26 October 2014

నోబెల్ బహుమతి పొందిన ముస్లింలుభౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు మరియు ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు/సంస్థలకు  ప్రతియేటా నోబుల్ బహుమతి బహూకరిస్తుంటారు. వీటిని ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేర 1901 లోప్రారంభించడం జరిగింది.  ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్ గారి వర్దంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్ హోం లో ఇవ్వబడతాయి. శాంతి నోబుల్ బహుమానం ఓస్లో లో ఇవ్వబడుతుంది.
 నోబెల్ బహుమతి పొందిన ముస్లింలు
ఇప్పటి వరకు మొత్తం 11 మంది ముస్లింలకు నోబుల్ పురస్కారం లబించినది వీరిలో అధికంగా  7గురు శాంతి పురస్కారం పొందగా, ఇద్దరు సాహిత్యం లోను, ఒకరు ఫిజిక్స్, ఒకరు రసాయన శాస్త్రం లో పురస్కారం పొందినారు. ప్రపంచ జనాభా లో ముస్లిం లు సుమారు 25% ఉన్నారు. నోబుల్ బహుమతి పొందిన 11 మంది ముస్లింలలో ఏడుగురు 21 వ శతాబ్దం లో నోబుల్ బహుమతి పొందినారు. మొత్తం 11 మంది లో 3 గురు స్త్రీలు ఉండటం విశేషం మరియు వీరిలో మాలాల యూసఫ్ జాయ్ అతి చిన్న వయస్సు (17 సంవత్సరాల)లో పొందటం మరి విశేషం.
ఒకే సంవత్సరం 2006లో  ఇరువురు ముస్లింలకు  శాంతి మరియు సాహిత్యం లో నోబెల్ బహుమతి లబించినది.మొత్తం 11 మంది ముస్లిం నోబెల్ బహుమతులు పొందిన వారిలో ఆరుగురు అరబ్ ప్రపంచానికి చెందినవారు (ఈజిప్ట్-6,పాలస్తీనా-1,ఏమన్ -1), పాకిస్థాన్ కు చెందినవారు ఇరువురు,బంగ్లాదేశ్ కు చెందిన వారు ఒకరు, ఇరాన్ కు చెందిన వారు ఒకరు, టర్కీ కి చెందిన వారు ఒకరు ఉన్నారు.
 నోబెల్ బహుమతి పొందిన మొదటి ముస్లిం శాస్త్రవేత్త అబ్దుస్ సలాం(పాకిస్తాన్-ఫిజిక్స్-1979). నోబెల్ బహుమతి పొందిన మొదటి ముస్లిం అన్వర్ అల్ సాదత్ (ఈజిప్ట్-శాంతి-1978). మెడిసన్(వైద్యం) లో1998లో  నోబెల్ బహుమతి పొందిన ఫరీద్ మురాద్ (ferid murad) తండ్రి అల్బేనియా ముస్లిం కాని అతడు ముస్లిం కాదు దీనితో     ఇంతవరకు ఆర్ధిక శాస్త్రం, వైద్యం, లో ముస్లింలు ఎవరికీ  నోబుల్ బహుమతి లబించలేదు.  

వ.సo.
సంవత్సరం
 విభాగం
పేరు
1)     
1978
 శాంతి
అన్వర్ అల్  సాదత్ (ఈజిప్ట్ అద్యక్షుడు
2)     
1994
శాంతి
యాసీర్ అరాఫత్(పి.ఎల్.ఒ. అద్యక్షుడు)
3)     
2003
 శాంతి
షిరిన్ ఇబాదీ (ఇరాన్ లోని మానవహక్కుల కార్యకర్త
4)     
2005
శాంతి
మొహమ్మద్ ఎల్ బరాది (ఈజిప్ట్ రాజినీతి వేత్త)
5)     
2006
శాంతి
మొహమ్మద్ యూనస్
బంగ్లాదేశ్ గ్రామిణ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఆర్ధిక వేత్త
6)     
20 11
శాంతి
  తవకల్ కర్మాన్(Tawakel Karman) ఎమెన్ మానవ హక్కుల కార్య కర్త
7)     
2014
శాంతి
మాలాల యూసఫ్ జాయ్ పాకిస్తాన్ కు చెందిన బాలల విద్యా హక్కుల కార్యకర్త. అతి చిన్నవయస్సు 17 సంవత్సరాలలోనే నోబుల్ బహుమతి పొందినది. 
8)     
1988
సాహిత్యం
నగిబ్ మహాఫూజ్
(naguib mahfouz)
ఈజిప్ట్ కు చెందిన ఆధునిక అరబ్ రచయిత
9)     
2006
సాహిత్యం
ఒర్హాన్ పముక్ (orhan pamuk)
టర్కీ రచయిత
10)                     
1979
ఫిజిక్స్
అబ్దుస్ సలాం (abdus salam)
పాకిస్తాన్ బౌతిక శాస్త్రవేత్త
11)                     
1999
రసాయనిక శాస్త్రం
అహ్మద్ జెవైల్ (ahmed zewail)
ఈజిప్ట్-అమెరికన్ శాస్త్రవేత్త

 


5 October 2014

భారత దేశం లో మొదటి మహిళా సైన్స్ ఫిక్షన్ రచయిత బేగం రోఖయా (రోఖయా షెఖావత్ హుస్సేన్ 1880 -1932)20 వ శతాబ్దం ప్రారంభం  లో(1880) బెంగాల్ లోని రంగపూర్ లో ఒక సంపన్న ముస్లిం కుటుంబం లో  జన్మించి బేగం రోఖయా గా పేరుగాంచిన రోఖయా ఖాతూన్ (వివాహనంతరం బేగం రోఖయా షెఖావత్ హుస్సేన్) ప్రముఖ స్త్రీవాది, సామాజిక కార్యకర్త. వివాహానంతరం భర్త ప్రేరణ తో బెంగాలి లో  రచనలు సాగించిన ఈమె తన రచనలలో స్త్రీ-పురుష సమానత్వం ను మరియు అనేక పలు సామాజిక అంశాలను ప్రస్తావించేను. భర్త తోడ్పాటు తో ఈమె ప్రారంబించిన ముస్లిం బాలికల విద్యాలయం నేటికి కలకత్తా లో కొనసాగుతున్నది. ఈమె తనచే స్థాపించబడిన “అంజుమన్ ఎ ఖవాతీన్ ఎ ఇస్లాం”అనే సంస్థద్వార ఇస్లాం చే ప్రవచించబడిన అనేక సాంఘిక సంస్కరణల కొరకు కార్యక్రమాలు నిర్వహించెను. ఈమె తన రచనల ద్వారా అన్యాయం, సాంఘిక అసమానతలు, వివక్షతకు వ్యతిరేకం గా పోరాడమని స్త్రీలను ఉద్భోధించెను. ఇస్లాం  లో స్త్రీ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉన్నాదని నమ్మేను.

ఈమె అనేక రచనలు చేసెను. వీటిలో sultana’s dream (సుల్తానా స్వప్నం) పద్మరాగ్ ముఖ్యమైనవి. పిపాసా(thrist) ఈమె తోలి రచన.  ఈమె చే రచింపబడి 1905 లో   మద్రాస్ నుండి వెలుబడే “ది ఇండియన్ లేడిస్ మేగజైన్” లో  ఆంగ్లం లో ప్రచురించబడి ఇప్పటికి లబ్య మవుతున్న సైన్స్-ఫిక్షన్ కధ “సుల్తానా స్వప్నం”(sultana’s dream)”  భారత దేశం లో మహిళ చే రచించబడిన తోలి సైన్స్ ఫిక్షన్ అని చెప్పవచ్చును. 

ఈమె తన రచన “సుల్తానా స్వప్నం”(sultana’s dream’)  లో భవిష్యత్ ను(future) స్త్రీ దృక్పదం తో చిత్రికరించిరి. “సుల్తానా స్వప్నం (sultana’s dream)”  లో స్త్రీ దృక్పదం తో వ్రాయబడిన ఒక మంచి సైన్స్ ఫిక్షన్. రాబోయే తరాలలో/ సంవత్సరాలలో ఉపయోగించే సైన్స్ వస్తువులను/ఆవిష్కరణలను ఆనాడే తన రచన “సుల్తాన స్వప్నం ” లో పేర్కొని ముందు తరం రచయిత్రిగా వాసికేక్కినారు. 

ఈమె “సుల్తాన స్వప్నం” లో స్త్రీల ఆధిక్యం గల lady land(స్త్రీల రాజ్యం) గురించి వివరించబడినది. అక్కడ పురుషులకు ప్రత్యేకం గా  మర్దానా ఉందును.  పరిపాలకులు గా స్త్రీలు ఉండి దేశమంతా శాంతి సౌభాగ్యంగా  ఉండును. ఈమె తన రచనలో సైన్స్ ను విస్తృతం గా మానవ జీవితం లో ఉపయోగించడం జరిగింది. 

సోలార్ పవర్(సూర్య శక్తీ) ఉపయోగం ను ఆనాడే ఉహించి తన రచనలో సోలార్ కిచన్ ను వర్ణించిరి. బొగ్గు, మంట, పొగ, చిమ్ని రహిత శుబ్రమైన, వెలుతురుతో కూడి కిటికీలు తెరిచిన పూల తోటలు కన్పించే, అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం లో  సోలార్ శక్తీ తో పనిచేసే వంటిల్లును తన రచన “సుల్తాన స్వప్నం ”లో వర్ణించిరి.

ఇంకొక అడుగు ముందుకు వేసి ఆనాడే గాలి తో పని చేసే ఎయిర్-కార్ ను తన రచనలో వర్ణించిరి. హైడ్రోజెన్ సహాయం తో భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటి పంఖాల సహాయం తో గాలి లో ఎగిరే ఎయిర్ కార్ ను వివరంగా తన రచనలో వర్ణించిరి.

అందమైన ల్యాండ్ స్కేప్, పూల తోటలు, పచ్చిక మైదానాలు, వెల్వెట్ కార్పెట్ వంటి పచ్చిక తో కూడిన అందమైన నగర పబ్లిక్ పార్కులను తన రచనలలో అబివర్ణించిరి.

అదేవిధంగా స్త్రీ లందరూ విధిగా విద్యనూ అబ్యసించుట, స్త్రీ వివాహం చేసుకొనుటకు 21 సంవత్సరములు, కనీస వయస్సు గా ఉండుట మొదలగు సాంఘిక సంస్కరణలను ఆనాడే ఉహించిరి.
   
 వాటర్ బెలూన్ ల ద్వారా మేఘమధనం చేసి నీటి ని పొందుట, సౌర శక్తీ ని వాణిజ్య, సైనిక, గృహ అవసరాలకు వినియోగించుట గురించి కుడా తన రచనలో పేర్కొన్నారు.
వ్యవసాయం ను యాంత్రి కరించుట, విద్యుత్ శక్తీ సహాయం తో బావుల నుంచి నీటి ని తోడుట, ప్రయాణ సాధనం గా విమాన యానం (ఆకాశ మార్గం ను ఉపయోగించుట)  మొదలగు ఆధునిక ఆవిష్కరణలను, ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలను  ఆనాడే ఉహించి తన రచనలలో వాటిని పేర్కొనిరి. 

ఈమె రచన లో ఆహార పదార్ధాలుగా పళ్లకు(fruits) అధిక ప్రాధాన్యత ఇవ్వబడినది. చుట్టుపక్కల ప్రదేశాలను చల్లబరుచుటకు క్రుతిమమైన వాటర్ ఫాల్స్,  స్నానానికి ఉపయోగించే వాటర్ బాత్, వాటర్ షవార్స్,సూర్య శక్తీ తో పని చేసే రూమ్ హిటర్స్/వాటర్ హిటర్స్  అన్ని అనాడే ఉహించి రాయబడినవి.

సైన్స్ పరిశోధనలకు ఉపయోగించే యూనివర్సిటిలు, సైన్స్ లాబ్స్, అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడే అబ్సర్వేటరిలు అన్నింటి ప్రస్తావన ఈమె రచనలో కన్పించును. ఈమెను దూరదృష్టి కల ఆధునిక  రచయిత్రి గా పేర్కొన వచ్చును.

ఈమె రచన “Sultana’s Dream” విద్యావంతురాలైన ప్రతి భారతీయ మహిళా చదవవలసిన రచన. ఇంటర్నెట్ లో లబ్యమౌతున్నది. దాదాపు 110 సంవత్సరాలకు పూర్వమే ఆధునిక ఆవిష్కరణలను తన రచనలలో ప్రస్తావించి, సైన్స్ఆవిష్కరణల పట్ల  ఆసక్తి చూపిన  పురోగామి మహిళ  శ్రీమతి రోఖయా. అరబిక్,పెర్షియన్  అబ్యసించిన సనాతన ముస్లిం జమిందారి కుటుంబం లో జన్మించినప్పటికీ ఆదునిక విద్యనూ అబ్యసించి, బెంగాలి నేర్చుకొని   ఇంగ్లీష్ లో సైన్స్ ఫిక్షన్ రచించిన తోలి భారతీయ పురోగామి, ఆధునిక ముస్లిం మహిళ గా ఆమెను పేర్కొనవచ్చును. ముస్లిం మహిళలకు మార్గదర్శిగా వ్యవహరించిన ఉత్తమురాలు.