29 April 2018

అసమానతకు, వివక్షతకు వ్యతిరేకంగా ధైర్యంగా వాస్తవాలు ప్రకటించిన జస్టిస్ సచర్


ఆధునిక భారత దేశం లోని ముస్లిమ్స్ నవాబులు కాదు గరీబులు వారి స్థితి ఎస్.సి./ఎస్.టి. లకన్నా హీనంగా ఉంది అని తన నివేదికలో ప్రకటించి ముస్లిమ్స్ సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను భారత ప్రజల ముందు ఉంచి భారతీయ ముస్లిమ్స్ ఎంతటి వేనుకుబాటుతనం తో ఉన్నారో,సామాజికంగా, విద్యాపరంగా, ఆర్ధికంగా,రాజకీయ అధికార లేమితో ఎళా  కడు హీన స్థితిలో ఉన్నారో  వివరించిన మహా మనిషి, న్యాయ వేత్త  జస్టిస్  సచార్.  వారిని ఈ రోజు  గుర్తు చేసుకొందాము.
జస్టిస్ రాజిందర్ సచార్ లేరు! ఆయన స్వర్గవాసి అయ్యారు. ఇటీవలి శతాబ్దాల్లో భారత దేశం /ప్రపంచంలోని వ్యక్తులలో అటువంటి వ్యక్తిని మనం  చూడలేము. 21 వ శతాబ్దంలో భారతీయ ముస్లిల స్థితిగతులను అద్యయనం చేయడానికి భారత ప్రధాని నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి అధ్యక్షుడిగా వ్యవరించడం అయన పనితీరును, విశ్వనీయనితను  మరియు వారి మానవీయకోణం ను ప్రస్తావిస్తుంది.

స్వార్ధం యొక్క సామాజిక అలలకు వ్యతిరేకంగా నిలబడిన జస్టిస్ సచార్ నివేదిక 2006 స్వతంత్ర భారతదేశం చరిత్రలో చిరస్మరణియమైనది. అప్పటి పాలక మండలికి బలమైన రాజకీయ ప్రత్యర్ధులు కూడా దానిని తిరస్కరించ లేనంతగా పటిష్టం గా నివేదిక తయారు చేయబడినది.

సహజం గా మృదు స్వభావి అయిన సచార్ సామాజిక అసమానతలను స్పష్టంగా ఎవరు వ్యతిరేకించ లేనంతగా వాస్తవంగా, కటినంగా  నివేదిక రూపొందించినారు. 2004-05లో భారతదేశం అంతటా తన సుడిగాలి పర్యటన లో భాగంగా ప్రధాని నియమించిన ఉన్నత స్థాయి కమిటి చైర్మెన్ అయిన శ్రీ  సచార్ భారత దేశం లోని నలుమూలల పర్యటించారు.
  
వెళ్ళిన ప్రతిచోటా స్థానిక పురుషులు, మహిళలు మరియు యువత తో పరస్పరం ఇంటరాక్ట్ అయ్యారు  మరియు వారి స్థితి గతులను, సామజిక వెనుకుబాటుతనం గురించి శ్రద్దగా వారి  భావాలు విన్నారు. వారి సమాచారం పై  ఆధారపడి మరియు అందుబాటులో ఉన్న అధికారిక డేటాతో పాటు వివిధ ప్రభుత్వ మంత్రిత్వశాఖలు మరియు విభాగాలలో ఉన్న  సీనియర్ రాజకీయ మరియు అధికారులు నుండి సమాచారం రాబట్టారు.ఆయన సందర్శించిన ప్రతి  రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు చీఫ్ సెక్రటరీలతో  నివేదికలో ఏది రాయబడాలి అనేదాని గురించి న్యాయమైన మరియు సంస్థపరమైన విస్తృత సమావేశాలు జరిపారు.

ఎవరు 'విదేశీయుడు' అని గుర్తించడం  మీద అస్సాం లోని   స్పెషల్ పవర్స్ చట్టం యొక్క విస్తృతమైన అధికారిక దుర్వినియోగం గురించి ప్రత్యేకంగా అక్కడి ప్రజలు  సచార్ కమిటీకి ఫిర్యాదు చేసారు. రాష్ట్ర యంత్రాంగంతో ప్రత్యేకంగా ఈ విషయం చర్చిండం జరిగింది వారు ప్రజల ఆరోపణలను తిరస్కరించారు. ఒక వ్యక్తి విదేశీయుడుగా ఎలా నిర్ణయిస్తారు అనే దానికి ఉన్న పారామితులు ఏమిటి అనే దానిపై  ఒక యువ అధికారి, "లుంగి, ధర్ ఔర్ టోపీ" (అస్సామీ ముస్లింలు ధరించే లుంగీ,  గడ్డం మరియు టోపీ) అని అన్నారు. దానిపై సచార్ తన తీవ్ర ఆగ్రహాన్ని అక్కడ ఉన్న సినియర్ అధికారులపై చూపారు.

ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో రౌండ్ టేబుల్ సంభాషణల కోసం సమాజం లోని వివిధ వర్గాల ప్రజలందరినీ ఆహ్వానించారు. భారతదేశంలో ముస్లింల జీవితంలోని  నిర్దేశిత రంగంలో ప్రత్యేక అంశాలను అధ్యయనం చేయడానికి డజన్ల కొద్దీ కన్సల్టెంట్స్, టాస్క్ ఫోర్సెస్లను (consultants and task forces) నియమించారు. యాదృచ్ఛికంగా అదేసమయం లో  యుఎస్ఎ మరియు అనేక ఇతర దేశాలు ప్రపంచంలోని వివిధ భాగాలలో ఇస్లామిక్ జీవితం గురించి తెలుసుకొవడానికి ఎక్సర్సైజేస్ నిర్వహిస్తున్నారు.

ఇటివల మార్చి 10, 2017 న తన నివేదిక యొక్క అమలు యొక్క డీకాడల్ (దశాబ్ద కాల) సమీక్ష కోసం ఒక రోజు సమావేశం ఢిల్లీలో నిర్వహించారు.  మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్నాటక రాష్ట్రాలు ముస్లిం స్థితిగతుల పై నియమించిన కమిటీ  నివేదికలు ఆ రాష్ట్రాలలో ముస్లింలో మరింత దిగజారుతున్న ధోరణులను చూపుతున్నాయి.

ఇటీవల ఒక ప్రశ్నకు సమాధానంగా, న్యా”యస్థానాలు  జాతీయ ప్రయోజనల  దృష్ట్యా రాజ్యాంగబద్ధమైన ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏమి చేయాలి అని అడిగినప్పుడు  నిరసన తెలపాలి, నిరసనకు    నేను ముందు నుండి నాయకత్వం వహిస్తాను అని అన్నారు.".

కొన్నిసార్లు తన వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిన శ్రీ సచార్ దేవుడికి మాత్రమే భయపడటం మరియు నిజం మాట్లాడటం చేసేవారు. మరియు రాబోయే తరాల మానవుల పట్ల శ్రద్ధ వహించారు. సచార్  ఆత్మకు విశ్రాంతి కలుగు గాకా! వారికి అల్లాహ్ జన్నత్ ప్రసాదించు గాకా అమీన్ .

భారతదేశ ముస్లిం వ్యాపారవేత్తలు


కొంతకాలం  క్రిందట ముంబై మిడ్ డే న్యూస్ పేపర్ గ్రూప్ ను  అన్సారీ కుటుంబం అమ్మింది. అది అన్సారిల యాజమాన్యంలో 72 సంవత్సరాల పాటు ఉంది, అన్సారీలు ఒక ప్రధాన ఆంగ్ల వార్తాపత్రికను కలిగి ఉన్న ఏకైక ముస్లింలు. అన్సారీల పూర్వికులు  ఇస్లాం స్వీకరించిన  ఉత్తరప్రదేశ్ చేనేతకారులు  మరియు వంకర్ కులస్థులు. వీరు 1857 తిరుగుబాటు తరువాత   ఉత్తరప్రదేశ్ నుండి వలస వచ్చారు. బ్రిటీష్ వారు వంకరుల చేతి బ్రొటనవేళ్ళను తొలగించి  చేనేత వృత్తికి వారిని పనికి రాకుండా చేసారు. అన్సారీలు పెద్ద సంఖ్య లో బాంబే వెలుపల భివాండికి వలస వెళ్లారు. వీరి రాక తో  భివాండి ప్రపంచంలోని అతిపెద్ద నేత కేంద్రాలలో ఒకటిగా నిలిచింది.


మిడ్ డే అన్సారీస్ వారి సంపదను నేత పని నుండి పొందలేదు, వార్తాపత్రికల నుండి పొందారు. మిడ్ డే స్థాపకుడు అబ్దుల్ హమీద్ అన్సారీ.  ఇతను ఉర్దూ వారపత్రిక ఇంక్విలాబ్ రచయిత  మరియు ప్రచురణకర్త.  మిడ్-డే  వెబ్సైట్ అతనిని 'ముజాహిద్-ఎ-అజాది' లేదా “స్వాతంత్ర యోదుడు” అని సూచిస్తుంది. అన్సారి మొదట్లో కాంగ్రెస్ వాది పిదప ముస్లిం లీగ్ లో చేరినాడు.  కానీ అతను పాకిస్తాన్ వెళ్ళటానికి జిన్నా ఆహ్వానం అంగీకరించలేదు. జిన్నా కు రాసిన ఒక లేఖ లో అన్సారీలు భారత దేశం లో ఉన్నందుకు గర్వంగా ఉంది అని అని అన్నారు మరియు  తనూ మరియు తన  ప్రెస్ ఇక్కడే ఉంటారు అని సగర్వం గా ప్రకటించాడు.


దీనికి బదులుగా జిన్నా  పాకిస్తాన్ టైమ్స్ మరియు ఇమ్రోజ్ల(Imrose)ను పేపర్స్ ప్రచురించిన ప్రోగ్రసివ్ పేపర్స్ స్థాపకుడు మరియు ప్రచురణకర్త మియా ఇఫ్తాఖర్-ఉద్-దిన్ సహాయం తీసుకొన్నారు.ఇంక్విలాబ్ ఇప్పటికీ బొంబాయిలో అంత్యంత ప్రజాదరణ పొందింది, మరియు దానికి  సుమారు 3,00,000 పాఠకులు ఉన్నారు. అబ్దుల్ హమీద్ అన్సారీ కుమారుడు ఖాలిద్ 1979 లో స్పోర్ట్స్ వీక్ నెలకొల్పాడు. ఇది భారతదేశం యొక్క అతిపెద్ద క్రీడా పత్రిక  మరియు ఆ తరువాత మధ్యాహ్నం వార్తాపత్రిక మిడ్-డేని స్థాపించారు. అన్సారీలు ప్రస్తుతం ఉన్నత-తరగతి ముస్లిమ్స్. వారు , దక్షిణ బాంబే కు చెందిన వారు మరియు ఖాలిద్ అన్సారీ స్టాన్ఫోర్డ్ Stanford మరియు అతని కుమారుడు తారిక్ నోట్రే డామ్ Notre Dame లో ఉన్నత విద్య అబ్యసించారు. తారిక్ తండ్రి ఇప్పటికీ  ఆ సంస్థకు చైర్మన్ గా  ఉన్నారు మరియు బొంబాయి యొక్క ప్రత్యేకమైన విల్లింగ్డన్ క్లబ్ లో  స్క్వాష్ ఆడతారు.

కలకత్తా వార్తాపత్రిక ఆసియా ఏజ్ MJ అక్బర్ చేత నిర్వహించబడినది. MJ అక్బర్ ఒక తెలివైన మరియు ఆకర్షణీయమైన వ్యక్తి మరియు మొదటి తరగతి  పత్రికా సంపాదకుడు. MJ అక్బర్ కలకత్తాలో పెరిగారు, కానీ కాశ్మీర్ కు చెందిన నార్త్ ఇండియన్ ముస్లిం మరియు బిహారీ మూలలు కలిగి ఉన్నాడు.

ఇండియన్ ముస్లిమ్స్ లొ ఎక్కువమంది వడ్రంగులు, కసాయి, ప్లంబర్లు మరియు మొదలైన వృతి నిపుణులు. ముస్లింలను  వాణిజ్యం (tijarat) ఆకర్షించింది ఎందుకంటే ఇస్లాం యొక్క ప్రవక్త(స)  కూడా ఒక వ్యాపారి. ఇండియన్ ముస్లిమ్స్ లో కొద్దిమంది మాత్రమే వర్తకం treding సముదాయంనకు చెందిన వారు.  

ఇండియన్ ముస్లిమ్స్ లో వర్తకం treding సముదాయంనకు చెందిన వారిలో ప్రముఖులు గుజరాత్ కు చెందిన షియాలు. వారిది  ఒక చిన్న కమ్యూనిటీ (దాదాపు అయిదు లక్షల మంది) అయినప్పటికీ వ్యాపారం యొక్క విషయాల్లో భారత దేశం లోని 20 కోట్ల ముస్లిమ్స్ పై ఆధిపత్యం కలవారు.

విప్రో అజీమ్ ప్రేమ్జీ, అంబానీల తరువాత భారతదేశపు అత్యంత  రెండవ ధనవంతుడు, ఇతడు ముస్లిమ్స్ లోని ఖోజా కమ్యూనిటి కి చెందిన వాడు.  అజీమ్ ప్రేమ్జీ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి  ఎలెక్ట్రికల్ ఇంజనీర్ పట్టాను పొందినాడు.  ప్రేమ్జీ బొంబాయి యొక్క ఖోజా కులీనులలో అత్యంత ప్రసిద్ధ సభ్యుడు, వాస్తవానికి, పాకిస్తాన్ పితామహుడు జిన్నా కూడా ఖోజా ముస్లిం.  

అజీమ్ ప్రేమ్జీ తన 21 ఏళ్ల వయస్సులో 1945 లో ఒక విజటబుల్ నూనె వ్యాపారాన్ని సొంతం చేసుకున్నాడు. ఇది అతనికి   తండ్రినుంచి  వారసత్వంగా లబించినది. అతను తన 35 సంవత్సరాల వయస్సులో బెంగుళూరులో విప్రో  సాఫ్ట్వేర్ విభాగాన్ని స్థాపించాడు.


అజీం ప్రేమ్జీ చాలా సీదాసాద వ్యక్తి. అజీమ్ ప్రేమ్జీ ఎకోనమి క్లాస్ లో ప్రయాణిస్తారు మరియు మూడు నక్షత్రాల హోటళ్ళలో నివసిస్తారు. అవసరమైతే ఆటో-రిక్షా లో ప్రయాణిస్తారు. ఆయన ఆస్థి  17 బిలియన్ డాలర్లు (రూ.1.4 లక్షల కోట్లు) విలువైనది. ఈ వైఖరి సంపన్న  గుజరాతీ, ముస్లిం కుటుంబాలలో సర్వసాధారణం. వారు తమ ఐశ్యర్యం ను ప్రదర్శించరు మరియు సాధారణ జీవితాన్ని గడుపుతారు. 

ఫార్మాసుటికల్ సంస్థ వోక్హార్డ్కు Wockhardt యజమాని దావూది బోహ్రా హబీల్ ఖోరాకివాలా. ఇతను పర్డ్యూ Purdue విశ్వవిద్యాలయంలో ఉన్నత  విద్యనభ్యసించాడు. అతను ఒక బిలియన్ డాలర్ల ఔషధ సంస్థను నడుపుతాడు, అది జనిరిక్  మందులను తయారుచేస్తుంది.. ఖోరాకివాలాస్ ధనవంతులు మరియు శక్తివంతులు  అయినప్పటికీ, వారు అందరు బోహ్రాస్ లాగే  ఇప్పటికీ సంప్రదాయవాదులు. భారతదేశంలో మొదటి  అక్బారలిస్ Akbarally’ డిపార్ట్మెంటల్ స్టోర్స్  ఖకోవాలివాస్ స్థాపించారు.
.

మరొక గుజరాతీ కచ్చీ Kutchchi ముస్లిం, ప్రముఖ ఔషధ సంస్థ  సిప్లాకు యజమాని,  దాని వార్షిక  టర్న్-ఓవర్ ఒక బిలియన్ డాలర్లను  కలిగి ఉంది. ఇది 1927 లో బెర్లిన్ యునివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన ఖ్వాజా అబ్దుల్ హమీడ్ చేత స్థాపించబడింది. ఈ సంస్థ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన అతని కుమారుడు యూసఫ్ హమీద్ చేత ఈ రోజు నడుపుతుంది.


భారతదేశంలో సున్నీ వ్యాపారస్తులు కూడా కొందరు ఉన్నారు. కానీ వాళ్ళు గుజరాతీలు కూడా  ఉదా:  మేమోన్స్ ఆఫ్ కచ్చ్ Memons of Kutchch.  వారు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేసేవారు. బాలీవుడ్ యొక్క ముస్లిం నిర్మాతలు కూడా గుజరాతీయులు ఉదా:   నాడియాడ్వాలాస్ Nadiadwalas. నాడియాడ్వాలాస్ గుజరాత్లోని చరోటార్ ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం నాడియాడ్, నుండి వచ్చారు. గుజరాతి పటేల్స్ భూస్వాములు, వ్యాపార వేత్తలు కారు.  

మరొక సున్ని పారిశ్రామికవేత్త హందార్డ్ కంపనీ స్థాపకుడు హకీమ్ అబ్దుల్ హమీద్. ఈ వేసవిలో మనం బాగా త్రాగే వేసవి పానీయo “రుహ్ -అఫ్జ (Rooh Afza)” తయారీదారులు.  “రుహ్ -అఫ్జ” అనేది అందరు భారతీయులు మరియు పాకిస్థానీలకు బాగా తెలుసు.


హందార్డ్  1907 లో హకీమ్ అబ్దుల్ మజీద్ చేత స్థాపించబడింది. యునాని (గ్రీకు) వైద్య నిపుణులు అబ్దుల్ హామీద్ ఆధునిక వైద్య పితామహుడు ఇబ్న్ సిన(అవిసెన్న) రచనల ఎడిషన్ ప్రచురించారు. అబ్దుల్ హమీద్ యొక్క సోదరుడు హకీమ్ మొహమ్మద్ పాకిస్తాన్ కు  వలస పోయారు మరియు 1998 లో కరాచీలోమరణించారు. .మరొక ప్రముఖ కకీజై (Kakezai) పఠాన్ పారిశ్రామికవేత్త గురించి తెలుసుకొందాము. ఈనాడు వాణిజ్య వాహనాలు(LCV), కార్లు మరియు ట్రాక్టర్లను తయారు చేసే ప్రముఖ  భారతీయ సంస్థ  మహేంద్ర 1945 లో స్థాపించబడింది. ఆ సంస్థ యొక్క స్థాపకులు "గులామ్ మహమ్మద్ " మరియు “మహేంద్ర బ్రదర్స్”. దేశవిభజనకు పూర్వం ఈ సంస్థ   మహీంద్రా & మొహమ్మద్  పేరు కలిగి ఉండేది మరియు రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో విజయవంతమైన  విల్లీస్ జీప్స్ నిర్మించేది..


జీప్ అనే పేరు GP లేదా జనరల్ పర్పస్ వాహనం నుండి వచ్చింది. మహీంద్రా & మొహమ్మద్  జీప్లను అసెంబుల్ చేయడం మరియు విక్రయించడం ప్రారంభించారు..

 మహీంద్రా సోదరులు మరియు గులాం మొహమ్మద్  మద్య  మధ్య భాగస్వామ్యం దేశ విభజన వరకు కొనసాగింది. ఆ తరువాత  గులాం మొహమ్మద్  పాకిస్తాన్ కు  తరలి వెళ్లి అక్కడ , మొదటి ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


ఆ తరువాత కంపనీ పేరు మహేంద్ర & మహేంద్ర గా మారింది. ఈ నాడు ఆ కంపనీ ఒక లక్ష మంది ఉద్యోగులతో సుమారు 6.3 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువను కలిగి ఉంది. సత్యం కంప్యూటర్స్ ను టెక్-మహేంద్ర తనలో   విలీనం చేసుకోంది. 

పాకిస్థాన్ కూడా అనేకమంది పంజాబీ, గుజరాతి వ్యాపారవేత్తలను కలిగి ఉంది. వ్యాపారుల గురించి జోకులు పాకిస్తాన్లో బాగా ప్రాచుర్యం పొందాయి...

21 April 2018

సౌత్ ఆఫ్రికాలో ఇస్లాం మరియు ఇస్లామిక్ ఉద్యమం (Islam and Islamic Movement in South Africa the Rainbow Countrసౌత్ ఆఫ్రికాను రెయిన్బో(Rainbow) దేశం అని  పిలుస్తారు. ఆఫ్రికా లో  అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం ఇస్లాం.

1960వ దశకం లో  బ్రిటన్ నుండి అనేక ఆఫ్రికన్  దేశాలు స్వాతంత్ర్యం పొందిననప్పటికీ  అవి ఇంకా సామాజికంగా వర్ణ వివక్షతను ఎదుర్కొంటున్నాయి.  ఆఫ్రికాలో వర్తకం మరియు వ్యాపారం రంగం లో ఆధిపత్యం కల ఆసియా కు చెందిన తమ తోటి ముస్లింల నుండి ఇప్పటికీ అనేక మంది ఆఫ్రికన్ ముస్లింలు వివక్షత మరియు  జాత్యహంకారం నుండి విముక్తి కొరకు పోరాడుతున్నారు.

దక్షిణాఫ్రికాలో ఇస్లాం యొక్క రాక ప్రారంభ అరబ్ వర్తకులతో ప్రారంభమైనది.  వారు వ్యాపారం తో పాటు స్థానిక ప్రజలలో ఇస్లాం సందేశాన్ని ప్రచారం చేశారు. ఒకే దేవుడు, మానవ సమానత్వం, మానవ గౌరవం,శాంతి  మొదలైన ఇస్లామిక్  యొక్క బోధనలు ఇస్లాం పట్ల ఆఫ్రికన్లను ఆకర్షించాయి. జింబాబ్వే, జాంబియా మరియు బోట్స్వానా వంటి వలస దేశాలలో  బ్రిటీష్ పాలకులు అక్కడి స్థానిక ప్రజల పట్ల చాలా ఆగౌరవంగా, బానిసలు లాగా  ప్రవర్తిoచే వారు.

బ్రిటన్ ఈ దేశాలను దాదాపు 100-200 సంవత్సరాలు  పాలించింది. స్థానిక ప్రజల సాయుధ పోరాటం తరువాత 1960 లో ఈ దేశాలు చివరకు స్వాతంత్ర్యం పొందాయి. జాంబియా 1964 లో స్వాతంత్ర్యం పొందింది, తరువాత 1966 లో బోట్స్వానా మరియు 1980 లో జింబాబ్వే      స్వాతంత్ర్యం పొందినాయి.

బ్రిటన్ ఆఫ్రికన్ దేశాల నుండి నిష్క్రమించినప్పుడు, ఈ దేశాల జనాభాలో మూడు వర్గాలు ఉన్నాయి: తెల్ల బ్రిటీష్ వారు, వ్యాపార రంగంపై ఆధిపత్యం చెలాయించిన బ్రౌన్ ఆసియన్లు మరియు బానిసలుగా లేదా చాలా తక్కువ వేతనాల కోసం పనిచేసే నల్లజాతీయులు. రైల్వే కోచ్ల నుండి పోస్ట్ ఆఫీస్ కౌంటర్లు వరకు, ప్రతిదీ మూడు వేర్వేరు క్లాస్లలుగా/వర్గాలుగా  విభజించబడింది.

జింబాబ్వే, జాంబియా మరియు బోట్స్వానా దేశాలలో ముస్లిం జనాభా 3-4 శాతం వరకు వుంది. భారతదేశం నుండి చాలా కాలం క్రితం వెళ్లి అక్కడ స్థిర పడ్డ ఆసియన్ ముస్లింలు, స్థానిక  ఆఫ్రికన్ జనాభా కూడా ఇందులో ఉన్నారు.

భారతీయ ముస్లింల  కృషి  
స్థానిక ఆఫ్రికన్ ముస్లింలు పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులు, ఆకలి, పోషకాహార లోపం,పారిశుధ్యలేమి  మొదలైన అనేక సమస్యలతో  బాధపడుతున్నారు. విద్య ఇప్పటికీ స్థానికులకి అందుబాటులో లేదు అది కొంతమందికి ప్రత్యేకమైనది. ఒక రైతు పిల్లవాడు వ్యవసాయంలో తల్లిదండ్రులతో పాటు ఉంటాడు మరియు అతని  భవిష్యత్తు వ్యవసాయంలో ముగుస్తుంది; అదేవిధంగా, ఒక గని కార్మికుడు యొక్క పిల్లవాడు  తన తల్లిదండ్రులతో ఉంటాడు మరియు గని కార్మికుడు గా తన భవిష్యత్ను ముగిస్తాడు. ఇది అక్కడ చాలా కాలం పాటు ఆచారంగా ఉంది.


ఈ ధోరణి ఇప్పుడు నెమ్మదిగా మారుతోంది, స్థానిక ఆఫ్రికన్ ముస్లింలచే నిర్వహించబడుతున్న కొన్ని NGO లు విద్య యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాయి. ప్రాధమిక మరియు సెకండరీ విద్య పై ఈ ఎన్జిఓNGOలు  శ్రద్ధ చూపుతున్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలలో, విశ్వవిద్యాలయ స్థాయి విద్య మరియు పరిశోధనా  అధ్యయనాలు ఇప్పటికీ సుదూర కలలుగా ఉన్నవి. విద్య కాకుండా, స్థానిక ముస్లింలకు కెపాసిటీ బిల్డింగ్, వ్యక్తిత్వ అభివృద్ధి, వ్యవస్థాపకత మొదలైన వాటిలో  మద్దతు కావాలి. చాలా తక్కువ వనరులతో స్థానిక ఎన్జిఓNGOలు ఈ ప్రాంతాల్లోకి ప్రవేశించటానికి కష్టపడుతున్నారు.


ఈ దేశాలలో వ్యాపారం (treding) భారత వ్యాపారవేత్తల ఆధిపత్యం లో ఉంది. భారతీయుల  కంపెనీల్లో కొన్ని సుమారు 100 సంవత్సరాల పాటు వ్యాపారాన్ని చేస్తున్నాయి. ముస్లిం వ్యాపారవేత్తలు ఎక్కువమంది ముస్లింలకు స్వచ్ఛందంగా సేవచేస్తూన్నారు. కొంతమంది స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేస్తున్నారు, మరి కొందరు వారి సొంత ఎన్జిఒNGOలను ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని ఎన్జిఓNGOలు ఆకలి, వ్యాధులు, విపత్తు నిర్వహణ మరియు మసీద్ నిర్మించడానికి అవసరమైన ప్రాథమిక అవసరాలను తీరుస్తాయి.

జకాత్ యొక్క పెద్ద మొత్తం భారతీయ వ్యాపారస్తుల నుండి  సేకరిస్తారు మరియు NGOల ద్వారా ఖర్చుబెడతారు.  ఈ NGOలు, భారతీయులచే నియంత్రించబడుతున్నాయి. లబ్ధిదారుల పరంగా ఈ ఎన్జిఓNGOలు అందించిన గణాంకాలు అద్బుత పలితాలను  చూపుతున్నాయి కానీ విద్యాపరమైన మరియు సాంఘిక ఉద్ధరణ లేమితో  స్థానిక ఆఫ్రికన్ ముస్లింలు ఇప్పటికీ నేలమీద ఉన్నారు.

ఈ ధోరణికి కారణo ముస్లింలలో కల  థవబ్ Thawab మనస్తత్వం. వారికి ఆద్యాత్మికత ను  బోధించే ఉలేమా Ulema కూడా Thawab పై కాకుండా హిసాబ్  Hisab పై ద్రుష్టి పెడతారు. ఒక మసీదు నిర్మాణం మరియు ఆకలి తో ఉన్నవారికి  ఆహారం అందించడం ఖచ్చితంగా ఇస్లాం యొక్క ముఖ్యమైన బోధనలు అనడం లో  ఎటువంటి సందేహం లేదు, కానీ స్థానిక ఆఫ్రికన్ ముస్లింలతో కలసి  100 సంవత్సరాల పాటు నివసిస్తూ, 100 సంవత్సరాలు  గడిచిన తర్వాత కూడా వారిని ఆదే స్థితిలో ఉంచడం జరిగింది. దీనికి వారు  తప్పనిసరిగా అల్లాహ్ ముందు జవాబుదారి అయి ఉండాలి.

ముస్లింల విద్యా మరియు సామాజిక అభివృద్ధికి కృషి చేయడం  ముస్లింల యొక్క నైతిక మరియు సామాజిక బాధ్యత. భారతీయ ముస్లింలు దీనిని ఒకటి లేదా  లేదా దశాబ్దలలో చేయగలిగితే, స్థానిక ఆఫ్రికన్ ముస్లింలు వారి తక్కువస్థాయి కాంప్లెక్స్ నుండి బయటికి వచ్చి, సగౌరవంగా  జీవిస్తారు

మరో పెద్ద సమస్య భారతీయ ముస్లింలు స్థానిక ముస్లింలతో మిళితం కావడం. వారి నివాస ప్రాంతాలు స్థానికుల నుండి భిన్నమైనవి. వారు ఇప్పటికీ వారిని తక్కువ గానే  పరిగణిస్తున్నారు మరియు వారి స్థానం పని మరియు కార్మిక వర్గంలో మాత్రమే ఉంటుంది. వారు కేవలం సహాయపడటానికి ఉద్దేశించబడినారు  మరియు వారు అభివృద్ధి చెందవలసిన అవసరం లేదు. మదీనాకు ప్రవక్త (స) మదీనాకు వలస పోయినప్పుడు, ముహజీర్ మరియు అన్సార్  సోదరుడు ఇమాన్ విషయంలో కాకుండా, జీవితంలోని అన్ని ఇతర అంశాలలో కూడా సోదరుడు గానే  ఉన్నారు.

ఇస్లామిక్ సంస్థలు

తబ్లిక్ జమాత్ అనేది స్థానిక ఆఫ్రికన్ల మధ్య పనిచేసే ప్రబలమైన ఇస్లామిక్ సంస్థ, దీని తరువాత సలాఫిస్ మరియు బరెల్విస్ ఉన్నారు. ఈ సంస్థల నాయకత్వం ఇప్పటికీ భారతీయుల చేతులలో  ఉంది మరియు స్థానిక ఆఫ్రికన్ ముస్లింలు నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ప్రోత్సహించబడలేదు. స్థానికులకు  మార్గనిర్దేశం చేసేందుకు ఉలేమా భారతదేశం నుంచి వస్తారు. స్థానికుల మధ్య దావా నిర్వహించడానికి భారతదేశం నుండి వచ్చిన పలు ప్రతినిధులు ఉన్నారు. నమాజ్ మరియు దీన్ యొక్క సిద్ధాంత బోధనల అందిస్తారు. కాని స్థానిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలని కలిగి ఉన్న జీవితాన్ని పూర్తిస్థాయిలో ఇక్కడ ఇస్లాం అందించడం లేదు. ముస్లింలలో భారీ సంఖ్యలో వస్తున్నట్లు చెపుతున్నప్పటికీ, దానికి చాలామంది స్థానికులు తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వారిని ఆకర్షిస్తున్నది ఆహారమని చెబుతారు.


తబ్లిక్ జమాత్ యొక్క సభ్యులు తమ కుటుంబ సమావేశాలకు స్థానిక ప్రజలను ఆహ్వానించరు లేదా వ్యాపారంలో వారిని అభివృద్ధి చేయరు. నా పర్యటనలో జింబాబ్వేకు వెళ్లినప్పుడు, స్థానిక ఆఫ్రికన్ల పట్ల వారి వైఖరి నాకు ఆశ్చర్యమేసింది. నా హోస్ట్ ఒక స్థానిక ఆఫ్రికన్ మరియు నేను ఒక ఆఫ్రికన్ సోదరుడితో ఉన్నాను. నేను స్థానిక ఆఫ్రికన్ను విశ్వసించి, వారితో పాటు ఉండటానికి  భారతదేశం నుండి వచ్చానని తెలిసి కొంతమంది సీనియర్ తబ్లిక్ జమాత్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తబ్లిక్ సోదరులలో ఒకరు, ఆఫ్రికన్లకు  వ్యాపారo గురించి ఏమి తెలియదు అని నాకు చెప్పారు మరియు వ్యాపారం అభివృద్ధి కొరకు  నేను వారితో గాకా అక్కడ ఉన్న భారతీయులలో ఉండాలని సలహా ఇచ్చాను.

సలాఫి సోదరులు ముస్లింల యొక్క స్థానిక సంస్కృతిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించరు మరియు ఇస్లాం యొక్క సౌదీ రూపం వారిపై విధించాలని కోరుతున్నారు. వారి నమ్మకం ప్రకారం సౌదీ లో ఆమోదయోగ్యమైనది స్థానిక ఆఫ్రికన్లకు  కూడా  ఆమోదయోగ్యంగా ఉండాలి. వారు ఆఫ్రికన్ స్థానిక సమాజానికి ముఖ్యo కానటువంటి అంశాలపై ఒత్తిడి చేస్తారు.ఫర్డా  మరియు హలాల్ గురించి స్థానిక ఆఫ్రికన్ల తెలుసుకోవాలంటే, వారికి  సున్నహ్ మరియు హరామ్  ఇష్టమైనవి. . .


బరేలిస్  (Barelwis) ఎక్కువగా మావలిద్  Mawlid వేడుకలు చేస్తారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఆకర్షించే ఆహారం మరియు పానీయాలు పెద్దఎత్తున సరఫరా చేస్తారు. ఇది స్థానిక ప్రజలకు  చాలా గొప్ప వేడుకగా ఉండును.


ముస్లింలు కాని వారిలో దావా కార్యక్రమం నిర్వహించడానికి  అనేక స్థానిక సంస్థలు ఉన్నాయి, కానీ ప్రయత్నాలు చాలా తక్కువ స్థాయి లో   ఉన్నాయి. భారతదేశం, మలేషియా, తదితర దేశాల నుంచి వచ్చిన ప్రసిద్ధ వ్యక్తులతో అప్పుడప్పుడూ భారీ దావా సమావేశాలు నిర్వహిస్తారు  కానీ స్థానిక దావా కార్యక్రమాలు  చాలా అరుదు.
ఇస్లామిక్ ఉద్యమాలు

స్థానిక ముస్లింలకు  భారతీయ ముస్లింలు సహాయం చేస్తున్నప్పటికీ, వారి పెరుగుదల నిలకడగా ఉంది. సమస్యలు మరియు సవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. స్థానిక ముస్లింలలో  విద్య మరియు వ్యవస్థాపకత  లేదు. వారి ఆకలి మరియు వ్యాధుల అవసరాలను తీర్చేందుకు భారతీయ ముస్లిం సోదరుల మీద ఆధారపడి ఉండాలి. వారు తమ నల్ల రంగు  ఛాయ వలన తక్కువ గా తమ్ము తాము భావిస్తున్నారు.. వారు దాతృత్వం మరియు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉన్నారు. .  
.

ఈ పరిస్థితుల వలన స్థానిక ముస్లిమ్స్  స్వచ్ఛంద మరియు సామాజిక అభివృద్ధి కోసం తమ సొంత సంస్థలను ఏర్పరచుకొన్నారు. ఒక వైపు వారు సాధారణ సమాజంతో  మరియు రెండో వైపు  ముస్లిం సమాజంతో  పోరాడవలసి వచ్చింది. పోరాటంలో ఇది పోరాటం. జాంబియా, జింబాబ్వే మరియు బోట్సువానా వంటి దేశాలలో యువజన సంస్థల ఏర్పాటుకు ఇది ఆధారం. వారు నెట్వర్క్ను ఏర్పరుచుకొని, ఇతరులు నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు కనుగొన్నారు, వారు ఇఖ్వాన్ మరియు జమాత్-ఇ-ఇస్లామీ పాకిస్తాన్ వంటి ఇస్లామిక్ ఉద్యమాలతో పరిచయం ఏర్పచుకొన్నారు. కానీ వనరుల  లోపం  కారణంగా, వారితో  ఎటువంటి ప్రత్యక్ష పరస్పర సంబంధాలు లేవు. వారు ఎక్కువగా దక్షిణాఫ్రికాలోని  ముస్లిం యువజన ఉద్యమoతో  అనుసంధానం చేయబడ్డారు

జింబాబ్వే ముస్లిం యూత్ ఆర్గనైజేషన్ గత 35 సంవత్సరాలుగా ఇస్లామిక్ ఉద్యమాలను  కొనసాగిస్తున్నది. కార్యకర్తల వయస్సు 12-35 సంవత్సరాలు మద్య ఉంటుంది.  సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్ మరియు పాకిస్తాన్లో గల  ఇటువంటి ఉద్యమాల కార్యక్రమాల ద్వారా ఈ సంస్థ సహాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తోంది. యూత్ క్యాంప్, ఇంటర్ఫెయిత్ డైలాగ్స్, సోదరీమణులు మరియు మహిళల కార్యక్రమాలు ZMYO చే నిర్వహించబడుతున్న కొన్ని ఇతర కార్యక్రమాలు

సాంఘిక అభివృద్ధి వైపు, ఉద్యమ సోదరులు " చారిటబుల్ ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ " అని పిలిచే ఒక ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. మానవత్వ సేవలను అందించడంలో ప్రముఖ మానవతావాద సంస్థగా ఉండటం, ఆర్థిక సాధికారత ద్వారా దారిద్య్రతను తగ్గించడం దీని కార్యకలాపాలు,

Ø అనాధ మరియు అసురక్షిత పిల్లలకు  మద్దతు కార్యక్రమాలు;
Ø విద్య మరియు నైపుణ్యం అభివృద్ధి;
Ø నీరు, ఆరోగ్యం మరియు పారిశుధ్యం;
Ø మహిళలు మద్దతు కార్యక్రమాలు;
Ø ఎండోమెంట్స్, వక్ఫ్ ఫండ్ల నిర్వహణ మరియు అవస్థాపన అభివృద్ధి; మరియు
Ø రిలీఫ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్.ZMYO యొక్క కార్యకర్తలలో చాలా శక్తి మరియు ఆశాభావం ఉంది, వారు తాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఇస్లామిక్ ఉద్యమాలతో మిళితమైతే  మరింతగా తమ పోరాటంలో విజయవంతం అవుతామని  వారు నమ్ముతారు.