
స్విట్జర్లాండ్ లో చదివిన ఒక భారతీయ విద్యార్థి సామాజిక సేవారంగం లో అనుభవాలు:
నేను స్విట్జర్లాo చదువు కోనేటప్పుడు, నేను చదివే స్కూలు
దగ్గర ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఇల్లు యజమానురాలు క్రిస్టినా 67 ఏళ్ల ఒంటరి వృద్ధ మహిళ. ఆమె పదవీ విరమణ
ముందు ఒక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. స్విట్జర్లాండ్ లో పింఛను చాలా ఎక్కువ.
అది ఆమె అవసరాలకు తగినట్టుగా ఉండేది. ఎటువంటి ఆందోళన, చీకు-చిoతలు లేక ప్రశాంతం జీవనం గడిపేది.
అయినప్పటికీ ఒక 87 ఏళ్ల ఒంటరి వృద్దుని యొక్క శ్రద్ధ వహించడానికి ఆమె
"పని" లో చేరింది. నేను కుతూహలం తో ఆమెను “ ఈ వయస్సులో డబ్బు కోసం పని చేస్తున్నావా” అని అడిగాను. ఆమె సమాధానం నన్ను
ఆశ్చర్యపరిచింది: "నేను డబ్బు కోసం పని చేయటం లేదు, కానీ నేను నా
సమయాన్ని" టైమ్ బ్యాంక్ "లో ఉంచాను మరియు వృద్ధాప్యంలో నేను మంచాన పడినప్పుడు
, దాన్ని నేను వెనక్కి
తీసుకోoటాను. "
నేను "టైమ్
బ్యాంక్" భావన గురించి మొదటిసారి విన్నప్పుడు, నేను చాలా ఆసక్తి తో క్రిస్టినాను
దాని పూర్తి వివరాలు పూర్తిగా అడిగాను. "టైమ్ బ్యాంక్" అనేది
స్విస్ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అభివృద్ధి చేసిన వృద్ధాప్య పెన్షన్
కార్యక్రమం. వ్యక్తులు తాము యవ్వనం లో ఉన్నప్పుడు వృద్ధుల పట్ల శ్రద్ధ తీసుకునే
సమయాన్ని టైం time బ్యాంక్ లో దాచిపెడతారు. దాన్ని వారు వృద్ధులు, అనారోగ్యం పాలు
అయినప్పుడు వాడు కొంటారు. టైంtime బ్యాంక్
లో చేరే దరఖాస్తుదారులు(వ్యక్తులు) ఆరోగ్యంగా ఉండాలి, బాగా కమ్యూనికేట్ చేయడం మరియు ప్రేమతో ప్రవర్తించడం
లో నిపుణుత ప్రదర్సించడం అదనపు ఆర్హత. ప్రతిరోజు వారు తమ విరామ సమయాన్ని సహాయం అవసరమైన వృద్ధులను చూసుకోవడానికి
కేటాయిస్తారు. వారి సేవా గంటలు సామాజిక
భద్రతా వ్యవస్థ యొక్క వ్యక్తిగత ఖాతాలలో జమ చేయబడతాయి.
క్రిస్టినా వృద్దులకు
సహాయం చేయటం, వారు నివసించే గదిని శుబ్రపర్చడం, వృద్ధులు షాపింగ్
చేయడం లో సహాయ పడటం, వృద్ధులతో ప్రేమ
తో మాట్లాడటానికి వారానికి, రెండు గంటలపాటు పని
చేసేది. ఒప్పందం ప్రకారం,
ఆమె సేవ యొక్క ఒక
సంవత్సరం ముగిసిన తరువాత,
"టైమ్ బ్యాంక్" ఆమె పని గంటలను లెక్కించి ఆమె కు "టైమ్ బ్యాంక్ కార్డు"
ను జారీ చేస్తుంది. ఆమెకు అవసరమైనప్పుడు ఆమె "టైమ్ బ్యాంక్" నుండి "టైమ్
బ్యాంక్ కార్డు" ను "టైమ్ అండ్ వడ్డీ " తో ఉపసంహరించుకోని ఉపయోగించవచ్చు. సమాచారం వెరిఫికేషన్ అయిన తర్వాత, "టైం
బ్యాంక్" స్వచ్చంద సేవకులను ఆమె ఆసుపత్రి పనులు లేదా ఇంటి పనులు చేయడానికి నియమించు తుంది.
ఒకరోజు, నేను పాఠశాలలో ఉన్నప్పుడు
ఇల్లు యజమానురాలు నుంచి పిలుపు వచ్చింది. కిటికీను తుడిచిటప్పుడు ఆమె స్టూల్ నుండి
పడిపోయింది. నేను వెంటనే సెలవు తీసుకొని చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి పంపాను.
ఆమె చీలమండ విరిగింది మరియు ఆమెకు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పారు. ఆమెను
జాగ్రత్తగా చూసుకోవడానికి నేను ఒక రోజు సెలవు కు దరఖాస్తు చేసుకోబోతున్నాను. వెంటనే ఆమె తన గురించి ఆందోళన చెందనవసరం లేదని నాతో అన్నది. ఆమె అప్పటికే "టైమ్ బ్యాంక్" నుండి
విత్-డ్రాయాల్ అభ్యర్థనను సమర్పించింది.
రెండు గంటల కన్నా తక్కువ
సమయంలోనే , "టైమ్
బ్యాంక్" క్రిస్టనా కోసం శ్రద్ధ వహించడానికి ఒక మేల్-నర్సింగ్ వర్కర్ ని పంపించింది. మరుసటి నెల వరకు ప్రతి రోజు
మేల్-నర్స్ ఆమె ను బాగా చూసుకున్నాడు. ఆమెతో మాట్లాడాడు మరియు ఆమె కోసం రుచికరమైన
భోజనం తయారుచేసాడు. క్రిస్టినా ఆరోగ్యం బాగుపడినది. ఆరోగ్యం బాగుపడిన తరువాత
క్రిస్టినా తిరిగి పనికి వెళ్ళింది. ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు "టైమ్
బ్యాంక్" లో సమయాన్ని ఆదా చేసుకోవాలని అనుకుంటుంది మరియు ఆమెకు బాగాలేనప్పుడు
దానిని ఖర్చు చేస్తానని చెప్పింది.
నేడు స్విట్జర్లాండ్లో, వృద్ధాప్యంలో సహాయం
చేయడానికి "టైం బ్యాంకులు" ఒక
సాధారణ పద్ధతిగా మారినవి. ఇది దేశ పింఛను ఖర్చులను ఆదా చేస్తుంది, దానితో పాటు
కొన్ని ఇతర సామాజిక సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. చాలామంది స్విస్ పౌరులు ఈ
రకమైన ఓల్డ్-ఏజ్ పెన్షన్లకు బలపరుస్తారు. స్విస్ పెన్షన్ సంస్థ నిర్వహించిన సర్వే
ప్రకారం, స్విస్ యువకుల లో
సగం మంది ఈ తరహా వృద్ధుల సంరక్షణ సేవలో పాల్గొనాలని కోరుకొంటున్నారు. "టైమ్
బ్యాంక్" పెన్షన్కు మద్దతుగా స్విస్ ప్రభుత్వం కూడా చట్టంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు
చేసింది..
Great blog, Thanks.
ReplyDeleteinnallaha sayubtiluhu, masha allah in arabic, obesity in islam, symptoms of black magic to separate husband and wife, famous female personalities in islamic history, sad story about father and son, things that will take you to jannah, learn quran online, learn quran online uk, quran teacher online,
quran teacher needed, need quran teacher online
Great blog, Thanks.
ReplyDeleteHe is a man from Jannah , Angels of Allah, KHALID BIN WALID TAKES POISON, The Supplication of Musa, Who is ad-Dayuth?, Ask Allah for everything, True Story of Prophet Yunus, learn quran online, learn quran online uk, quran teacher online,
quran teacher needed, need quran teacher online