3 February 2014

పాశ్చాత్య నాగరికత పునరుద్దరణలో ఇస్లామిక్ విద్యా ప్రభావం



విజ్ఞానము,సైన్సుమరియు టెక్నాలజీ రంగాలలో ముస్లింలు అబివృద్ధిని సాదించినపుడు క్రైస్తవ రాజ్యాల పరిస్థితి ఆశాజనకము గా లేదు. ప్యాగన్ చక్రవర్తులచే స్థాపించబడిన గ్రంధాలయలు మూతబడినవి. చదువు అనేది మాయ-మంత్రం  గా పరిగణించబడి రాజద్రోహము క్రింద శిక్షించబడేది. శాస్త్ర విజ్ఞానము,తత్వ శాస్త్రము నాశనము చేయబడినవి. భక్తి కి  మూలం అజ్ఞానం అని నమ్మబడేది మరియు పోపు గ్రెగోరి ద గ్రేట్ మతానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ,రోమ్ లో శాస్త్ర విజ్ఞాన భోదనాన్ని నిషేదించి ఆగస్టస్ సీజరు చే స్థాపించబడిన పాలరాతి గ్రంధాలయమును తగలబెట్టించినాడు.   ప్రాచీన గ్రీక్,రోమ్ రచయితల గ్రంధాలను ఆద్యయనము చేయడము నిషేదించినాడు. క్రైస్తవ మత  చిహ్నాలను, మహనీయులను (saints) ఆరాధించమని,క్రైస్తవ పురాణాలను  యూరప్ అంతటా ప్రచారము చేసినాడు. సంప్రదాయక క్రైస్తవము శాస్త్రవిజ్ఞానము,సాహిత్యమును  (litaleture)  నిషేదించినది. కానీ స్వేచ్చా పూరిత ఆలోచనలు,  మానవ ఆలోచన  ప్రగతి పెరిగి చివరకు సాంప్రదాయకవాదులు సృష్టించిన అవరోధాలను పటాపంచలు చేయడం జరిగింది.
పశ్చిమ దేశాలపై అపార ప్రభావము చూపిన  ఇస్లామిక్ విద్య .
పశ్చిమ దేశాలపై ఇస్లామిక్ విద్య అపార ప్రభావమును చూపినది. ఎన్సైక్య్లోపెడియ ఆఫ్ బ్రిటానికా ప్రకారం “మేధారంగం/విద్యారంగం  లో ముస్లింల పతనము ,విద్యారంగం లో యూరోపియన్ వాసుల మేల్కొలుపు తో ప్రారంభమైనది, ఇందుకు గాను శాస్త్ర విజ్ఞాన అనువాదాలు ఎంతొగా ఉపకరించినవి. యూరోపియన్ పునర్జీవనములో 12-13 శతాబ్దాలలోని అరబిక్ రచనలకు చేసిన లాటిన్ అనువాదాలు ఎంతొగా తోడ్పడినవి.విద్యా,మేధా రంగాలలో ముస్లింల పతనం పలితంగా శతాబ్దాల తరబడి ముస్లింలు విద్యారంగంలో సాదించిన సృజనాత్మకత ను,ఫలాలను లాటిన్ తనలో ఇముడ్చుకొని,యూరోపియఠన్ క్రైస్తవ పునర్జీవానికి దారి చూపింధి .

12 వ శతాబ్దం లో ఇస్లామిక్ దేశాలలోని రాజకీయ పరిస్థితులు,ముస్లిం విద్యాకుసుమాలను, జ్ఞాన ఫలాలను నాశనం చేసినపుడు యూరోపియన్  దేశాలు ముందుండి అరబిక్ జ్ఞానమును  లాటిన్ బాష లోనికి అనువదింప చేసుకోవటం ద్వారా ఆ జ్ఞానాన్ని సముపార్జించినాయి. 1300 స. నాటికి సమస్త అరబిక్/ముస్లిం శాస్త్ర/సాంకేతిక,సామాజిక, దార్శనిక  విజ్ఞానము లాటిన్ అనువాదాల ద్వారా యూరోపియన్ పండితులవద్దకు చేరినది. ముస్లిం,బైజంటిన్ విద్వాంసుల హెలోనిక్ తత్వము ను  యూరోపియన్ జ్ఞానులు స్వీకరించి తమ విజ్ఞాన పునాదులను పటిస్టం చేసుకొన్నారు. పురాతన గ్రీక్ విజ్ఞానము అరబిక్ అనువాదముల ద్వారా బద్ర పరచబడినది. గ్రీక్ విజ్ఞానములో మార్పులు చేయకుండా, ముస్లిం లు వాటికి ముఖ్యమైన  అనుబంధాలను చేర్చినారు. 12,13 శతాబ్దములలో యూరప్ లో గ్రీక్ విజ్ఞానము పట్ల ఆసక్తి పెరిగినప్పుడు, పండితులు వాటికోసం ఇస్లామిక్ స్పెయిన్ ను ఆశ్రయించి నారు. ఫలితం గా గ్రీక్ విజ్ఞానము లాటిన్ లోనికి అనువదింపబడి యూరప్ లో అనేక యూనివర్సిటీలు స్థాపించబడినవి. మద్య యుగ యూరోపియన్ శాస్త్రవేత్తలు గ్రీక్ విజ్ఞాన పరిధిలో పనిచేయటం ప్రారంబించి 16,17 శతాబ్దము లో  విజ్ఞాన శాస్త్ర అంచులను లో  చేరినారు.”  పాశ్చాత్య  పండితుడు విల్ డూరంట్  అబిప్రాయం లో 700-1200 వరకు  ఐదు శతాబ్దాల పాటు శాస్త్ర విజ్ఞానము,టెక్నాలజీ, తత్వశాస్త్రం, సాహిత్యము,సుపరిపాలన,వంటి విషయాలలో ఇస్లాం ప్రపంచాన్నిఎలింది.

No comments:

Post a Comment