2 May 2025

అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ రోజా లైబ్రరీ మరియు కలిమి బుక్ డిపో. Kalim Book Depot at Sarkhej Roza library Ahmedabad.

 


అహ్మదాబాద్, గుజరాత్ :

ప్రపంచ వారసత్వ నగరం అహ్మదాబాద్ లో ప్రచురణకర్త, రచయిత మరియు గుజరాత్ మధ్యయుగ చరిత్ర నిపుణుడు అయిన దివంగత షాహెద్ కలిమి దాదాపు శతాబ్దాల నాటి కలిమ్ బుక్ డిపోను నడిపించడమే కాకుండా సర్ఖేజ్ రోజాలో లైబ్రరీని ఏర్పాటు చేసి  దానిలో 20 సంవత్సరాల పాటు  స్వచ్ఛంద సేవను అందించాడు.. అహ్మదాబాద్ సర్ఖేజ్ రోజాలోని ASI-రక్షిత స్మారక చిహ్నాలలో ఒకటైన లైబ్రరీని వెనుక ఉన్న  ఏకైక శక్తి షాహెద్ కలిమి

ఇటివల అహ్మదాబాద్ వారసత్వానికి కలిమి చేసిన సహకారాన్ని విద్యావేత్తలు, ప్రఖ్యాత చరిత్రకారులు మరియు వారసత్వ ఔత్సాహికులు నగరంలో ఏర్పాటు చేసిన స్మారక సమావేశంలో గుర్తు చేసుకున్నారు.

"సర్ఖేజ్ రోజాలోని లైబ్రరీ లో ప్రచురణ విభాగాన్ని ఏర్పాటు చేయడంలో కలిమి కీలక పాత్ర పోషించారు, సర్ఖేజ్ రోజా లైబ్రరీ ద్వారా అనేక పుస్తకాలు అనువదించబడి ప్రచురించబడ్డాయి".

షహీద్ కలిమి తన జీవితకాలంలో ఉర్దూ, పర్షియన్ మరియు అరబిక్ నుండి దాదాపు 50 పుస్తకాలను గుజరాతీలోకి అనువదించాడు, గుజరాత్ చరిత్ర ను ప్రజలకు వివరించాడు.

షహీద్ కలిమి చివరి పుస్తకాలలో రెండు - ఎ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ సర్ఖేజ్ రోజా మరియు యాద్-ఎ-అయ్యమ్, స్మారక సమావేశంలో విడుదలయ్యాయి.

"షహీద్ కలిమి గుజరాత్ చరిత్ర గురించి రాసిన అనేక పుస్తకాలను రాసి అనేక  పర్షియన్ మరియు అరబిక్ భాషా రగ్రంధాలను  గుజరాతీలోకి అనువదించాడు. అహ్మదాబాద్ మరియు గుజరాత్ చరిత్ర పై దాదాపు 50 రచనలను షహీద్ కలిమి అనువదించారు.

గుజరాత్ మధ్యయుగ చరిత్రపై పుస్తకాలను సేకరించడం, అవసరమైతే అనువదించడం, ప్రజలకు అందుబాటులో ఉంచడానికి కలిమ్ బుక్ డిపోను షహీద్ కలిమి స్థాపించాడు.

చరిత్ర మరియు వాస్తుశిల్పం విద్యార్థులు తరచుగా కలిమ్ బుక్ డిపోను సందర్శించేవారు, కలిమ్ బుక్ డిపో ఒకప్పుడు, మేధావులచే  కవిత్వం మరియు ఆలోచనలకు ఒక కేంద్రంగా ఉండేది.

కలిమ్ బుక్ డిపో స్థాపించి  ఒక శతాబ్దం అవుతుంది మరియు నేటికీ అరుదైన పుస్తకాలకు కలిమ్ బుక్ డిపో ప్రసిద్ధి చెందింది. "రామాయణం, మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఉర్దూ వెర్షన్లు  కలిమ్ బుక్ డిపో  లో లబిస్తాయి. గుజరాత్ చరిత్ర పై అనేక పర్షియన్, అరబిక్ మరియు ఉర్దూ భాషల గ్రంధాలు  కలిమ్ బుక్ డిపో  లో లబిస్తాయి

షహీద్ కలిమి మరణించే ముందు తన చివరి పుస్తకాలలో ఒకటైన - మక్బరాస్ మరియు అహ్మదాబాద్‌లోని మసీదులపై కృషి  చేస్తున్నాడు. సర్ఖేజ్ రోజా లైబ్రరీ ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి కృషి చేస్తున్నది. ఇది త్వరలో విడుదల కానుంది.


No comments:

Post a Comment