11 February 2025

ఆగా ఖాన్ వారసత్వం-భారతీయ మూలాలను మరియు ఆఫ్రికన్ ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది

 


ఆగా ఖాన్,  షియా ఇస్లాంలో  నిజారీ ఇస్మాయీలీల ఇమామ్ బిరుదు.1866లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఆగా ఖాన్I (1800–81), నిజారీ ఇస్మాయిలీల 46వ ఇమామ్ గా, భారతదేశ ఖోజా ముస్లింల అధిపతిగా నిర్ధారించబడ్డాడు. 1887లోభారత వైస్రాయ్ ద్వారా  ఆగా ఖాన్ అనే బిరుదును అధికారికంగా గుర్తించారు.

ఆగా ఖాన్  బ్రిటీష్ ఇండియాలో తుపాకీచే గౌరవ వందనం అందుకున్నఏకైక మతపరమైన లేదా సమాజ నేత అయ్యారు. ఆగా ఖాన్I కేవలం ఖోజా ముస్లింల ఆధ్యాత్మిక నాయకుడిగా ఎదగటమే కాకుండా ఖోజా ముస్లింల వ్యాపార నెట్‌వర్క్‌ల వ్యాప్తిని కూడా వ్యాపింపజేశారు..

ఖోజా ముస్లిం సమాజ ప్రయాణం ముంబైలో ప్రారంభమైంది, మత గురువుగా ఆగా ఖాన్I ఖోజా ముస్లింల ఆదాయంలో దశమ భాగమును స్వికరించడమే కాకుండా  దానిని ఖోజా ముస్లిం కమ్యూనిటీ ధార్మిక మరియు వ్యాపార మద్దతు కోసం ఉపయోగించారు

భారతదేశ ఖోజా ముస్లింలు అధికముగా గుజరాత్ మరియు సింధ్‌లో స్థిరపడినారు. ఖోజాలు నివసించే గుజరాత్ మరియు సింద్‌లు కరువులకు గురయ్యాయి, ఆగా ఖాన్I వారిని తూర్పు ఆఫ్రికాలోని కొత్త యూరోపియన్ కాలనీలకు వెళ్లమని ప్రోత్సహించారు. ముంబైలోని  మజ్‌గావ్‌లో ఆగా ఖాన్I సమాధి కలదు.

మెరుగైన అవకాశాల కోసం, ఖోజాలు తూర్పు ఆఫ్రికాకు వెళ్లారు, అక్కడ ఆగా ఖాన్ III (1885–1957) విద్య మరియు ఆర్థిక సహాయం ద్వారా వారికి మద్దతు ఇచ్చాడు. 1945లో ఆగా ఖాన్ III తన అనుచరులు తూర్పు ఆఫ్రికా లో లోతట్టు ప్రాంతాలకు విస్తరించాలని ఆజ్ఞాపించి, వారికి సులభమైన నిబంధనలపై రుణాలు అందించే ఏర్పాట్లు చేసారు.

ఆగా ఖాన్ III, తన 72 సంవత్సరాల పాలనలో తూర్పు ఆఫ్రికా ఇస్మాయిలీలకు మద్దతు ఇచ్చాడు, పాఠశాలలు మరియు మసీదులను ఏర్పాటు చేశాడు మరియు వారి తరపున వలస పాలకులతో మధ్యవర్తిత్వం వహించాడు. తూర్పు ఆఫ్రికాలోని ఆసియన్లు, యూరోపియన్ వలసవాదులు మరియు స్థానిక ఆఫ్రికన్ల మధ్య చిక్కుకున్నారు, కానీ ఆగా ఖాన్ ప్రభావం ఇస్మాయిలీలకు గణనీయంగా సహాయపడింది.

తూర్పు ఆఫ్రికాలో ఇస్మాయిల జీవితం సులభమైన జీవితం కాదు. వ్యాపారులు లేదా దుకాణదారులుగా పనిచేయడం వల్ల పెద్ద కుటుంబాలను పోషించడానికి  చిన్న లాభాలు మాత్రమే వచ్చాయి. ఇస్మాయిలీలు ప్రధానంగా శాఖాహారానికి అలవాటు పడటానికి ఇది కారణమైనది.

తూర్పు ఆఫ్రికా కు వలసవెళ్ళిన ఇస్మాయిలీలు స్థానిక ఆహార పదార్థాలకు అలవాటు పడ్డారు, కాసావా మరియు వేరుశెనగ వంటి ఆఫ్రికన్ ప్రధాన ఆహార పదార్ధాలను తమ భారతీయ వంటకాలతో మిళితం చేసారు. ఆహరం విషయం లో  తూర్పు ఆఫ్రికా లోని ఇస్మాయిలీలు భారతీయ మూలాలను మరియు వలస మరియు అనుసరణ ద్వారా ఏర్పడిన ఆఫ్రికన్ ప్రభావాలను ప్రతిబింబిస్తారు.

అగా ఖాన్ III భారతదేశం మరియు అంతకు మించి ఇస్మాయిల్ ముస్లిం సమాజానికి ఆకర్షణీయమైన మరియు ప్రగతిశీల నాయకుడు. అగా ఖాన్ III సామాజిక సమస్యలపై సంస్కరణ-దృక్పథం కలిగిన విధానాన్ని కలిగి ఉన్నాడు మరియు తన సమాజానికి సమగ్ర నాయకత్వం అందించాడు.  ఆగా ఖాన్ III మహిళల విద్యను  ప్రోత్సహించిన ప్రగతిశీలవాది.

1946లో ఆర్దికముగా అభివృద్ధి చెందిన తూర్పు ఆఫ్రికాలోని ఇస్మాయిలీలు దార్-ఎ-సలాం Dares-Salaam లో ఆగా ఖాన్ III వజ్రోత్సవాన్ని Diamond Jubilee celebrations ఆగా ఖాన్ ను వజ్రాలతో,తూకం వేయడం ద్వారా జరుపుకున్నారు, అయితే  వచ్చిన నిధి ఆగా ఖాన్ అభివృద్ధి నిధికి వెళ్ళింది

పాకిస్తాన్, భారతదేశం, మధ్య ఆసియా, యూరప్, తూర్పు ఆఫ్రికా , మధ్యప్రాచ్యం మరియు ఉత్తర అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 మిలియన్ల మంది సభ్యులు నివసిస్తున్న నిజారీ సమాజానికి ఆగా ఖాన్ IV (1957–2025) బలమైన నాయకుడయ్యాడు . 

ఆగా ఖాన్ ఫౌండేషన్ వంటి సంస్థల ద్వారా, ఆగా ఖాన్ IV దక్షిణాసియా మరియు తూర్పు ఆఫ్రికాలో విద్య, ఆరోగ్యం మరియు గృహ సేవలను అందించే సహాయ సంస్థలకు నిధులు సమకూర్చారు.  1977లో ఆగా ఖాన్ IV  ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఇస్మాయిలీ స్టడీస్‌’ను స్థాపించాడు . విద్య, కళలు, ఆరోగ్యం మరియు అభివృద్ధిని ప్రోత్సహించే తొమ్మిది అనుబంధ సంస్థలకు ఒక గొడుగు సంస్థ అయిన ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ (AKDN)ను కూడా ఆగా ఖాన్ IV స్థాపించాడు. ఆ సమూహంలో, ఆగా ఖాన్ ఫండ్ ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ (AKFED) అభివృద్ధి చెందుతున్న దేశాలలో తయారీ, పర్యాటకం మరియు ఆర్థిక సేవలను ప్రోత్సహించడానికి అభివృద్ధి కార్యక్రమాలలో పెట్టుబడి పెడుతుంది. 2020ల ప్రారంభం నాటికి లాభాపేక్షలేని అభివృద్ధి సమూహం $4 బిలియన్ల ఆదాయాన్ని సంపాదించింది, దీనిని దాని ప్రపంచవ్యాప్తంగా అనుబంధ సంస్థలలో తిరిగి పెట్టుబడి పెట్టారు.

అగా ఖాన్ IV బ్రిటిష్ మరియు కెనడియన్లతో తన ప్రభావాన్ని ఉపయోగించి ఇస్మాయిలీలను పునరావాసం కల్పించాడు మరియు వారిలో చాలామంది అభివృద్ధి చెందారు. ఆగా ఖాన్ అభివృద్ధి నిధి ఇప్పటికీ ఆఫ్రికాలో పనిచేస్తుంది, మతం మరియు ప్రగతిశీల ఆలోచన మంచి ప్రభావం చూపగల అరుదైన ఉదాహరణ.

అగా ఖాన్ IVకు  భారత దేశంలో సామాజికాభివృద్ధికి ఏకేడీఎన్ అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్  ప్రధానం చేసింది.

2015లో అగా ఖాన్ IV పోర్చుగల్‌లో ఇస్మాయీలీ ఇమామేట్ యొక్క ప్రపంచ స్థానాన్ని స్థాపించాడు. 2025లో  మరణించిన ఆగా ఖాన్ IV, ఈజిప్టులోని అస్వాన్‌లో తన పూర్వీకుడితో ఖననం చేయబడ్డారు.. ఇస్మాయిలీ సమాజం యొక్క సంపదలో ఎక్కువ భాగం ఆఫ్రికాలో ఉంది

2025లో ఆగా ఖాన్ IV మరణించిన తరువాత, అతని కుమారుడు రహీమ్ అల్-హుస్సేనీ ఇస్మాయీలీ ఇమామ్‌ల వంశపారంపర్య వంశంలో 50వ అగా ఖాన్ Vగా నియమించబడ్డాడు 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

 

 

 


10 February 2025

మదర్సా విద్య తప్పనిసరిగా ఇతర మతాల అధ్యయనాన్ని కలిగి ఉండాలి

 

మదర్సా విద్య లో సoస్కరణాలు


ముస్లింల విద్యాభివృద్ధిలో మదర్సా కీలకపాత్ర పోషిస్తోంది. ఆధునిక కాల పరితీతులకు తగినట్లు గా మదర్సాలు తమ పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావాలి.   మతాల తులనాత్మక అధ్యయనాన్ని మదరసా సిలబస్‌లో తప్పనిసరిగా ప్రవేశపెట్టాలి. మతాల తులనాత్మక అధ్యయనo  మతపరమైన హింస మరియు ద్వేషంతో సహా అనేక సమస్యలను పరిష్కరిస్తుంది మరియు ఒకరి మతం, నమ్మకాలు మరియు ఆలోచనల పట్ల గౌరవాన్ని పెంచుతుంది.

భారతదేశంలో  విభిన్న మత మరియు జాతుల సమూహాలు శాంతి మరియు సామరస్యంతో సహజీవనం చేసే బహు సమాజంలో జీవిస్తున్నాయి. సుఖ దుఃఖాలు పంచుకుంటాం. ఇతర మతాలు, విశ్వాసాలు, ఆచారాలు మరియు ఆలోచనలను అధ్యయనం చేయకపోతే సామాజిక దూరాలు మరియు అపార్థాలు పెరుగుతాయి.

ఇతర మతాల తులనాత్మక అధ్యయనo  వల్ల సమాజంలో సమతుల్య ఆలోచన మరియు అభిప్రాయాలు ఖచ్చితంగా పెరుగుతాయి. సానుకూల మరియు సమతుల్య ఆలోచన యొక్క ప్రభావం శాశ్వతమైనది.తోటి దేశస్థుల మతానికి సంబంధించి జ్ఞానం కూడా పెంచుకోవాలని మనం ఎప్పటికీ మరచిపోకూడదు.

విభిన్న నాగరికతలు, మతాలు, ఆచారాలు మరియు సంప్రదాయాలను అధ్యయనం చేయడం అవసరం. ఇతర మతాలకు చేరువ కావాలంటే మదరసాలు మతాల తులనాత్మక అధ్యయన సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలి. మదర్సాలు సామాజిక ఐక్యత మరియు మత సమగ్రతకు కృషి చేయాలి

 

 

9 February 2025

ఉర్దూ లో అరుదైన పుస్తకాలు, టైపు రైటర్ మరియు మాన్యుస్క్రిప్ట్‌ల ప్రదర్శన Rare 1900s Urdu typewriter, manuscripts displayed at exhibition in Hyderabad

 


హైదరాబాద్:

హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్‌లోని థ్రైవ్‌సమ్ కేఫ్ అండ్ కమ్యూనిటీ Thrivesome Cafe and Communityలో డెక్కన్ ఆర్కైవ్స్ ఫౌండేషన్ సహకారంతో ది కబికాజ్ ఫౌండేషన్ అరుదైన ఉర్దూ పుస్తకాలు మరియు మాన్యుస్క్రిప్ట్‌ల ప్రదర్శనను నిర్వహించినది.  .

ప్రదర్సన లో 1937 నాటి  ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్ర పాఠ్యపుస్తకం, 1931 గోథే ఫౌస్ట్ Goethe’s Faust ఉర్దూ అనువాదం, చారిత్రాత్మక నవల్ కిషోర్ పబ్లికేషన్స్ నుండి మౌలానా రూమి రచనల మస్నవిస్ మరియు హైదరాబాద్‌లోని అంతరించిపోయిన ప్రెస్‌ల నుండి అరుదైన ప్రింట్‌లతో సహా సాహిత్య సంపదల సేకరణ కలదు.

ప్రదర్శనలో అరుదైన ఉర్దూ పుస్తకాలు మరియు మాన్యుస్క్రిప్ట్‌ల అద్భుతమైన సేకరణ కలవు. వీటిలో కొన్ని :

Ø 1900ల మధ్యకాలపు ఉర్దూ టైప్‌రైటర్ (రెమింగ్టన్ పోర్టబుల్ 5), టైప్‌రైటింగ్ టెక్నాలజీలో ఉర్దూ లిపి పరిణామాన్ని హైలైట్ చేసే అరుదైన కళాఖండం

Ø మౌలానా రూమికి చెందిన 100 ఏళ్ల మస్నవి, మిరాత్-ఉల్-మస్నవి, హైదరాబాద్‌లోని అజామ్ స్టీమ్ ప్రెస్ ప్రచురించింది

Ø ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ కోసం 1937 చరిత్ర పాఠ్యపుస్తకం,

Ø ఒరిజినల్ ఉస్మానియా విశ్వవిద్యాలయ లోగోను కలిగిన  1937 దక్షిణాసియా మ్యాప్

Ø 1900ల ప్రారంభంలో గోథే యొక్క ఫౌస్ట్ ఉర్దూ అనువాదం

Ø కోనన్ డోయల్ యొక్క ది పాయిజన్ బెల్ట్ యొక్క ఉర్దూ అనువాదాల ప్రారంభ మరియు మొదటి సంచికలు.


 అరుదైన నిఘంటువులు:

Ø ఫర్హాంగ్--అసఫియా (1970)

Ø దఖ్నీ ఉర్దూ కి లుఘాట్ (1969)

Ø లుఘాట్ ఉన్ నిసా (1917)

Ø కలాం--నానక్ మా' ఫర్హాంగ్ (1970)

Ø రుక్అత్--అలంగీరి, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు రాసిన లేఖల సంకలనం, 1911లో హైదరాబాద్‌లో ప్రచురించబడింది, అసఫ్ జాహి రాజవంశం యొక్క మొదటి అసఫ్ జాహ్ సూచనలతో.

Ø ఈజిప్టులో ప్రచురించబడిన ఆల్ఫ్ లైలాహ్ వా లైలాహ్ (ది అరేబియన్ నైట్స్) యొక్క 1893 ఒట్టోమన్-యుగం అరబిక్ ఎడిషన్.

o    

నవాల్ కిషోర్ ప్రచురణలు:

Ø సింఘాసన్ బట్టీసి (భారతీయ జానపద కథల సంకలనం, 1953).

Ø సాది షిరాజీ యొక్క మస్నవి--బస్తాన్ (150 సంవత్సరాల పురాతన ఎడిషన్).

Ø తులసి దాస్ రామాయణం పర్సో-అరబిక్ లిపిలో, 1913లో ప్రచురించబడింది.

Ø జస్టిస్ సయ్యద్ మహమూద్ 1872 లా ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ యొక్క ఉర్దూ అనువాదం, 1893లో ప్రచురించబడింది.

Ø ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్  ప్రోసిడింగ్స్: ఐదవ హైదరాబాద్ సెషన్ (1941) మరియు ది హైదరాబాద్ కోడ్ (1951)-ఉర్దూ అనువాదములు

ప్రదర్సన సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక, విద్యా, మతపరమైన మరియు సాంప్రదాయ ప్రాముఖ్యత కలిగిన అరుదైన పుస్తకాలు మరియు మాన్యుస్క్రిప్ట్‌లను సంరక్షించడం మరియు ప్రోత్సహించడం, ఇలాంటి అభిరుచి ఉన్న వ్యక్తులను ఒకచోట చేర్చే ప్రదర్శనలు మరియు కార్యక్రమాలను నిర్వహించడం కోసం అంకితం చేయబడింది.