16 May 2024

ఢిల్లీలోని జామా మసీదులో ఒక హిందూ సన్యాసి (స్వామి శ్రద్దానంద) ఉపన్యాసం ఇచ్చినప్పుడు When a Hindu Sanyasi(Swami Sraddananda) delivered sermon in Jama Masjid of Delhi

 


1650 లో నిర్మించినప్పటి నుండి జుమా మసీదు ప్రార్ధనలకు మాత్రమే కాకుండా, భారత చరిత్రకు సాక్షిగా ఉంది. 1857 లో బ్రిటీష్ అధికారానికి వ్యతిరేకంగా విముక్తి మరియు తిరుగుబాటుకు ఇది సంకేతంగా ఉంది.1857 తిరుగుబాటులో ఢిల్లీ ముట్టడి సమయంలో తిరుగుబాటు సమావేశాలకు జామా  మసీదు ప్రధాన కేంద్రంగా ఉంది

హిందల్ అహ్మద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అబిప్రాయం ప్రకారం "ఎర్రకోట మరియు జామా మసీదు బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో మతం లేదా కులo కు  అతీతంగా  భారతీయ ప్రజానీకపు  రాజకీయ ప్రేరణకు ఎల్లప్పుడూ చిహ్నంగా ఉన్నాయి. వేర్వేరు నేపథ్యాల మరియు సిద్ధాంతాల నుండి వచ్చిన వివిధ రాజకీయ పక్షాల నాయకులు తమ రాజకీయ సందేశాలను అందించడానికి మసీదు యొక్క మింబర్ (పల్పిట్) ను ఉపయోగించారు.

గాంధీ, నెహ్రూ మరియు ఆజాద్ – ఆర్య సమాజం నుండి  స్వామి శ్రద్దనంద మొదలగు నాయకులు ఇక్కడ ప్రసంగాలు చేశారు. కాని గుర్తించుకోవలసిన అంశం ఏమిటంటే "1946 లో ముస్లిం లీగ్ యొక్క ఊరేగింపులో పాల్గొన్నప్పటికీ, జిన్నా జామామసీదు లోపల ప్రసంగాన్ని ఎప్పుడూ చేయలేదు.

శుక్రవారం ప్రార్థనల సమయంలో ఢిల్లీలోని చారిత్రాత్మిక జామా మసీదులో "హిందూ-ముస్లిం కీ జై" (హిందూ మరియు ముస్లింలు  దీర్ఘకాలం జీవించండి) అనే నినాదాల మధ్య కాషాయ వస్త్రాన్ని ధరించిన ఒక హిందూ సన్యాసి నడుచుకుంటూ వస్తున్నారు. జామా మసీదు నిండిపోయింది. ఈ సన్యాసి జామా మస్జిద్ మింబర్ (పల్పిట్) లోంచి ప్రసంగిస్తాడని వేలాది మంది ముస్లింలు ఎదురు చూస్తున్నారు. వందలాది మంది ఇతర హిందువులను కూడా జామా మసీదు లోపలికి అనుమతించారు.

ఇది అవాస్తవం కాదు. ఇది వాస్తవంగా  4 ఏప్రిల్ 1919న జరిగింది. ఆర్యసమాజ్ శుద్ధి మరియు గౌరక్షా ఉద్యమ నాయకుడు సన్యాసి స్వామి శ్రద్ధానంద్,

హిందూ-ముస్లిం ఐక్యత సూత్రం ప్రపంచానికి చాటటానికి , ముస్లింలు   ఢిల్లీలోని జామా మసీద్ నుండి ఆర్య సమాజానికి చెందిన స్వామి శ్రద్దానంద ను ప్రసంగించమని అడిగారు. డాక్టర్ సైఫ్ ద్డిన్ కిచ్చ్లు, కు అమృతసర్ లోని సిక్కు మందిరం అయిన స్వర్ణ దేవాలయానికి చెందిన తాళాలు keys ఇవ్వబడ్డాయి. హిందూ-ముస్లిం కి జై'  నినాదం తో మొత్తం దేశం ప్రతిధ్వనిoచింది.

ఏప్రిల్ 4న శుక్రవారం షహీద్‌ల (అమరవీరుల) కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని నిర్ణయించారు. స్వామి శ్రద్దానంద్ మరియు పలువురు హిందువులను ప్రత్యేకంగా జామా మసీదు లోపలికి ఆహ్వానించారు. హిందూ ముస్లిం ఐక్యతపై స్వామి శ్రద్దానంద్ ఉపన్యాసం ఇచ్చారు..

జామ మసీదు నందు  4 ఏప్రిల్ 1919 న స్వామి శ్ర్రద్దానంద్ కుంకుమ వస్త్రాలు ధరించి, అక్కడ ప్రజలను ఉద్దేశించి హిందూ-ముస్లిం ఐక్యత మరియు బ్రిటిష్ పాలన కు వ్యతిరేకంగా ప్రసంగించారు. స్వామి శ్ర్రద్దానంద్ వేద మంత్ర ఉచ్చారణ తో  తన ప్రసంగాన్ని ప్రారంభించారు.దానికి అందరు అమీన్ అని బదులిచ్చారు.  'ఈ జాతీయ ఆలయం' లో మాతృభూమి యొక్క "ప్రేమతో కూడిన నీటితో ‘water of love’" తమ  హృదయాలను శుద్ధి చేయాలని ఆయన ప్రతి ఒక్కరిని కోరారు మరియు భారతీయులు అందరు సోదరులు మరియు సోదరీమణులు అని భోదించారు.

సంఘటన-పూర్వ చరిత్ర:

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, బ్రిటీష్ వారు రౌలట్ బిల్లును తీసుకువచ్చారు, ఇది భారతీయుల ప్రసంగం మరియు భావవ్యక్తీకరణ హక్కుపై మరిన్ని ఆంక్షలను ప్రతిపాదించింది. M. K. గాంధీ (మహాత్మా గాంధీ) నేతృత్వంలోని భారత నాయకత్వం ఈ బిల్లును క్రూరమైనదిగా పిలిచింది.

మహాత్మా గాంధీ మరియు ఇతర నాయకులు ఫిబ్రవరి 1919లో అహ్మదాబాద్‌లో బ్రిటీష్ ప్రభుత్వం చట్టంగా చేస్తే రౌలట్ బిల్లును వ్యతిరేకిస్తామని ప్రతిజ్ఞపై సంతకం చేశారు. ప్రతిజ్ఞపై అబుల్ కలామ్ ఆజాద్, అజ్మల్ ఖాన్, లజపత్ రాయ్, మోతీలాల్ నెహ్రూ, శ్రీమతి సరోజినీ నాయుడు, అబ్బాస్ తయాబ్జీ, ఎన్.సి.కేల్కర్, వి.జె.పటేల్, వల్లభాయ్ పటేల్, ఎం.ఆర్.జయకర్, జవహర్‌లాల్ నెహ్రూ, గంగాధరరావు దేశ్‌పాండే, శ్రీమతి సోబని,  జమునాలాల్ బజాజ్, , M. S. అనీ, డా. అన్సారీ, ఖలీకుజ్జమాన్, అబ్దుల్ బారీ, రాజగోపాలాచారి, జతీంద్ర లాల్ బెనర్జీ, రాజేంద్ర ప్రసాద్, హస్రత్ మోహని, యాకూబ్ హసన్, డాక్టర్. మూంజే మరియు జైరామ్‌దాస్ దౌలత్ రాం మొదలగు నాయకులు సంతకం చేసారు..

దేశంలోని ఇతర ప్రాంతాల్లో, బిల్లు ఆమోదం పొందిన తర్వాత సత్యాగ్రహం కోసం ఎంచుకున్న రోజు ఏప్రిల్ 6, కాని ఢిల్లీలో మార్చి 30న సత్యాగ్రహం జరిగింది. 1919 మార్చి 7న ఢిల్లీలో ఏర్పడిన సత్యాగ్రహ సభలో పద్నాలుగు మంది నాయకులు ఉన్నారు. వీరిలో డాక్టర్ అన్సారీ (అధ్యక్షుడు), స్వామి శ్రద్ధానంద్ అని పిలవబడే మున్షీ రామ్, హస్రత్ మోహని, డాక్టర్ అబ్దుర్ రెహమాన్, శంకర్ లాల్, శివ నారాయణ్ హక్సర్, మిస్ గ్మీనర్ Miss Gmeiner, షుయబ్, ఇంద్ర (స్వామి కుమారుడు) మరియు అతని భార్య మరియు ఇతరులు ఉన్నారు.

స్వామి శ్రద్ధానంద్, మహమూద్ షుయబ్ మరియు అబ్దుర్ రెహమాన్ 30 మార్చి 1919న డిల్లీ సత్యాగ్రహానికి ప్రధాన నిర్వాహకులుగా ఉన్నారు.

సత్యాగ్రహా కార్యాచరణ ప్రణాళిక ఇలా ప్రచారం చేయబడింది:

 ( 1 ) మార్చి 30వ తేదీని సంతాప దినంగా జరుపుకోవాలి.

(2) మార్చి 29 రాత్రి నుండి అందరూ మార్చి 30 రాత్రి వరకు ఉపవాసం ఉండాలి.

(3) ఇతర రోజువారీ విధులన్నీ ముగించుకుని, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని, పరమాత్మను మనకు ఓర్పు శక్తిని ప్రసాదించమని, మన సర్కార్‌ను సరైన మార్గంలో నడిపించమని మరియు భారత మాత యొక్క కష్టాలను అంతం చేయమని ప్రార్థించండి,

(4) అన్ని వ్యాపారాలు మరియు దుకాణాలు మూసివేయడం, దేశానికి మంచి జరగాలని కోరుకోవడంలో, మనస్సును సంస్కరించడంలో మరియు దాతృత్వ పనిలో గడపాలి.

(5) ప్రతి స్త్రీ, పురుషుడు మరియు బిడ్డ సాయంత్రం సమావేశానికి 5 గంటలకు హాజరు కావాలి.

 ఆ రోజు (మార్చి 30)1857 తరువాత ఢిల్లీ చరిత్రలో అత్యంత రక్తపాతంగా మారింది మరియు భారతీయులకు బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఒక హెచ్చరిక అని కూడా నిరూపించబడింది. రెండు వారాల తర్వాత బ్రిటిష్ వారు అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో మారణకాండ నిర్వహించారు.

బ్రిటీష్ పోలీసులు మరియు సైన్యం ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో సత్యాగ్రహిలపై కాల్పులు జరిపినారు  మధ్యాహ్నం 2 గంటలకు డజనుకు పైగా సత్యాగ్రహులు మరణించారు. జనం చాందినీ చౌక్‌లోని క్లాక్ టవర్ వైపు వెళ్లడంతో పోలీసులు మళ్లీ బ్రిటీష్ పోలీసులు మరియు సైన్యం పలువురిని హతమార్చారు. ఢిల్లీలో 50 మందికి పైగా శాంతియుత నిరాయుధ సత్యాగ్రహులు బ్రిటిష్ పోలీసులు మరియు సైన్యం చేతిలో హతమయ్యారు.

చాందినీ చౌక్ నుండి క్లాక్ టవర్ వరకు వేలాది మందితో జరిగిన సత్యాగ్రహ యాత్రలో మెషిన్ గన్‌లు ఉపయోగించారని స్వామి శ్రద్ధానంద్ విన్నారు. అటు వెళ్ళిన స్వామి శ్రద్ధానంద్  ను బ్రిటీష్ సైన్యం,   నిలువరించి తుపాకీలను గురిపెట్టినది.   స్వామి విచారణ కమిషన్ ముందు జరిగిన సంఘటనను వివరించారు

.” స్వామి ఇలా వ్రాశాడు, “మేము క్లాక్ టవర్ దగ్గరికి చేరుకున్నప్పుడు, గుర్ఖాలు రోడ్డు మధ్యలో, రెండు వైపులా డబుల్ ఫైల్‌లో ఉన్నారు. మమ్మల్ని చూడగానే వాళ్లు కుడి ఫుట్ బోర్డు దగ్గరకు వెళ్లారు. మేము ముందుకు వెళ్లేందుకు వీలుగా వారు రోడ్డును విడిచిపెట్టారని మేము అనుకున్నాము, కాని మేము వారి దగ్గరికి చేరుకున్నప్పుడు, ఒక రైఫిల్ గుంపుపైకి కాల్చబడింది. జనంలో కలకలం మరియు తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కానీ నేను అందరినీ శాంతి గా ఉండమని అడిగాను మరియు వారు నా మాట పాటించారు. నా సన్యాసి వేషంలో, నేను ఒంటరిగా ఫుట్‌పాత్‌పైకి వెళ్లి, అమాయక శాంతియుత ప్రజలపై ఎందుకు కాల్పులు జరుపుతున్నారని గూర్ఖాలను అడిగాను. వెంటనే రెండు రైఫిళ్లు నా వైపుకు గురిపెట్టబడ్డాయి మరియు వారు చాలా అసభ్యకరమైన స్వరంతో తుమ్ కో ఛేద్ దేంగే (మేము మిమ్మల్ని కాలుస్తాము) అని చెప్పడం ప్రారంభించారు. నేను వారి ముందు నిశ్శబ్దంగా నిలబడి చెప్పాను. "మై ఖాడా హున్, గోలీ మారో (నేను నిలబడి ఉన్నాను, కాల్చండి)). ఒక్కసారిగా మరో ఎనిమిది లేదా పది రైఫిళ్లు నా రొమ్ముపై గురిపెట్టాయి మరియు అవమానకరమైన బెదిరింపులు కొనసాగాయి."

ఏప్రిల్ 17C. A. బారన్, C.I.E. , ఐ.సి.ఎస్. Sir J. H. DuBoulay, K.C.I.E. C.S.I. , I.C.S కి వ్రాసారు. “4వ తేదీన జామా మసీదు ప్రార్థనా సమావేశం ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగిసింది, అయితే అనేక మంది హిందువులను మసీదులోకి ఆహ్వానించడం మరియు ఆర్య సమాజిస్ట్ మున్షీ రామ్ (స్వామి శ్రద్ధానంద్) పల్పిట్ నుండి నమాజీలను ఉద్దేశించి  ప్రసంగించడానికి అనుమతించడం విశేషం.."

R. C. జెఫ్రీస్, పోలీసు సూపరింటెండెంట్, C.I.D. "జామా మసీదులోని పల్పిట్ నుండి మాట్లాడటానికి స్వామికి అనుమతి ఉంది మరియు 40 లేదా 50 మందికి బదులుగా ఇక్కడ ఉన్న సగం మందిని కూడా చంపితే భయపడవద్దని ప్రజలను కోరటం జరిగింది" అని నివేదించబడింది.

తరువాతి కొద్ది రోజుల్లో, జలియన్ వాలా బాగ్, అహ్మదాబాద్, లాహోర్ మొదలైన అనేక ప్రదేశాలలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులపై కాల్పులు జరిపింది.

 

 

 

 

భారత పార్లమెంటులో ముస్లింల అల్ఫ-ప్రాతినిద్యం

 


భారత పార్లమెంటులో ముస్లింలు అతి  తక్కువగా ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 200 మిలియన్ల ముస్లింల రాజకీయ శక్తి క్రమంగా క్షీణిస్తోంది.

అధికార పక్షం తో పాటు ప్రతిపక్ష పార్టీల్లోనూ ముస్లిం ప్రాతినిధ్యం పడిపోయింది.

2014లో అవుట్‌గోయింగ్ పార్లమెంట్‌లో 30 మంది ముస్లిం ఎం.పి.లు  మరియు కేవలం ఒక ముస్లిం బిజెపి సభ్యుడు గా ఉన్నారు.

ముస్లింలు ప్రస్తత పార్లమెంట్ లో 543 సీట్లలో 25 స్థానాలను కలిగి ఉన్నారు మరియు బిజెపిలో ఒక ఎం.ఫి కూడా లేదు.

భారతదేశం ముస్లింలు ఎక్కువగా అట్టడుగున ఉన్న marginalized దేశం నుండి వారు "చురుకుగా మినహాయించబడిన“actively excluded,” " దేశంగా మారిందని న్యూ ఢిల్లీలోని అశోకా విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రవేత్త మరియు చరిత్రకారుడు అలీ ఖాన్ మహమూదాబాద్ అన్నారు.

1980ల మధ్యకాలంలో, ముస్లింలు భారతదేశ జనాభాలో 11% ఉన్నారు మరియు పార్లమెంటులో 9% స్థానాలను కలిగి ఉన్నారు;

నేడు ముస్లింలు జనాభాలో 14% మరియు పార్లమెంటులో 5% కంటే తక్కువ సీట్లు కలిగి ఉన్నారు.

పార్లమెంటులోని 10 మంది సభ్యులలో తొమ్మిది మంది హిందువులు,

హిందువులు 1.4 బిలియన్ల జనాభా కలిగి  భారతదేశ జనాభాలో 80 శాతం ఉన్నారు.

రాష్ట్ర స్థాయిలో ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం కాస్త మెరుగ్గా ఉంది.

భారతదేశంలో 28 రాష్ట్రాలలోని రాష్ట్ర శాసనసభలలో 4,000 కంటే ఎక్కువ మంది శాసనసభ్యులు ఉన్నారు మరియు ముస్లిం శాసన సభ్యులు కేవలం 6% కలిగి ఉన్నారు.

2006లో సచార్ కమిటి నివేదిక ప్రకారం ముస్లింలు హిందువులు, క్రైస్తవులు మరియు భారతదేశంలోని అట్టడుగు కులాల ప్రజలు అక్షరాస్యత, ఆదాయం మరియు విద్యను పొందడంలో వెనుకబడి ఉన్నారు. బహుళ స్వతంత్ర అధ్యయనాల ప్రకారం వారు అప్పటి నుండి కొన్ని లాభాలను పొందారు, కానీ ఇప్పటికీ గణనీయమైన ప్రతికూలతలో ఉన్నారు.

భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒక్కదానికి కూడా ముస్లిం ముఖ్యమంత్రిగా లేరు; బిజెపి మరియు దాని మిత్రపక్షాలు 19 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను కలిగి ఉన్నాయి.

దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 16% మంది ముస్లింలు ఉన్నారు, రాష్ట్ర శాసనసభ్యులలో కేవలం 7% మంది మాత్రమే ముస్లింలు.

అధికార పక్షం మరింత శక్తివంతంగా మారడంతో, హిందూ ఓటర్లను దూరం చేస్తారనే భయంతో భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలు ముస్లిం అభ్యర్థులను నామినేట్ చేయడానికి విముఖత చూపుతున్నాయని నిపుణులు అంటున్నారు.

బిజెపి 2014 మరియు 2019 ఎన్నికలలో కలిపి కేవలం 13 మంది ముస్లిం అభ్యర్థులను మాత్రమే నిలబెట్టింది మరియు ఎవరూ ఎన్నిక కాలేదు.

ఈ ఏడాది పార్లమెంట్‌కు పోటీ చేస్తున్న 430 మంది బీజేపీ అభ్యర్థుల్లో ఒక్క అబ్యర్ది ముస్లిం అయిన ఎం అబ్దుల్ సలాం(మలప్పుర౦). గెలిస్తే, 2014 తర్వాత భారత పార్లమెంటు దిగువ సభలో బీజేపీకి చెందిన మొదటి ముస్లిం సభ్యుడు అవుతాడు.

 

15 May 2024

భారతదేశంలో ఉన్నత విద్యలో ముస్లింల ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థుల కంటే హిందూ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది: CSR-NOUS నివేదిక Hindu students outnumber Muslim students in higher education in Muslim-run institutions in India: CSR-NOUS Report

 



న్యూఢిల్లీ-

ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ స్టడీ అండ్ రీసెర్చ్ (CSR) మరియు NOUS నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించిన "భారతదేశంలో ముస్లింలు నిర్వహించే ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల ఉన్నత విద్యకు సంబంధించిన ఒక సర్వే" ప్రకారం దేశవ్యాప్తంగా ముస్లింలు నిర్వహించే విద్యాసంస్థల్లో ఉన్నత విద్యలో ముస్లిం విద్యార్థుల కంటే హిందూ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

Ø సర్వే ప్రకారం ముస్లింలు నిర్వహించే ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల ఉన్నత విద్యాసంస్థల్లో హిందువులు  55 శాతంగా ఉండగా ముస్లిం విద్యార్థులు 42 శాతంగా ఉన్నారు.

ముస్లిములు నిర్వహించే విద్యాసంస్థలకు సంబంధించి సమాజంలోని కొన్ని వర్గాల మధ్య ఉన్న తప్పుడు అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ అధ్యయనం అనుభావిక సాక్ష్యాలను అందిస్తుంది.

Ø అంతేకాకుండా ముస్లింల ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాలలో, హిందువులు మెజారిటీ విద్యార్థులు (52.7%)గా , ముస్లింలు 42.1% గా ఉన్నారు.

Ø ముస్లిం మైనారిటీలు నిర్వహించే కళాశాలలో హిందువులు (55.1%), ముస్లింలు (42.1%) మరియు ఇతర మైనారిటీ సమూహాలు (2.8%) గా ఉన్నారు.


భారత దేశ మొత్తం జనాభాలో ఎస్సీలు మరియు ఎస్టీలు వరుసగా 16.6% మరియు 8.6% గా ఉన్నారు.

Ø ఉన్నత విద్యలో షెడ్యూల్డ్ కులాలు (SC) 15.3% మరియు షెడ్యూల్డ్ తెగల (ST) నమోదు రేట్ల 6.3% గా ఉన్నవి.

భారతదేశ జనాభాలో ముస్లింలు 14% పైగా ఉన్నారు.

ఉన్నత విద్యలో ముస్లిముల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది.

Ø తాజా ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE-2021-22) ప్రకారం, ఉన్నత విద్యలో చేరిన విద్యార్థులలో కేవలం 4.8% మంది మాత్రమే ముస్లింలు. ఇది షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగల (ST) నమోదు రేట్ల కంటే కూడా తక్కువ


Ø ముస్లిం విద్యా సంస్థలతో అనుబంధంగా ఉన్న కళాశాలల్లో ముస్లిం విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి 1.23గా ఉంది.

Ø విశ్వవిద్యాలయాలలో ముస్లిం విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి కేవలం 0.23 గా ఉంది.

Ø ముస్లిం విద్యార్థుల ఉమ్మడి స్థూల నమోదు నిష్పత్తి 1.46. అయితే, IITలు, IIITలు, IISERలు, NITలు మరియు IIMల వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలలో కేవలం 1.72% మంది విద్యార్థులు మాత్రమే ముస్లింలు ఉన్నారు.

17 ఏళ్ల కిందట ముస్లిం సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై సచార్ కమిటీ నివేదిక విడుదల చేసినా పెద్దగా పురోగతి లేదు.

2006లో సచార్ నివేదిక వెలువడినప్పుడు ఉన్నత విద్యలో ముస్లింల నమోదు 3.6%గా ఉంది.

2012-13లో మొదటి AISHE నివేదిక ఆరేళ్ల తర్వాత ఉన్నత విద్యలో ముస్లింల నమోదు 0.6% మాత్రమే పెరిగింది.

ఒక దశాబ్దం తరువాత, AISHE నివేదిక మరో 0.6% పెరుగుదలను సూచించింది. దీనికి విరుద్ధంగా, SC మరియు STలు వంటి ఇతర వెనుకబడిన వర్గాలు గణనీయమైన పురోగతిని సాధించాయి. వారి నమోదు రేట్లు 2006లో 2.4% నుండి 2021-22లో వరుసగా 15.3% మరియు 6.3%కి పెరిగాయి.

ముస్లింలతో పోలిస్తే ఎస్సీ మరియు ఎస్టీల నమోదు రేట్లు చాలా పెరుగుదలను చూపించాయి. ఉన్నత విద్యలో వారి వాటా 2006లో ఉమ్మడి 2.4% నుండి 2021-22లో SCలకు 15.3% మరియు STలకు 6.3%కి పెరిగింది.

సచార్ నివేదిక ప్రారంభంలో SCలు మరియు STలకు కలిపి 2.4% నమోదు రేటును నివేదించింది.

 

అధ్యయనం యొక్క ఇతర ముఖ్య ఫలితాలు:

 

విశ్వవిద్యాలయాలు:

1. AISHE 2020-21 డేటా ప్రకారం భారతదేశంలోని మొత్తం 1113 విశ్వవిద్యాలయాలలో, 23 విశ్వవిద్యాలయాలు ముస్లిం మైనారిటీకి చెందినవి. ముస్లిం మేనేజ్‌మెంట్ విశ్వవిద్యాలయాల వాటా కేవలం 2.1% మాత్రమే.

2. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది.

3. 23 ముస్లిం విశ్వవిద్యాలయాలలో, మెజారిటీ (43.5%) ప్రైవేట్‌గా నిర్వహించబడుతున్నాయి, ప్రభుత్వ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు (26.1%), డీమ్డ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు (13%), మరియు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు (13%) ఉన్నాయి.

4. దాదాపు 69.9% ముస్లిం విశ్వవిద్యాలయాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.

5. 2021-22 విద్యా సంవత్సరంలో ముస్లిం విశ్వవిద్యాలయాలలో  నమోదు చేసుకున్న మొత్తం 97,928 మంది విద్యార్థులలో 42.1% మంది ముస్లింలు, 52.7% హిందువులు మరియు 5.2% ఇతర మైనారిటీ వర్గాలకు చెందినవారు.

6. ముస్లిం విద్యార్థులకు సంబంధించి, ఉన్నత విద్యలో 26,039 (63.09%) మంది విద్యార్థులు మరియు 15,236 (36.91%) మంది మహిళా విద్యార్థులు ఉన్నారు.

7. నమోదు చేసుకున్న 41,275 ముస్లిం విద్యార్థులలో 1% కంటే తక్కువ మంది షెడ్యూల్డ్‌ తెగలు, 34% ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు, 42.8% అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందినవారు మరియు మిగిలిన 16.4% ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు

 

కళాశాలలు:

1. AISHE 2020-21 డేటా ప్రకారం భారతదేశంలోని మొత్తం 43,796 కాలేజీలలో 1,155 కాలేజీలు ముస్లిం మైనారిటీ కమ్యూనిటీచే నిర్వహించబడుతున్నాయి. అంటే ముస్లిం మేనేజ్‌మెంట్ కాలేజీల వాటా కేవలం 2.6% మాత్రమే.

2. 1,155 కళాశాలల్లో 141 (12.2%) ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో నమోదు చేయబడిన సాంకేతిక కళాశాలలు.

3. అన్ని మైనారిటీ సమూహాలలో 73.4% ఉన్నప్పటికీ, ముస్లిం మైనారిటీ కమ్యూనిటీలు సాంకేతిక కళాశాలల్లో 16.6% వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, ఇతర మైనారిటీ సమూహాలు, జనాభాలో 26.6%, కాని సాంకేతిక కళాశాలల్లో 83.4% వాటాను కలిగి ఉన్నాయి.

4. భారతదేశంలోని 6.4% ముస్లిం కళాశాలలు బాలికల కోసం మాత్రమే ఉన్నాయి.

5. భారతదేశంలోని కళాశాలల సంఖ్య పరంగా మొదటి 10 రాష్ట్రాలు కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ మరియు జమ్మూ & కాశ్మీర్.

దేశంలోని మొత్తం కళాశాలల్లో ఈ రాష్ట్రాల వాటా 90.47%.

6. 1,155 ముస్లిం మైనారిటీ కళాశాలల్లో 85.5% ప్రైవేట్ (అన్ ఎయిడెడ్), 10.6% ప్రైవేట్ (ఎయిడెడ్), మరియు 3.9% ప్రభుత్వ కళాశాలలు.

7. కేరళలో లక్ష జనాభాకు 24.9 కళాశాలలు ఉండగా, యుపిలో 4.9 కళాశాలలు మరియు పశ్చిమ బెంగాల్‌లో లక్ష జనాభాకు కేవలం 1.8 కళాశాలలు ఉన్నాయి. లక్ష జనాభాకు జాతీయ కళాశాలల సగటు 6.4%గా ఉంది.

8. 1155 ముస్లిం మైనారిటీ కళాశాలల్లో 85.5% ప్రైవేట్ (అన్ ఎయిడెడ్), 10.6% ప్రైవేట్ (ఎయిడెడ్), మరియు 3.9% ప్రభుత్వ కళాశాలలు.

9. దాదాపు 57.8% ముస్లిం మైనారిటీ కళాశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

10. మెజారిటీ కళాశాలలు (93.16%) అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి, అయితే 6.32% మాత్రమే పీహెచ్‌డీ స్థాయి ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.

11. కేరళలో అత్యధిక సంఖ్యలో PhD ప్రోగ్రామ్‌లను అందిస్తున్న కళాశాలలు ఉన్నాయి, ఆ తర్వాత తమిళనాడు మరియు మహారాష్ట్ర ఉన్నాయి.

12. దాదాపు 51% కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి ప్రోగ్రామ్‌లను మాత్రమే అందిస్తాయి.

13. 2021-22 విద్యా సంవత్సరంలో నమోదు చేసుకున్న మొత్తం 524,441 మంది విద్యార్థులలో 42.1% మంది ముస్లింలు, 55.1% హిందువులు మరియు 2.8% ఇతర మైనారిటీ వర్గాలకు చెందినవారు.

14. ముస్లిం విద్యార్థుల పరంగా, 104,163 (47.18%) మంది విద్యార్థులు మరియు 116,622 (52.82%) మహిళా విద్యార్థులు ఉన్నత విద్యలో చేరారు.

15. నమోదు చేసుకున్న 220,785 ముస్లిం విద్యార్థులలో, 1% కంటే తక్కువ మంది షెడ్యూల్డ్ తెగలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, 48.1% ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు,

50.7%అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ నుండి వచ్చాయి మరియు మిగిలిన 0.9% ఆర్థికంగా బలహీనమైన విభాగాల (EWS) నుండి వచ్చినవి.

16. 96.4% కళాశాలలు 2023 NIRF ర్యాంకింగ్‌లో పాల్గొనలేదు.

17. NIRF 2023 కాలేజీ ర్యాంకింగ్స్‌లో ఏ కాలేజీ కూడా టాప్ 100లో స్థానం సంపాదించలేదు.