13 December 2025

చదరంగం మరియు ముస్లిం వారసత్వం Chess & Muslim Heritage

 

ree


ముస్లిం చరిత్రలో చదరంగం ఒక ముఖ్యమైన భాగం. చదరంగం ఆట 6వ శతాబ్దం ADలో ఉత్తర భారతదేశంలో ఉద్భవించి పర్షియాకు వ్యాపించింది. అరబ్బులు పర్షియాను జయించినప్పుడు, చదరంగం ముస్లిం ప్రపంచం లో వ్యాపించినది.

చదరంగం యొక్క భారతీయ రూపాన్ని చతురంగ అని పిలుస్తారు, దీనిని 6వ శతాబ్దం ADలో అభివృద్ధి చేశారు, అంటే "4 సభ్యులు", ఇది భారత సైన్యంలోని 4 సైనిక విభాగాల నుండి వచ్చింది: పదాతిదళం, అశ్వికదళం, ఏనుగులు మరియు రథం.

ఇస్లామిక్ పర్షియా నుంచి చదరంగం ఆట పశ్చిమ దిశగా వ్యాపించింది మరియు అరేబియా జనాభాలో ఎక్కువ భాగం చదరంగం ఆడటం ప్రారంభించారు,

ముస్లిములు  చెస్‌ను తాము జయించిన ప్రతిచోటా తమతో తీసుకెళ్లారు అరబ్ ప్రపంచం లో  ఖలీఫాలు చదరంగంను ప్రాచుర్యం చేసారు. ఖలీఫా హరున్ అల్-రషీద్ చదరంగంను తప్పనిసరి ఆస్థాన/కోర్టు కార్యకలాపంగా మార్చాడు. ఖలీఫా హరున్ అల్-రషీద్ అసాధారణ నైపుణ్యం (ఉదాహరణకు కళ్ళకు గంతలు కట్టుకుని చెస్ ఆడే సామర్థ్యం) కలిగిన చెస్ ఆటగాళ్లను ఆదరించాడు.

హరున్ అల్-రషీద్ చెస్  ఆటగాళ్లను వారి ఆర్థిక స్థితి బాగా ఉన్నప్పటికీ, వారికి సంపదను అందించేవాడు. ఈ ఎత్తుగడ "క్వీనింగ్" అనే చదరంగ ఎత్తుగడగా అనువదించబడింది: ఉదాహరణ కు ఒక బంటును విజియర్ సలాదిన్ అల్-అయోబి మరియు ఖలీఫ్ హరున్ అల్-రషీద్ స్థాయికి పదోన్నతి కల్పించడం

చార్లెమాగ్నే చెస్ సెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ చదరంగ సెట్ కావచ్చు. ఖలీఫా  హరున్ అల్-రషీద్ బహుమతిగా రాజు చార్లెమాగ్నేకు అద్భుతమైన చదరంగ ఆటగాళ్ల సెట్‌ను బహుకరించారని చరిత్ర చెబుతుంది.

హరున్ వారసుడు అతని కుమారుడు అల్-అమీన్ (813లో మరణించాడు) ఒక అద్భుతమైన చదరంగ కథను కలిగి ఉన్నాడు: అల్-అమీన్ సవతి సోదరుడు అల్-మమున్‌కు విధేయులైన దళాలు బాగ్దాద్‌ను ముట్టడించిన కీలక సమయంలో, బాగ్దాద్ స్వాధీనం త్వరలో జరుగుతుందని చెస్ ఆడుతున్నప్పుడు అల్-అమీన్ కి సందేశం వచ్చింది.

12వ శతాబ్దంలో సంకలనం చేయబడిన “బుక్ ఆఫ్ చెస్: ఎక్స్‌ట్రాక్ట్స్ ఫ్రమ్ ది వర్క్స్ ఆఫ్ అల్-అడ్లి, అస్-సులి & అదర్స్‌ Book of Chess: Extracts From the Works of al-Adli, as-Suli & Others లోని రెండు  మాన్యుస్క్రిప్ట్‌లలో 10వ శతాబ్దంలో  ఇద్దరు అత్యంత ప్రసిద్ధ అబ్బాసిడ్ చదరంగం మాస్టర్లు, అల్-లజ్లాజ్ మరియు అల్-సులి కలరు అని ప్రస్తావించబడినది.

బాగ్దాద్ కోర్టులో, చదరంగం నిశ్శబ్ద వ్యవహారం కాదు. ఆటగాళ్ళు ఒకరితో ఒకరు మరియు ప్రేక్షకులతో చమత్కారమైన పరిహాసాన్ని ఆడేవారు.. "చదరంగం ఆటగాళ్ళు ఆశ్చర్యపరిచేలా వివిధ రకాల ఆహ్లాదకరమైన మరియు హాస్యాలను ఉపయోగిస్తారు" అని 14వ శతాబ్దపు అరబ్ చరిత్రకారుడు అల్-మసూది రాశారు

ఇప్పుడు పోర్చుగల్ మరియు స్పెయిన్ దేశాలుగా పిలువబడే ఐబీరియన్ ద్వీపకల్పాన్ని అరబ్బులు జయించిన తర్వాత, చదరంగం ఆటను యూరప్‌లోని ఐబీరియన్ ద్వీపకల్ప ప్రాంతంలోకి ప్రవేశపెట్టారు. కార్డోబా కాలిఫేట్ సంస్కృతి, విద్య మరియు శాస్త్రాలను ప్రోత్సహించింది - ఇందులో చెస్ కూడా ఉంది

చారిత్రాత్మకంగా చదరంగం ఆడటం సంస్కృతులను మరియు ప్రజలను అనుసంధానించింది, ఎందుకంటే ఇది మేధోపరమైన సవాళ్లు మరియు తార్కిక నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది.

13వ శతాబ్దంలో స్పెయిన్‌లో చదరంగం మధ్యప్రాచ్యం & ఉత్తర ఆఫ్రికాలో ఆడే ఆట నుండి పరివర్తన చెందింది. చదరంగం ఆట ప్రయాణికులకు అవసరమైన కాలక్షేపంగా మారింది, ఇది యూరప్ అంతటా మరింత వ్యాప్తి చెందడానికి సహాయపడింది. పశ్చిమ ఐరోపాలో చదరంగం ఆట యొక్క మొదటి కథనం 1010 A.D. నాటిది..

10& 11వ శతాబ్దాలలో, మధ్యప్రాచ్యం నుండి రష్యా మరియు  స్కాండినేవియాకు చెస్ వ్యాపించింది. కొంతకాలం తర్వాత, చెస్ ఇటలీలోకి ప్రవేశించింది.

చైనా & మధ్యధరా మధ్య పాత వాణిజ్య మార్గం అయిన సిల్క్ రూట్‌లోని మధ్య ఆసియాలోని చారిత్రాత్మకంగా ముఖ్యమైన నగరం సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్) సమీపంలోని కనుగొనబడిన పురాతన చెస్ సెట్ సుమారు 700 సంవత్సరాల  నాటిది.

చదరంగంలోని రాజు పావు king chess piece కు ఉపయోగించే పర్షియన్ పదం 'షా', వివిధ భాషలలో చదరంగం ఆట పేరుగా వ్యాపించింది: ఇటాలియన్‌లో స్కాచి, డచ్‌లో షాక్‌స్పీల్, జర్మన్‌లో షాక్‌స్పీల్, సెర్బియన్‌లో షాక్, ఐస్‌లాండిక్‌లో స్కాక్టాఫ్ల్ మరియు ఫ్రెంచ్‌లో ఎచెస్, దీని నుండే ఆంగ్లంలో చెస్ అనే పదం వచ్చింది.

ప్రాంతాలను బట్టి పావుల pieces ఆకారాలు మారాయి. ఉదాహరణకు, మధ్య ఆసియాలో ఏనుగు స్థానంలో కొన్నిసార్లు ఒంటె ఉండేది. టిబెటన్లలో, రాజు స్థానంలో సింహం మరియు వజీర్ స్థానంలో పులి ఉండేవి. మొఘల్ చదరంగపు సెట్‌లో, పావులు జంతువులపై ఉన్న భారతీయ సైనికుల రూపంలో ఉంటాయి

సెంటెరెక్ (Sänṭäräž ሰንጠረዥ) అనేది ఇథియోపియా మరియు ఎరిట్రియాలో ఆడే ఒక ప్రాంతీయ చదరంగపు రకం. సాంప్రదాయకంగా, బోర్డు చదరపు గడులతో ఉండదు, కానీ చతురస్రాలుగా గుర్తించబడి ఉంటుంది.

చదరంగం మొఘల్ భారతదేశంలో ప్రాచుర్యం పొందింది, ఇది మొఘల్ చక్రవర్తులకు ఇష్టమైన ఆట. "ఫ్రాంక్ లెస్లీస్ పాపులర్ మంత్లీ" (1883) పత్రికలోని "లివింగ్ చెస్" అనే ఒక వ్యాసం, మొఘల్ చక్రవర్తి అక్బర్ (1542-1605) ఫతేపూర్ సిక్రీలోని పచీసీ ప్రాంగణం యొక్క నేలపై సజీవ చదరంగం ఆడాడని పేర్కొంది.

 

 

No comments:

Post a Comment