3 February 2014

సైన్స్,టెక్నాలజి మరియు వైద్య రంగాలలో ముస్లింల సేవలు



          ఆధునీక విజ్ఞాభివృద్ధిలో మదర్శాలు, మక్తబ్,హల్క,దారుల్-ఆలూమ్ వంటి సంప్రదాయక ఇస్లామిక్ విద్యా సంస్థల పాత్ర మహత్తరమైనది. ఎన్సైక్లోపెడియా ఆఫ్ బ్రిటానిక అభిప్రాయం లో “సాధారణంగా మదరసాలు సంప్రదాయక మత విజ్ఞానాన్ని మరియు ఇతర విజ్ఞాన అంశాలను భోధించేవి.ఆధునిక  విజ్ఞాభివృద్ధిలో ఈ సంస్థల పాత్ర మరువ లేనిది”.
          ముస్లిం పండితులు  గ్రహణ కోణం ను ,భూమి విస్తీర్ణాన్ని, సమరాత్రి -దిన కాలాన్ని ఖచ్చితం గా కొలిచిరి.ఆప్టిక్స్,ఫిజిక్స్ లలో కాంతి పరావర్తనం , గ్రావిటి,కపిలరి అట్రాక్షన్,సంద్య వెలుగు మొదలగు వాటిని విశిదపరిచిరి. ఖగోళ వస్తువుల పరిశీలనకు పరిశోధన శాలలను అబివృద్ధి చేసిరి. ఔషదాల తయారీలో ఔషద మొక్కలు మరియు ఖాద్య పదార్ధాల వినియోగం లో అబివృద్ధి సాదించిరి. ఇన్ మరియు ఔట్ పెషంట్ల వైద్యం కోసం వైద్య శాలలను స్థాపించిరి. సరియైన రోగ నిర్ధారణ  చేసి కొన్ని రోగాలకు సరియైన కారణాలను కనుగొనిరీ. వైద్యం లో శుబ్రతను అబివృద్ధి చేసిరి. శస్త్ర చికిత్సలో మత్తు మందును ఉపయోగించిరి. నూతన శస్త్ర చికిత్సా పరికరాలను కనుగొని , అనాటమీ లో శరీరచ్చేదనమును అబివృద్ది చేసిరి.
          అశ్వములు,పశువుల ఉత్పత్తిలో శాస్త్రీయ పద్దతులను, మొక్కలను  అంటూ కట్టే విధానం లో కొత్త పద్దతులనుకనుగొని, నూతన ఫల పుష్పజాతులను అబివృద్ధి చేసిరి. ఇరిగేషన్ లో కొత్త పద్దతులను ఏర్పాటుచేసి ఎరువులను, నూతన వ్యవసాయ పద్దతులను,నౌకాయాన  శాస్త్రాన్ని అబివృద్ధి చేసిరి.పోటాష్,ఆల్కహాల్,సిల్వర్ నైట్రేట్,నైట్రిక్ యాసిడ్,సల్ఫ్యూరిక్ ఆసిడ్,మెర్కురి క్లోరైడ్ వంటి వాటిని ముస్లిం పండితులు తమ పరిశోధనలతో కనుగొనిరీ. నేత,పింగాణి,లోహా శాస్త్రం లో సంపూర్ణతను సాదించిరి.మద్య యుగ ముస్లిం కట్టడాలను పరిశీలించిన వాటి నిర్మాణం లో ఉపయోగించిన ఇస్లామిక్ డిజైన్లు, రేఖలు,  గణిత పద్ధతులు, గణితం పై,డిజైనింగ్ పద్దతులపై వారికున్న పట్టును తెలుపు తున్నాయి. ఆ పద్ధతులను సరిగా  అర్థం చేసుకోవటానికి పాశ్చాత్యులకు ఆ తరువాత సుమారు 500 సంవత్సరాలు పట్టింది.

వేదాంత,విజ్ఞాన శాస్త్రాలలో ముస్లిం పండితులు :
          ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్-స్టీన్  మతం లేని విజ్ఞానము వ్యర్థము. విజ్ఞానము లేని మతము గ్రుడ్డిది అని అన్నాడు. ప్రముఖ దార్శనికుడు ఫ్రాన్సిస్ బాకన్ అబిప్రాయం లో విజ్ఞాన శాస్త్ర పరిచయం నాస్తికునిగా చేస్తుంది, కానీ విజ్ఞానశాస్త్ర విస్తృత పరిచయం నిన్ను ఆస్తికునిగా చేస్తుంది అని అబిప్రాయపడినాడు . మద్య యుగ ముస్లిం శాస్త్ర వేత్తలు,పండితులు, ఇస్లాం మత మరియు ఇస్లాం దార్శనిక ప్రముఖులు కూడా. తొలి ముస్లిం పరిశోధకుల  పరిశోధనలు భౌతిక మరియు ఆద్యాత్మిక రంగాల మద్యగల సంబంధం పై ఆధార పడి భౌతిక ప్రపంచాన్ని సునిశితముగా పరిశీలించి, పరిశోధించి వాస్తవాలను రాబట్టినారు.
          విశ్వ నిర్మాణం పై ముస్లిం శాస్త్రవేత్తల అబిప్రాయాలు దివ్య ఖురాన్ భావాలచే ప్రభావితమైనాయి. “భూమ్యాకాశాల నిర్మాణంలో,రేయింబవళ్ళు ఒక దాని వెంట ఒకటి చేసే నిరంతరమైన పయనంలో, ప్రజాబాహుళ్యానికి ఉపయోగపడే వస్తువులు మోసుకుంటూ నధులలో, సముద్రాలలో సంచరించే ఓడలలో, పై నుండి అల్లాహ్ కురిపించే వర్షపు నీటిలో తద్వారా ఆయన మృతభూమికి ప్రాణం పోస్తాడు. భూవిలో వివిధ ప్రాణులను వర్ధిల్లజేస్తాడు.వాయువుల సంచారంలో, భూమ్యాకాశాల మద్య అల్లాహ్ ఆదేశాలకు కట్టుబడిఉన్న మేఘమాలికలలో అసంఖ్యాకమైన సూచనలు కానవస్తాయి.-దివ్య ఖురాన్ 2:164
“నిశ్చయంగా రేయింబవుళ్ళ మార్పులో, భూమ్యాకాశాలలో దేవుడు సృష్టించిన వాటన్నింటిలో భయబక్తులు గల జనులకు పలు సూచనాలున్నాయి.”-దివ్య ఖురాన్ 10:6.
          భగవంతుని అతని ఆదేశాలను పాటించి,శూన్యాన్ని ,నిశబ్దాన్నిభగవతారాధనతో మార్మోగించే    ముస్లిం శాస్త్ర వేత్తలకు సూర్య,చంద్ర గమనాలు,పగలు,రాత్రి, దినం యొక్క కాలాన్ని,దివ్య ఖురాన్ లో చెప్పినట్లు సూర్య,చండ్రుల ఖచ్చితమైన గమనాన్ని కొలవాలని తెలుసు.డోముల,మీనారాల నిర్మాణాన్ని డిజైన్ చేసినవారికి, ఇంకా ఎంతో కనుగొనవలసిఉన్నదని తెలుసు. 
ప్రముఖ ముస్లిం శాస్త్రవేత్తలు-పండితులు:
            సాంప్రదాయక ముస్లిం విద్యాలయాలు అనేకమంది ప్రముఖ దార్శినికులను, తత్వవేత్తలను,పండితులను, శాస్త్రవేత్తలను సృష్టించినవి. వేయి సంవత్సరాల పూర్వం విజ్ఞానం యొక్క వివిధ శాఖలలో ముస్లిం పండితులు, శాస్త్రవేత్తలు చేసిన కృషిని దిగువ వివరించటమైనది. మచ్చుకు కొంతమంది వివరాలను ఇవ్వటం జరుగుతుంది.
రసాయనిక శాస్త్రం (కెమిస్ట్రీ)
          రసాయనిక శాస్త్ర పితామహునిగా జాబిర్-ఇబ్న్-హయ్యన్,అబు మూస (721-815) ప్రసిద్ది గాంచినాడు. ఇతడు వైద్యం తో సహా వివిధ  విజ్ఞాన శాస్త్రాలను అబ్యశించినాడు. ఇతను ఖలీఫా హారూన్ ఆర్ రషీద్ ఆస్థానం లో ఆస్థాన వైద్యునిగా ఉన్నాడు. షియా ల 6వ ఇమామ్ ఐనా జాఫర్ ఇబ్న్ ముహమ్మద్ స్నేహితునిగా ఉండి అతనివద్దనుండి వివిద విజ్ఞాన అంశాలను నేర్చుకొన్నాడు.
గణితము,బీజ గణితము,ఖగోళ శాస్త్రము మరియు బౌగోళిక శాస్త్రము:
          అల్-ఖ్వారిజ్మీ(అల్గోరీమ్) 770-840 గణితము,అల్గొరితం,అల్జీబ్రా,క్యాలుక్యులస్,ఖగోళ శాస్త్రం మరియు బౌగోళిక శాస్త్రములలో పండితుడు. ఖగోళ శాస్త్ర పట్టికలను, భారతీయ అంకెలను, ట్రిగనామెట్రీ పట్టికలను మరియు 69 మండి ఇతర పండితులతో కలసి బౌగోళిక శాస్త్ర ఎన్సైక్లోపీడియా ను తయారుచేసినాడు. 
బౌతీక శాస్త్రం, ఫిలాసఫి, మరియు మెడిసన్:
          ఇబ్న్-ఇశాక్ అల్-కిండి (అల్కిందుస్) (800-873) : బౌతీక శాస్త్రం, ఫిలాసఫి, ఆప్టిక్స్,మెడిసన్,గణితము మరియు లోహశాస్త్రములో ప్రముఖ పండితుడు.
          అలీ-ఇబ్న్-రబ్బాన్ అల్-తబరి (838-870) :మెడిసన్,గణితం,కాలిగ్రాఫీ, సార్వస్వతం లో ప్రముఖుడు.
          అల్-రాజీ (ర్హాజెస్)864-930 :మెడిసన్,ఆప్తమాలోజీ,కెమిస్త్రీ, ఖగోళశాస్త్రం లో ప్రముఖ విద్వాంసుడు. ఇతను మశూచికం (స్మాల్ ఫాక్స్) పై విస్తృతంగా పరిశోదనలు చేసినాడు. మశూచికము,తడపర పై అతడు వ్రాసిన పరిశోధనా వ్యాసాలు ఆతరువాత లాటిన్,గ్రీక్,బైజంటిన్ మరియు ఇతర ప్రముఖ ఆధునిక బాషలలో పేరుగాంచినవి అతడు వ్రాసిన కితాబ్ అల్-మన్సురి దానిపై 12వ శతాబ్ధం లోగెరార్డ్ ఆఫ్ క్రిమోనా చేసిన లాటిన్ అనువాదము మరియు కితాబ్ అల్-హవి లేదా సమగ్ర గ్రంధం ప్రఖ్యాతి పొందినవి.
          అల్-ఫరాబి (అల్-ఫరాబియస్) 870-950: సమాజశాస్త్రము, తర్కం, వేదాంతం,రాజనీతి శాస్త్రం మరియు సంగీతశాస్త్రములో ఖ్యాతి గడించినాడు.
          అబు అల్-కాసిం అల్-జఃరవి(అల్బుకాసిస్) 936-1013 సర్జరీ,వైద్యం లో ప్రముఖుడు, ఆధునిక సర్జరీ పితామహుడుగా పేరు గాంచినాడు.
ఇబ్న్అల్-హైతమ్ (అల్హజెన్) 965-1048:
          2వ శతాబ్ధానికి చెందిన టోలేమీ తరువాత ఆప్టికల్ థియరీని విస్తృతపరిచిన గొప్ప గణిత మరియు బౌతిక శాస్త్రవేత్త. ఆప్టిక్స్ మీద ఇతడు వ్రాసిన సిద్దాంతం 1270 లో లాటిన్ బాషలో అనువదింపబడినది.రిఫ్రాక్షన్,రిఫ్లెక్షన్,బైనాక్యులర్ విజన్,లెన్సుల ఫోకస్,రైన్ బో, పారబోలిక్,స్ఫెరికల్ అద్దాలు, స్ఫెరికల్ అబెర్రషన్,అట్మాస్ఫెరిక్ రెఫ్రాక్షన్, మరియు సూర్య వలయం సమీపంలోని ప్లానీటరి వస్తువుల సైజ్ పెరుగుదలపై పరిశోదనలు ప్రచురించినాడు. కంటిచూపు యొక్క ఖచ్చితమైన లెక్కనుచెప్పి కాంతి వస్తువునుండి కంటిపైకి ప్రసరించుచున్నదని మొదటగా చెప్పినాడు.
అబూ రైహాన్ అల్-బిరుని 973-1048
          పర్షియా దేశ  విద్వాంసుడు,శాస్త్రవేత్త మరియు సమకాలీన ప్రముఖులలో ,పండితులలో పేరుగాంచినవాడు. అతర్ అల్-బాకీయః (ప్రాచీన దేశాల వివరాలు) అల్-తఫ్హిమ్ (జ్యోతిష్య శాస్త్రా సూత్రాలు) అల్-కానూన్ అల్-మసూదీ (ది మసూదీ కానన్)(ఖగోళం పై ఒక గ్రంధము), తారిఖ్ అల్-హింద్,(భారత దేశ చరిత్ర)మరియు కితాబ్ అల్-సయ్దాలాహ్ (వైద్యం లో ఉపయోగించే మందుల వివరాలు)మొదలగు గ్రంధాలను రచించినాడు. ఇతడు ఖగోళం పై చేసిన పరిశోధనలలో భూమి  తన అక్షము పై తిరుగుటను, అక్షాంశా,రేఖాంశములను ఖచ్చితముగా లెక్కించినాడు.భూమి పరిధిని లేదా కైవారమును కొలచినాడు. హైడ్రో స్టాటిక్ సూత్రాల ద్వారా సహజ స్ప్రింగులను వివరించి, 18 రకాల విలువైన రాళ్ళు,లోహాల బరువులను కొలచినాడు.  సింధు లోయ ఒకప్పుడు సముద్రజల సంధి  అని తెలిపినాడు.
ఇబ్న్ సీనా (అవిసెన్నా) 981-1037 
          వైద్య శాస్త్రవేత్త,తత్వవేత్త  ,గణిత, ఖగోళ శాస్త్రవేత్త. అరిస్టాటిల్ తత్వం పై,వైద్యం పై చేసిన పరిశోధనలకు గాను  పేరుగాంచినవాడు. అతడిచే రచించబడిన కితాబ్  అష్-షిఫా(బుక్ ఆఫ్ హిలింగ్) శాస్త్రీయ,తాత్విక ఎన్సైక్లోపెడియా గా చేప్పవచ్చును.అతడు రచించిన “కానన్ ఆఫ్ మెడిసన్” గ్రంధము వైద్యం పై వ్రాయబడిన గ్రంథాలు అన్నింటిలోనూ ప్రముఖమైనది.
ఇబ్న్ హజ్ 994-1064:
          ముస్లింస్పెయిన్ కు చెందిన  సాహితీవేత్త,చరిత్ర కారుడు,న్యాయవేత్త,జహిరి స్కూల్ ఆఫ్ జురిస్ ప్రుడెన్స్ గ్రంధ రచయిత. న్యాయశాస్త్రము,తర్కము,చరిత్ర,నీతి,సమకాలీన మతాల ఆద్యయనము, దార్శనికత మరియు రింగ్ ఆఫ్ డోవ్, ఆర్ట్ లవ్ పై సుమారు 400 గ్రంధాలు రచించినాడు.
అల్-జర్ఖాలి(ఆర్జకేల్)1028-1087 :ఖగోళ కొలతలను కొలవటానికి ఉపయోగించే ఆస్ట్రోలాబ్ కనిపీట్టిన ఖగోళ శాస్త్రజ్ఞుడు.
అల్-ఘజాలీ(అల్గజెల్)1058-1111: ప్రముఖ సామాజిక,ధార్మిక, తత్వవేత్త
ఇబ్న్ జూర్ (అవెన్ జోర్) 1091-1161: శాస్త్రవేత్త,వైద్యం మరియు శస్త్ర చికిత్స లో ప్రముఖుడు.
ఇబ్న్ రుష్డ్ (ఆవేర్రోస్) 1128- 1198: తత్వశాస్త్రము, న్యాయశాస్త్రము,వైద్య శాస్త్రము, ఖగోళము మరియు వేదాంతముల  లో ప్రముఖుడు.
నాసిర్-అల్-దీన్ అల్-తుసి 1201-1274: ఖగోళ, నాన్-యూక్లిడియన్ జా మెంట్రీ లో ప్రముఖుడు.
గేబర్:
          గేబర్ రసాయన శాస్త్రము, లోహ శాస్త్రముపై ప్రామాణిక గ్రంధాలను రచించిన స్పెయిన్ కు చెందిన  14-15 వ శతాబ్ధపు శాస్త్రవేత్త. ఇతడు  రచించిన గ్రంధాలలో “సుమ్మ పెర్ ఫెక్షనిస్ మాజిస్టీరి1678”,”లిబర్ ఫోర్ణకం1678”, డి ఇన్వెస్టిగేషన్ పెర్ఫెక్షనిస్ 1678’ మరియు  డి ఇన్వెంటీ వేరితాటిస్1678  ముఖ్యమైనవి.ఇతను అంతకు పూర్వం11-13 శతాబ్ధాములలో  లాటిన్ లో ఆనువదింపబడిన జబిర్ అనే అరబ్ శాస్త్రవేత్త రచనలను అనుసరించినాడు. 16 వ శతాబ్ధపు పూర్వం రసాయన శాస్త్రం పై వ్రాయబడిన జాబిర్ ప్రముఖ గ్రంధాలు యూరప్ లో విస్తృతంగా అద్యనము చేయబడినవి.
          గేబర్ రచనలు యూరప్ లో రసాయన శాస్త్రానికి గౌరవాన్ని కలుగ చేసినాయి. ఇతని ప్రయోగశాల పద్దతులు వివరంగా స్పష్టం గా ఉండేవి. కెమికల్ కాంపౌండ్లు,ఆసిడ్ ల తయారీ, ప్రయోగశాల పరికరాలు ముఖంగా ఫర్నెస్ ల తయారీలో విశేష అనుభవాన్ని ప్రదర్శించినాడు.16 శతాబ్ధాపు యూరప్ కు చెందినప్రముఖ రసాయనిక వేత్తలు,ఖనిజవేత్తల రచనలతో ఇతని రచనలను సరిపోల్చవచ్చును.
ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లా (ఇబ్న్ బటుతా)1304-1369:
          ప్రసిద్ద యాత్రికుడు. మొరాకో నుంచి చైనా వరకు తిరిగి చైనా నుంచి మొరాకో కు మొత్తం 75,000 మైళ్ళు ప్రయాణం చేసినాడు.
ఇబ్న్ ఖల్దున్ 1332-1395 :
          సామాజిక శాస్త్రం,చరిత్ర,మరియు రాజనీతి తత్వ శాస్త్రముల పండితుడు.
మైసూర్ పులి టిప్పు సుల్తాన్1783-1799:
          మొదటి యుద్ద రాకెట్ ను తయారు చేసిన దక్షిణ భారత దేశ సుల్తాన్. ఇతని రాజధాని శ్రీరంగపట్టంము నుంచి వశపరుచుకొన్న రెండు రాకెట్లను లండన్ మ్యూజియం లో ప్రదర్శించటము జరిగింది. ఇతను తయారు చేసిన యుద్ద రాకెట్ 900మీటర్ల నుండి 1.5 కిలోమీటర్ వరకు గల లక్ష్యాలను ఛేదించగలవు.
హాజర్ఫెన్ అహ్మెట్ సెలెబి:
          గలాటా టవర్ నుంచి బొస్ఫోరూస్ జలసంధి పై ఎగిరినాడు. అదే కుటుంబానికి చెందిన లోగారి హాసన్ సెలెబి అంతరిక్షం లోనికి 300 ల పొండ్ల బరువు గల గన్ పౌడర్ తో కూడిన  రాకెట్ ను ప్రవేశపెట్టినాడు.




No comments:

Post a Comment