ఎ.కె. ఫజ్లుల్ హక్ అని ప్రసిద్ధి చెందిన
అబుల్ కాసెం ఫజ్లుల్ హక్ 1873 అక్టోబర్ 26న బేకర్‌గంజ్
జిల్లాలోని బారిసల్ సబ్-డివిజన్ లో జన్మించాడు.
సర్ అశుతోష్ ముఖర్జీ పర్యవేక్షణలో న్యాయశాస్త్రంలో శిక్షణ పొందినాడు. ఎ.కె.
ఫజ్లుల్ హక్ ముహమ్మదన్ విద్యా సమావేశం Muhammadan Educational Conference తో దగ్గరి సంబంధం కలిగి
ఉన్నాడు మరియు ముస్లిం లీగ్ ప్రారంభకులలో ఒకరు..
ఎ.కె. ఫజ్లుల్ హక్ 1916 లక్నో ఒప్పందం పై సంతకం
పెట్టినవారిలో ఒకడు. 1917లో, ఎ.కె.
ఫజ్లుల్ హక్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించాడు.
అదే సంవత్సరం ఎ.కె. ఫజ్లుల్ హక్ కలకత్తా వ్యవసాయ సంఘం ఏర్పాటులో కూడా
పాల్గొన్నారు. 1919లో జరిగిన బెంగాల్ కాంగ్రెస్ సమావేశానికి ఎ.కె. ఫజ్లుల్ హక్ అధ్యక్షత వహించారు
మరియు జలియన్ వాలాబాగ్ పై కాంగ్రెస్ విచారణ కమిటీ సభ్యుడిగా కూడా నియమితులయ్యారు.
ఖీలాఫత్ ఉద్యమానికి ఎ.కె. ఫజ్లుల్ హక్ బలమైన సమర్ధకుడు
మరియు 1920 సెప్టెంబర్‌లో కలకత్తాలో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశంలో ఫజ్లుల్ హక్
సహాయ నిరాకరణకు అనుకూలంగా ఓటు వేశారు. ఫజ్లుల్ హక్ బెంగాల్ శాసనసభకు ఎన్నికైనారు 1924లో విద్యా మంత్రిగా పదోన్నతి
పొందారు. విద్యా మంత్రిగా ఫజ్లుల్ హక్ ఇస్లామియా కళాశాలను స్థాపించినాడు, అర్హులైన
ముస్లిం విద్యార్థుల కోసం ఒక నిధిని సృష్టించడం జరిగింది..
ఫజ్లుల్ హక్, లక్నో ఒప్పందం గురించి పునరాలోచించి
నెహ్రూ నివేదిక (1928)లోని ఉమ్మడి ఓటర్ల వ్యవస్థ కు మద్దతు ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీలో ఆమోదించబడిన కౌలు సవరణ
బిల్లును ఫజ్లుల్ హక్, తీవ్రంగా
వ్యతిరేకించారు. మరియు నిఖిల్ ప్రజా పార్టీ స్థాపించారు. 1930 మరియు 1931లో రౌండ్ టేబుల్ సమావేశాల కోసం
ఫజ్లుల్ హక్ లండన్‌కు వెళ్లారు,
1935లో, ఫజ్లుల్ హక్ కలకత్తా
కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికైనారు. నిఖిల్ ప్రజా పార్టీలోని తన సొంత వర్గాన్ని
క్రిషక్ ప్రజా పార్టీ KPPఅని పేరు పెట్టారు.
జూన్ 1936లో, జరిగిన బెంగాల్ ప్రాంతీయ ఎన్నికలలో KPP ముస్లిం లీగ్ మద్దతుతో
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హక్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
1937 లక్నో సమావేశంలో ఫజ్లుల్ హక్ ముస్లిం లీగ్
సభ్యత్వాన్ని తీసుకున్నాడు జిన్నా బెంగాల్ ముఖ్యమంత్రి ఫజ్లుల్ హక్‌ను ముస్లిం
లీగ్ కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు నామినేట్ చేశాడు, కానీ KPP-UML
సంకీర్ణం
మద్య విబేధాలు వచ్చి , జిన్నా ఫజ్లుల్ హక్‌ను కేంద్ర
పార్లమెంటరీ బోర్డు నుండి బహిష్కరించాడు
1938లో, ఫజ్లుల్ హక్ ప్రభుత్వం కానిస్టేబుళ్లలో
కనీసం 50% మంది ముస్లింలు ఉండేవిధంగా పోలీసుల నియామక నియమాలను మార్చినది.. అన్ని
ప్రభుత్వ నియామకాలలో ముస్లింలకు 60% రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించింది. 1940లో ఫజ్లుల్ హక్ ప్రభుత్వం కలకత్తా
విశ్వవిద్యాలయం నుండి ఉన్నత విద్య నియంత్రణను తొలగించి, ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత గల
బోర్డుకు అప్పగించింది.
జూలై 1941లో, జాతీయ రక్షణ మండలిలో ఫజ్లుల్
హక్ బెంగాల్ ముఖ్యమంత్రి హోదాలో స్వీకరించారు. జిన్నా సింకందర్ హయత్ ఖాన్ మరియు సాదుల్లాను
ఫజ్లుల్ హక్ తో పాటు కౌన్సిల్ కు రాజీనామా చేయమని బలవంతం చేశాడు, కానీ హక్ లీగ్ వర్కింగ్
కమిటీకి కూడా రాజీనామా చేశాడు.
జిన్నాతో ఫజ్లుల్ హక్ కు గల విభేదాలు
తీవ్రతరం అయినాయి ఫజ్లుల్ హక్ జిన్నా నిరంకుశ ప్రవర్తన పట్ల ఎప్పుడూ సంతోషంగా లేడు మరియు తన ప్రసంగాలు మరియు
చర్యల ద్వారా బెంగాల్ స్వయంప్రతిపత్తిని నొక్కి చెబుతూనే ఉన్నాడు.
జిన్నా బెంగాల్‌లోని ఫజ్లుల్ హక్ ప్రత్యర్థులను
ఉపయోగించి ఫజ్లుల్ హక్ ను పదవి నుంచి తొలగించాడు. అయితే, ఫజ్లుల్ హక్ మెజారిటీ సబ్యుల
మద్దతు కూడకట్టి ప్రోగ్రెసివ్ సంకీర్ణ మంత్రిత్వ వర్గం ఏర్పాటును ప్రకటించాడు. గవర్నర్ జాన్ హెర్బర్ట్ ఫజ్లుల్
హక్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిలిచాడు. కాని గవర్నర్ శరత్ బోస్‌ను
డిఫెన్స్ ఆఫ్ ఇండియా పాలనలో అరెస్టు చేయడం, ఫజ్లుల్ హక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
గవర్నర్ జరిపిన కుట్రలు, చర్యల పలితంగా ఫజ్లుల్ హక్ ప్రభుత్వం బలహీనపడింది
అంత్య దశలో ఫజ్లుల్ హక్ రాజకీయ జీవితం
అంధకారమయం అయింది. 1946 ఎన్నికలు ఫజ్లుల్ హక్ పార్టీ యొక్క క్షీణిస్తున్న రాజకీయ దశకు నిదర్శనం, ఎన్నికలలో లీగ్ 114 సీట్లు, కాంగ్రెస్ 86 సీట్లు (అన్నీ జనరల్)
గెలుచుకుంది మరియు కెపిపి మూడు సీట్లను మాత్రమే పొందినది.
1946లో నెహ్రూ ఫజల్-ఉల్ హక్ పేరును జాతీయ మంత్రివర్గంలో
చేర్చాలని ప్రతిపాదించాడు, కానీ లార్డ్
వేవెల్ దానికి తీవ్రంగా వ్యతిరేకంగా స్పందించాడు. అందువల్ల ఫజల్-ఉల్ హక్ కు
మంత్రివర్గంలో చోటు దక్కలేదు
ఫజల్-ఉల్ హక్ పాకిస్తాన్ ఆలోచనకు అంగీకరించి
తూర్పు పాకిస్తాన్‌కు వెళ్లాడు తూర్పు పాకిస్తాన్ అడ్వకేట్ జనరల్ గా హక్ నియమించబడినాడు.
జిన్నా బెంగాలీలపై ఉర్దూను ఏకైక రాజ్య భాషగా విధించడం వల్ల తూర్పు పాకిస్తాన్
నిర్లక్ష్యం చేయబడిందని హక్ భావించాడు.
తూర్పు పాకిస్తాన్ లో మౌలానా భాషాని, షేక్
ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ ఏర్పచినారు ఫజ్లుల్
హక్ స్వయంగా కృషక్ శ్రామిక్ పార్టీ (KSP)ని స్థాపించి, అవామీ లీగ్‌తో చేతులు కలిపి
యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశాడు, దాని నాయకుడిగా ఫజ్లుల్ హక్ ఉన్నారు
1954లో తూర్పు పాకిస్తాన్‌లో జరిగిన ఎన్నికల్లో, ముస్లిం లీగ్ 10 సీట్లకు వ్యతిరేకంగా యునైటెడ్
ఫ్రంట్ 223 సీట్లు గెలుచుకుంది. ఫజ్లుల్ హక్ మరోసారి తూర్పు పాకిస్తాన్ ముఖ్యమంత్రి
అయ్యాడు, కానీ తూర్పు
పాకిస్తాన్ లో రాజకీయ కారణాలపై చెలరేగిన అల్లర్ల వలన 1954 మే 30న ఫజ్లుల్ హక్ మంత్రివర్గం రద్దు చేశారు. అయితే, తూర్పు పాకిస్తాన్ నుండి
కేంద్ర పాలన ఉపసంహరించబడిన కొంతకాలం తర్వాత, ఫజ్లుల్ హక్, చౌదరి ముహమ్మద్ అలీ పాకిస్తాన్ కేంద్ర మంత్రివర్గం లో చేరి, పాకిస్తాన్ అంతర్గత మంత్రి
పదవిని దక్కించుకున్నాడు. . ఉర్దూతో పాటు బెంగాలీకి జాతీయ భాష హోదాను కల్పించే
కొత్త రాజ్యాంగాన్ని రూపొందించడంలో కూడా ఫజ్లుల్ హక్ కీలక పాత్ర పోషించారు
ఫజ్లుల్ హక్ వ్యక్తత్వ అంచనా:
ఫజ్లుల్ హక్‌ను అంచనా వేస్తూ1937లో వైస్రాయ్‌కు రాసిన లార్డ్
లిన్‌లిత్‌గో, సర్
జాన్ ఆండర్సన్, ఫజ్లుల్
హక్ "ముస్లిం రాజకీయాల్లో అత్యంత అనిశ్చిత వ్యక్తి, పూర్తిగా సూత్రప్రాయంగా
లేనివాడు మరియు ఎవరూ విశ్వసించనివాడు" అని పేర్కొన్నారు.
హక్ బెంగాల్ గ్రామీణ ప్రాంతాలలో బాగా తెలిసిన
వ్యక్తి. ప్రజలతో, ముఖ్యంగా రైతులతో ఫజ్లుల్ హక్ కున్న
అనుబంధం ఎంత గొప్పదంటే, 1940లలో వివిధ రంగాల నాయకులు బెంగాల్ గ్రామీణ ప్రాంతాలకు చేరుకున్నప్పుడు, చాలా మంది రైతులు గాంధీ మరియు
ఫజ్లుల్ హక్ పేరు మాత్రమే విన్నారని కనుగొన్నారు.
ఫజ్లుల్ హక్ బెంగాలీ దేశభక్తుడు బెంగాల్
స్వయంప్రతిపత్తి కోసం ఆరాటపడ్డాడు." ఫజ్లుల్ హక్ రాజకీయాలు ఆయనను బెంగాల్ యొక్క అత్యంత ప్రియమైన నాయకులలో ఒకరిగా
చేశాయి."