21 May 2024

రేషి మౌల్ మందిరం/దర్గా : అనంతనాగ్ Shrine of Reshi Moul: Anantnag

 




16వ శతాబ్దపు సూఫీ సన్యాసి  రేషి మౌల్ 909 హిజ్రీలో జన్మించి, 986 (హిజ్రీ)లో మరణించినట్లు విశ్వసించబడింది, అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, రేషి మౌల్ జనవరి 17, 1504న జన్మించాడు 68 సంవత్సరాల వయస్సులో సూఫీ సన్యాసి  రేషి మౌల్ మరణించాడు.

రేషి మౌల్ అనంతనాగ్‌లోని దండార్ గ్రామంలో వృత్తిరీత్యా కమ్మరి షేక్ అబ్దుల్లా ఇంట్లో జన్మించాడు. చిన్నతనంలో, రేషి మౌల్ గొప్ప అద్భుతాలు చేశాడు, వ్యవసాయం చేసాడు  పశువులను పోషించాడు మరియు తన జీవితాన్ని బ్రహ్మచర్యంతో గడిపాడు.

కాశ్మీర్ యొక్క గొప్ప సన్యాసి హజ్రత్ షేక్ హంజా మఖ్దూమ్, రేషి మౌల్ యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శి.

అప్పటి కాశ్మీర్ పాలకుడు అలీ షా చక్ మరియు యువరాజు యూసుఫ్ షా చక్ రేషి మౌల్ ను దర్శించే వారు. గొప్ప పండితుడు మరియు కాశ్మీర్ చీఫ్ కాజీ బాబా దావూద్ ఖాకీ కూడా రేషి మౌల్ ను సందర్శించారు. రేషి మౌల్ గొప్ప ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉన్నాడు

దక్షిణ కాశ్మీర్‌లోని ప్రజలందరూ మే 7 నుండి ఐదు రోజుల పాటు మటన్, చికెన్ మరియు చేపలను తినడానికి దూరంగా ఉంటారు.. ఈ రోజులు పుణ్యమైన రోజులు” (అయామ్-ఎ-పర్హేజ్‌గారి) మరియు ఆ రోజులలో సూఫీ సన్యాసి బాబా ఉర్స్‌ జరుగుతుంది. సూఫీ సన్యాసి రేషి మౌల్ ను  (తండ్రి రేషి) లేదా హైదర్ అలీ రేషి, అని పిలుస్తారు. అనంతనాగ్ పట్టణం నడిబొడ్డున ఉన్న రేషి మౌల్ మందిరంలో 459వ ఉర్సు రాత్రి ప్రత్యేక ప్రార్థనలతో ఆచరించబడుతుంది..

ఇస్లామిక్ (హిజ్రీ) క్యాలెండర్‌లోని 11వ నెల అయిన జుల్ ఖదా మొదటి రోజున సూఫీ సన్యాసి రేషి మౌల్ ఉర్స్ ఆచరిస్తారు. ఉర్స్ ముందు 5 రోజులు ప్రజలు మాంసాహారానికి ఖచ్చితంగా దూరంగా ఉంటారు.

దక్షిణ కాశ్మీర్ ప్రజలు సూఫీ సెయింట్, రేషి మౌల్ గౌరవార్ధం ఉర్స్ ముందు ఐదు రోజులు మటన్, చికెన్ మరియు చేపలను తినడం మానేస్తారు,ఈ పద్ధతి శతాబ్దాలుగా అనుసరించబడుతుంది..

సూఫీ సన్యాసి రేషి మౌల్ ఆధ్యాత్మిక మార్గదర్శి షేక్ హంజా మఖ్దూమ్‌ను "తృప్తిపరచడానికి" ఐదు రోజులు శాఖాహారం తినడం జరుగుతుంది.

" గత అనేక శతాబ్దాలుగా దక్షిణ కాశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా అనంత్‌నాగ్ జిల్లా మరియు పట్టణ, ప్రజలు సూఫీ సెయింట్, రేషి మౌల్ గౌరవసూచకంగా ఈ అభ్యాసాన్ని పాటిస్తున్నారు" ఇతర ప్రాంతాలలో మరియు ఇతర దేశాలలో నివసిస్తున్న సూఫీ సన్యాసి, రేషి మౌల్ అనుచరులు/భక్తులు  కూడా దీనిని పాటిస్తారు."

జపాన్, స్పెయిన్, జర్మనీ వంటి ఇతర దేశాల నుంచి కూడా సూఫీ సెయింట్, రేషి మౌల్ భక్తులు ఆశీర్వాదం పొందడానికి మరియు ఆశీర్వాదం కోసం ప్రసాదాలను సమర్పించడానికి పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రానికి తరలివస్తారు.

సూఫీ సన్యాసి రేషి మౌల్ మందిరం(దర్గా) కాశ్మీరీ వాస్తుశిల్పానికి ఒక ఉదాహరణ మరియు అన్ని వర్గాల కాశ్మీరీలకు పుణ్యక్షేత్రం. మందిరం(దర్గా) సముదాయంలో సల్ఫర్ నీటి బుగ్గ మరియు ప్రార్థనల కోసం విశాలమైన మసీదు ఉన్నాయి.

రేషి మౌల్ మందిరం(దర్గా) లో రేషి మౌల్ (మధ్యలో) మరియు అతని 20 మంది శిష్యుల సమాధులు ఉన్నాయి.

ముఖ్యంగా అనంతనాగ్ పట్టణంలోని ప్రాంతాల ప్రజలు రేషి మౌల్ ఉర్సు కు ముందు ఐదు రోజుల పాటు శాకాహారులుగా మారతారు. మటన్ వంటకాల స్థానంలో గుడ్లు, చీజ్ వంటి పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తున్నారు.

హర్దా రేషి లేదా రేషి మోలు అని ప్రసిద్ధి చెందిన బాబా హైదర్ రేషి సమాధిని కాశ్మీర్ లోయ నలుమూలల నుండి ముస్లింలు మరియు హిందువులు సందర్శిస్తారు.

 

 

No comments:

Post a Comment