కొంతకాలం క్రిందట
ముంబై మిడ్ డే న్యూస్ పేపర్ గ్రూప్ ను అన్సారీ కుటుంబం అమ్మింది. అది అన్సారిల
యాజమాన్యంలో 72 సంవత్సరాల పాటు ఉంది, అన్సారీలు ఒక ప్రధాన ఆంగ్ల వార్తాపత్రికను కలిగి ఉన్న ఏకైక ముస్లింలు.
అన్సారీల పూర్వికులు ఇస్లాం
స్వీకరించిన ఉత్తరప్రదేశ్ చేనేతకారులు మరియు వంకర్ కులస్థులు. వీరు 1857 తిరుగుబాటు
తరువాత ఉత్తరప్రదేశ్ నుండి వలస వచ్చారు. బ్రిటీష్ వారు
వంకరుల చేతి బ్రొటనవేళ్ళను తొలగించి చేనేత
వృత్తికి వారిని పనికి రాకుండా చేసారు. అన్సారీలు పెద్ద సంఖ్య లో బాంబే వెలుపల
భివాండికి వలస వెళ్లారు. వీరి రాక తో భివాండి ప్రపంచంలోని అతిపెద్ద నేత కేంద్రాలలో
ఒకటిగా నిలిచింది.
మిడ్ డే అన్సారీస్ వారి సంపదను నేత పని నుండి పొందలేదు, వార్తాపత్రికల నుండి పొందారు. మిడ్ డే స్థాపకుడు
అబ్దుల్ హమీద్ అన్సారీ. ఇతను ఉర్దూ వారపత్రిక ఇంక్విలాబ్
రచయిత మరియు ప్రచురణకర్త. మిడ్-డే వెబ్సైట్ అతనిని 'ముజాహిద్-ఎ-అజాది' లేదా “స్వాతంత్ర యోదుడు” అని
సూచిస్తుంది. అన్సారి మొదట్లో కాంగ్రెస్ వాది పిదప ముస్లిం లీగ్ లో చేరినాడు. కానీ అతను పాకిస్తాన్ వెళ్ళటానికి జిన్నా
ఆహ్వానం అంగీకరించలేదు. జిన్నా కు రాసిన ఒక లేఖ లో అన్సారీలు భారత దేశం లో ఉన్నందుకు
గర్వంగా ఉంది అని అని అన్నారు మరియు తనూ
మరియు తన ప్రెస్ ఇక్కడే ఉంటారు అని సగర్వం
గా ప్రకటించాడు.
దీనికి బదులుగా జిన్నా పాకిస్తాన్ టైమ్స్ మరియు ఇమ్రోజ్ల(Imrose)ను
పేపర్స్ ప్రచురించిన ప్రోగ్రసివ్ పేపర్స్ స్థాపకుడు మరియు ప్రచురణకర్త మియా ఇఫ్తాఖర్-ఉద్-దిన్
సహాయం తీసుకొన్నారు.
ఇంక్విలాబ్ ఇప్పటికీ బొంబాయిలో అంత్యంత ప్రజాదరణ పొందింది, మరియు దానికి సుమారు 3,00,000 పాఠకులు ఉన్నారు. అబ్దుల్ హమీద్ అన్సారీ కుమారుడు ఖాలిద్ 1979 లో
స్పోర్ట్స్ వీక్ నెలకొల్పాడు. ఇది భారతదేశం యొక్క అతిపెద్ద క్రీడా పత్రిక మరియు ఆ తరువాత మధ్యాహ్నం వార్తాపత్రిక మిడ్-డేని
స్థాపించారు. అన్సారీలు ప్రస్తుతం ఉన్నత-తరగతి ముస్లిమ్స్. వారు , దక్షిణ బాంబే కు చెందిన వారు మరియు
ఖాలిద్ అన్సారీ స్టాన్ఫోర్డ్
Stanford మరియు అతని కుమారుడు తారిక్ నోట్రే డామ్ Notre Dame లో ఉన్నత విద్య అబ్యసించారు. తారిక్ తండ్రి ఇప్పటికీ ఆ సంస్థకు చైర్మన్ గా ఉన్నారు మరియు బొంబాయి యొక్క ప్రత్యేకమైన
విల్లింగ్డన్ క్లబ్ లో స్క్వాష్ ఆడతారు.
కలకత్తా వార్తాపత్రిక ఆసియా ఏజ్ MJ అక్బర్ చేత నిర్వహించబడినది. MJ అక్బర్ ఒక తెలివైన మరియు ఆకర్షణీయమైన
వ్యక్తి మరియు మొదటి తరగతి పత్రికా సంపాదకుడు. MJ అక్బర్ కలకత్తాలో
పెరిగారు, కానీ కాశ్మీర్ కు చెందిన నార్త్ ఇండియన్
ముస్లిం మరియు బిహారీ మూలలు కలిగి ఉన్నాడు.
ఇండియన్ ముస్లిమ్స్ లొ ఎక్కువమంది వడ్రంగులు, కసాయి, ప్లంబర్లు మరియు మొదలైన వృతి నిపుణులు. ముస్లింలను వాణిజ్యం (tijarat) ఆకర్షించింది
ఎందుకంటే ఇస్లాం యొక్క ప్రవక్త(స) కూడా ఒక
వ్యాపారి. ఇండియన్ ముస్లిమ్స్ లో కొద్దిమంది మాత్రమే వర్తకం treding సముదాయంనకు
చెందిన వారు.
ఇండియన్ ముస్లిమ్స్ లో వర్తకం treding సముదాయంనకు చెందిన
వారిలో ప్రముఖులు గుజరాత్ కు చెందిన షియాలు. వారిది ఒక చిన్న కమ్యూనిటీ (దాదాపు అయిదు లక్షల మంది) అయినప్పటికీ
వ్యాపారం యొక్క విషయాల్లో భారత దేశం లోని 20 కోట్ల ముస్లిమ్స్ పై ఆధిపత్యం కలవారు.
విప్రో అజీమ్ ప్రేమ్జీ, అంబానీల తరువాత భారతదేశపు అత్యంత రెండవ ధనవంతుడు, ఇతడు ముస్లిమ్స్ లోని ఖోజా కమ్యూనిటి కి చెందిన వాడు. అజీమ్ ప్రేమ్జీ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం
నుండి ఎలెక్ట్రికల్ ఇంజనీర్ పట్టాను
పొందినాడు. ప్రేమ్జీ బొంబాయి యొక్క ఖోజా కులీనులలో అత్యంత ప్రసిద్ధ
సభ్యుడు, వాస్తవానికి, పాకిస్తాన్ పితామహుడు జిన్నా కూడా ఖోజా
ముస్లిం.
అజీమ్ ప్రేమ్జీ తన 21 ఏళ్ల వయస్సులో 1945 లో ఒక విజటబుల్ నూనె
వ్యాపారాన్ని సొంతం చేసుకున్నాడు. ఇది అతనికి తండ్రినుంచి
వారసత్వంగా లబించినది. అతను తన 35
సంవత్సరాల వయస్సులో బెంగుళూరులో విప్రో సాఫ్ట్వేర్ విభాగాన్ని స్థాపించాడు.
అజీం ప్రేమ్జీ చాలా సీదాసాద వ్యక్తి. అజీమ్ ప్రేమ్జీ ఎకోనమి
క్లాస్ లో ప్రయాణిస్తారు మరియు మూడు నక్షత్రాల హోటళ్ళలో నివసిస్తారు. అవసరమైతే
ఆటో-రిక్షా లో ప్రయాణిస్తారు. ఆయన ఆస్థి 17 బిలియన్ డాలర్లు (రూ.1.4 లక్షల కోట్లు)
విలువైనది. ఈ వైఖరి సంపన్న గుజరాతీ, ముస్లిం కుటుంబాలలో సర్వసాధారణం. వారు తమ
ఐశ్యర్యం ను ప్రదర్శించరు మరియు సాధారణ జీవితాన్ని గడుపుతారు.
ఫార్మాసుటికల్ సంస్థ వోక్హార్డ్కు Wockhardt యజమాని దావూది బోహ్రా హబీల్ ఖోరాకివాలా.
ఇతను పర్డ్యూ Purdue విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించాడు. అతను ఒక బిలియన్ డాలర్ల ఔషధ సంస్థను నడుపుతాడు, అది జనిరిక్ మందులను తయారుచేస్తుంది.. ఖోరాకివాలాస్ ధనవంతులు
మరియు శక్తివంతులు అయినప్పటికీ, వారు అందరు బోహ్రాస్ లాగే ఇప్పటికీ సంప్రదాయవాదులు. భారతదేశంలో మొదటి అక్బారలిస్ Akbarally’ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఖకోవాలివాస్ స్థాపించారు.
.
మరొక గుజరాతీ కచ్చీ Kutchchi ముస్లిం, ప్రముఖ ఔషధ సంస్థ సిప్లాకు యజమాని, దాని వార్షిక
టర్న్-ఓవర్ ఒక బిలియన్ డాలర్లను
కలిగి ఉంది. ఇది 1927 లో బెర్లిన్ యునివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన
ఖ్వాజా అబ్దుల్ హమీడ్ చేత స్థాపించబడింది. ఈ సంస్థ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
నుండి డాక్టరేట్ పొందిన అతని కుమారుడు యూసఫ్ హమీద్ చేత ఈ రోజు నడుపుతుంది.
భారతదేశంలో సున్నీ వ్యాపారస్తులు కూడా కొందరు ఉన్నారు. కానీ వాళ్ళు గుజరాతీలు కూడా ఉదా:
మేమోన్స్ ఆఫ్ కచ్చ్
Memons of
Kutchch. వారు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం
చేసేవారు. బాలీవుడ్ యొక్క ముస్లిం నిర్మాతలు కూడా గుజరాతీయులు ఉదా: నాడియాడ్వాలాస్ Nadiadwalas. నాడియాడ్వాలాస్ గుజరాత్లోని చరోటార్
ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం నాడియాడ్, నుండి వచ్చారు. గుజరాతి పటేల్స్ భూస్వాములు, వ్యాపార
వేత్తలు కారు.
మరొక సున్ని పారిశ్రామికవేత్త హందార్డ్ కంపనీ స్థాపకుడు హకీమ్
అబ్దుల్ హమీద్. ఈ వేసవిలో మనం బాగా త్రాగే వేసవి పానీయo “రుహ్ -అఫ్జ (Rooh Afza)” తయారీదారులు. “రుహ్ -అఫ్జ” అనేది అందరు భారతీయులు మరియు
పాకిస్థానీలకు బాగా తెలుసు.
హందార్డ్ 1907 లో
హకీమ్ అబ్దుల్ మజీద్ చేత స్థాపించబడింది. యునాని (గ్రీకు) వైద్య నిపుణులు అబ్దుల్
హామీద్ ఆధునిక వైద్య పితామహుడు ఇబ్న్ సిన(అవిసెన్న) రచనల ఎడిషన్ ప్రచురించారు. అబ్దుల్
హమీద్ యొక్క సోదరుడు హకీమ్ మొహమ్మద్ పాకిస్తాన్ కు వలస పోయారు మరియు 1998 లో కరాచీలోమరణించారు. .
మరొక ప్రముఖ కకీజై
(Kakezai) పఠాన్ పారిశ్రామికవేత్త గురించి
తెలుసుకొందాము. ఈనాడు వాణిజ్య వాహనాలు(LCV), కార్లు మరియు ట్రాక్టర్లను తయారు చేసే ప్రముఖ భారతీయ సంస్థ మహేంద్ర 1945 లో స్థాపించబడింది. ఆ సంస్థ యొక్క
స్థాపకులు "గులామ్ మహమ్మద్ " మరియు “మహేంద్ర
బ్రదర్స్”. దేశవిభజనకు పూర్వం ఈ సంస్థ మహీంద్రా & మొహమ్మద్ పేరు
కలిగి ఉండేది మరియు రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో విజయవంతమైన విల్లీస్ జీప్స్ నిర్మించేది..
జీప్ అనే పేరు GP లేదా జనరల్ పర్పస్ వాహనం నుండి వచ్చింది. మహీంద్రా & మొహమ్మద్ జీప్లను అసెంబుల్ చేయడం మరియు విక్రయించడం
ప్రారంభించారు..
మహీంద్రా సోదరులు మరియు గులాం
మొహమ్మద్ మద్య మధ్య భాగస్వామ్యం దేశ విభజన వరకు కొనసాగింది. ఆ
తరువాత గులాం మొహమ్మద్
పాకిస్తాన్ కు తరలి వెళ్లి అక్కడ , మొదటి ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు
చేపట్టారు.
ఆ తరువాత కంపనీ పేరు మహేంద్ర & మహేంద్ర గా మారింది. ఈ
నాడు ఆ కంపనీ ఒక లక్ష మంది ఉద్యోగులతో సుమారు 6.3 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువను
కలిగి ఉంది. సత్యం కంప్యూటర్స్ ను టెక్-మహేంద్ర తనలో విలీనం చేసుకోంది.
పాకిస్థాన్ కూడా అనేకమంది పంజాబీ, గుజరాతి వ్యాపారవేత్తలను
కలిగి ఉంది. వ్యాపారుల గురించి జోకులు పాకిస్తాన్లో బాగా ప్రాచుర్యం పొందాయి..
.
.
No comments:
Post a Comment