శరీరఆరోగ్యమును కాపాడుటలో ఫలముల పాత్ర ఎంతైనా
ఉంది. ప్రతి దినము క్రమము తప్పకుండా ఫలములను భుజించిన శరిర ఆరోగ్యం
కాపాడబడును. “An apple a day keeps the doctor away” అను సామెత ఉండనే ఉంది. ప్రకృతి
మనకు ప్రసాదించిన అమూల్య వరం ఫలములు. కొన్ని ఫలముల ఆకృతులను పరిశిలించిన అవి మన
శరీరములోని కొన్ని అవయవములను పోలిఉండును.
మన శరీర ఆరోగ్యమును కాపాడే కొన్ని ఫలములను, శరీర భాగములను పోలిన వాటి ఆకృతులను,
వాటి ఉపయోగాములను పరిశిలించేదము.
క్యారెట్ ముక్కను అడ్డముగా కోసిన అది మానవ నేత్రమును
పోలిఉండును. క్యారెట్ ముక్కలను భుజించిన అవి కళ్ళకు రక్తము అధికముగా
ప్రసరించునట్లు చేయును ముఖ్యం రేచీకటి ని పారద్రోలును.నైట్ విజన్ పెంచును. పెద్దవయస్సు వారికీ వచ్చే కంటి దోషాలను
నివారించును.క్యారెట్ లోని బీటా-కరోతిన్ వలన క్యారెట్ కు ఆరంజ్ రంగు వచ్చెను.
టమాట పండు ను
అడ్డముగా కోసిన అది ఎరుపు రంగు లో ఉండి నాలుగు గదులు కలిగిఉండును. మన శరీరం
లోని గుండె కుడా నాలుగు కవాటములు కలిగిఉండును.
టమాటో లోని లైకోపిన్ (lycopine)
గుండె కు శుబ్రమైన రక్తమును అందించును.
గ్రేప్స్ (నల్ల ద్రాక్ష grapes) ఊపిరితిత్తులను పోలి
ఉందును. ఉపిరి తిత్తులు అల్వెఒలి (అల్వెఒలి)అనే కణజాలం తో నిండి ఉండును. ఈ కణజాలం
ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ రక్తమునకు చేరునట్లు చేయును. తాజా ద్రాక్ష ను తిన్న ఊపిరి
తిత్తుల కాన్సర్ (lung cancer)రాకుండా
చేయును. ద్రాక్ష విత్తనాలు అలేర్జి ద్వారా వచ్చే ఆస్తమాను తగ్గించును.
అక్రోట్(walnut) చిన్న మేదడును పోలిఉండును. ఇది మెదడు
కణాల మద్య ప్రసారాలను పెంచును. మతిమరపును పోగొట్టును. అల్జిమీర్ వ్యాధిని
తగ్గించును.
బీన్స్ మూత్రపిందాలను పోలి ఉండును మరియు బీన్స్
మూత్రపిండాల పనిని మెరుగు పరుచును.బీన్స్ ఆరోగ్యానికి అవసరమైన మినరల్స్,విటమిన్లను
కలిగి ఉందును.సంతులిత ఆహరం లో భాగంగా బీన్స్ ను భుజించిన శరీరం ఆరోగ్యంగా ఉందును.
..
ఆకుకూరలు ఎముకల
నిర్మాణమును పోలియుండును. ఎముకలకు పటిష్టత కల్పించును. ఎముకలు 23% సోడియం కలిగి
ఉందును. ఆకు కూరలలో సోడియం అధికంగా ఉందును.ఆకుకూరలు మానవ అస్థిపంజరం కు దృడత్వం
కల్పించును.
వెన్న పండు మరియు పియర్; ఇది ఆరోగ్యానికి మంచిది. ఇది స్త్రీ
గర్భాశయమును పోలిఉండును మరియు గర్భాశయమునకు బలమును ఇచ్చును. వారమునకు ఒక అవోకాడో
ఫలము (వెన్నపండు) తిన్న గర్భ హార్మోనులను సమన్వయపరిచి గర్భాశయ కాన్సర్ ను
నివారించును.
ఫిగ్స్ (అత్తి పళ్ళు) ఇవి గింజలను అధికముగా కలిగి ఉండును. పురుష వీర్యమును వృద్ది పరచి పురుష వీర్య
కణముల సంఖ్యను పెంచును
చిలకడ దుంప : ఇది క్లోమ గ్రంధి (పాంక్రియాస్) ను
పోలి మధుమేహమును నియంత్రి౦చును. క్లోమము (పాంక్రియాస్) పనిని మెరుగుపరచును. వీటిలో
బీటా కరోతిన్ అధికముగా ఉండి శరీరం లోని కణములను శిధిలము కాకుండా, క్లోమము (పాంక్రియాస్)
దెబ్బతినకుండా, కాన్సర్ రాకుండా కాపాడును.
ఆలివ్స్: ఇది ఆరోగ్యమును కాపాడి ఒవరీస్ సక్రమముగా పనిచేయునట్లు చూడును. ఆలివ్ ఆయిల్
అధికముగా తీసుకొన్న వారిలో గర్భాశయ కాన్సర్ ప్రమాదం 30% వరకు తగ్గును. కాన్సర్
కారక జీన్స్ ను తగ్గించును.
ఆరంజ్ ఇతర
సిట్రస్ జాతికి చెందిన ఫలాలు: . ఇవి స్త్రీ యొక్క పాల
గ్రంధులు (మామరి గ్లాన్డ్స్) ను పోలి ఉందును మరియు వక్షం యొక్క ఆరోగ్యానికి మరియు
వక్షం లోని లింపుల కదలికకు తోడ్పడును. వీటిలో ఉండే లిమోనోయిడ్స్ బ్రెస్ట్ కాన్సర్
రాకుండా కాపాడును మరియు కోలన్ కాన్సర్, పాంక్రియాస్ కాన్సర్, లివర్ కాన్సర్,
లుకేమియా మొదలగు అన్ని రకాల కాన్సర్ లను ఎదుర్కొనును.
అరటి
పండు: ఇది పెదవులను(lips) పోలి ఉందును దీనిని తినుటవలన సంతోషం కలుగును. ఇది త్రైతోఫాన్
(tryptophan) అనే ప్రోటీన్ ను కలిగి ఉందును మరియు అరటి పండు జిర్ణమైనప్పుడు మొదడు
లోని కణములను చైతన్య పరుచును మరియు నిరాశ(depression) కు ముఖ్య ఔషదం గా
పనిచేయును
ఉల్లిపాయ: ఇది శరిరములోని ఎర్ర రక్త కణజాలమును
పోలి ఉందును. ఉల్లిపాయ శరీరంలోని అన్ని భాగముల నుండివ్యర్ధమును తొలగించును.
కన్నీటిని తెప్పించి కంటి ని శుబ్రపరచును.
అల్లం : ఇది ఉదరమును పోలిఉండి జీర్ణక్రియకు తోడ్పడును. ఉదర సంబంధ వ్యాధులను
నివారించును. పేగుల లోని (bowel)గడ్డల పెరుగుదలను తగ్గించును..
కుక్కగొడుగులు: వీటిని సగంగా కోసిన ఇవి మానవుని చెవిని పోలియుండును. కుక్కగొడుగులు శ్రవణ
సామర్ద్యం ను పెంచును వీటిలో విటమిన్ డి అధికంగా ఉండును మరియు మెదడుకు శబ్దమును
అందించు చెవి లోని మూడు చిన్నఎముకలకు బలము
ఇచ్చును.
బ్రోకాలి: బ్రోకలీ పైన ఉండే ఆకుపచ్చని టిప్స్ కాన్సర్ సెల్ల్స్ ను పోలి ఉందును. ఇది
ప్రొటెస్ట్ కాన్సర్ తగ్గుదలకు ఉపయోగ పడును. దీనిని వారం పాటు భుజించిన ప్రొటెస్ట్
కాన్సర్ 45% వరకు తగ్గును.
జిన్సెంగ్ వెళ్ళు: ఇవి మానవ శరీర ఆకృతిని పోలిఉండును
అన్ని రోగములకు నివారణగా పని చేయును.
ఎర్ర ద్రాక్ష రసం : ఇది మానవ రక్తం ను పోలి ఉందును.ఎర్ర
ద్రాక్ష రసం అంటి-ఆక్సిడెంట్స్ మరియు పోలి ఫేనోల్స్ కలిగి రక్తం రూపం లో ఉందును.
దీనిని సేవించిన రక్తం లోని చెడు కొలస్త్రాల్ ను తగ్గించి గుండె నొప్పి రాకుండా
కాపాడును. రక్తం గడ్డ కట్టుటను తగ్గించును.
క్లామ్స్: (నత్త గుల్ల) :ఇవి పురుష
వృషణాలను పోలి ఉంది పురుష ప్రత్యోత్పత్తి అవయములకు బలము నిచ్చును. వీటిలో ఫోలిక్
ఆసిడ్ మరియు జింక్ అధికముగా ఉండి పురుషులలో విర్యమును వృద్ది పరుచును
అల్మొండ్స్: ఇవి కంటి ని పోలి కంటి కి ఆరోగ్యమును ఇచ్చును.
ఇందులో విటమిన్ –ఇ అధికముగా ఉండి
చర్మమునకు, వెంట్రుకలకు, కళ్ళకు శక్తిని ఇచ్చును. కొలస్త్రాల్ ను తగ్గించును.
అంటి-ఆక్సిడెంట్ గా పనిచేసి వార్ధక్యము త్వరగా రాకుండా చేయును మరియు కంటి చుట్టూ
ఉండే నల్లని వలయాలను తగ్గించును.
ఆలుచిప్ప (OYSTERS ) ఇది స్త్రీ యోని ని
పోలిఉండును. వీటిలో ఎమినో ఆసిడ్ లు అధికంగా ఉండి సెక్స్ హార్మోనులు టేస్తో
స్తేరోనే (testosternone) మరియు ఈస్ట్రోజెన్
లెవెల్స్ పెంచును. స్త్రీలకు ఈస్ట్రోజెన్ ఉపయోగకరం.
మిరపకాయ: ఇది పురుషావయమును పోలిఉండును. రక్త ప్రసరణను
పెంచును.