16 February 2014

రష్యా లో ఇస్లాం


పూర్వచరిత్ర:
ఇస్లాం తో రష్యాకు పరిచయం 7వ దశాబ్ధం తో ప్రారంభం అయినది. 642 లో అజర్ భైజన్ ముస్లిం పరిపాలన క్రిందకు వచ్చినది. తూర్పు కకాసియా(ఒఫ్కాజ్) విజయం తరువాత,673 లో ముస్లింలు ఒక్సస్ నదిని దాటినారు, 674 లో బుఖార ముస్లింల వశమైనది. 8 వ శతాబ్ధం లో ఉజెబెకిస్తాన్ ముస్లింల వశమైనది. ఉజబెకిస్తాన్ అనేక మంది  ప్రముఖ ఇస్లామిక్  పండితులకు  (హదీసు, ఫికా,తత్వశాస్త్రం,వైద్యరంగంము ,గణితములో ప్రముఖులు)  జన్మనిచ్చినది.ఆతరువాత తజికిస్తాన్ ప్రజలు  పూర్తిగా  ఇస్లాం స్వీకరించినారు.  వోల్గా బుల్గరియాలో  922 లో ఇస్లాం రాజ్యం ఏర్పడింది. దానినుండి తాతర్లు ఇస్లాం స్వీకరించారు. ఆతరువాత యూరోపియన్,కాకసియన్ టర్కిష్ ప్రజలు ఇస్లాం స్వీకరించినారు. 10 వ శతాబ్ధం నాటికి మద్య ఆసియా ప్రాంతం లో ఇస్లాం వేగం గా విస్తరించినది ఇస్లామిక్ చరిత్ర, సంస్కృతికి ప్రధాన కేంద్రాలుగా మద్య ఆసియా ప్రాంతం మారింది.తాతర్, బాష్కర్,కాజన్, ఉరల్ మరియు వోల్గా నది లోయలో దాదాపు ఒక కోటి మంది వరకు  ముస్లింలు ఉండేవారు. 10 శతాబ్ధం లో ఇస్లామిక్ వ్యాపారులు యూరోపియన్ రష్యా వాసులకు ఇస్లాం పరిచయం చేసినారు.  
రష్యా సామ్రాజ్యం లో :
16వ శతాబ్ధాపు మద్య భాగం నుండి 20 వ శతాబ్ధాపు ప్రారంభం వరకు ముస్లిం ప్రాంతాలపై రష్యాన్ల ఆధిపత్యం కొనసాగింధి.రష్యా లో ఇస్లాం ఉనికి 1552 లో కజన్ ఖాన్తే విజయం తోప్రమాదం లో పడింధి . ఈ విజయం వోల్గా మద్యభాగం లోని  తాతరులను, బష్కిర్లను రష్యా ఆధీనము లోనికి తెచ్చినది. 1556 లో వోల్గా దిగువ ముస్లిం అస్త్రఖాన్ ఖాన్తే రష్యా సామ్రాజ్యం లో విలీనమైనది. 16వ శతాబ్ధం లో సైబీరియా ఖాన్తే రష్యా వశమైనధి. 1739 లో క్రిమియన్ ఖాన్తే రష్యా సామ్రాజ్యం లో విలీనమైనధి. 17,18 శతాబ్ధాలలో ఉత్తర కకాసుస్ ప్రాంతానికి చెందిన డగేస్తాన్,చెచెన్యా,ఇంగుష్ మరియు ఇతరులు రష్యా లో కలపబడినారు. సీర్కస్సియనస్,ఉజబెక్కులపై రష్యా విజయము వారిని మూహాజీర్లు గా మార్చింది. స్వతంత్ర రాజ్యలైన మద్యాసియా,అజర్ భైజానులు రష్యా లో విలీనమైనవి. తాతర్ ఖన్తే పై విజయము తో ముస్లిం ప్రాంతాలను రష్యా లో విలీనం చేయడం క్యాడరిన్ డి గ్రేట్ ఆగమనం తో పూర్తి అయినది.  
1552 లో కాజన్ విజయం తరువాత 1762 లో క్యాథరిన్ ది గ్రేట్ సింహాసనాన్ని, అధిస్టించేవరకు  ముస్లిం లను ఒక పద్దతి ప్రకారము, వివక్షతతో,ఇస్లాం సంస్కృతిని, మసీదులను నాశనము చేయడం జరిగింది.  మొదట్లో రష్యా పాలకులు ఇస్లాం పట్ల కొంత సానుభూతిని చూపారు. కజక్ లో ఇస్లాం వికాసానికి అంగీకరించారు. 1801 లో రష్యా లోని కజన్ లో మొదటి ఖురాన్ ప్రచురించబడినది.  కానీ ఆ తరువాత ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతాలనుండి వారిని తరలించి ముస్లిమేతరులను  ఆ ప్రాంతాలకు పంపి  వారికి భూమి హక్కులు కల్పించి ఆప్రాంత ముస్లింలను ముఖ్యంగా దక్షిణ ఉరల్ ప్రాంతాలు, ఆటోమన్ టర్కీ ప్రాంతాలవారిని  మైనారిటి లు గా చేసినారు.సీర్కస్సియన్,క్రిమియన్ తాతరులు మరియు కాకసుస్ ముస్లింలను,దాదాపుగా  నిర్మూలించినారు. ముస్లింలను బలవంతం గా ఆటోమన్ సామ్రాజ్యంనకు పారద్రోలినారు.లేదా ముస్లింలను దూరంగా ఉన్న వేరే ప్రాంతాలకు తరలించినారు ఉదా: తాతరస్థాన్  (tatarastan) లో నివసించే తాతర్ల కన్నా బయట ప్రాంతాలలో నివసించే తాతర్లు ఎక్కువ.
జారిస్ట్ రష్యా :
జారిస్ట్ రష్యా,లో  కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది.
సోవియట్ యూనియన్-కమ్యూనిస్టుల పాలనలో:
1917 లో కమ్యూనిస్టులు అధికారం స్వీకరించేనాటికి  సోవియట్ యూనియన్ లోని 16 రాష్ట్రాలలో 8 రాష్ట్రాలలో ముస్లింలు ఎక్కువగా ఉండేవారు. సోవియట్ యూనియన్ లోని ఉజబెకిస్తాన్, తజకిస్తాన్,అజర్ బైజాన్, జార్జియా –అర్మేనియా, కజకస్తాన్, కిర్ఘిజియా, తాతర్-బష్కర్, కాకసియా, మరియు క్రిమియాలో ముస్లింలు అధికం గా ఉండేవారు. 1917 విప్లవం సమయము లో లెనిన్ మరియు స్టాలిన్ ఒక సంయుక్త ప్రకటనలో రష్యన్ ముస్లిం లకు పూర్తి మత స్వేచ్చను ప్రసాదించినారు. కానీ అనతికాలం లోనే కమ్యూనిస్టులు తమ వాగ్ధానమును మరచి ముస్లిం రాజ్యాలను ఆక్రమించినారు.  1918 రష్యా రాజ్యాంగం రష్యన్ ప్రజలకు మత  స్వేచ్చను కల్పించినది. కానీ మత   ప్రచారం నిషేడించబడినది. మతవ్యతిరేక ప్రాపగాండా చేయబడినది 
కమ్యూనిస్టుల పరిపాలనలో ముస్లింలు నివసించే ప్రాంతాలు వలసలుగా మారినాయి వారి ఆర్థిక వనరులు, సహజ సంపద దోపిడిచేయబడినవి. స్వేచ్చను కోల్పోయినారు.1940 నాటికి దాదాపు 50వేలమంది ముస్లిం ఉలేమాలు ప్రాణాలు కోల్పోయిరి. 1941 నాటికి తుర్కిస్తాన్ లోని దాదాపు 14 వేల మసీదులు మూసివేయబడినవి. ముస్లింలు  బల్మీక్ అనగా ప్రత్యేకతావాదులు,మతవాదులు గా ముద్ర వేయబడిరి. బల్మీక్ గా ముద్ర పడేవారిని వెంటనే హత్య చేసేవారు. కమ్యూనిస్టుల పాలనలో ఇస్లాం అణిచివేతకు, వివక్షతకు గురిఐనది. అనేక మసీదులు మూసివేయబడినవి. తాతరస్తాన్ లో 83% మసీదులు మూసివేయబడినవి. కజన్ లోని మార్కానీ మసీదు మాత్రమే  పనిచేసినది
సోవియట్ యూనియన్ పతనం – ఆధునిక రష్యా ఫెడరేషన్  లో ముస్లింలు
ప్రస్తుత రష్యా ఫెడరేషన్  లో అత్యధికులు ఆరాధించే మతములలో రెండోవది  ఇస్లాం. రష్యా లోని సంప్రదాయక,చరిత్రాత్మక వారసత్వం గల  మతాలలో ఇస్లాం ఒకటి. 14 కోట్ల రష్యా జనాభా లో, 2కోట్ల మంధి వరకు ఇస్లాం ఆరాదించేవారు ఉన్నారు వారు మొత్తం రష్యన్ ఫెడరేషన్ జనాభా  లో దాదాపు  15% వరకు ఉన్నారు. ముస్లింలు అధికం గా వోల్గా ప్రాంతం, ఉత్తర కకాసుస్ లో కలరు. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్ఘ్ అర్బన్ ప్రాంతాలలో కలరు.  ఉత్తర కాకసుస్ ప్రాంతం లోని బ్లాక్ సీ –అస్పియన్ సీ మద్య సిర్కాసియన్స్,అడిఘే,బాల్కర్స్, చెచెన్స్, ఇంగుష్, కబర్దీన్,కరచాయ్ మరియు  డగేస్తాన్ ప్రాంతాలలో  ముస్లింలు నివసించుచున్నారు. వోల్గా,బాసీన్ ప్రాంతాలలో నివసించే తాతర్లు, బష్కీర్స్ లలో లో అధికులు ముస్లింలు.
రష్యా ముస్లిం లలో సున్నిలు,షియాలు,సూఫీ లు కలరు. ప్రస్తుత రష్యా భూభాగం లోని తొలి ముస్లింలు గా  దేర్బెంట్ ప్రాంతం లోని డగేస్తాన్ ప్రజలను పేర్కొనవచ్చును. రష్యాలోని సున్నీ ముస్లింలు  అధికంగా డగేస్తాన్ లో నివసిస్తున్నారు. షియాలు కాకసుస్ ప్రాంతంలో కలరు.  20వ శతాబ్ధం లో రష్యా లో ప్రారంభమయిన “వైసీ” ఉద్యమము రష్యా ఇస్లామిక్  చరిత్ర లో ప్రధానమైన ఘట్టము. “ఇత్తేఫాక్ అల్-ముస్లిమీన్ పార్టీ” రష్యా “డూమా” (పార్లమెంట్) లో మైనారిటీ ముస్లింలకు ప్రాతినిద్యం వహించుతున్నది.
 1990 తరువాత ఇస్లాం పట్ల రష్యా పాలకుల దృక్పదము లో మార్పు వచ్చింది. మక్కా హజ్ యాత్రకు అనేక మంది ముస్లింలకు అనుమతి లబించింది.  1995 తరువాత స్టాపించబడిన “నూర్ అల్ రష్యా ముస్లిం పబ్లిక్ మూవ్మెంట్మె”, ముస్లిం మరియు ఇతర మైనారిటీ వర్గాల రాజకీయ, ఆర్థిక,సంస్కృతి హక్కులను కాపాడ సాగింది. మాస్కో లో 1991లో ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ ఆఫ్ రష్యా స్థాపించబడినది.దానిచే మదారస నిర్వహింపబడుచున్నది. రష్యన్ బాషలో డగేస్తాన్ నుండి  ముస్లిం మ్యాగజైన్లు  వెలుబడ సాగినవి.
మాస్కో లోని అర్బన్ ముస్లింల తరువాత ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తాతారస్థాన్ లోని కజన్ లో రష్యన్ ఇస్లామిక్ యునివర్సిటి స్థాపించబడినది. డగేస్తాన్ లో అనేక ముస్లిం యూనివర్సిటీలు, మదర్శాలు స్థాపించబడినవి. దివ్య ఖురాన్ గ్రంధం అందరికీ లభించసాగినది.. ముస్లిం జనాభా అధికం గా ఉన్న చోట మసీదులు నిర్మించబడినవి.   తాతరస్తాన్,బష్కోర్తోస్తాన్ లోఇస్లామిక్ సెంటర్లు కలవు. వోల్గా నది వొద్దున గల తాతరస్తాన్ లో 1150 మసీదులు కలవు. దాని రాజధాని కజన్ లో రష్యా మరియు యూరప్ లోకల్ల అతిపెద్దదైన 16వ శతాబ్ధం లో నిర్మించబడిన  కొల్శరీఫ్ మసీదు కలదు తల్గట్ తాజుద్దీన్ రష్యా ప్రధాన ముఫ్తీ గా పనిచేశారు.
రష్యా లో ముస్లింలలో అధికులు సున్నిలు.5% మంది షియాలు ఉన్నారు. డగేస్తాన్,చెచెన్యా లో సున్నీ సూఫీ శాఖలైన నక్ష్ బంది,షాధిలి వారు కలరు. అజర్ బైజాన్ వాసులు షియాలు. రష్యా లో అధికంగా వ్యాప్తి చెందుతున్న మతం గా ఇస్లాంను చెప్పుతున్నారు. కొందరి అబిప్రాయం ప్రకారం 2050 నాటికి రష్యా లో ఇస్లాం అనుయాయులు గణనీయంగా వ్యాప్తి చెందుతారు. 2010 లో దాదాపు 20 వేలమంది రష్యన్ ముస్లింలు హజ్ యాత్ర చేసినారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో హజ్ యాత్ర చేయుటకు సౌదీఅరేబియా అనుమతి కోరుచున్నారు.
1991లో సోవియట్ యూనియన్ పతనమైన తరువాత పూర్వపు సోవియట్ రేపుబ్లిక్లకు చెందిన ముస్లింలు ఉద్యోగా ఉపాధి అవకాశాలను వేడుకొంటూ రష్యన్ ఫెడరేషన్ లోనికి వలస వస్తున్నారు. మాస్కో నగరం లో దాదాపు 8లక్షల ముస్లింలు నివసిస్తున్నారు. మొత్తం రష్యా ముస్లిం జనాభాలో వీరి శాతం 4% మరియు ఆయిల్ నిల్వలు అధికంగా ఉన్న ట్యూమెన్ ప్రాంతం (కజఖస్తాన్ సరిహద్దు)లో ఇంకో 3% మంది నివసిస్తున్నారు.
రష్యా ఫెడరేషన్ లోని 184 ఎథినిక్ గ్రూప్ ల లో 56 గ్రూప్ లు ప్రధానంగా ముస్లిం గ్రూప్ లు. రష్యా ఫెడరేషన్ లోని ముస్లింలలో సగం మండి తాటర్లు, బష్కిర్స్. రష్యా ముస్లిం జనాభాలో తాటర్లు 33%, బష్కిర్ర్లు 11% ఉన్నారు. చెఛన్లు 10%, మిగతావారు, కజకులు,అజేరిలు,ఉజ్బెక్కులు,తజికిలు,తుర్కుమాన్లు,మరియు కిర్గిజ్లు.
రష్యా ఫెడరేషన్ లోని ముస్లింలు కొన్ని ప్రాంతాలలో ఎక్కువుగా ఉన్నారు. రష్యా లోని ప్రతి ఐదుగురు ముస్లింలలో నలుగురు, ఏడు ఫెడరల్ జిల్లాలలోని రెండు జిల్లాలలో అనగా వోల్గా మరియు దక్షిణ జిల్లాలలో ఉన్నారు. 2009 లెక్కల ప్రకారం రష్యా ముస్లింలు తమ  సంప్రదాయక ప్రాంతాలు  అనగా డగేస్తాన్ (17%),బశ్కోర్తోస్తాన్ (15%) తాతారాస్తాన్ (14%) చేచన్యా  (7%) కబర్దీనో-బాల్కరియా (5%) లో నివసిస్తున్నారు. కొద్దిసంఖ్యలో ముస్లిం లు తమ సంప్రదాయక ప్రాంతాలు ఐనా ఇంగుషేతీయ(3%) కరచావో (2%)మరియు అడ్గెయా లో (1%) నివసిస్తున్నారు. మిగాతా వారు రష్యన్ ఫెడరేషన్ లోని మిగతా ప్రాంతాలలో నివసిస్తున్నారు. అనగా 2/3వంతు  ముస్లింలు తమ సంప్రదాయక ముస్లిం  నివాస ప్రాంతాలలోనే నివసిస్తున్నారు.
 రష్యా లో యూరోప్ లోకన్న అధికంగా ముస్లింలు ఉన్నారు. ప్రతి సంవత్సరము రష్యన్ ఫెడరేషన్ లో ముస్లిం జనాభా అభివృద్ధి 0.6% గా ఉంది. రష్యన్ రిపబ్లిక్ లో ముస్లిం జనాభా పెరుగుదలకు అనేక కారణాలు కలవు. ముస్లిం స్త్రీలకు పిల్లలు ఎక్కువ ఉదా. సరాసరి 2.3 పిల్లలు ఉంటారు. ముస్లిం స్త్రీలలో వివాహితలుఎక్కువ, విడాకులు తీసుకొని వారి సంఖ్య చాలా తక్కువ. ముస్లిం స్త్రీలలో అబార్షన్ చేయించేవారి సంఖ్య చాలా తక్కువ.
రష్యాన్ల సరాసరి జననాల రేటు కన్నా ముస్లింల జననాల రేటు అధికంగా ఉంది. రష్యన్ ముస్లిం స్త్రీల పునరుత్పాదన రేట్ 2.3 గా ఉంది. 2005-10 లెక్కల ప్రకారం ప్రతి 100మంది రష్యన్ ముస్లిం స్త్రీలకు,94 మంది పురుషులు కలరు
 రష్యా ఫెడరేషన్ 2002 జనాభా లెక్కల ప్రకారం ముస్లిం జనాభాలో 50% మంది సగటు వయస్సు 30 కు తక్కువ అనగా యువకుల శాతం అధికం. ముస్లిం జనాభాలో 25% మంది సగటు వయస్సు 15 కు లోపు. రష్యా ముస్లిం లలో 45 స. దాటివారు 27%,అరవై దాటినవారి సంఖ్యా 14% ఉంటుంది.
రష్యా ప్రెసిడెంట్ గా పనిచేసిన డిమెట్రి మెద్విదేవ్ “రష్యా,  ముస్లిం ప్రపంచం తో ప్రత్యేకంగా  స్నేహం చేయాలసిన అవసరము లేదు ఎందుకంటే రష్యా ఇస్లామిక్ ప్రపంచం లో ఒక భాగం” అని అన్నారు.
మద్య ఆసియా లోని  ముఖ్య ఇస్లాం ప్రాంతాలు 

ప్రాంతం పేరు
రాజధాని
జనసంఖ్య
1
అజర్ భైజన్
బాకు
0,71,46,000
2
కజఖిస్తాన్
అల్మ-ఆట
1,66,90,000
3
కిర్ఘిజియా
బిస్ఖెక్
0,43,42,000
4
తజికిస్తాన్
దుషాంబే
0,54,00,000
5
తుర్క్మెనిస్తాన్
అస్ఖాబాద్
0,36,21,700
6
ఉజెబిక్స్తాన్
తాష్కెంట్
2,03,22,000
తాతర్లు నివసించే క్రిమియా ప్రాంతం లో కూడా ముస్లిం లు కలరు.
మద్యాసియా లో ముస్లింలు నివసించే ప్రాంతాలు వ్యూహాత్మకంగా, రక్షణ దృష్ట్యాకీలక స్థానం లో ఉన్నాయి. ముస్లిం ప్రాంతాలు సహజ సంపదలతో నిండిఉన్నాయి.బంగారు గనులు ,ఖనిజాలు, చమురు,గ్యాస్  నిల్వలు,వ్యవసాయ ఉత్పత్తులు  అధికంగా ఉన్నాయి.
రష్యన్ ఇస్లామిక్ ప్రముఖులు:
·       వ్లాదిమిర్ ఖోడోవ్,
·       అలెక్సాండర్ లిత్వినేకో -                     రష్యా గూఢాచార సంస్థ ఉద్యోగి
·       ఆంటోన్ క్రోతోవ్-                     ట్రావెలర్,
·       వలెరీ కోరోవిన్ –                    రష్యా రాజనీతి శాస్త్రవేత్త,జర్నలిస్ట్
·       వ్యచేస్లావ్ పోలోసీన్-                ప్రొఫెసర్ మరియు  రష్యన్ అర్థోడాక్స్ చర్చ్ ప్రీస్ట్
·       మారియా అలకినా –               రష్యన్ పాప్ గర్ల్ గ్రూప్ ఫబ్రిక సబ్యురాలు.
·       మాక్సిం ట్రెఫాన్ –                   రష్యన్ రాక్ బ్యాండ్ సబ్యుడు
·       సెర్గి రోమనోవిచ్ –                   రష్యన్ నటుడు. 

ఆధారాలు:

1.     Wikipedia

2.     Wiki Islam

3.     Muslim Russia - Daniel Pipes

4.     Russiapedia

5.     Islam in Russia:  Abdur Rauf

6.     Muslims in the USSR Seeking a New DawnA Kalaam

7.     The Future of the Global Muslim Population – Pew Research Religion & Public Life Project
No comments:

Post a Comment