25 February 2014

వచ్చే2014 లోక్ సభ ఎన్నికలలో 10 %మంది కొత్త వోటర్లు


2014 లోక్ సభ ఎన్నికలలో మొత్తం 81.5 కోట్ల మంది వోటర్లు పాల్గొబోతున్నారు.వీరిలో పురుషులు 52.4% కాగా స్త్రీలు 47.6%  గా ఉన్నారు. 2009లో లోక్ సభ వోటర్ల సంఖ్య 71.4 కోట్లు గా ఉంది.  2009 లోక్ సభ ఎన్నికల కన్నా ఇప్పుడు అనగా 2014 లో  దాదాపు  10కోట్ల మంది అధికంగా,  అనగా మొత్తం వోటర్లలో 13.5% మంది అధికం గా వోటర్లుగా నమోదు అయినారు. ఇటివల ఎలెక్షన్ కమిషన్ ప్రకటించిన సవరించిన ఎన్నికల జాబితా ప్రకారం 2014 లో జరిగే లోక్ సభ  ఎన్నికలలో ఇంతవరుకు జరిగిన అన్నీ ఎన్నికలలో కన్నా అధికంగా 10% మంది కొత్త వోటర్లు అనగా మెదటిసారి ఎన్నికలలో వోటు చేసేవారు దాదాపు  3.91కోట్ల మంది  అదనంగా పాల్గొబోతున్నారు. ఇది ఒక రికార్డ్. 60సంవత్సరాల క్రితం మొదటిసారి జరిగిన ఎన్నికలలో కన్నా దాదాపు ఏదు రేట్ల మందిఅధికంగా ఈ సారి 2014 లో జరిగే ఎన్నికలలో వోటు వేస్తున్నారు. దేశ జనాభా లెక్కల ప్రకారం2014 లో  దేశ జనాభాలో 18 సంవత్సరాలకన్నా అధికం గా ఉన్న వారు 83.3 కోట్ల మండి ఉన్నారు. వీరిలో 98% మంది ఈ సారి జరిగి ఎన్నికలలో వోటు వేయుటకు నమోదు అయినారు.
   
మొదట సారి ఓటు చేసేవారిలో 18-19 సంవత్సరాల మద్య వయస్సు కలిగిన  2.3 కోట్ల మంది కొత్తగా   వోటర్లుగా నమోదు చేయించుకొన్నారు..   ఈ రికార్డును సమీప భవిషత్తు లో దాటే సూచనలు లేవు, ఎందుకనగా దేశ ఉత్తర ప్రాంతంలో కన్నా, దేశ దక్షిణ ప్రాంతం లో జననాల రేటు తగ్గుతుంది. వచ్చే ఎన్నికలలో 18-19 సవత్సరాల మద్యవయస్సు కలిగి , కొత్తగా వోటు నమోదు చేసుకొన్నావారిలో  96 లక్షల మండి  స్త్రీ వోటర్లు కాగా మొత్తం కొత్త వోటర్లలో  వారి శాతం 41% గా ఉంది. అదే పురుషులులలో కొత్తగా వోటు నమోదు చేసుకొన్నవారు 1.4 కోట్ల మంది ఉన్నారు

ఎలెక్షన్ కమిషన్ డాటా ప్రకారం 18-19 సంవత్సరాల మద్య వయస్సు కలిగి,వోటర్లుగా నమోదు చేసుకొన్న వారి సంఖ్య జార్ఖండ్ లో అధికంగా అనగా మొత్తం వోటర్లలో9% అధికంగా నమోదు అయినది. చత్తిస్గధ్ లో 4.9%,రాజస్తాన్ లో 4.8%,ఉండగా హిమాచల్ ప్రదేశ్ లో 1.3%.మహారాస్త్ర లో 1.4%, కేరళ మరియు కర్ణాటకా లో 1.8% గా ఉంది.

నాగాలాండ్ లో 18-19 సంవత్సరాల వయస్సు ఉండి కొత్తగా వోటు నమోదు చేసుకొన్న వారిలో స్త్రీ లు ఆదికముగా 50.4% ఉన్నారు. ఆతరువాత మిజోరాం, మణిపుర్ లలో 49.9% అధికంగా ఉన్నారు.. అదే విధంగా హర్యానాలో 28.3% గాను,మహారాష్ట్రా లో 35.5% గాను పంజాబ్,చండీగఢ్,గుజరాత్ లలో 36.2% గాను కొత్తగా వోటు నమోదు చేసుకొన్నవారిలో స్త్రీలు ఉన్నారు. యూ.పి. లో 18-19 సంవత్సరాల మద్య వయసు ఉన్నవారు 30.81లక్ష మంది ఉన్నారు వీరిలో పురుషులు 60.4% కాగా స్త్రీలు 39.6% గా ఉన్నారు.  దేశ వ్యాప్తం గా ఉన్న  మొత్తం వోటు చేసే వారి సంఖ్యలో  18-19 సంవత్సరాల మద్య వయస్సు కలిగిన వారి శాతం కేవలం 2.8% మాత్రమే ఉంది.
 
80 స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ లో కొత్తగా నమోదు చేసుకొన్న1.8 కోట్ల మంది వోటర్లతో సహా మొత్తం 13.44 కోట్ల మంది అనగా దేశం లోని మొత్తం వోటర్లలో 16% శాతం కలిగి ఉంది.  మహారాస్ట్రా లో 7.9 కోట్లమంది అనగా దేశం లోని మొత్తం వోటర్లలో 9.69%శాతం  కలిగి ఉంది, పశ్చిమ బెంగాల్ లో 6.25 కోట్ల మంది అనగా దేశం లోని మొత్తం వోటర్లలో 7.69%శాతం ,ఆంధ్ర ప్రదేశ్ లో 6.24 కోట్ల మంది అనగా దేశం లోని మొత్తం వోటర్లలో 7.65%శాతం ను , బిహార్లో 6.21 కోట్ల మంది, అనగా దేశం లోని మొత్తం వోటర్లలో 7.62%శాతం ను  కలిగి ఉంది.  డిల్లీ లో 1.21 కోట్ల మంది మొత్తం వోటర్లు గా నమోదు అయినారు.

లోక్ సభ లోని మొత్తం545 స్థానాలలో, 120 స్థానాలకు ప్రతినిద్యం వహించే యూ.పి.,బిహార్ దేశం లోని మొత్తం వోటర్లలో25% వోటర్లను కలిగి ఉన్నారు.  యూ.పి.,మహారాష్ట్రా,పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు దేశం లోనే అత్యధిక వోటర్లను కలిగిన పెద్ద రాష్ట్రాలుగా ఉన్నాయి. 3.62లక్షల వొట్ల తో లేదా మొత్తం దేశం లోని వోటర్లులలో 0.044% శాతం తో సిక్కిం అత్యంత తక్కువ వోటర్లను కలిగి ఉంది. గుజరాత్ లో 4 కోట్ల మంది లేదా దేశం మొత్తం వోటర్లలో 4.89% మంది వోటర్లు ఉన్నారు.
భారత దేశం లోని 28 రాష్ట్రాలలో, దేశం లోని మొత్తం వోటర్లలో 98,27%, డిల్లీ లో 1.48%, మిగతా 6 రాష్ట్రాలలో 0.253% వోటర్లు నమోదు అయినారు.  యూ.పి. లో 15.5% మంది, ఉత్తరా ఖండ్ లో 15.3% మంది, రాజస్తాన్ లో 14.2%,బిహార్ లో 13.9%,ఛత్తీస్ ఘడ్ లో 13%, పుంజాబ్ లో 11.8%, మేఘాలయాలో 21%, పందుచ్చేరి లో 15.8%, త్రిపురాలో 14.4% చండీగడ్ లో 11.5%, దాద్రా-నాగర్ హవేలి లో 25%, తమిళ్ నాడులో 29.3% మండి, హర్యానా లో 28% మండి, మద్య ప్రదేశ్ లో 25% మంది,వెస్ట్ బెంగాల్ లో 19% కొత్తగా వోటర్లుగా నమోదు చేసుకొన్నారు.
గత 20 సంవత్సరాలలో వోటు నమోదు చేసుకొన్న వారి సంఖ్య దేశవ్యాప్తం గా  64%పెరిగింది. దేశ జనాభా 43% పెరిగింది.గత  20సంవత్సరాలలో డిల్లీ వోటర్లు రెండింతలు కాగా,యూ.పి. లో 70%,మద్య ప్రదేశ్ ,బిహార్ లలో25% వోటర్లు పెరిగినారు. కేవలం గత 10సంవత్సరాలలో వెస్ట్ బెంగాల్ లో వోటర్లు 30% పెరిగినారు. 
దేశం లోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి మొత్తం 0.0035% “ఇతర” ఓటర్లు ఉన్నారు. “ఇతర” వోటర్లు అధికం గా కర్ణాటకలో2589 మంది,   ఆతరువాత ఉత్తర ప్రదేశేష్ లో అధికం గా ఉన్నారు.
భారత దేశం లో క్రమం గా స్త్రీ వోటర్ల సంఖ్య పెరుగు తుంది. వోటు నమోదు, వోటు హక్కు వినియోగం స్త్రీలలో పెరుగు తుంది. 2014 లోక్ సభ ఎన్నికలకు గాను 8రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలలో స్త్రీ వోటర్లు,పురుష వోటర్ల కన్న అధికం గా ఉన్నారు. డిల్లీ లో దేశం లో కల్లా అతి తక్కువుగా స్త్రీవోటర్లు 44.57% గా ఉన్నారు, ఆ తరువాత యూ.పి. లో 45.2% స్త్రీ వోటర్లు ఉన్నారు.అత్యధికంగా పాందుచ్చేరి లో స్త్రీ వోటర్లు 52%,కేరళలో 51.9% ఉన్నారు.

మొన్న జరిగిన డిల్లీ ఎన్నికలలో ప్రతి వెయ్యి మంది పురుష వోటర్లకు 804 మండి స్త్రీ వోటర్లు నమోదు అయినారు. అదేవిధం గా మొన్న జరిగిన 5 రాష్ట్రాల శాసన సభ ఎన్నికలలో 3 రాష్ట్రాలలో అధికం గా స్త్రీ వోటర్లు తమ వోటు వినియోగించుకొన్నారు. 2రాష్ట్రాలలో స్త్రీ పురుష వోటర్ల మద్య వోటు వినియోగం లో తేడా బాగా తగ్గింది. 1962 నుంచి 2012 వరకు జరిగిన 16 పెద్ద రాష్ట్రాల ఎన్నికలలో మొత్తం మీద ప్రతి వెయ్యి మండి పురుష వోటర్లకు 883 వరకు స్త్రీవోటర్లు వోటు హక్కు వినియోగింఛు కొన్నారు.  

 16 February 2014

రష్యా లో ఇస్లాం


పూర్వచరిత్ర:
ఇస్లాం తో రష్యాకు పరిచయం 7వ దశాబ్ధం తో ప్రారంభం అయినది. 642 లో అజర్ భైజన్ ముస్లిం పరిపాలన క్రిందకు వచ్చినది. తూర్పు కకాసియా(ఒఫ్కాజ్) విజయం తరువాత,673 లో ముస్లింలు ఒక్సస్ నదిని దాటినారు, 674 లో బుఖార ముస్లింల వశమైనది. 8 వ శతాబ్ధం లో ఉజెబెకిస్తాన్ ముస్లింల వశమైనది. ఉజబెకిస్తాన్ అనేక మంది  ప్రముఖ ఇస్లామిక్  పండితులకు  (హదీసు, ఫికా,తత్వశాస్త్రం,వైద్యరంగంము ,గణితములో ప్రముఖులు)  జన్మనిచ్చినది.ఆతరువాత తజికిస్తాన్ ప్రజలు  పూర్తిగా  ఇస్లాం స్వీకరించినారు.  వోల్గా బుల్గరియాలో  922 లో ఇస్లాం రాజ్యం ఏర్పడింది. దానినుండి తాతర్లు ఇస్లాం స్వీకరించారు. ఆతరువాత యూరోపియన్,కాకసియన్ టర్కిష్ ప్రజలు ఇస్లాం స్వీకరించినారు. 10 వ శతాబ్ధం నాటికి మద్య ఆసియా ప్రాంతం లో ఇస్లాం వేగం గా విస్తరించినది ఇస్లామిక్ చరిత్ర, సంస్కృతికి ప్రధాన కేంద్రాలుగా మద్య ఆసియా ప్రాంతం మారింది.తాతర్, బాష్కర్,కాజన్, ఉరల్ మరియు వోల్గా నది లోయలో దాదాపు ఒక కోటి మంది వరకు  ముస్లింలు ఉండేవారు. 10 శతాబ్ధం లో ఇస్లామిక్ వ్యాపారులు యూరోపియన్ రష్యా వాసులకు ఇస్లాం పరిచయం చేసినారు.  
రష్యా సామ్రాజ్యం లో :
16వ శతాబ్ధాపు మద్య భాగం నుండి 20 వ శతాబ్ధాపు ప్రారంభం వరకు ముస్లిం ప్రాంతాలపై రష్యాన్ల ఆధిపత్యం కొనసాగింధి.రష్యా లో ఇస్లాం ఉనికి 1552 లో కజన్ ఖాన్తే విజయం తోప్రమాదం లో పడింధి . ఈ విజయం వోల్గా మద్యభాగం లోని  తాతరులను, బష్కిర్లను రష్యా ఆధీనము లోనికి తెచ్చినది. 1556 లో వోల్గా దిగువ ముస్లిం అస్త్రఖాన్ ఖాన్తే రష్యా సామ్రాజ్యం లో విలీనమైనది. 16వ శతాబ్ధం లో సైబీరియా ఖాన్తే రష్యా వశమైనధి. 1739 లో క్రిమియన్ ఖాన్తే రష్యా సామ్రాజ్యం లో విలీనమైనధి. 17,18 శతాబ్ధాలలో ఉత్తర కకాసుస్ ప్రాంతానికి చెందిన డగేస్తాన్,చెచెన్యా,ఇంగుష్ మరియు ఇతరులు రష్యా లో కలపబడినారు. సీర్కస్సియనస్,ఉజబెక్కులపై రష్యా విజయము వారిని మూహాజీర్లు గా మార్చింది. స్వతంత్ర రాజ్యలైన మద్యాసియా,అజర్ భైజానులు రష్యా లో విలీనమైనవి. తాతర్ ఖన్తే పై విజయము తో ముస్లిం ప్రాంతాలను రష్యా లో విలీనం చేయడం క్యాడరిన్ డి గ్రేట్ ఆగమనం తో పూర్తి అయినది.  
1552 లో కాజన్ విజయం తరువాత 1762 లో క్యాథరిన్ ది గ్రేట్ సింహాసనాన్ని, అధిస్టించేవరకు  ముస్లిం లను ఒక పద్దతి ప్రకారము, వివక్షతతో,ఇస్లాం సంస్కృతిని, మసీదులను నాశనము చేయడం జరిగింది.  మొదట్లో రష్యా పాలకులు ఇస్లాం పట్ల కొంత సానుభూతిని చూపారు. కజక్ లో ఇస్లాం వికాసానికి అంగీకరించారు. 1801 లో రష్యా లోని కజన్ లో మొదటి ఖురాన్ ప్రచురించబడినది.  కానీ ఆ తరువాత ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతాలనుండి వారిని తరలించి ముస్లిమేతరులను  ఆ ప్రాంతాలకు పంపి  వారికి భూమి హక్కులు కల్పించి ఆప్రాంత ముస్లింలను ముఖ్యంగా దక్షిణ ఉరల్ ప్రాంతాలు, ఆటోమన్ టర్కీ ప్రాంతాలవారిని  మైనారిటి లు గా చేసినారు.సీర్కస్సియన్,క్రిమియన్ తాతరులు మరియు కాకసుస్ ముస్లింలను,దాదాపుగా  నిర్మూలించినారు. ముస్లింలను బలవంతం గా ఆటోమన్ సామ్రాజ్యంనకు పారద్రోలినారు.లేదా ముస్లింలను దూరంగా ఉన్న వేరే ప్రాంతాలకు తరలించినారు ఉదా: తాతరస్థాన్  (tatarastan) లో నివసించే తాతర్ల కన్నా బయట ప్రాంతాలలో నివసించే తాతర్లు ఎక్కువ.
జారిస్ట్ రష్యా :
జారిస్ట్ రష్యా,లో  కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది.
సోవియట్ యూనియన్-కమ్యూనిస్టుల పాలనలో:
1917 లో కమ్యూనిస్టులు అధికారం స్వీకరించేనాటికి  సోవియట్ యూనియన్ లోని 16 రాష్ట్రాలలో 8 రాష్ట్రాలలో ముస్లింలు ఎక్కువగా ఉండేవారు. సోవియట్ యూనియన్ లోని ఉజబెకిస్తాన్, తజకిస్తాన్,అజర్ బైజాన్, జార్జియా –అర్మేనియా, కజకస్తాన్, కిర్ఘిజియా, తాతర్-బష్కర్, కాకసియా, మరియు క్రిమియాలో ముస్లింలు అధికం గా ఉండేవారు. 1917 విప్లవం సమయము లో లెనిన్ మరియు స్టాలిన్ ఒక సంయుక్త ప్రకటనలో రష్యన్ ముస్లిం లకు పూర్తి మత స్వేచ్చను ప్రసాదించినారు. కానీ అనతికాలం లోనే కమ్యూనిస్టులు తమ వాగ్ధానమును మరచి ముస్లిం రాజ్యాలను ఆక్రమించినారు.  1918 రష్యా రాజ్యాంగం రష్యన్ ప్రజలకు మత  స్వేచ్చను కల్పించినది. కానీ మత   ప్రచారం నిషేడించబడినది. మతవ్యతిరేక ప్రాపగాండా చేయబడినది 
కమ్యూనిస్టుల పరిపాలనలో ముస్లింలు నివసించే ప్రాంతాలు వలసలుగా మారినాయి వారి ఆర్థిక వనరులు, సహజ సంపద దోపిడిచేయబడినవి. స్వేచ్చను కోల్పోయినారు.1940 నాటికి దాదాపు 50వేలమంది ముస్లిం ఉలేమాలు ప్రాణాలు కోల్పోయిరి. 1941 నాటికి తుర్కిస్తాన్ లోని దాదాపు 14 వేల మసీదులు మూసివేయబడినవి. ముస్లింలు  బల్మీక్ అనగా ప్రత్యేకతావాదులు,మతవాదులు గా ముద్ర వేయబడిరి. బల్మీక్ గా ముద్ర పడేవారిని వెంటనే హత్య చేసేవారు. కమ్యూనిస్టుల పాలనలో ఇస్లాం అణిచివేతకు, వివక్షతకు గురిఐనది. అనేక మసీదులు మూసివేయబడినవి. తాతరస్తాన్ లో 83% మసీదులు మూసివేయబడినవి. కజన్ లోని మార్కానీ మసీదు మాత్రమే  పనిచేసినది
సోవియట్ యూనియన్ పతనం – ఆధునిక రష్యా ఫెడరేషన్  లో ముస్లింలు
ప్రస్తుత రష్యా ఫెడరేషన్  లో అత్యధికులు ఆరాధించే మతములలో రెండోవది  ఇస్లాం. రష్యా లోని సంప్రదాయక,చరిత్రాత్మక వారసత్వం గల  మతాలలో ఇస్లాం ఒకటి. 14 కోట్ల రష్యా జనాభా లో, 2కోట్ల మంధి వరకు ఇస్లాం ఆరాదించేవారు ఉన్నారు వారు మొత్తం రష్యన్ ఫెడరేషన్ జనాభా  లో దాదాపు  15% వరకు ఉన్నారు. ముస్లింలు అధికం గా వోల్గా ప్రాంతం, ఉత్తర కకాసుస్ లో కలరు. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్ఘ్ అర్బన్ ప్రాంతాలలో కలరు.  ఉత్తర కాకసుస్ ప్రాంతం లోని బ్లాక్ సీ –అస్పియన్ సీ మద్య సిర్కాసియన్స్,అడిఘే,బాల్కర్స్, చెచెన్స్, ఇంగుష్, కబర్దీన్,కరచాయ్ మరియు  డగేస్తాన్ ప్రాంతాలలో  ముస్లింలు నివసించుచున్నారు. వోల్గా,బాసీన్ ప్రాంతాలలో నివసించే తాతర్లు, బష్కీర్స్ లలో లో అధికులు ముస్లింలు.
రష్యా ముస్లిం లలో సున్నిలు,షియాలు,సూఫీ లు కలరు. ప్రస్తుత రష్యా భూభాగం లోని తొలి ముస్లింలు గా  దేర్బెంట్ ప్రాంతం లోని డగేస్తాన్ ప్రజలను పేర్కొనవచ్చును. రష్యాలోని సున్నీ ముస్లింలు  అధికంగా డగేస్తాన్ లో నివసిస్తున్నారు. షియాలు కాకసుస్ ప్రాంతంలో కలరు.  20వ శతాబ్ధం లో రష్యా లో ప్రారంభమయిన “వైసీ” ఉద్యమము రష్యా ఇస్లామిక్  చరిత్ర లో ప్రధానమైన ఘట్టము. “ఇత్తేఫాక్ అల్-ముస్లిమీన్ పార్టీ” రష్యా “డూమా” (పార్లమెంట్) లో మైనారిటీ ముస్లింలకు ప్రాతినిద్యం వహించుతున్నది.
 1990 తరువాత ఇస్లాం పట్ల రష్యా పాలకుల దృక్పదము లో మార్పు వచ్చింది. మక్కా హజ్ యాత్రకు అనేక మంది ముస్లింలకు అనుమతి లబించింది.  1995 తరువాత స్టాపించబడిన “నూర్ అల్ రష్యా ముస్లిం పబ్లిక్ మూవ్మెంట్మె”, ముస్లిం మరియు ఇతర మైనారిటీ వర్గాల రాజకీయ, ఆర్థిక,సంస్కృతి హక్కులను కాపాడ సాగింది. మాస్కో లో 1991లో ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ ఆఫ్ రష్యా స్థాపించబడినది.దానిచే మదారస నిర్వహింపబడుచున్నది. రష్యన్ బాషలో డగేస్తాన్ నుండి  ముస్లిం మ్యాగజైన్లు  వెలుబడ సాగినవి.
మాస్కో లోని అర్బన్ ముస్లింల తరువాత ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తాతారస్థాన్ లోని కజన్ లో రష్యన్ ఇస్లామిక్ యునివర్సిటి స్థాపించబడినది. డగేస్తాన్ లో అనేక ముస్లిం యూనివర్సిటీలు, మదర్శాలు స్థాపించబడినవి. దివ్య ఖురాన్ గ్రంధం అందరికీ లభించసాగినది.. ముస్లిం జనాభా అధికం గా ఉన్న చోట మసీదులు నిర్మించబడినవి.   తాతరస్తాన్,బష్కోర్తోస్తాన్ లోఇస్లామిక్ సెంటర్లు కలవు. వోల్గా నది వొద్దున గల తాతరస్తాన్ లో 1150 మసీదులు కలవు. దాని రాజధాని కజన్ లో రష్యా మరియు యూరప్ లోకల్ల అతిపెద్దదైన 16వ శతాబ్ధం లో నిర్మించబడిన  కొల్శరీఫ్ మసీదు కలదు తల్గట్ తాజుద్దీన్ రష్యా ప్రధాన ముఫ్తీ గా పనిచేశారు.
రష్యా లో ముస్లింలలో అధికులు సున్నిలు.5% మంది షియాలు ఉన్నారు. డగేస్తాన్,చెచెన్యా లో సున్నీ సూఫీ శాఖలైన నక్ష్ బంది,షాధిలి వారు కలరు. అజర్ బైజాన్ వాసులు షియాలు. రష్యా లో అధికంగా వ్యాప్తి చెందుతున్న మతం గా ఇస్లాంను చెప్పుతున్నారు. కొందరి అబిప్రాయం ప్రకారం 2050 నాటికి రష్యా లో ఇస్లాం అనుయాయులు గణనీయంగా వ్యాప్తి చెందుతారు. 2010 లో దాదాపు 20 వేలమంది రష్యన్ ముస్లింలు హజ్ యాత్ర చేసినారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో హజ్ యాత్ర చేయుటకు సౌదీఅరేబియా అనుమతి కోరుచున్నారు.
1991లో సోవియట్ యూనియన్ పతనమైన తరువాత పూర్వపు సోవియట్ రేపుబ్లిక్లకు చెందిన ముస్లింలు ఉద్యోగా ఉపాధి అవకాశాలను వేడుకొంటూ రష్యన్ ఫెడరేషన్ లోనికి వలస వస్తున్నారు. మాస్కో నగరం లో దాదాపు 8లక్షల ముస్లింలు నివసిస్తున్నారు. మొత్తం రష్యా ముస్లిం జనాభాలో వీరి శాతం 4% మరియు ఆయిల్ నిల్వలు అధికంగా ఉన్న ట్యూమెన్ ప్రాంతం (కజఖస్తాన్ సరిహద్దు)లో ఇంకో 3% మంది నివసిస్తున్నారు.
రష్యా ఫెడరేషన్ లోని 184 ఎథినిక్ గ్రూప్ ల లో 56 గ్రూప్ లు ప్రధానంగా ముస్లిం గ్రూప్ లు. రష్యా ఫెడరేషన్ లోని ముస్లింలలో సగం మండి తాటర్లు, బష్కిర్స్. రష్యా ముస్లిం జనాభాలో తాటర్లు 33%, బష్కిర్ర్లు 11% ఉన్నారు. చెఛన్లు 10%, మిగతావారు, కజకులు,అజేరిలు,ఉజ్బెక్కులు,తజికిలు,తుర్కుమాన్లు,మరియు కిర్గిజ్లు.
రష్యా ఫెడరేషన్ లోని ముస్లింలు కొన్ని ప్రాంతాలలో ఎక్కువుగా ఉన్నారు. రష్యా లోని ప్రతి ఐదుగురు ముస్లింలలో నలుగురు, ఏడు ఫెడరల్ జిల్లాలలోని రెండు జిల్లాలలో అనగా వోల్గా మరియు దక్షిణ జిల్లాలలో ఉన్నారు. 2009 లెక్కల ప్రకారం రష్యా ముస్లింలు తమ  సంప్రదాయక ప్రాంతాలు  అనగా డగేస్తాన్ (17%),బశ్కోర్తోస్తాన్ (15%) తాతారాస్తాన్ (14%) చేచన్యా  (7%) కబర్దీనో-బాల్కరియా (5%) లో నివసిస్తున్నారు. కొద్దిసంఖ్యలో ముస్లిం లు తమ సంప్రదాయక ప్రాంతాలు ఐనా ఇంగుషేతీయ(3%) కరచావో (2%)మరియు అడ్గెయా లో (1%) నివసిస్తున్నారు. మిగాతా వారు రష్యన్ ఫెడరేషన్ లోని మిగతా ప్రాంతాలలో నివసిస్తున్నారు. అనగా 2/3వంతు  ముస్లింలు తమ సంప్రదాయక ముస్లిం  నివాస ప్రాంతాలలోనే నివసిస్తున్నారు.
 రష్యా లో యూరోప్ లోకన్న అధికంగా ముస్లింలు ఉన్నారు. ప్రతి సంవత్సరము రష్యన్ ఫెడరేషన్ లో ముస్లిం జనాభా అభివృద్ధి 0.6% గా ఉంది. రష్యన్ రిపబ్లిక్ లో ముస్లిం జనాభా పెరుగుదలకు అనేక కారణాలు కలవు. ముస్లిం స్త్రీలకు పిల్లలు ఎక్కువ ఉదా. సరాసరి 2.3 పిల్లలు ఉంటారు. ముస్లిం స్త్రీలలో వివాహితలుఎక్కువ, విడాకులు తీసుకొని వారి సంఖ్య చాలా తక్కువ. ముస్లిం స్త్రీలలో అబార్షన్ చేయించేవారి సంఖ్య చాలా తక్కువ.
రష్యాన్ల సరాసరి జననాల రేటు కన్నా ముస్లింల జననాల రేటు అధికంగా ఉంది. రష్యన్ ముస్లిం స్త్రీల పునరుత్పాదన రేట్ 2.3 గా ఉంది. 2005-10 లెక్కల ప్రకారం ప్రతి 100మంది రష్యన్ ముస్లిం స్త్రీలకు,94 మంది పురుషులు కలరు
 రష్యా ఫెడరేషన్ 2002 జనాభా లెక్కల ప్రకారం ముస్లిం జనాభాలో 50% మంది సగటు వయస్సు 30 కు తక్కువ అనగా యువకుల శాతం అధికం. ముస్లిం జనాభాలో 25% మంది సగటు వయస్సు 15 కు లోపు. రష్యా ముస్లిం లలో 45 స. దాటివారు 27%,అరవై దాటినవారి సంఖ్యా 14% ఉంటుంది.
రష్యా ప్రెసిడెంట్ గా పనిచేసిన డిమెట్రి మెద్విదేవ్ “రష్యా,  ముస్లిం ప్రపంచం తో ప్రత్యేకంగా  స్నేహం చేయాలసిన అవసరము లేదు ఎందుకంటే రష్యా ఇస్లామిక్ ప్రపంచం లో ఒక భాగం” అని అన్నారు.
మద్య ఆసియా లోని  ముఖ్య ఇస్లాం ప్రాంతాలు 

ప్రాంతం పేరు
రాజధాని
జనసంఖ్య
1
అజర్ భైజన్
బాకు
0,71,46,000
2
కజఖిస్తాన్
అల్మ-ఆట
1,66,90,000
3
కిర్ఘిజియా
బిస్ఖెక్
0,43,42,000
4
తజికిస్తాన్
దుషాంబే
0,54,00,000
5
తుర్క్మెనిస్తాన్
అస్ఖాబాద్
0,36,21,700
6
ఉజెబిక్స్తాన్
తాష్కెంట్
2,03,22,000
తాతర్లు నివసించే క్రిమియా ప్రాంతం లో కూడా ముస్లిం లు కలరు.
మద్యాసియా లో ముస్లింలు నివసించే ప్రాంతాలు వ్యూహాత్మకంగా, రక్షణ దృష్ట్యాకీలక స్థానం లో ఉన్నాయి. ముస్లిం ప్రాంతాలు సహజ సంపదలతో నిండిఉన్నాయి.బంగారు గనులు ,ఖనిజాలు, చమురు,గ్యాస్  నిల్వలు,వ్యవసాయ ఉత్పత్తులు  అధికంగా ఉన్నాయి.
రష్యన్ ఇస్లామిక్ ప్రముఖులు:
·       వ్లాదిమిర్ ఖోడోవ్,
·       అలెక్సాండర్ లిత్వినేకో -                     రష్యా గూఢాచార సంస్థ ఉద్యోగి
·       ఆంటోన్ క్రోతోవ్-                     ట్రావెలర్,
·       వలెరీ కోరోవిన్ –                    రష్యా రాజనీతి శాస్త్రవేత్త,జర్నలిస్ట్
·       వ్యచేస్లావ్ పోలోసీన్-                ప్రొఫెసర్ మరియు  రష్యన్ అర్థోడాక్స్ చర్చ్ ప్రీస్ట్
·       మారియా అలకినా –               రష్యన్ పాప్ గర్ల్ గ్రూప్ ఫబ్రిక సబ్యురాలు.
·       మాక్సిం ట్రెఫాన్ –                   రష్యన్ రాక్ బ్యాండ్ సబ్యుడు
·       సెర్గి రోమనోవిచ్ –                   రష్యన్ నటుడు. 

ఆధారాలు:

1.     Wikipedia

2.     Wiki Islam

3.     Muslim Russia - Daniel Pipes

4.     Russiapedia

5.     Islam in Russia:  Abdur Rauf

6.     Muslims in the USSR Seeking a New DawnA Kalaam

7.     The Future of the Global Muslim Population – Pew Research Religion & Public Life Project
అమెరికా లో ఇస్లాం


అమెరికా తో ఇస్లాం కు పరిచయం కొలంబస్ అమెరికాను కనుగొనక పూర్వమే ప్రారంభమైనది. కొలంబస్ పోర్చగీసు ముస్లిం నావికులు వ్రాసిన పుస్తకం  సహాయం తో అమెరికాను కనుగొన్నాడు అనటానికి  ఆధారాలు ఉన్నాయి.14వ శతాబ్ధం లో  ఆఫ్రికా లోని సెనెగల్-జాంబియా ప్రాంతానికి చెంది,స్పెయిన్ నుండి వెలివేయబడిన “మూర్లు” కరేబియన్, మెక్సికో జలసంధి ప్రాంతాలలో స్థిర నివాసం ఏర్పర్చుకొన్నారు. 16వ శతాబ్ధం లో ఇస్తఫాన్ అనే ముస్లిం స్పానిష్ గైడ్ సహాయం తో స్పెయిన్ వారు నూతనప్రపంచం(new world) ముఖ్యం గా ఆరిజోనా,న్యూ మెక్సికో ప్రాంతాలను జయించినారు.
అమెరికా స్వాతంత్ర్యం పొందక పూర్వమే అమెరికా లో ముస్లిం లు ఉన్నారు.. మొదట్లో ఆఫ్రికా నుండి అమెరికా కు తీసుకు రాబడిన బానిసలలో 10% మంది ముస్లింలు. అమెరికాకు వలస వచ్చిన మొదటి ముస్లింలలో ఆఫ్రికా కు చెందిన నల్లజాతి బానిసలే  అధికులు. అమెరికా విప్లవ పోరాటం లో పాల్గొని పేరు సంపాదించిన ముస్లిం మతస్తులలో సలీం పూర్ (Salem  Poor,)యూసఫ్ బెన్ అలీ, బంపేట్ ముహమద్,ఫ్రాన్సిస్ సబా,జోసఫ్ సబా చెప్పుకోదగిన వారు.1777 లో అమెరికా ను స్వతంత్ర దేశం గా మొరాకో గుర్తించినది. మొదటినుండి అమెరికా లో ముస్లిం లకు మతస్వాతంత్రం ప్రసాదించబడినది.1805 లోనే అమెరికా ప్రెసిడెంట్ థామస్ జఫర్ సన్ అద్యక్ష భవనం వైట్ హౌస్ లో ఇఫ్తార్ విందు ఇచ్చినారు. ఇస్లాం స్వీకరించిన తొలి ప్రముఖ ఆంగ్లో-అమెరికన్ లలో అలెక్సాండర్ రస్సెల్ వెబ్ ముఖ్యుడు ఇతడు 1893 లో జరిగిన ప్రపంచమతాల పార్లమెంట్ లో ఇస్లాం కు ప్రాతినిద్యం వహించినాడు.
19 శతాబ్ధాపు ద్వితీయార్ధం లో అనేక  మంది ముస్లింలు అమెరికా వలస  వచ్చిరి. వీరిలో  చాలా మంది అమెరికాలోనే స్థిరపడిపోయినారు. వీరు ప్రపంచంలోని వివిద ప్రాంతాలనుండి వచ్చిన ముస్లిం లతో కలసి అమెరికా లోని అనేక భాగాలలోని  పట్టణాలలో, పల్లెలలో స్థిర  నివాస సమూహాలను ఏర్పర్చసాగినారు.  20 శతాబ్ధాపు ద్వితీయార్ధం లో అరబ్ ప్రాంతాలనుండియే కాక, దక్షిణ ఆసియా ,ఆగ్నేయ ఆసియా, టర్కీ,ఇరాన్, ఆఫ్రికా లోని అనేక ఇతర  ప్రాంతాలనుండి అధిక విద్యాబ్యాసము, ఆర్థిక శక్తి కలిగిన వారు అమెరికా వలస వచ్చిరి. వీరే కాక ఇటీవల అస్థిరతకు లోనుఐన అనేక అరబ్ ప్రాంతాలనుండి కూడా ముస్లిం శరణార్ధులు అమెరికా వలస వచ్చిరి 
          అమెరికా లో ఇస్లాం స్వీకరించిన వారిలో 64% ఆఫ్రికన్-అమెరికన్లు, 27% తెల్లజాతీయులు,6% హిస్పానికులు, 3% ఇతరులు20 శతాబ్ధాపు మద్య భాగం లో చెప్పుకోదగిన సంఖ్యలో ఆఫ్రికన్-అమెరికన్ లునేషన్ ఆఫ్  ఇస్లాం” (Nation of Islam) అనే సంస్థ ద్వారా ఇస్లామిక్ అస్తిత్వాన్ని పొందినారు. ది నేషన్ ఆఫ్ ఇస్లాం సంస్థ 1930 లో వాలాస్ డి. ఫర్డ్ ద్వారా స్థాపించబడినది. వీరు నల్ల జాతీయుల అస్తిత్వాన్ని,కాపాడటానికి, నల్ల జాతీయుల ఆర్థికాభి వృద్ధికి పాటుపడినారు.. దీనితో పాటు ఇస్లామిక్ సొసైటి ఆఫ్ నార్త్ అమెరికా(ISNA ),అమెరికన్ ముస్లిం మిషన్ (AMM),ముస్లిం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (MET)అమెరికన్ ముస్లిం కౌన్సిల్(AMC), ముస్లిం స్టూడెంట్ అస్సోషియేషన్ (యునైటెడ్ స్టేట్స్)(MSA(US),  వంటి సంస్థలు అమెరికా లోని ముస్లింల అభివృద్ధి కొరకు పనిచేస్తున్నాయి.
          మొత్తం అమెరికా దేశ జనాభాలో ముస్లింల శాతం  3% కన్నా తక్కువగానే ఉంది.అమెరికా లోఉన్న  మొత్తం ముస్లింలలో సున్నిలు 50%, షియాలు20% ఉండగా , డ్రుజ్,అహమ్మదియాలు,సూఫీలు వంటి  ఇతర శాఖల వారు  కూడా కలరు. అరబ్ ముస్లింలు ల లో అధికులు సున్నిలు, దక్షీణ ఆసియా ముస్లింలలో ఆదికసంఖ్యాకులు సున్నిలు. ఇరాన్ ముస్లింలలో అధికులు షియాలు, ఆఫ్రికన్-అమెరికన్ ముస్లింలలో అధికులు సున్నిలు కలరు.ముస్లిం అస్తిత్వాన్ని,సంఖ్యను, జాతీయ,ప్రాంతీయ స్థాయి లలో కాపాడటానికి అనేక ముస్లిం సంస్థలు కృషి చేస్తున్నాయి. ముస్లిం మసీదులు, ఇస్లామిక్ సెంటర్లు,ముస్లిం స్కూళ్ళ నిర్మాణం గత కొన్ని సంవత్సరాలుగా బాగా పెరిగింది.
          అమెరికా ముస్లిం జనాభా పై బిన్నాభిప్రాయాలు కలవు. 2మిలియన్ల నుండి 10 మిలియన్ల వరకు, ఇంకా అంతకన్నా అధికం గా ఉండవచ్చు అని కొందరి అంచనా .ప్రతి సంవత్సరం అమెరికా లో ముస్లిం ల జనాభా 6% వృద్ధి రేటును కలిగి ఉంది. అమెరికా మొత్తం జనాభాలో ముస్లిం శాతం 2.11%  లేదా వీరి సంఖ్య దాదాపు 61 లక్షల వరకు ఉంటుంది (2013). అమెరికా లోని మొత్తం  ముస్లిం లలో దక్షిణ ఆసియా కు చెందిన వారు 34%, అరబ్బులు 26%,ఆఫ్రికన్ అమెరికన్లు 25%, ఇతరులు 15% కలరు.  20 శతాబ్ధం లో అమెరికా లో ముస్లిం జనసంఖ్య భాగా పెరిగింది దీనికి ప్రధాన కారణము ముస్లిం లలో అధిక జననాల రేటు మరియు అరబ్, దక్షిణ ఆసియా ప్రాంతాలనుండి ముస్లిం లు అధిక సంఖ్యలో  అమెరికాకు వలస రావడమని చెప్పవచ్చును.
          అమెరికన్ ముస్లిం లలో 65% మండి మొదటి తరం వలసవాదులు, 35% అమెరికా లో జన్మించినారు.  వలసవాదులలో 37% అరబ్ ప్రాంతాలనుండి, 27% సౌత్ ఆసియన్ దేశాలనుండి, 8% యూరప్ నుండి, 6%సబ్-సహారా ప్రాంతాలనుని వలస వచ్చినారు. అమెరికన్ ముస్లిం లలో 80% మంది  అమెరికా పౌరులు,  ప్రతి 5గురు అమెరికన్ ముస్లిం లలో ఒకరు ముస్లిం మతం స్వీకరించిన వారు.
            అమెరికా లోని రాష్ట్రాలలో మిచిగాన్ రాష్ట్రం లో ముస్లిం లు అధిక సంఖ్యలో కలరు.ఆతరువాత న్యూ యార్క్, కాలిఫోర్నియా,మేరి లాండ్, వర్గీనియా ,న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా రాష్ట్రాలలో కూడా అధికంగానే కలరు.అమెరికా ముస్లిం లలో 55% మంది  నగరాలలో, 44% సబర్బన్ ప్రాంతాలలో 1% మండి రూరల్ ప్రాంతాలలో నివసిస్తున్నారు.
          న్యూ యార్క్ సిటి లో ముస్లిం లు అధికంగా నివసిస్తున్నారు, అక్కడి ప్రతి 10 మంది పబ్లిక్  స్కూల్ పిల్లలలో ఒకరు ముస్లిం ఆతరువాత లాస్ ఎంగెల్స్ ,చికాగొ,హుస్టన్,గ్రేటర్ డెట్రైట్,మిచిగన్ లోని దేయర్ బోర్న్,హంట్రామక్ ప్రాంతాలలో ముస్లిం లు అంధికంగా కలరు. డెట్రైట్ లో అధికంగా అరబ్-ముస్లింలు కలరు. డియర్ బోర్న్ మిచిగాన్ లో అరబ్-అమెరికన్లు అధికంగా కలరు.వాషింగ్టన్ డి‌సి లో 24% మంది  ఇరానీ ముస్లింలు, లాస్ ఏంజెల్ లో 38% ఇరానీ ముస్లింలు, ఫిలడెల్ఫియా లో 54% ఆఫ్రికన్ అమెరికన్ ముస్లింలు, ఫిలడెల్ఫియా  మెట్రో ఏరియా లో 82% మండి నేటివ్ బోర్న్ ముస్లింలు (native  born Muslims),న్యూ జెర్సీ లో 62% నేటివ్ బోర్న్ ముస్లింలు (native  born Muslims),కలరు. టెక్సాస్ లో అమెరికన్ పౌరసత్వం చట్టప్రకారంగా (Naturalized Citizenship)పొందిన ముస్లింలు 58% కలరు. లాస్ ఆంగిల్స్ లో అమెరికన్ ముస్లిం స్త్రీలు అధికంగా 78% కలరు. ఒహియా లో 46% మండి ఆఫ్రికన్ ముస్లిం లు, టెక్సాస్ లో 43% మండి సౌత్ ఆసియా ముస్లింలు, ఫ్లోరిడా లో హిస్పానిక్ ముస్లిం లు అధికం గా కలరు.పేటర్ సన్,న్యూ జెర్సీ మాసాచూట్స్ ప్రాంతం  ముస్లిం వలసవాదులకు ఇష్టమైన ప్రదేశం గా పరిగణించబడు చున్నది .
            అమెరికన్ ముస్లిం లు అమెరికన్ఇంగ్లిష్, అరబిక్,పర్షియన్,బంగ్లా,సింధి, పంజాబీ, ఉర్దు,కుర్డు,బోస్నియన్, పస్తో,చైనీస్,స్పానిష్,టర్కిష్, అల్బేనియన్ వంటి వివిధ రకాల బాషలు మాట్లాడు తారు.
          అమెరికాలోని విబిన్న మత గ్రూపులలోఅమెరికన్  ముస్లింలు ఆధిక  విద్యావంతులు వీరీలో 40% మంది పట్టబద్రులు. ఆసియన్ అమెరికన్ ముస్లిం లలో 57% మండి, వైట్ అమెరికన్ ముస్లిం లలో 51% మండి పట్టబద్రులు. అమెరికా లోని ముస్లిం కుటుంబాలలో 2/3 కుటుంబాలు సం.నికి 50 వేల డాలర్లు, ¼ వంతు కుటుంబాల సం.నికి 1లక్ష డాలర్ల్ల వంతున సంపాదిస్తున్నారు. ఆఫ్రికన్ ముస్లింలు తక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్నారు.44% మంది ఆసియన్ అమెరికన్ ముస్లింలు,34% మండి వైట్ అమెరికన్ ముస్లింలు అధిక ఆధాయన్ని కలిగి ఉన్నారు. అమెరికా లోని పాకిస్తానీ ముస్లింలు బాగా చదువుకొన్నవారు మరియు ధనవంతులు. వీరిలో చాలా మంది డాక్టర్లు,సైంట్రిస్టులు,ఇంజనీర్లు, ఫైనాన్షియల్ అనలిస్టులు, పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు.అమెరికా లో క్యాబ్ (టాక్సీ) డ్రైవర్లు గా సోమాలియాకు చెందిన వారు ఉంటారు. మద్య ప్రాచ్యం నుండి వచ్చిన  ముస్లిం విద్యార్ధులు ఎక్కువుగా అమెరికా లో కనిపిస్తారు.అమెరికన్ ముస్లిం ల వినియోగ శక్తి  సంవత్సరానికి $170-$200 బిలియన్ డాలర్ల వరకు ఉంది
          అమెరికన్ ముస్లిం లలో 60% మంది  యువకులు 18-39స. మద్య వయస్సుకలిగి ఉన్నారు. అమెరికన్ ముస్లింలలో 43% స్త్రీలు పట్టబద్రులు. అమెరికన్ ముస్లిం స్త్రీలు, అమెరికన్ పురుష ముస్లిం లతో సమానంగా పని లో వేతనం పొందుతున్నారు. అమెరికన్ ముస్లిం స్త్రీలలో 82% మండి, పురుషులలో 78% మతం పట్ల ఆసక్తి కలిగిన వారు. వీరు సాధారణంగా వారానికి ఒకసారి మసీదు కు వెళ్తుంటారు.
            అమెరికాలో 2011 నాటికి 2106 మసీదులు కలవు. న్యూ యార్క్,కాలిఫోర్నియా,టెక్సాస్,ఫ్లోరిడా,ఇల్లినాయిస్,న్యూ జెర్సీ మొదలు 6 రాష్ట్రాలలో మసీదులు అధికం గా కలవు. 1915 లో అమెరికాలో తొలి మసీదు అల్బేనియా ముస్లింలచే నిర్మించబడినది.కాలిఫోర్నియా లో అధికంగా  మసీదులు కలవు. అమెరికా లో అతిపెద్ద మసీదు “ది ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ అమెరికా” డియర్ బోర్న్ మిచిగాన్ లో షియా ల చే నిర్మించబడినది.  2001 లో అమెరికా ఇస్లామిక్ సంస్కృతి ని తెలిపే “ఇంటర్నేషనల్ మ్యూజీయమ్ ఆఫ్ ముస్లిం కల్చర్” జాక్సన్,మిస్సిసిపీలో ప్రారంభం అయినది. “అమెరికా ఇస్లామిక్ హెరిటేజ్ మ్యూజీయమ్” వాషింగ్టన్ డిసి లో 2011 లో ప్రారింభించబడినది.
          అమెరికా ముస్లిం లలో అధిక శాతం మంది రాజకీయంగా ఉదారవాదులు.70% అమెరికన్ ముస్లింలు డెమొక్రాటిక్ కి అనుకూలంగా ఉంటారు.అమెరికన్ యంగ్ ముస్లిం లలో కేవలం 51% మంది వోటు రిజిస్టర్ చేసుకొంటున్నారు. కీత్ ఎల్లిసన్ అమెరికా తొలి ముస్లిం కాంగ్రెస్ సబ్యుడు. ఆతరువాత ఆంద్రె కార్సన్ ఇండియానా నుంచి కాంగ్రెస్ మన్ గా ఎన్నికైనారు.2008 అమెరికా అద్యక్ష ఎన్నికలలో బరాక్ –ఒబామాకు అమెరికన్ ముస్లిం లు 67-90% వరకు ఓటు చేసినారు. బరాక్ ఒబామా పూర్తి పేరు బరాక్ హుసైన్ ఒబామా.(బారక్ అనగా ఆశ్విరదింపబడిన వాడు అని అరబిక్ అర్థం, హుస్సైన్ ప్రవక్త మనుమని పేరు, ఒబామా అనగా పార్సి లో నేను నీ తో ఉన్నాను అని అర్థం) ఇతని తండ్రి కీన్యా దేశ ముస్లిం,తల్లి అమెరికన్ వనిత.  2005 నాటికి అమెరికా రక్షణ దళాలలో దాదాపు 15000 మంది  ముస్లిం లు పని చేస్తున్నారు. అనేక అమెరికా విమానాశ్రయాలలో ముస్లిం ల సౌకర్యార్ధం వజూఖానాలు, ప్రార్ధన మందిరాలు నిర్మించబడినవి.
          9/11. దాడుల తరువాత అమెరికన్ ముస్లిం లు కొంత అవహేళనను,హింసను,వ్యతిరకతను వివక్షతను,ఎదుర్కొన్నప్పటికి ప్రస్తుత పరిస్థితులు శాంతి యుతంగానే ఉన్నాయని చెప్పవచ్చును. అనేక మంది ఇస్లాం ను అర్థం చేసుకోవటానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థలు ముస్లింలపై పరిశోధనలు జరిపినాయి. అమెరికా లోని ముస్లిం లపై అనేక సర్వే లు, ఒపీనియన్ పోల్ల్స్ నిర్వహించడం  జరగడం జరిగింది.  ప్రస్తుతం అమెరికా లో బహుముఖంగా విస్తరిస్తున్న(fast growing) మతం గా ఇస్లాం ను చెప్పవచ్చును. నల్లజాతి ప్రాంతాలలో,కారాగారాలలో,హిస్పానిక్ ప్రజలలో  ఇస్లాం విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. బ్లాక్ అమెరికన్  ముస్లిం ఇమాములు నల్ల  జాతి వారు ఉన్న ప్రాంతాలలో క్రైమ్ రేటు తగ్గించటం లో విజయం సాదించారు.  
వివిధ రంగాలలో ప్రముఖ అమెరికన్ ముస్లింలు
ఆర్ట్:
శిరీన్ నేషత్:               ఇరానియన్-అమెరికన్ విజివల్ ఆర్టిస్ట్,ఫిల్మ్ డైరెక్టర్.
షాజియా సికందర్:       పాకిస్తానీ అమెరికన్ ఆర్టిస్ట్, జీనియస్ అవార్డ్ విజేత
బిజినెస్:
మహమ్మద్ ఆ ఎల్ ఎరియన్ : PIMCO కంపనీ CEO మరియు $ ట్రిలియన్ విలువైన గ్లోబల్ ఆస్తుల                                                 మేనేజర్
జావేద్ కరీం:                       యు ట్యూబ్ సహ వ్యవస్థాపకుడు
ఫిల్మ్
నబిల్ అబౌ-హర్బ్:                 ఫిల్మ్ మేకర్,  “అరబ్ ఇన్ అమెరికాఫిల్మ్ రైటర్/డైరక్టర్
శోహ్రా అఘాషూ:                     ఇరాన్ లో పుట్టిన అకాడమీ అవార్డ్ కి నామినేటెడ్ చేయబడిన  నటి.
మ్యూజిక్ :
అహమద్ జమాల్:       జాజ్ పియనిస్ట్
ఐస్ క్యూబ్ :               నిర్మాత, రాపర్
జెర్మైనే జాక్సన్ :          గాయని,బాస్ గిటారిస్ట్
యూసుఫ్ లతీఫ్ :        జాజ్ మ్యూజిషియన్ అండ్ గ్రామీ అవార్డ్ విజేత
టెలివిజన్:
మర బ్రోక్ అకిల్:          నిర్మాత,స్క్రీన్ ప్లే రైటర్
రిజ్వాన్ మంజి :           నటుడు
ఏసయ్య ముస్తఫా:        నటుడు
మెఃమెట్ ఒజ్ :             టాక్ షో హోస్ట్,
సూపర్ మోడల్:
ఈమాన్:                   సూపర్ మోడల్
రీమా ఫైక్ :                 మిస్ యూ‌ఎస్‌ఏ 2010
రాజకీయాలు:
కీత్ ఎలిసొన్:              తొలి ముస్లిం కాంగ్రెస్ మన్ (మిన్నసోటా రాష్ట్రం)
ఆంద్రె కార్సన్:             ఇండియానా కాంగ్రెస్ మన్
సి.జాక్ ఎల్లిస్:             మాకోన్ (జార్జియా) మాజీ మేయర్
జాల్మయ్ ఖలీల్ జాద్ :   ఐక్య రాజ్య సమితి లో మాజీ అమెరికా రాయబారి, ఇరాక్ మరియు అఫ్ఘానిస్తాన్ లో  మాజీ అమెరికా రాయబారి.
ఫరా పండిత్:              ముస్లిం విషయాలలో ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కు సలహాదారు.
జేమ్స్ యీ:                అమెరికా ఆర్మీ లో కేప్టైన్ ర్యాంక్ కలిగిన మాజీ ఆర్మీ మత చాప్లిన్
మత ప్రచారకులు:
షుఐబ్ వెబ్ :                        ముస్లిం ఉపన్యాసకుడు
వారిత్ దీన్ మహమ్మద్:           అమెరికన్ సొసైటి ఆఫ్ ముస్లింస్ నాయకుడు
యూసుఫ్ ఎస్టేస్:                   ముస్లిం మత  ప్రచారకుడు.
ఖాలిద్ లతీఫ్                        న్యూ యార్క్ యూనివర్సిటీ ముస్లిం చాప్లిన్

సైన్స్:
ఫజ్లుర్ ఖాన్:                         స్ట్రక్చరల్ ఇంజినిర్ , సేయర్ టవర్, జాన్ హాన్ కాక్ సెంటర్ డిజైనర్
అయూబ్ కే ఒమ్మయ;             న్యూరో సర్జన్
అహ్మెద్ జేవైల్:                      రసాయనిక శాస్త్రం లో నోబుల్ ప్రైజ్ విజేత

స్పొర్ట్స్:
మహమ్మద్ అలీ,హాసిమ్ రహ్మాన్, మైక్ టైసన్ :             బాక్సింగ్,
కరీం అబ్దుల్ జబ్బార్,మహమ్మద్ అబ్దుల్ రవూఫ్;           బాస్కెట్ బాల్                         
హమ్జా అబ్దుల్లా,హుసైన్ అబ్దుల్లా:                              నేషనల్ పుట్ బాల్ లీగ్
రచనా వ్యాసంగం:
రేజ అస్లాన్ :               రచయిత
మోనా ఏతవి:             కాలమిస్ట్
యహ్యా ఎమ్రిక్క్:           గ్రంధ రచయిత
ఫరిద్ జకారియా:         రచయిత,కామెంటేటర్,సి‌ఎన్‌ఎన్ ఫరిద్ జకారియా జి‌పి‌ఎస్ ప్రోగ్రాం ప్రయోక్త 


 

ఆధార గ్రంధాలు:
1.    వికీపీడియా
2.   Wiki islam
3.   ముస్లిం డెమోగ్రాఫిక్స్ –  ఫరిద్ సెంజై ఎస్‌సి‌యూ, కాలిఫోర్నియా
4.   ఫ్రంట్ లైన్
5.   ఆక్స్ ఫర్డ్ ఇస్లామిక్ ఆన్ లైన్ స్టడీస్
6.   The Future of the Global Muslim Population – Pew Research Religion & Public Life Project –US Special