దివ్య ఖురాన్ ప్రకారం స్త్రీ,పురుషులు ఇరువురు సమానులే మరియు ఇరువురు ఒకే జీవి నుండి సృష్టించబడినారు.
ఇస్లాం మానవాళికి ప్రసాదించిన ముఖ్యమైన హక్కు విద్యార్జన.సామాజిక,ధార్మిక విద్యను పొందటాన్ని ఇస్లాం ప్రోత్సహించును.విద్యా-జ్ఞానములకు
ఇస్లాం లో ఉన్నతస్థానం కల్పించబడినది. విద్యార్జన స్త్రీ-పురుషులకు ముఖ్యమైన
విధి.(తిర్మిజీ) విద్యను పొందటంలో స్త్రీ-పురుషుల మద్య ఇస్లాం ఎటువంటి విచక్షణ
చూపదు. వాస్తవానికి అనేక మంది ముస్లిం
స్త్రీలు ఇస్లాం ప్రారంభ దశలో విద్య,జ్ఞాన రంగముల లోని వివిధ
విభాగాలలో మహత్తరమైన సేవలు
అంధించినారు.మతశాస్త్రం,సాహిత్యము,
విద్య మరియు వైద్య రంగాలలో ముస్లిం స్త్రీలు అసమానమైన ప్రతిభను ప్రదర్శించిరి.
వారిలో కొంతమంధి యొక్క ప్రతిభాపాఠవాలను పరిశీలించుదాము:
మహాప్రవక్త (స) తన కాలంనాటి అన్సార్ మహిళల
జ్ఞానాశక్తిని, విద్యాపట్ల వారికున్న
అబిరుచిని ఎంతొగా కొనియాడినారు.
ఆయెషా బిన్తే అబూబకర్ :
మహాప్రవక్త భార్య ఐనా ఆయెషా ప్రముఖ ఇస్లామిక్
విద్వాంసురాలు. ఆమె చాలా తెలివైనదేగాక,అసాధారణ జ్ఞాపక శక్తిని కలిగి
ఉన్నది. హదీసులు సంబంధించినంతవరకు ఒక ముఖ్యమైన ఆధారం గా
పరిగణించబడుచున్నారు.మహాప్రవక్త (స) స్వయముగా మతవిధుల ఆద్యయనము,నేర్చుకొనుటకకొరకు ఆమె వద్దకు వెళ్ళవలసినధిగా సూచించేవారు. ఆమె భోధనలను,సూచనలను పాటించమని ప్రవక్త(స) స్వయంగా అనేవారు.ఆమె విద్యావేత్తయే కాక
సైనిక నిపుణురాలు,రాజకీయ వేత్త కూడా,ఆమె వద్ద అనేక మంది
హదీసు విద్యా ప్రముఖులు హదీసు విద్యాద్యాయనము చేసేవారు. హదీసుల జ్ఞానం లో ఆమె
జ్ఞానులకే జ్ఞాని గా పరిగణించబడే వారు.
నఫీసా బిన్త్ అల్-హాసన్ :
ఈమె 4వ ఖలీఫా ఐనా అలీ బంధువు మరియు ఇస్లాం
నిపుణురాలు,ముఖ్యం గా హదీసువిద్యలో,నేర్పరి.ఆనాటి ప్రముఖ ముస్లిం విద్యావేత్త ఐనా ఇమామ్ షఫి-ఐ ఇమె వద్ద
విద్యా అబ్యశించినారు.
సకినా:
ఈమె ప్రవక్త మనుమరాలు. ఇమామ్ హుసైన్ యొక్క
కుమార్తె. తన కాలం నాటి అత్యంత తెవైన మహిళా గా పరిగణిపబడేవారు. వ్యతిగత, సామాజిక,రాజకీయ,రంగాలలో
అన్నిరకాల అన్యాయాలను,అసమానలతను,
నియంతృత్వాన్ని వ్యతిరేకించేవారు. స్వతంత్రభావాలు కలిగిన వనిత. వ్యాపార,వాణిజ్య, విద్యా రంగాలలో రాణించినారు. ఆ కాలంనాటి
ప్రముఖ పండితులు, విద్యావేత్తలు,
శాస్త్ర వేత్తలతో కలసి చర్చలలో పాల్గొనే వారు.
ఉం-ఆదాహ్ అల్-ఆడావియాహ్ (705):
హజరత్ అలీ,
ఆయెషా లకు సంబంధించిన హదీసుల విద్యా వేత్త.
రాబియా బసరి (717-801):
ఇస్లాం మతానికి చెందిన ప్రముఖ సూఫీ కవయిత్రి, హదీసు విద్యా వేత్త. అనాధ ఐనా
ఈమె ఆతరువాత బానిస గా అమ్మబడినది. ఏమే మహత్తును గమనించిన యజమాని ఈమెను బానిసత్వం
నుండి విడుదల చేసి స్వేచ్చ ప్రసాదించినాడు. ఎడారి లో స్థిర నివాసాన్ని
ఏర్పర్చుకొని, వివాహాన్ని త్యజించి,
భగవంతుని ఆరాధనలో,సూఫీ తత్వవిచారం లో నిండా మునిగి తేలుతూ తన
కాలాన్ని గడిపినారు. ఈమెకు అనేకమంది శిష్యులు కలరు. సూఫీ కవిత్వం లో ఈమె పేరు
అజరామరం గా ఉంటుంది.
అమ్రాహ్ బిన్త్ అబ్దుల్ రహమాన్ (720)
ఆయెషా గారి శిష్యురాలు, మదినా కు చెందినా ప్రముఖ న్యాయశాస్త్రవేత్త.
హఫ్సా బిన్త్ అల్-అన్సారియా (722) : ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త
జూబైదా 841
ఈమె అత్యంత ప్రసిద్ది చెంది ముస్లిం ఖలీఫా
హారూన్ అల్ రషీద్ భార్య. అత్యంత ధనికురాలు, కవయిత్రి, కళాపోషకురాలు,మతసాహిత్యం లో ప్రసిద్ది గాంచిన
స్త్రీ. ఈమె సమకాలీన పండితులను ,కవులను, పండితులను, శాస్త్రవేత్తలు బాగ్దాద్ పిలిపించి
వారికి బృతి కల్పించేది. ప్రజాపయోగకరమైన కార్యక్రమాలకు,
రహదారులు, వంతెనలను నిర్మించడానికి తన ఆదాయాన్ని
ఖర్చుచేసేది. కుఫా నుంచి మక్కా వరకు పక్క రహదారి నిర్మించినది. యాత్రికుల
సౌకర్యార్ధం, వ్యవసాయం కోసం ఇరిగేషన్ కాలువలు నిర్మించినది.
మక్కా లో యాత్రికుల కోసం మంచినీటి సౌకర్యం కల్పించినది. రాజకీయాలలో, పాలనలో ఆసక్తి చూపేది. ఖలీఫాలు సైతం ఆమె సలహాలు పాటించేవారు.
ఫాతిమా అల్ ఫిహారి (859)
కారాయిన్ యూనివర్సిటీ ని స్థాపించినది. ఈమె
నిర్వహించే మజ్లిస్-అల్ హిక్మా కు పెద్ద సంఖ్యలో స్త్రీ-పురుషులు హాజరయ్యేవారని
ప్రసిద్ద చరిత్ర కారులు ఇబ్న్ కు-తువాయ్ర్, ఇబ్న్-అల్-సబిహా
అబిప్రాయపడినారు.
ఉజ్లియా బిన్త్ అలీ (944)
ఖగోళ పరిశోదంకు ఉపకరించే వైజ్ఞానిక సాధనాలను
కనుగొన్నారు. .
అమహా అల్ వహీద్ (999)
షాఫీ విద్వాంసురాలు, బాగ్దాద్ ముఫ్తీ గా పనిచేశారు.
అర్వా బిన్త్ అహ్మద్ (1048-1138)
యెమెన్ కు చెందిన సుప్రసిద్ద రాణి.ఈమె తన పరిపాలనా కాలం లో మసీదులు, పాటశాలలు రహదారులు
నిర్మించినది.వ్యవసాయం పట్ల ఆసక్తి చూపి దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పారచినది. సాహిత్యము, చారిత్రిక
సంఘటనల పట్ల ఆసక్తి చూపేది. ఖురాను,హదీసుల జ్ఞానవంతురాలు.
సైనిక నిపుణురాలు, సనా లో ఈమె పేరు మీద యూనివర్సిటీ
స్థాపించబడినది.
కరీమా బిన్త్ అహ్మద్ అల్-మార్వాజియా (1085)
- హదీసులను భోదించే వారు.
12-13 శతాబ్ధా లలో కైరో లో 5
యూనివర్సిటీ లను 11 విద్యాలయాలను స్త్రీలు నిర్వహించేవారు. దమాస్కస్ లో 12 మసీదులు, 160
మదరసాలు స్థాపించబడినవి. వీటిలో 26 విద్యాలయాలు స్త్రీ వక్ఫ్ ఆస్తుల ద్వారా
నిర్వహింపబడేవి. వీటికి రాజపోషకులు గా
స్త్రీలు ఉండే వారు. మద్యౌగాలలో స్త్రీలు విద్యాబ్యసము చేసే వారు, డిగ్రీలు
సాదించి ఉలేమాలుగా, ఉపాద్యాయులుగా పనిచేస్తుండేవారు. 12వ
శతాబ్ధాపు ముస్లిం పండితుడు ఇబ్న్-ఆసికార్ 80 మండి స్త్రీల వద్ద విద్యాబ్యసము
చేసినాడు.
జైనాబ్ బిన్త్ అబ్దుల్ రహమాన్ (1237) బాషాశాస్త్రవేత్త, ఖోరాసాన్ విద్యాలయములో భాషాశాస్త్రాన్ని భోదించే వారు.
జైనాబ్ బిన్త్ మక్కీ(1310) దమాస్కస్ లోని ప్రముఖ విద్వాంసురాలు,హనఫీ ఫికా యొక్కమొదటి
విద్యావేత్త ఇబ్న్ తైమియాయొక్క గురువు.
జైనాబ్ బిన్త్ ఉమర్ బిన్ కింది (1311) ప్రముఖ హదీసు పండితులు అల్-మిజ్జి గురువు
ఫాతిమా బిన్త్ అబ్బాస్(1336) హనఫీ
న్యాయ వేత్త, దమాస్కస్, కైరో లో ముఫ్తీ.
ఇరువురు మహిళలు ఉం ఈసా బిన్త్ ఇబ్రాహిం
మరియు అమత్ అల్వవాహద్ బాగ్దాద్ ముఫ్తిలు గా పనిచేసినారు.
ఆయెషా అల్ బన్నియ
సుప్రసిద్ద న్యాయవేత్త, ఇస్లామిక్ న్యాయం పై అనేక
గ్రంధాలు రచించిరి.
ఉం అల్ (1427)
మొరాకో లో ముఫ్తీ గా పనిచేశారు.
అల్ అలియా జోహర్ నమాజ్ ముందు ఈమె వద్ద ఆనేక పురుషులు, ఆస్ర్ నమాజ్ తరువాత అనేకమంది స్త్రీలు ఈమె వద్ద మతవిద్యను అబ్యసించేవారు.
రుసా
వైద్య శాస్త్ర గ్రంధాన్ని రచించినారు.
15వ శతాబ్ధానికి
చెందిన ఇరాన్ లోని ఇస్మాయిలీలు నిర్వహించే బుద్దిజీవుల సమావేశాలకు స్త్రీలు కూడా
హాజరు అయేవారు. ఇమామ్ ప్రత్యక్షం గా ఇరువురిని ఉద్దేశించి ప్రసంగించేవారు.
15 వ శతాబ్ధం
లో అల్సఖాని రచించిన దవ్ అల్ లామి రచయితల 12 సంపుటాల నిఘంటువులొ దాదాపు 1075 మండి
స్త్రీ రచయితల జీవిత చరిత్రలను వివరించడము జరిగింది.
బురాన్
ఖలీఫా మామూన్ భార్య. రాజ్య వ్యవయారాలలో ఆసక్తిని చూపేది, దాన దర్మాలు చేయుటలో ప్రసిద్ధురాలు.
భారత దేశ చరిత్రలోని ముస్లిం యుగానికి చెందిన
మహిళా ప్రముఖులలో రజియా సుల్తానా, నూర్ జహాన్, జైబున్నీసా ప్రముఖులు.
19 వ శతాబ్ధానికి చెందిన నానా ఆస్మావెస్ట్
ఆఫ్రికా కు చెందిన ప్రముఖ ఇస్లామిక్
పండితురాలు, కవయిత్రి,
ఉపాద్యాయురాలు. 60కు పైగా పుస్తకాలు రచించినది.
సెబెక జహార హుస్సైన్ ఆధునిక కాల ప్రముఖ సున్నీ మహిళా పండితురాలు.
ముస్లిం చరిత్ర ప్రారంభ దినాలలో స్త్రీలు
అనేక రంగాలలో పాల్గొన్నారు, 2వ ఖలీఫా ఉమర్ మార్కెట్
వ్యవహారాలను పరిశీలించడానికి స్త్రీలను నియమించేవాడు. ఇస్లాం చరిత్రలో స్త్రీలు
యుద్దనిపుణులు మరియు అనేక యుద్దలలో పాల్గొన్నారు. 12వ
శతాబ్ధాపు తత్వవేత్త,న్యాయవేత్త ఇబ్న్ రుష్డ్ ప్రకారం
ముస్లిం స్త్రీ పురుషులు ఇరువురు సమానులే, స్త్రీలు యుద్ద
రంగంలో కూడా పాల్గొనే వారు. నుసయ్య బిన్త్ మాజ్నియ, అయిశ, కహాల,వాఫెరా యుద్దరంగం
లో స్వయంగా పాల్గొన్నారు.
ముస్లిం మహిళలు మొదటినుంచి సామాజిక, ఆర్థిక రంగాలలో తమ సేవలను అంధించేవారు. కర్షకులుగా,నిర్మాణ కార్మికులుగా,చర్మాలను
శుద్ది చేసేవారుగా, నేతపనివారిగా,వాణిజ్య
వేత్తలుగా,వైద్యులుగా,నర్సులుగా,వ్యాపార శ్రేణుల నాయకులుగా,విద్యావేత్తలుగా వివిధ
రంగాలలో రాణించేవారు. నేత, చర్మాల శుద్ది,కుట్టు పనులలో వీరికి సాటి ఎవరు లేరు. ముస్లిం స్త్రీలు వైద్యశాలలో నర్సులుగా పనిచేసే
వారు. మహిళా ఆస్పత్రులలో మహిళా వైద్యులుగా పనిచేససేనారు. 12వ శతాబ్ధానికి చెందిన
భాను జూర్ కుటుంబానికి చెందిన ఇరువురు
మహిళా వైద్యులు ఉండేవారు. 15వ శతాబ్ధం లో మహిళా శాస్త్ర చికిత్స నిపుణులు
కలరు.
ఈ విధంగా ముస్లిం మహిళలలు శాస్త్ర విజ్ఞానం,టెక్నాలజీ,మత,ఆర్థిక, సాహిత్య, పాలనా,వైద్య,ఉపాద్యాయ,వాణిజ్య రంగాలలో మొదటినుంచి అత్యంత ఆసక్తితో పాల్గొనేవారు మరియు గొప్ప గా
రాణించినారు.
No comments:
Post a Comment