భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు మరియు ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు/సంస్థలకు
ప్రతియేటా నోబుల్ బహుమతి బహూకరిస్తుంటారు.
వీటిని ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేర 1901
లోప్రారంభించడం
జరిగింది. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప
మిగతా ఐదు బహుమతులు నోబెల్ గారి వర్దంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్ హోం లో ఇవ్వబడతాయి.
శాంతి నోబుల్ బహుమానం ఓస్లో లో
ఇవ్వబడుతుంది.
నోబెల్ బహుమతి పొందిన ముస్లింలు
ఇప్పటి వరకు మొత్తం 11
మంది ముస్లింలకు నోబుల్ పురస్కారం లబించినది వీరిలో అధికంగా 7గురు శాంతి పురస్కారం పొందగా, ఇద్దరు సాహిత్యం
లోను, ఒకరు ఫిజిక్స్, ఒకరు రసాయన శాస్త్రం లో పురస్కారం పొందినారు. ప్రపంచ జనాభా
లో ముస్లిం లు సుమారు 25% ఉన్నారు. నోబుల్ బహుమతి పొందిన 11 మంది ముస్లింలలో
ఏడుగురు 21 వ శతాబ్దం లో నోబుల్ బహుమతి పొందినారు. మొత్తం 11 మంది లో 3 గురు
స్త్రీలు ఉండటం విశేషం మరియు వీరిలో మాలాల యూసఫ్ జాయ్ అతి చిన్న వయస్సు (17
సంవత్సరాల)లో పొందటం మరి విశేషం.
ఒకే సంవత్సరం 2006లో ఇరువురు ముస్లింలకు శాంతి మరియు సాహిత్యం లో నోబెల్ బహుమతి
లబించినది.మొత్తం 11 మంది ముస్లిం నోబెల్ బహుమతులు పొందిన వారిలో ఆరుగురు అరబ్
ప్రపంచానికి చెందినవారు (ఈజిప్ట్-6,పాలస్తీనా-1,ఏమన్ -1), పాకిస్థాన్ కు
చెందినవారు ఇరువురు,బంగ్లాదేశ్ కు చెందిన వారు ఒకరు, ఇరాన్ కు చెందిన వారు ఒకరు,
టర్కీ కి చెందిన వారు ఒకరు ఉన్నారు.
నోబెల్ బహుమతి పొందిన మొదటి ముస్లిం
శాస్త్రవేత్త అబ్దుస్ సలాం(పాకిస్తాన్-ఫిజిక్స్-1979). నోబెల్ బహుమతి పొందిన మొదటి
ముస్లిం అన్వర్ అల్ సాదత్ (ఈజిప్ట్-శాంతి-1978). మెడిసన్(వైద్యం) లో1998లో నోబెల్ బహుమతి పొందిన ఫరీద్ మురాద్ (ferid
murad) తండ్రి అల్బేనియా ముస్లిం కాని అతడు ముస్లిం కాదు దీనితో ఇంతవరకు
ఆర్ధిక శాస్త్రం, వైద్యం, లో ముస్లింలు ఎవరికీ నోబుల్ బహుమతి లబించలేదు.
వ.సo.
|
సంవత్సరం
|
విభాగం
|
పేరు
|
1)
|
1978
|
శాంతి
|
అన్వర్ అల్ సాదత్
(ఈజిప్ట్ అద్యక్షుడు
|
2)
|
1994
|
శాంతి
|
యాసీర్ అరాఫత్(పి.ఎల్.ఒ. అద్యక్షుడు)
|
3)
|
2003
|
శాంతి
|
షిరిన్ ఇబాదీ (ఇరాన్ లోని మానవహక్కుల కార్యకర్త
|
4)
|
2005
|
శాంతి
|
మొహమ్మద్ ఎల్ బరాది (ఈజిప్ట్ రాజినీతి వేత్త)
|
5)
|
2006
|
శాంతి
|
మొహమ్మద్ యూనస్
బంగ్లాదేశ్ గ్రామిణ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఆర్ధిక వేత్త
|
6)
|
20 11
|
శాంతి
|
|
7)
|
2014
|
శాంతి
|
మాలాల యూసఫ్ జాయ్ పాకిస్తాన్ కు చెందిన బాలల విద్యా
హక్కుల కార్యకర్త. అతి చిన్నవయస్సు 17 సంవత్సరాలలోనే నోబుల్ బహుమతి
పొందినది.
|
8)
|
1988
|
సాహిత్యం
|
నగిబ్ మహాఫూజ్
(naguib mahfouz)
ఈజిప్ట్ కు చెందిన ఆధునిక అరబ్ రచయిత
|
9)
|
2006
|
సాహిత్యం
|
ఒర్హాన్ పముక్ (orhan pamuk)
టర్కీ రచయిత
|
10)
|
1979
|
ఫిజిక్స్
|
అబ్దుస్ సలాం (abdus salam)
పాకిస్తాన్ బౌతిక శాస్త్రవేత్త
|
11)
|
1999
|
రసాయనిక శాస్త్రం
|
అహ్మద్ జెవైల్ (ahmed zewail)
ఈజిప్ట్-అమెరికన్ శాస్త్రవేత్త
|
No comments:
Post a Comment