26 May 2024

జపాన్ లో ముస్లిములు సంక్షిప్తం గా

 




జపాన్‌లోని అతిచిన్న మైనారిటీ విశ్వాసాలలో ఇస్లాం ఒకటి

 

Ø  జపాన్ లో దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మతాలలో ఇస్లాంను ఒకటి.

Ø ఇస్లాం స్వికరించినవారు 2010లో 110,000 నుండి 2019 చివరి నాటికి 230,000కి సుమారు 110% పెరిగారు. 

2019 నాటికి మొత్తం జపాన్ జనాభాలో దాదాపు 0.18% మంది ఉన్నారు,

Ø జపాన్ మొత్తం జనాభా దాదాపు 126 మిలియన్లు.

Ø నేడు, జపాన్‌లోని దాదాపు 90% మంది ముస్లింలు విదేశీ మూలానికి చెందినవారు, మిగిలినవారు స్థానిక జపనీస్ మతం మారినవారు

Ø జపాన్ లో 1970 లోరెండు మసీదులు ఉండేవి కాని ఇప్పుడు 200 కంటే ఎక్కువ  కలవు.

Ø జపాన్ లో ఇస్లాం పునాదులు 8 వ శతాబ్దం లో ప్రారంభమైనవి.

Ø తతార్ ముస్లిం వలస వాదులు  1930 లో జపాన్లో అతిపెద్ద  ముస్లిం సముదాయం గా రూపొందారు 

Ø 1938 లో ఒరిజినల్ టోక్యో మసీదును  స్థాపించారు.

Ø అనధికార లెక్కల ప్రకారం జపాన్ లో 70 వేల నుంచి 2,30,000 వరకు ముస్లింలు కలరు. వారిలో 10% మంది జపాన్ వారు.

Ø కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారి సంఖ్య 50,000 వరకు కలదు.

Ø టోక్యో కామి లేదా టోక్యో మసీదు ఒక అద్భుతమైన కట్టడం.మసీదు నిర్మాణం 2000 లో పూర్తయ్యింది..

Ø టోక్యో కామి  camiలేదా టోక్యో మసీదు ను జపాన్ లో అత్యంత ప్రముఖ మసీదు గా మరియు జపాన్ ప్రభుత్వ ఆర్ధిక సహాయం లేకుండా ,జపనీస్  ఆర్ధిక కంపెనీలు, అతి ముఖ్యంగా మిట్సుబిషి ఆర్ధిక  సహాయం మరియు టర్కీ ప్రభుత్వ సహాయం  తో నిర్మించిన మస్జిద్.

Ø టోక్యో కామి  camiలేదా టోక్యో మసీదు ప్రారంభ వేడుకలకు  జపాన్ మరియు ఇస్లామిక్ వరల్డ్ నుండి ఉన్నతాధికారులు  మరియు దౌత్యవేత్తలు హాజరయ్యారు

Ø . నేగాయ(Nagoya) మసీదు 1931 లో మరియు కోబే మసీదు 1935 లో భారతీయ ముస్లిం వలసదారులు నిర్మించారు.

Ø 1966లో  జపాన్ ఇస్లామిక్ సెంటర్ (ICJ), ఏర్పాటుచేయబడినది. 

Ø నేడు జపాన్ లో 200 మస్జిద్లు మరియు అనేక తాత్కాలిక ఇస్లామిక్ ప్రార్ధనా మందిరాలు కలవు.

Ø టోక్యో మస్జిద్, ఒమర్ పాఠశాల,జపాన్ ఇస్లామిక్ సెంటర్ ఆధునిక జపాన్ ఇస్లామిక్ చరిత్ర లో ముఖ్యమైన అంతర్భాగాలు.

Ø ప్రసిద్ధ జపనీస్ ముస్లిం పండితుడు మరియు మేధావి అయిన  ప్రొఫెసర్ డాక్టర్ హసన్ కో నకటా చాలా మంది జపనీయులను ఇస్లాం వైపు నడిపించారు.

 

 

 

 

No comments:

Post a Comment