ఆధునిక భారత దేశం లోని
ముస్లిమ్స్ నవాబులు కాదు గరీబులు వారి స్థితి ఎస్.సి./ఎస్.టి. లకన్నా హీనంగా ఉంది
అని తన నివేదికలో ప్రకటించి ముస్లిమ్స్ సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను భారత
ప్రజల ముందు ఉంచి భారతీయ ముస్లిమ్స్ ఎంతటి వేనుకుబాటుతనం తో ఉన్నారో,సామాజికంగా,
విద్యాపరంగా, ఆర్ధికంగా,రాజకీయ అధికార లేమితో ఎళా
కడు హీన స్థితిలో ఉన్నారో వివరించిన మహా మనిషి, న్యాయ వేత్త జస్టిస్ సచార్. వారిని
ఈ రోజు గుర్తు చేసుకొందాము.
జస్టిస్ రాజిందర్ సచార్
లేరు! ఆయన స్వర్గవాసి అయ్యారు. ఇటీవలి శతాబ్దాల్లో భారత దేశం /ప్రపంచంలోని
వ్యక్తులలో అటువంటి వ్యక్తిని మనం చూడలేము.
21 వ శతాబ్దంలో
భారతీయ ముస్లిల స్థితిగతులను అద్యయనం చేయడానికి భారత ప్రధాని నియమించిన ఉన్నత
స్థాయి కమిటీకి అధ్యక్షుడిగా వ్యవరించడం అయన పనితీరును, విశ్వనీయనితను మరియు వారి మానవీయకోణం ను ప్రస్తావిస్తుంది.
స్వార్ధం యొక్క సామాజిక
అలలకు వ్యతిరేకంగా నిలబడిన జస్టిస్ సచార్ నివేదిక 2006 స్వతంత్ర భారతదేశం చరిత్రలో చిరస్మరణియమైనది.
అప్పటి పాలక మండలికి బలమైన రాజకీయ ప్రత్యర్ధులు కూడా దానిని తిరస్కరించ లేనంతగా
పటిష్టం గా నివేదిక తయారు చేయబడినది.
సహజం గా మృదు స్వభావి
అయిన సచార్ సామాజిక అసమానతలను స్పష్టంగా ఎవరు వ్యతిరేకించ లేనంతగా వాస్తవంగా, కటినంగా
నివేదిక రూపొందించినారు. 2004-05లో భారతదేశం
అంతటా తన సుడిగాలి పర్యటన లో భాగంగా ప్రధాని నియమించిన ఉన్నత స్థాయి కమిటి
చైర్మెన్ అయిన శ్రీ సచార్ భారత దేశం లోని
నలుమూలల పర్యటించారు.
వెళ్ళిన ప్రతిచోటా
స్థానిక పురుషులు, మహిళలు మరియు
యువత తో పరస్పరం ఇంటరాక్ట్ అయ్యారు మరియు వారి
స్థితి గతులను, సామజిక వెనుకుబాటుతనం గురించి శ్రద్దగా వారి భావాలు విన్నారు. వారి సమాచారం పై ఆధారపడి మరియు అందుబాటులో ఉన్న అధికారిక డేటాతో
పాటు వివిధ ప్రభుత్వ మంత్రిత్వశాఖలు మరియు విభాగాలలో ఉన్న సీనియర్ రాజకీయ మరియు అధికారులు నుండి సమాచారం
రాబట్టారు.ఆయన సందర్శించిన ప్రతి రాష్ట్ర
ముఖ్యమంత్రి మరియు చీఫ్ సెక్రటరీలతో నివేదికలో ఏది రాయబడాలి అనేదాని గురించి న్యాయమైన
మరియు సంస్థపరమైన విస్తృత సమావేశాలు జరిపారు.
ఎవరు 'విదేశీయుడు' అని గుర్తించడం మీద అస్సాం లోని స్పెషల్
పవర్స్ చట్టం యొక్క విస్తృతమైన అధికారిక దుర్వినియోగం గురించి ప్రత్యేకంగా అక్కడి ప్రజలు
సచార్ కమిటీకి ఫిర్యాదు చేసారు. రాష్ట్ర
యంత్రాంగంతో ప్రత్యేకంగా ఈ విషయం చర్చిండం జరిగింది వారు ప్రజల ఆరోపణలను తిరస్కరించారు.
ఒక వ్యక్తి విదేశీయుడుగా ఎలా నిర్ణయిస్తారు అనే దానికి ఉన్న పారామితులు ఏమిటి అనే
దానిపై ఒక యువ అధికారి, "లుంగి, ధర్ ఔర్
టోపీ" (అస్సామీ ముస్లింలు ధరించే లుంగీ, గడ్డం మరియు టోపీ) అని అన్నారు. దానిపై సచార్
తన తీవ్ర ఆగ్రహాన్ని అక్కడ ఉన్న సినియర్ అధికారులపై చూపారు.
ఢిల్లీలోని ఇండియా
ఇంటర్నేషనల్ సెంటర్లో రౌండ్ టేబుల్ సంభాషణల కోసం సమాజం లోని వివిధ వర్గాల ప్రజలందరినీ
ఆహ్వానించారు. భారతదేశంలో ముస్లింల జీవితంలోని నిర్దేశిత రంగంలో ప్రత్యేక అంశాలను అధ్యయనం
చేయడానికి డజన్ల కొద్దీ కన్సల్టెంట్స్, టాస్క్ ఫోర్సెస్లను (consultants and task forces) నియమించారు.
యాదృచ్ఛికంగా అదేసమయం లో యుఎస్ఎ మరియు
అనేక ఇతర దేశాలు ప్రపంచంలోని వివిధ భాగాలలో ఇస్లామిక్ జీవితం గురించి తెలుసుకొవడానికి
ఎక్సర్సైజేస్ నిర్వహిస్తున్నారు.
ఇటివల మార్చి 10, 2017 న తన నివేదిక
యొక్క అమలు యొక్క డీకాడల్ (దశాబ్ద కాల) సమీక్ష కోసం ఒక రోజు సమావేశం ఢిల్లీలో
నిర్వహించారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్నాటక రాష్ట్రాలు
ముస్లిం స్థితిగతుల పై నియమించిన కమిటీ నివేదికలు ఆ రాష్ట్రాలలో ముస్లింలో మరింత
దిగజారుతున్న ధోరణులను చూపుతున్నాయి.
ఇటీవల ఒక ప్రశ్నకు
సమాధానంగా, న్యా”యస్థానాలు జాతీయ ప్రయోజనల
దృష్ట్యా రాజ్యాంగబద్ధమైన ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏమి చేయాలి
అని అడిగినప్పుడు నిరసన తెలపాలి,
నిరసనకు నేను ముందు నుండి నాయకత్వం వహిస్తాను అని
అన్నారు.".
కొన్నిసార్లు తన
వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిన శ్రీ సచార్ దేవుడికి మాత్రమే భయపడటం మరియు నిజం
మాట్లాడటం చేసేవారు. మరియు రాబోయే తరాల మానవుల పట్ల శ్రద్ధ వహించారు. సచార్ ఆత్మకు విశ్రాంతి కలుగు గాకా! వారికి అల్లాహ్
జన్నత్ ప్రసాదించు గాకా అమీన్ .
No comments:
Post a Comment