విదేశీ కళాశాల/యూనివర్సిటీలలో ప్రవేశం
పొందే విద్యార్ధుల కోసం
మీ అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాల యొక్క మంచి ప్రకటన స్టేట్మెంట్
అఫ్ పర్పస్ SoP.
SoP లేదా స్టేట్మెంట్ అఫ్ పర్పస్ లేదా సోప్, అనేది ఆధునిక కాలంలో విదేశీ కళాశాలల ప్రవేశ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా భావించబడుతుంది. మీరు విద్యాపరంగా ఎంత బలం గా(strong) ఉన్నారో మీ మార్క్ షీట్లు లేదా ట్రాస్న్క్రిప్ట్ (transcripts) నుండి సులభంగా అంచనా వేయవచ్చు, కానీ మీరు ఏ విధమైన వ్యక్తి - నాయకుడు లేదా టీం ప్లేయర్ లేదా మీ స్వంత పనిలో ఎంత ఉత్తమంగా రాణిoచగల వ్యక్తో? ఒక బలమైన స్టేట్మెంట్ అఫ్ పర్పస్ SoP.తెలుపుతుంది.
SoP లేదా స్టేట్మెంట్ అఫ్ పర్పస్ లేదా సోప్, అనేది ఆధునిక కాలంలో విదేశీ కళాశాలల ప్రవేశ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా భావించబడుతుంది. మీరు విద్యాపరంగా ఎంత బలం గా(strong) ఉన్నారో మీ మార్క్ షీట్లు లేదా ట్రాస్న్క్రిప్ట్ (transcripts) నుండి సులభంగా అంచనా వేయవచ్చు, కానీ మీరు ఏ విధమైన వ్యక్తి - నాయకుడు లేదా టీం ప్లేయర్ లేదా మీ స్వంత పనిలో ఎంత ఉత్తమంగా రాణిoచగల వ్యక్తో? ఒక బలమైన స్టేట్మెంట్ అఫ్ పర్పస్ SoP.తెలుపుతుంది.
స్టేట్మెంట్ అఫ్ పర్పస్ SoP ఎలా ఉండాలి.
చాలా విదేశి విశ్వవిద్యాలయాలు ఒక విద్యార్థి
విశ్వవిద్యాలయానికి మంచి పేరు ఎలా తెస్తాడు అనే విషయం చూస్తున్నారు. కాబట్టి, గ్రేడ్స్ ఒకటే ముఖ్యమైనవి కావు, అవి ఒక్కటే ప్రమాణాలు కాదు.
యూనివర్సిటీలు మీరు ఒక వ్యక్తిగా ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు, మరియు మీరు ఏ విధమైన
కార్యకలాపాల అందు ఆసక్తి కలిగి ఉన్నారు
మరియు ఒక ప్రత్యేక అంశంలో మీరు ఎంతమేరకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు అనేది
పరిశిలిస్తున్నాయి.
మీ SoP మీరు దరఖాస్తు చేసుకుంటున్న విశ్వవిద్యాలయ లక్ష్యాలను అనుసంధానించాలి మరియు మీరు యూనివర్సిటీకి ఏవిధంగా ఉపయోగపడతారో మీ SoP లో హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఒక మంచి SoP ను ఎలా వ్రాస్తారు? ముందుగా, SoP తప్పక ఒక
సృజనాత్మకతో ప్రారంభం కావాలి. దరఖాస్తు
అధికారి(అడ్మిషన్ ఆఫీసర్) దానిని చదివి
ఉత్తేజపడాలి. కాబట్టి SoP చదవడానికి ఉత్తేజకరమైనదిగా ఉండాలి.
ఒక దరఖాస్తు అధికారి(అడ్మిషన్ ఆఫీసర్) రోజుకు సగటున 10 నుండి 12 SoPల ను చదువుతాడు అంది గుర్తుంచుకోవాలి కాబట్టి మీరు అతనిని / ఆమెని ఆకర్షించడానికి ఒక ఉత్తేజకరమైన ప్రారంభాన్ని కలిగి ఉండాలి
ఒక దరఖాస్తుదారు అధికారి(అడ్మిషన్ ఆఫీసర్) మాటలలో, "నా అభిమాన వ్యాసాలు ఏవనగా ఒక విద్యార్ధి
తన వ్యక్తిగత లేదా అకేడేమిక్ అడ్డంకులను
ఎలా అధిగమించాడు మరియు ఆ అనుభవం నుండి అతను ఏమి నేర్చుకున్నాడు అనేవి
ముఖ్య మైనవి.”
అలా అని SoP లు కల్పిత
కథలుగా ఉండకూడదు. మీరు మీ విద్యా ప్రయాణం, మరియు మీ ప్రత్యేక అనుభవం గురించి వివరించాలి అని అడ్మిషన్
ఆఫీసర్ అంటారు.
SoP లో మీ అధ్యయనాలు (learnings) హైలైట్ చేయాలి మరియు మీరు ఒక ప్రత్యేక విషయం పట్ల ఎలా ఆసక్తి అభివృద్ధి చేసుకొన్నారు మరియు మీ జీవితం లక్ష్యాలు ఏమిటో వివరించాలి.
అయితే, మీ డిగ్రీ తరువాత ఉద్యోగం పొందటం ఒక లక్ష్యంగా పరిగణించరాదు. లక్ష్యాలు మీ దృక్పధాన్ని బాగా తెలుపుతాయి మరియు మీరు నిజ జీవిత పరిస్థితులలో డిగ్రీ నుండి పొందిన మీ అభ్యాసాలను ఎలా అమలు చేస్తారు వాటిని తెలపాలి. మీ SoP మీ మీ భవిష్యత్కు వంతెనగా పని చేయాలి.
గుర్తించుకో దగిన విషయాలు:
§ మీ అప్లికేషన్/SoP లో గ్రామర్ తప్పులు
ఉండరాదు.
§ స్పెల్లింగ్ తప్పులు ఉండరాదు.
§ పేర్కొన్న పాయింట్లను పునరావృతం
చేయవద్దు.
§ SoP సోప్ నిజంగా మీ ప్రత్యేకత మరియు
ఒక హైలైట్. అది మీ కథ. ప్లగారిజం ఉండరాదు.
§ SoP మీమ్మలను ఇతరుల నుంచి ప్రత్యేకత
చూపేది.
§ మంచి వాస్తవమైన SoP రాయండి, అడ్మిషన్
ఆఫీసర్ ను ఆకర్షించండి.
§ మీ ఉన్నత విద్యా కలలను నిజం చేసుకోండి
No comments:
Post a Comment