20 April 2018

ఇస్లాం లో కార్మికుల హక్కులు (Rights of Workers in Islam)


అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా:


ఇస్లాం సంపూర్ణ మానవ జివితానికి మార్గదర్శి. ఇది జీవితం లోని  ప్రతి రంగంలో దాని అనుచరులకు  మార్గనిర్దేశం చేస్తుంది. ఇస్లాం సమాజం లో ప్రతి వ్యక్తి యొక్క ధర్మ హక్కులు నిర్ణయిస్తుంది.

ఇస్లాం సాంఘిక హోదా, గౌరవం మరియు కార్మికుల హక్కులను మెరుగుపరుస్తుంది. ఇది చట్టపరమైన మార్గాల ద్వారా సంపాదనను ప్రోత్సహిస్తుంది.  ఇస్లాం  యాచనను నిరసిస్తుంది. ఇస్లాం కార్మికుల హక్కులకు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రవక్త (స) కార్మికుల హక్కులకు ప్రాముఖ్యతను ఇచ్చారు మరియు "వారి చెమట ఆరక ముందే కార్మికుల వేతానాలు చెల్లించ మన్నారు”.

సర్వశక్తిమంతుడయిన అల్లాహ్ విశ్వాసిని నిజాయితీగా సంపాదించమన్నారు.  ప్రవక్త ముహమ్మద్ (స) ప్రకారం , " ప్రతి ముస్లిం యొక్క బాధ్యత నిజాయితీ గా జీవిక సంపాదించడం.". ప్రవక్త (స) ప్రకారం  అక్రమ సంపాదనతో పోషి౦పబడిన శరీరం స్వర్గం లో ప్రవేశించదు.
 పవిత్ర ప్రవక్త ముహమ్మద్ (స) ఇంకా ఇలా అన్నారు: "అల్లాహ్ నైపుణ్యం గల నమ్మినవారిని ఇష్టపడు తున్నాడు." దివ్య ఖురాన్ లో అల్లాహ్ “జ్ఞానం సంపాదించిన వాడు, దాని నుండి లాభం సంపాదించడానికి ఇష్టపడుట లేదు” అన్నారు.  ప్రవక్త ముహమ్మద్ (స) ప్రకారం స్వయం సంపాదన అన్నింటికన్నా  ఉత్తమ సంపాదన.


జుబైర్ బిన్ అవాం ప్రకారం “ప్రవక్త (స) ఇలా అన్నారు: మీలోని ఒకరు త్రాడు తీసుకోని కట్టెలు కొట్టి కట్టుకురావడం, అవి అమ్మడం- అల్లాహ్ తద్వారా అతని గౌరవాన్ని కాపాడాలని కోరడం-ఇతరులను యాచిస్తూ తిరిగినా, ఏమి లబించకపోవడం కంటే ఎంతో ఉత్తమైనది”: బుఖారి . అల్లాహ్ యొక్క సందేశహరుడు ఇలా అన్నారు, " మీరు యాచించడం కోసం వెళ్ళినట్లయితే, మీ ముఖం మీద తీర్పు దినం నాడు  మచ్చ ఉంటుంది. "

ఇస్లాం ప్రజలను న్యాయపరమైన మార్గాల్లో సంపాదించడానికి అనుమతిస్తుంది. ధర్మబద్ద సంపాదన  గౌరవాన్ని ఇస్తుంది. అందరు దైవ దూతలు మరియు వారి సహచరులు స్వహస్తాలతో పనిచేసి సంపాదించి భుజించే వారు. నిజమైన ముస్లిం నిజాయితీగా  జీవనం సంపాదించాలి.

ఇస్లాం శారిరిక  శ్రమను ప్రోత్సహిస్తుంది,కార్మికుల హక్కులను గౌరవిస్తుంది మరియు రక్షణ కల్పిస్తుంది. ఇస్లాం కార్మికుల పట్ల ఉదారంగా వ్యవరించమని యజమానులను ఆదేశిస్తుంది. కార్మికులకు సమాన న్యాయం ప్రసాదిస్తుంది. ఇస్లాం శ్రామిక జీవన సౌందర్యాన్ని గౌరవించినది. ప్రవక్త (స) శ్రామికునికి అతని శక్తికి తగు ప్రాధాన్యత ఇచ్చారు.

ఇస్లాంలో కార్మికుల హక్కులకు సంభందించి కొన్ని కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. హదీసులు మరియు దివ్య ఖుర్ఆన్ ఆధారంగా, కార్మికుల హక్కులు ఇస్లాంలో నెరవేరాలి:
ఇస్లాం లో  కార్మికుల హక్కులు:
1.సరిఅయిన వేతనం పొందుట:
వేతనాలు కోసం పనిచేసే కార్మికులకు, వారు చేసిన పనులకు సరి అయిన వేతనం చెల్లించాలి. వారి కుటుంబo  కోసం  పనిచేసే కార్మికులకు కూడా అల్లాహ్ ప్రతిఫలాన్ని ఇస్తాడు. అబూ ఉమాహ్ ప్రకారం అల్లాహ్ యొక్క సందేశహరుడు ఇలా అన్నారు:
 " అబద్దం ద్వారా కార్మికుల హక్కులను హరించిన విశ్వాసిని అల్లాహ్ స్వర్గం నుంచి తొలగించి  నరకాగ్నిలో పడవేస్తాడు.”
2. సమయం ప్రకారం వేతనం పొందుట

ఇస్లామిక్ చట్టాల ప్రకారం, కార్మికులు ఇంటికి తిరిగి వెళ్ళే  సమయానికి కార్మికుల వేతనం ఇవ్వాలి. కార్మికులు సంపాదించిన డబ్బు కార్మికుల మొత్తం కుటుంబానికి ఆహారం ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది. కాబట్టి  యజమాని కార్మికుల వేతనం చెల్లింపు ఆలస్యం చేసి తద్వారా  వారి హక్కులను ఉల్లంఘించ రాదు.  
3. పనికి తగిన వేతనం పొందుట:

కార్మికులకు చెల్లించే  మొత్తం వారి సామర్థ్యాలకు  లేదా వారు చేసిన పనుల ప్రకారం, న్యాయమైనదిగా ఉండాలి. అల్లాహ్  తన కార్మికులకు  సరిగా వేతనం చెల్లించని యజమానులను హెచ్చరిస్తాడు." కార్మికుడి నుండి శ్రమ పూర్తిగా పొంది అందుకు ఎవరు తక్కువ వేతనం ఇస్తారో అది వారికి నష్టాన్ని కలిగించవచ్చు. "అల్ ముతఫ్ఫిన్ (83: 1-3)

ఆమె అన్నది “ నా తండ్రిగారు మిమ్ములను పిలుస్తున్నారు: మీరు మా పశువులను నీరు త్రాపించినదానికి గాను మీకు ప్రతిపలం ఇవ్వడానికి” 28:25
అల్లాహ్ అంటాడు “ప్రజలకు వారి వస్తువుల విషయం లో నష్టం కలిగించ కండి”. 7:85
4. కార్మికుల  చెమట అరక ముందే వారి వేతనం చెల్లించాలి:
అల్లాహ్ కార్మికుల వేతనం చెల్లింపు లో ఆలస్యం అంగీకరించడు. అబూ హురైరః ప్రకారం అల్లాహ్ అంటారు “నేను తీర్పు దినాన ముగ్గురు వ్యక్తుల విషయం లో నేనే వాదిస్తాను. ఒకడు నామీద ప్రమాణం చేసి ఒడంబడిక భంగపరిచిన వాడు, రెండోవాడు స్వేత్చ్చ  గా వ్యక్తిని అమ్మివేసి వచ్చిన డబ్బును కాజేసినవాడు, మూడోవాడు ఒక కార్మికుని శ్రమకు తగు వేతనం పూర్తిగా చెల్లించని వాడు”. –బుఖారి, ఇబ్న్ మాజా  

5. తమకు తగిన పనిని ఎన్నుకొనుట: ఇస్లాం లో కార్మికులు తమకు తగిన పనిని ఎన్నుకొనే  స్వేచ్ఛ ఉంది. అల్లాహ్ తన సేవకులను అధిక పనితో భాధపదవద్దని హేచ్చరిస్తాడు.  
 "అబూ హురైరా ప్రకారం అల్లాహ్ యొక్క సందేశహరుడు ఇలా అన్నారు: 'బానిసకు  అన్న-వస్త్రాలు కల్పించండి. మరియు అతని శక్తికి మించిన పని భారం అతనిపై మోప వద్దు.  '- ముస్లిం.

6. పనితీరు సరిగా లేనప్పుడు తొలగించబడాలి
కార్మికులు పనిలో ఉత్తమoగా ఉండాలి.  తమ పనితీరు సరిగా లేనప్పుడు మరియు యజమానికి వారిని తొలగించే  హక్కు ఉంది,
7. విశ్రాంతి సమయం పొందుట:
యజమాని కార్మికులకు విశ్రాంతి సమయం కల్పించవలెను. పని మధ్యలో కొన్ని గంటలు పాటు విశ్రాంతి సమయం మరియు ఒక నెలలో కొద్ది రోజుల విశ్రాంతి ఇవ్వవలె. విశ్రాంతి తిరిగి శక్తిని పొందటానికి ఉపయోగ పడుతుంది.  

8. పనిలో అన్యాయానికి వ్యతిరేకం గా పిర్యాదు చేసే హక్కు.

ఇస్లాం సమాజం లో సమ న్యాయం ప్రసాదించును. ఒక ముస్లిం తన జీవితంలోని  ప్రతి కోణంలోనూ ధర్మం పాటించాలి. యజమాని అన్యాయంగా వ్యవహరిస్తున్నప్పుడు ఫిర్యాదు చేయడానికి కార్మికులు  హక్కు కలిగి ఉంటారు. ఇస్లాం వారి హక్కుల కోసం పోరాడడానికి వారిని అనుమతిస్తోంది.

9. యజమాని నుండి దయను పొందే హక్కును కార్మికులు కలిగి ఉంటారు:
యజమానులు తమ కార్మికుల పట్ల  దయతో వ్యవహరించాలి. వారి సామర్ధ్యాలను అధిగమించే పనులను వారితో చేయించారాడు. భౌతికంగా, మానసికంగా వారికి ఎలాంటి హాని కలిగించే పనులు చేయమని వారిని అడగకండి

10. ఖచ్చితమైన సమయంలో పని చేయండి:
 ప్రతి కార్మికుడు ఖచ్చితమైన సమయములో పనిచేయాలి, వారు అందుకున్న వేతనానికి తగిన పని చేయాలి. ఓవర్ టైం పని కోసం, వారు అదనపు చెల్లింపును పొందాలి.
ఇస్లాంలో కార్మికులకు గల  అదనపు  హక్కులు:
1. అదనపు పని కోసం అదనపు చెల్లింపు పొందడం
2. శారీరక మరియు మానసికంగా వారికి హాని కలిగించే పని చేయకుండుట..
3. తమ యజమానులతో పనికి సంబందించిన అన్యాయాన్ని అనుభవిస్తున్నప్పుడు వారితో విభేదించవలసిన హక్కు కలిగి ఉండుట.
4. కార్మికులు సంఘము ఏర్పాటు చేసుకొనవచ్చు.  
5. ఉద్యోగుల భద్రత కోసం భీమాను యజమాని  అందించాలి.
6. వారికి  దయతో చికిత్స/వైద్య సదుపాయం  అందించాలి.  
7. కార్మికుల  సామర్థ్యాలను అధిగమించే పని లేదా  వేతనం  చెల్లింపులలో  అసమానత ఉండరాదు.
8. వారిచే అవమానకరమైన పనులను చేయించ రాదు. 

ఇస్లాం లో కార్మికుల హక్కులు నెరవేరాలి. కార్మికుల హక్కులను దుర్వినియోగపరచకూడదు. ఇస్లాం ఈ ప్రపంచంలో అందరికి సరి అయిన మార్గనిర్దేశం చేస్తుంది. ఇస్లాం లక్ష్యం  పరలోక సంక్షేమానికి  ఆర్ధిక అభివృద్దిని ఉపయోగించుట.




No comments:

Post a Comment