో   రాసిన వ్యాసం లో మహాత్మా గాంధీ “నుదుటిన తిలకం పెట్టిన ఒక వైష్ణవుడు, రుద్రాక్ష ధరించి సంద్యావందనం ఆచరిoచే  ఒక హిందూ మరియు నమాజ్ చదేవే ఒక ముస్లిం కలసి మెలసి సోదరులుగా జీవించవచ్చని” అన్నారు. దేవుడు తలస్తే ఆ కల వాస్తవ మవుతుంది అని ఆయన అన్నారు.   


గురుగ్రామ్ లో ఇటివల కొన్ని గ్రూపులు బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చదవడం వ్యతిరేకించడం  గాంధీ అభిప్రాయాలకు  వ్యతిరేకంగా ఉన్నాయి. మన రాజ్యాంగంలో పొందుపరచబడిన లౌకికవాదం యొక్క లక్షణం అయిన “సర్వ ధర్మ సమ భావన”   యొక్క ఆదర్శాన్ని ఇది నిరోధిస్తుంది. హిందూ మతం పేరుతో గాంధీ స్వప్నం ను దెబ్బతీయుటకు కొన్ని విచ్చినకర శక్తులు ప్రయత్నిస్తున్నాయి.  గాంధీ ఉద్దేశం లో హిందుతత్వం యేసు, ముహమ్మద్ మరియు జోరోస్టెర్ యొక్క ఆదర్శాలను తనలో ఇముడ్చుకొన్న  గొప్ప పరిణామ ప్రక్రియ.


మహాత్మా గాంధీ యొక్క రాబోయే 150 వ వార్షికోత్సవ వేడుకలు అతని వారసత్వం గురించి తెలుపుతాయి. “సత్యంతో నా ప్రయోగాలు  My Experiments with Truth, గ్రంధం లో మహాత్మా గాంధీ తన మొదటి సత్యాగ్రహ సమయంలో దక్షిణాఫ్రికాలో స్థాపించిన టాల్స్టాయ్ ఫారంలో ముస్లింలు ఎటువంటు ఆటంకాలు లేకుండా బహిరంగం గా నమాజ్ ఎలా ఆచరించే వారో గుర్తుచేసుకొన్నారు. 
  

మహాత్మా గాంధీ అన్ని మత వర్గాల విశ్వాసాలతో సంబంధం కలిగిన “ప్రార్థన” ను సమర్ధించారు మరియు ఇలా రాశారు, "గాయత్రి , నమాజ్ లేదా క్రైస్తవ ప్రార్థన యొక్క పఠనం మూఢవిశ్వాసాలకు, అమాకత్వం కు  అనుగుణంగా ఉంటుందని అనుకోవటం పెద్ద తప్పు. "ఉపవాసం మరియు ప్రార్థన అనేవి  పరిశుభ్రత యొక్క అత్యంత శక్తివంతమైన ప్రక్రియ మరియు పవిత్రమైనవి. అది మన  పనిని చేయటానికి మరియు మన లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పతాయి." కాబట్టి ముస్లింలను నమాజ్ చేయకుండా నిరోధించడం వారిని బాధ్యతలు కలిగిన పౌరులుగా  రుపొందించ నివ్వదు.

గాంధీ సబర్మతి ఆశ్రంలో ఒక ఆలయాన్ని నిర్మించమని మీరా బెన్ చేసిన అభ్యర్థనను  తిరస్కరించారు. గాంధీ  బహిరంగ ప్రదేశం open space తన ప్రార్ధనా మందిరం అని విశ్వసించారు. దాని  పైకప్పు ఆకాశంగా ఉండి  నాలుగు వైపులా (తూర్పు, పశ్చిమ, ఉత్తర మరియు దక్షిణం) నాలుగు గోడలను కలిగి ఉంటుంది.  అలాంటి ఓపెన్ హాల్ లో  చేసిన ప్రార్థన విశ్వాసం, కులం, భాష మరియు జాతీయత యొక్క అడ్డంకులను అధిగమించగలదని ఆయన వివరించారు.


 భారతదేశం అంతటా అనేక బహిరంగ ప్రార్ధనా సమావేశాలలో పాల్గొని, అలాంటి సందర్భాలలో మాట్లాడేటప్పుడు, గాంధీ ముస్లింలు  నమాజ్ చేసే సమయం లో  విరామం యిచ్చేవారు మరియు ఆ తరువాత ప్రసంగించే వారు.   1946, నవంబరు 16 న ఒక ప్రార్ధన సమావేశంలో ప్రసంగించే సమయంలో, ముస్లింలు  నమాజ్ చేయడానికి అనుకూలంగా ఆయన తన ప్రసంగాన్ని ఆపి వేసారు  మరియు సభికులు రణగొణ ధ్వని చేయడం చూసి, "సంస్కృతి మరియు మంచి పెంపకం ఇతరుల ప్రార్థన సమయం లో  నిశ్శబ్దం పాటించమని భోదించేవి” అని  చెప్పారు.
 

“నమాజ్” ప్రార్థన యొక్క ఒక రూపం మరియు  వ్యాయామం యొక్క ఒక రూపంగా గాంధీ అర్థం చేసుకున్నారు.  1921 లో "నమాజ్  ద్వారా వ్యక్తి వ్యాయామం చేస్తాడు" అని గాంధి తన అభిప్రాయాన్ని స్పష్టంగా పలికారు.  డిల్లి లో 1946 లో జరిగిన ప్రార్థన సమావేశంలో మాట్లాడుతూ గాంధీ “తనకు “నమాజ్” ఎలా చేయాలి  అనే దానిని  గురించి ఒక పుస్తకాన్ని ఎవరో పంపించారని అందులో సమూహా ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన కన్నా 27 సార్లు ప్రభావవంతంగా ఉందని” అన్నారు. అందరు ప్రార్థనలో సంపూర్ణంగా హృదయపూర్వకంగా మరియు పద్దతిలో పాల్గొంటే అది వాతావరణాన్ని మార్చి, ఢిల్లీలో అల్లర్లు జరిగేవి కావని గాంధీ అన్నారు.“సర్వ ధర్మ సమ భావన” భావనను అర్ధం చేసుకోటం లో నమాజ్ పై గాంధీ యొక్క ఆలోచనలు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.