31 March 2022

నడక శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది Walking Improves Physical and Mental Health

 

 

నడక అనేది ప్రతి ఒక్కరూ తమ రోజువారీ కార్యకలాపాలలో చేర్చుకోవాల్సిన వ్యాయామం. లిఫ్ట్‌కి బదులు మెట్లు ఎక్కండి. గంటల తరబడి కూర్చోవాల్సిన డెస్క్ జాబ్ ఉంటే, ప్రతి గంట లేదా రెండు గంటలకు సీటు నుండి లేచి, డెస్క్ చుట్టూ కొంచెం నడవండి. నడక శారీరక, మానసిక మరియు సామాజిక ఆరోగ్యo తో పాటు  అనేక ప్రయోజనాలను కలిగి ఉంది.

 1. నడక వలన బరువు తగ్గడం:

ఒక గంట పాటు వేగంగా నడవడం వల్ల చాలా కేలరీలు బర్న్ అవుతాయి. ఒకవేళ, మీరు జిమ్‌కి వెళ్లకుండా ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయాలనుకుంటే, నడవడానికి ప్రయత్నించండి.

 2. నడక గుండెకు మంచిది:

ఆరోగ్యకరమైన హృదయం ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్ణయిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గించడానికి నడక గొప్ప మార్గంగా సూచించబడింది. నడక రక్త ప్రసరణను కూడా నియంత్రిస్తుంది, ఇది రక్తపోటును అదుపులో  ఉంచుతుంది.

 3. నడక మధుమేహం ఉన్నవారికి మంచిది :

2013లో డయాబెటీస్ కేర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం  ప్రతి భోజనం తర్వాత 15 నిమిషాల నడక రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుందని రుజువు అయ్యింది.. క్రియారహితంగా ఉండే వ్యక్తులు సాధారణంగా నడిచే వ్యక్తులతో పోలిస్తే ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను చూస్తారు.

4. నడక మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది:

ఒత్తిడి ప్రజలలో అనేక మానసిక సమస్యలకు దారితీయవచ్చు. ఇది ఒక వ్యక్తి యొక్క శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మనం నడిచేటప్పుడు ఎండార్ఫిన్ అనే రసాయనం విడుదలవుతుందని పరిశోధనలో తేలింది. ఇది మన మానసిక స్థితిని మెరుగుపరచడం  మరియు మనల్ని రిలాక్స్‌గా మరియు ప్రశాంతంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటుందని చెప్పబడింది.

5. నడక నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది:

మన కండరాలు సడలించినప్పుడు మరియు మన మెదడు స్వేచ్ఛగా ఉన్నప్పుడు, మనం బాగా నిద్రపోతాము. స్లీప్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం మెరుగైన నిద్రతో వాకింగ్ వంటి శారీరక కార్యకలాపాలను కనెక్ట్ చేయడానికి ప్రయత్నించింది. సాధారణంగా రోజంతా చురుగ్గా గడిపే వ్యక్తులు మంచి నిద్రను పొందుతారని కనుగొనబడింది.

6. నడక జాయింట్  పెయిన్స్  నుండి ఉపశమనం ఇస్తుంది:

తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు నొప్పి నివారణగా నడకను ప్రయత్నించాలి. హిప్, మోకాలి వంటి కీళ్లకు మద్దతు ఇచ్చే కండరాలను లూబ్రికేట్ చేయడంలో మరియు బలోపేతం చేయడంలో నడక సహాయపడుతుంది. కనీసం 30 నిమిషాల పాటు నడవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

 7.నడక  స్వీయ-సాక్షాత్కారాన్ని ప్రేరేపిస్తుంది:

వ్యాయామశాలలో తీవ్రమైన వ్యాయామం చేస్తున్నప్పుడు, శరీరం మరియు మనస్సు కేలరీలను ముక్కలు చేయడంపై దృష్టి పెడతాయి, నడక మిమ్మల్ని మీతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇది స్వీయ-గౌరవం, స్వీయ-అవగాహన కోసం సహాయపడుతుంది.

 

ఉర్దూ: ఇది ఎవరి భాష?

 


ఉర్దూ జర్నలిజం ఉనికిలోకి వచ్చి 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉర్దూ గురించిన కొన్ని అపోహలు, అపోహలు తొలగించుకోవడానికి ఇదే మంచి అవకాశంగా కనిపిస్తోంది. ఉర్దూ అనేది భారతదేశంలో పుట్టి అభివృద్ధి చెందిన భాష. అయితే, దురదృష్టవశాత్తూ వలసవాద యజమానుల అడుగుజాడల్లోనే, భారతదేశంలోని కొత్త పాలకులు కూడా మతం ఆధారంగా భాషలను విభజించారు. నిజానికి భాష వర్ధిల్లాలంటే మతం అవసరం లేదు కానీ మతాలు వర్ధిల్లాలంటే భాష కావాలి.

ఉర్దూ మతంతో సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల వారు ఆదరించే భాష ఇది. కానీ వలసవాద మాస్టర్లు హిందీని హిందువులకు మరియు ఉర్దూను ముస్లింలకు ఆపాదించారు, అయితే రెండు భాషలకు గొప్ప సంప్రదాయం ఉంది.

ఉర్దూ సాహిత్యంలో మాలిక్ రామ్‌ను గాలిబ్‌ పై విశేష నిపుణుడుగా పరిగణించడం అరుగుతుంది మరియు అలాగే మహమ్మద్ ఇక్బాల్ జీవితం, తత్వశాస్త్రం మరియు రచనలపై జగన్ నాథ్ ఆజాద్‌ను విశేష నిపుణుడుగా పరిగణించడం జరుగుతుంది. భారతదేశంలో ఉర్దూ జర్నలిజానికి 200 సంవత్సరాలు నిండిన సందర్భంగా, వివిధ భారతీయులు వారి మతంతో సంబంధం లేకుండా, భాషను ఎలా సుసంపన్నం చేసారో చూద్దాం.

ఉర్దూ జర్నలిజం, రెండు వందల సంవత్సరాలపాటు  సుసంపన్నంగా జీవించినది.  మొదటి నుండి ఉర్దూ తన పాఠకులలో జాతీయవాద భావాలను ప్రోత్సహించింది మరియు ఆనాటి ప్రభుత్వం పట్ల పూర్తిగా వలసవాద మరియు సామ్రాజ్యవాద వ్యతిరేకతను కలిగి ఉంది. 

1822లో దాని బాల్యం నుండి, ఉర్దూ వార్తాపత్రికలు మరియు పాత్రికేయులు తమ రిపోర్టింగ్ మరియు కథనాల ద్వారా జాతీయవాద భావాలను పెంపొందింప జేశారు.. ఉర్దూ జర్నలిజం ప్రారంభ దశలో హిందువులు మరియు ముస్లింలు యాజమాన్యం మరియు సంపాదకీయ బాధ్యతలను సమానంగా పంచుకున్నారు. భారత జాతీయవాద ఆదర్శాలను ప్రోత్సహించడం మరియు వలసవాద అనుకూల  కథనాలను తిరస్కరించడం ఉర్దూ జర్నలిస్టుల ప్రధాన విధి.

పశ్చిమ బెంగాల్‌లోని పర్షియన్ వార్తాపత్రికలు ఉర్దూ ప్రెస్‌కు ముందున్నాయి. పెర్షియన్ అనేది  మొఘల్ న్యాయస్థానంచే పోషించబడిన మరియు దేశంలోని పాలక వర్గాలచే స్వీకరించబడిన భాష, వలసవాద మాస్టర్లు ఆంగ్లానికి అనుకూలంగా పర్షియన్‌ను విస్మరించిన తరువాత వారు ఉర్దూపై దృష్టి సారించారు

పండిట్ హరిహర్ దత్తా 1822లో కోల్‌కతాలో (అప్పటి కలకత్తా) జామ్-ఇ-జహాన్ నుమాను స్థాపించారు. అతను ప్రముఖ బెంగాలీ పాత్రికేయుడు మరియు బెంగాలీ వారపత్రిక సంబాద్ కౌముది వ్యవస్థాపకులలో ఒకరైన పండిట్ తారా చంద్ దత్తా కుమారుడు. ఈ మూడు పేజీల వారపత్రికకు సంపాదకులు పండిట్ సదాసుఖ్ లాల్. ఇది ఇంగ్లీష్ మరియు బెంగాలీ తర్వాత భారతదేశంలో మూడవ భాషా వార్తాపత్రిక, మరియు 1888 వరకు ప్రచురించబడింది. 

1857లో తిరుగుబాటు తరువాత, ఉర్దూ జర్నలిజం జాతీయవాద ఉత్సాహంతో కొనసాగింది, ఎందుకంటే ఉర్దూ భాష మాత్రమే భారతదేశంలోని వర్ధమాన రాజకీయ పార్టీల జాతీయవాద నాయకులకు మరియు సాధారణ పాఠకులకు మధ్య వారధి పాత్రను పోషించగలదు. అయితే, 1857 తర్వాత, ఉర్దూ జర్నలిజం కేంద్రం కోల్‌కతా నుండి మొదట లక్నో మరియు తరువాత ఢిల్లీకి మారింది. అయినప్పటికీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, పాట్నా, భోపాల్ మరియు శ్రీనగర్ వంటి భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉర్దూ జర్నలిజం యొక్క వివిధ కేంద్రాలు ఉన్నాయి, ఈ నగరాల నుండి ప్రస్తుత పురాతన దినపత్రికలు కొన్ని ప్రారంభించబడ్డాయి

1857 నుండి, ఉర్దూ జర్నలిజం భారతదేశంలోని అన్ని వర్గాల ప్రోత్సాహంతో కొత్త అభివృద్ధి యుగంలోకి ప్రవేశించింది. రతన్ నాథ్ సర్షర్సంపాదకత్వంలో మున్షీ నవల్ కిషోర్ లక్నో నుండి ప్రచురించబడిన ఔద్ అఖ్బర్ దీనికి ఒక ఉదాహరణ.

20వ శతాబ్దం ప్రారంభం నుండి, రాజకీయాలు మరియు సామాజిక సంస్కరణలు ఉర్దూ జర్నలిజంపై ఆధిపత్యం చెలాయించాయి. కాంగ్రెస్, ముస్లిం లీగ్, హిందూ మహాసభ, ఆర్యసమాజ్, ఖిలాఫత్ కమిటీ మరియు అలీఘర్ ఉద్యమం ప్రారంభించిన రాజకీయ మరియు సామాజిక-సంస్కరణ ఉద్యమాలు ఉర్దూ భాషా వార్తాపత్రికలు మరియు పత్రికలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ఉద్యమాలన్నీ ప్రజలలో తమ ఆలోచనలను ప్రచారం చేయడానికి వివిధ ఉర్దూ వార్తాపత్రికలను ప్రారంభించాయి.

1919లో, మహాషే కృష్ణన్ లాహోర్ నుండి డైలీ ప్రతాప్‌ను ప్రారంభించారు. ఇది గాంధీ విధానాలకు మరియు భారత జాతీయ కాంగ్రెస్‌కు బలమైన మద్దతునిచ్చింది. ఇది నిరంతర ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొంది మరియు అనేక సార్లు ప్రచురణను నిలిపివేయవలసి వచ్చింది. పంజాబ్ మరియు ఢిల్లీలోని ఉర్దూ చదివే హిందువులలో ఇది గొప్ప ప్రభావాన్ని చూపింది.

1923లో స్వామి శ్రద్ధానంద్ లాలా దేశబంధు గుప్తా సంపాదకుడిగా డైలీ తేజ్‌ని స్థాపించారు. ఇది రాజస్థాన్, U.P. ఢిల్లీ లలో విస్తృతంగా చెలామణిలో ఉంది. ఇది కూడా కలోనియల్ మాస్టర్స్ నుండి వేధింపులను ఎదుర్కొంది మరియు అనేక రాచరిక రాష్ట్రాలలో నిషేధించబడింది. అదే సంవత్సరంలో, ఆర్యసమాజ్ లాహోర్ నుండి డైలీ మిలాప్‌ను ప్రారంభించింది. ఇది శక్తివంతమైన జాతీయవాద సంపాదకీయాలకు ప్రసిద్ధి చెందింది. తరువాత, జవహర్‌లాల్ నెహ్రూ 1945లో క్వామీ ఆవాజ్‌ను స్థాపించారు, అది వెబ్ ఎడిషన్ ద్వారా నేటికీ మనుగడలో ఉంది.

స్వాతంత్య్రానంతరం హిందీ అధికార భాషగా మారడంతో ఉర్దూ జర్నలిజం చాలా నష్టపోయింది. చందాదారుల సంఖ్య క్షీణించింది మరియు దాని వృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం లేదు. ఉర్దూ జర్నలిజం వృద్ధికి అనేక సంస్థలు వ్యక్తిగతంగా మరియు ప్రభుత్వం ద్వారా కూడా ప్రారంభించబడినప్పటికీ, అవి చాలా తక్కువ ప్రభావం కల్గించినవి..

ఉర్దూ వార్తాపత్రికల ద్వారా తమ మద్దతుదారులతో కనెక్ట్ కాలేమని ప్రభుత్వం యొక్క తప్పుడు అభిప్రాయానికి ఇది కారణం కావచ్చు మరియు ఉర్దూ ప్రేమికుల స్వీయ-హానికర చర్యల వల్ల కూడా కావచ్చు. ప్రతి ఒక్కరూ ఉర్దూకు మద్దతు ఇవ్వాలని కోరుకున్నారు, కానీ వారు తమ వ్యక్తిగత జీవితంలో దాని పెరుగుదలను పెద్దగా పట్టించుకోలేదు.

అంబాలాలోని పంజాబ్ కేసరి గ్రూప్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ 1948లో హింద్ సమాచార్‌ను ప్రారంభించింది. ఒక దశలో ఇది దేశంలో అత్యధికంగా సర్క్యులేట్ చేయబడిన ఉర్దూ వార్తాపత్రికలలో ఒకటిగా ఉండేది. తన వార్తాపత్రిక ప్రతిరోజూ ఒక పాఠకుడిని కోల్పోతుందని, కానీ దానిని మూసివేయడానికి తనకు మనస్సు ఒప్పటం లేదని ప్రస్తుత ఛైర్మన్ వికె చోప్రా ఒకసారి ఉటంకించారు. ఇది ఉర్దూ పట్ల ఆయనకున్న ప్రేమను మరియు నిబద్ధతను తెలియజేస్తుంది.

1992లో, ప్రపంచంలోనే ఉర్దూలో మొట్టమొదటి వైర్ ఏజెన్సీ అయిన UNI-ఉర్దూను ప్రారంభించడంతో ఉర్దూ జర్నలిజం ఒక ఊపును  అందుకుంది. కంప్యూటరీకరణ ప్రచురణ రంగంలో తొలి అడుగులు వేసింది. కంప్యూటరీకరణ/దిజిలైజేషణ్ అనేక పాత వార్తాపత్రికలు మరింత కంటెంట్ అందుబాటులో ఉండటంతో అభివృద్ధి చెందడానికి సహాయపడింది మరియు అనేక కొత్త మరియు చిన్న వార్తాపత్రికలు ప్రచురణను ప్రారంభించడంలో సహాయపడింది.

ప్రస్తుతం రెండు అతిపెద్ద మల్టి-ఎడిషన్ ఉర్దూ వార్తాపత్రిక సమూహాలు, రాష్ట్రీయ సహారా మరియు రోజ్నామా ఇంక్విలాబ్ మరియు ETV-భారత్-24 గంటల ఉర్దూ TV ఛానెల్, జీ సలామ్ మరియు నెట్‌వర్క్ 18 ఉర్దూ, అన్నీ ముస్లిమేతర సమూహాల యాజమాన్యంలో ఉన్నాయి. ఉర్దూ భారతీయ ముస్లింల భాష కాదని, అది భారతీయుల భాష అనే  వాదనను  ఇవి మళ్లీ బలపరిచాయి. స్వాతంత్య్రానంతరం అతి జాతీయవాద శక్తులు ఉర్దూను ముస్లిం భాషగా భావించారు ఆ అభిప్రాయం ఇప్పటి వరకు సరిగ్గా తొలగించబడలేదు.

జనాదరణ పొందిన అభిప్రాయానికి విరుద్ధంగా, ఉర్దూ ముస్లింల భాష కాదు. ఇది సైనికుల భాష మరియు మొఘల్ కాలంలో అభివృద్ధి చెందింది, పెర్షియన్ మరియు స్థానిక భాషల నుండి పదాలను సమీకరించింది. అరబ్, టర్క్ మరియు స్థానికులుగా ఉండే సైనికుల మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడం దీని ఉద్దేశ్యం. తరువాత, ఉర్దూ దాదాపు 900 సంవత్సరాల కాలంలో స్థానిక పర్షియన్, అరబిక్ మరియు టర్కిక్ ప్రభావాన్ని సమీకరించడం ద్వారా అక్షరాస్యులు మరియు ప్రజల భాషగా మారింది.

70 ఏళ్లుగా ఉర్దూతో  సవతి సోదరుడిలా వ్యవహరించిన తర్వాత, మనం దానిని భారతదేశ భాషగా గుర్తించి, దాని అభివృద్ధికి కృషి చేయడానికి ప్రయత్నిస్తే మరియు దానికి తగిన గుర్తింపు మరియు గౌరవాన్ని అందిస్తే మంచిది.

30 March 2022

చెస్ ఒలింపియాడ్‌లో భారతదేశానికి మొదటి పతకం సాధించిన వ్యక్తి - మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన రఫీక్ ఖాన్(1946-2019)

 



కార్పెంటర్ నుండి భారతదేశపు మొదటి చెస్ ఒలింపియాడ్ పతక విజేత- రఫీక్ ఖాన్ సంక్షిప్త జీవిత చరిత్ర

 

పుట్టిన తేదీ - జూలై 12, 1946

తండ్రి పేరు - అబ్దుల్ రషీద్ ఖాన్ (1993లో మరణించారు )

తల్లి పేరు - ఖుర్షీద్ బేగం (రఫీక్ ఖాన్ 16 సంవత్సరాల వయస్సులో మరణించినది)

తోబుట్టువు - 1 చెల్లెలు

వివాహం - 17 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నాడు

విద్య - మదర్సాలో చదివారు, ఫార్మల్ విద్య లేదు

అభిప్రాయాలు - చాలా లౌకిక మరియు ఉదారవాది.

ముహమ్మద్ రఫీక్ ఖాన్ భోపాల్‌లో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. రఫీక్ ఖాన్ తండ్రి ఒక పేద కార్పెంటర్. రఫీక్ ఖాన్ తన కుటుంబానికి కార్పెంటర్గా   పని చేస్తూ సంపాదనలో సహాయ పడే వాడు. రఫీక్ ఖాన్ తన కుటుంబం యొక్క ఆర్థిక సంక్షోభం కారణంగా, బాల్యపు రోజులలో విద్యకు దూరమయ్యాడు. చిన్న వయస్సులోనే , రఫీక్ తన తండ్రితో కలసి కార్పెంటర్ పని చేయడం ప్రారంభించాడు మరియు తండ్రికి సహాయకుడు అయ్యాడు. రఫీక్ ఖాన్ అన్ని రకాల క్రీడల పట్ల మక్కువ మరియు ఉత్సాహాన్ని కలిగి ఉన్నాడు కాని హాకీ లేదా ఫుట్‌బాల్ ఆడటానికి సమయం లేదు.

ఉదయం నుండి సాయంత్రం వరకు, రఫిక్ ఖాన్ మరియు అతని తండ్రి రోజంతా చాలా కష్టపడి అలిసిపోయి అలసటతో రాత్రి పడుకునేవారు. 16 సంవత్సరాల వయస్సులో, రఫిక్ ఖాన్ కార్పెంటర్ పని నుండి కొంత డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. రఫిక్ ఖాన్ అలసిపోయినప్పుడల్లా, సమీపంలోని దుకాణంలో టీ తాగేవాడు  మరియు అక్కడ కొంతమంది చెస్ మరియు క్యారమ్ ఆడటం గమనించాడు.

రఫిక్ ఖాన్ చదరంగం ఆటను చాలా చమత్కారంగా భావించాడు మరియు చదరంగం ఆడటం ప్రారంభించాడు. ప్రతిరోజూ, రఫిక్ ఖాన్ నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా చదరంగం ఆడేవాడు మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ, నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు చెస్ ఆడాలనే నియమానికి కట్టుబడి ఉన్నాడు.

క్రమంగా, రఫిక్ ఖాన్ చదరంగం కదలికలపై అవగాహన పెంచుకున్నాడు మరియు ఆటపై మంచి పట్టు సాధించాడు కానీ ఈ సమయంలో, రఫిక్ ఖాన్ దేశీ చెస్‌ను ఆడేవాడు రఫీక్ ఖాన్ “పాటియా”లో చదరంగం ఆడటం ప్రారంభించాడు (ఒక రకమైన నవాబీ సంప్రదాయం ఇక్కడ ప్రజలు టీతో పాటు వీధుల్లోని  పేవ్‌మెంట్‌లపై చెస్ మరియు క్యారమ్ ఆడతారు.) ఈ పద్ధతి మొత్తం 12 సంవత్సరాలు కొనసాగింది. అప్పటికి రఫిక్ ఖాన్ చెస్‌లో నిష్ణాతుడయ్యాడు.

తర్వాత ప్రపంచ ఛాంపియన్ గా బాబీ ఫిషర్ విజయంతో స్ఫూర్తి పొంది, 1974లో, జబల్‌పూర్‌లో జరిగిన మద్య ప్రదేశ్ రాష్ట్ర టోర్నమెంట్‌లో రఫీక్ ఖాన్ పాల్గొని ఛాంపియన్‌గా నిలిచాడు. రాష్ట్రస్థాయి విజేతగా నిలిచిన తర్వాత రఫీక్‌ఖాన్‌ అనేక జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.

1975లో, రఫిక్ ఖాన్ పాట్నాలో జరిగిన జాతీయ బిచెస్ పోటీని ఆడి పదో స్థానం సాధించాడు. మరుసటి సంవత్సరం 1976లో కలకత్తాలో జరిగిన జాతీయ బిని గెలుచుకున్నాడు. 1978లో, రఫీక్ ఖాన్ ఎర్నాకులంలో జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు, అయితే అప్పుడు కూడా రఫిక్ ఖాన్ తన సొంత రాష్ట్రం మద్య ప్రదేశ్ లో పెద్దగా గుర్తింపు పొందలేదు. విజయ శిఖరాగ్రానికి చేరుకున్నా, చిన్న చిన్న విజయాల ద్వారా ఇతరులు పొందిన కీర్తిని పొందలేకపోయాడు.

జీవితంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభం, సమస్యలు, కష్టాలు ఉన్నా పర్వాలేదని, ధైర్యం, పట్టుదల, క్రమబద్ధమైన సాధన ఉంటే విజయం సాధించవచ్చని రఫీక్ ఖాన్ తరచూ చెప్పేవారు.

తీవ్రమైన పేదరికం కారణంగా రఫీక్ ఖాన్ చెస్ ప్రాక్టీస్‌ను నిలిపివేయాలనే ఆలోచనలో ఉండగా, చెస్ అభిమాని అయిన షానవాజ్ ఖాన్ కృషితో భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పెంటర్‌గా నియమితులయ్యారు.

మునిసిపల్ కార్పొరేషన్‌లో తన నియామకం జరిగిన సంఘటనను రఫిక్ ఖాన్ హాస్యభరితంగా చెప్పేవారు. రఫిక్ ఖాన్ ఉద్యోగం కోసం అప్పటి ఎగ్జిగుటివ్ మిస్టర్ బుచ్ వద్దకు వెళ్ళినప్పుడు, బుచ్ వేసిన మొదటి ప్రశ్న, “మీరు ఏ తరగతి వరకు చదివారు?” అని. దానికి రఫిక్ ఖాన్ , “అయ్యా, నేను నిరక్షరాస్యుడినిఅని బదులిచ్చాడు. మొదట, బుచ్ తన తలని చేతుల్లో పట్టుకున్నాడు, కానీ ఐదు నిమిషాల్లో, రఫిక్ ఖాన్‌కు ఉద్యోగం వచ్చింది. మునిసిపల్ కార్పొరేషన్‌లో కార్పెంటరీ పని చేస్తూనే రఫీక్ ఖాన్ పూర్తిగా చదరంగం వైపు మొగ్గు చూపాడు.

రఫిక్ ఖాన్ ఈ సమయంలో అనేక జాతీయ మరియు అంతర్జాతీయ టోర్నమెంట్లు కూడా ఆడాడు. రఫిక్ ఖాన్ 9 సంవత్సరాల పాటు పూర్తి నిమగ్నత మరియు అంకితభావంతో చెస్‌ను కొనసాగించాడు. ఈ స్వల్ప వ్యవధిలో దాదాపు నాలుగైదు సార్లు ఓవర్సీస్‌లో ఆడే అవకాశం లభించింది.

1978లో, అతను మలేషియాలో గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ ఆడాడు. అదే ఏడాది ఇరాన్‌లో నిర్వహించిన రెండో అంతర్జాతీయ పోటీలో పాల్గొన్నాడు. రఫిక్ ఖాన్ 1979లో ఢాకాలో జరిగిన సిల్వర్ కింగ్ ఈవెంట్‌లో కూడా పాల్గొన్నారు. రఫిక్ ఖాన్ వరుసగా 1980 మరియు 1982లో జరిగే చెస్ ఒలింపియాడ్స్‌లో పాల్గొనేందుకు మాల్టా మరియు స్విట్జర్లాండ్‌లకు కూడా వెళ్లారు. మాల్టా ఒలింపియాడ్‌లో బోర్డ్ సిల్వర్ మెడల్ సాధించి భారత చెస్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ క్రీడాకారుడు. రఫీక్ ఖాన్ సాధించిన జాతీయ రికార్డును దేశంలో ఇంతవరకు ఎవరు  బద్దలు కొట్టలేదు.

1976లో జరిగిన జాతీయ బిచెస్ ఛాంపియన్‌షిప్, లో రఫిక్ ఖాన్ 15కి 13 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు; ఇది ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్. అలాగే రఫిక్ ఖాన్ అదే ఈవెంట్‌లో 9 బ్యాక్ టు బ్యాక్ రౌండ్‌లలో గెలిచి రికార్డు సృష్టించాడు. రఫీక్ యొక్క భారీ విజయాన్ని వార్తాపత్రికలు లేదా ప్రభుత్వం పెద్దగా గుర్తించలేదు. రఫిక్ ఖాన్ కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు కేంద్రం లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఈ సమయంలో, ఒక ఆంగ్ల పత్రిక 'ఆన్ లుకర్ /Onlooker' రఫిక్ ఖాన్ సాధించిన విజయాలు మరియు రఫిక్ ఖాన్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంపై వివరణాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ కథ అప్పటి పరిశ్రమల మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌కు చేరింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం కోసం రఫీక్ ఖాన్‌ను జార్జ్ సిఫార్సు చేశాడు. మరియు రఫిక్ ఖాన్ వెంటనే BHEL లో ఉద్యోగం సంపాదించాడు కానీ అతని నిరక్షరాస్యత అతనికి అడ్డంకిగా మారింది. రఫిక్ ఖాన్ కు ఆపరేటర్ గ్రేడ్ ఉద్యోగం ఇచ్చారు. రఫీక్ ఖాన్ చదరంగంలో మరింత దూరం వెళ్లి ఉండేవాడు కానీ దురదృష్టవశాత్తు దానిని చేయలేకపోయాడు.

1984లో, రఫిక్ ఖాన్ తీవ్రమైన సైనస్ వ్యాధితో బాధపడ్డాడు. ఈ వ్యాధితో బాధపడుతున్న ఒక సంవత్సరం తర్వాత, రఫిక్ ఖాన్ రక్తహీనతతో అనారోగ్యానికి గురయ్యాడు. ఆరోగ్య సమస్యల కారణంగా, రఫిక్ ఖాన్ పోటీ చెస్ ఆడటం దాదాపు మానేశాడు. రఫిక్ ఖాన్ పోటీలకు దూరంగా ఉన్నప్పటికీ, చదరంగం ఆట నుండి ఎప్పుడూ వీడలేదు. తన జీవితంలో చివరి రోజు వరకు ప్రతిరోజూ భోపాల్ సిటీ చెస్ క్లబ్‌ను సందర్శించే వాడు. రఫిక్ ఖాన్ జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో ఆడటానికి వెళ్ళే  యువ ఆటగాళ్లకు శిక్షణ కూడా ఇచ్చేవాడు కూడా 

25 March 2022

ఐస్ క్రీం-పురాతన పెర్షియన్ డెజర్ట్ – చరిత్ర – విశేషాలు Ice Cream, the ancient Persian dessert – History.

 






ఎండలు పెరుగుతున్నాయి. వేసవి కాలం వచ్చేస్తుంది.   ఐస్‌క్రీం పార్లర్‌ల సంఖ్య పెరుగుతుంది. తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు తమకు ఇష్టమైన ఐస్‌క్రీం  తినడానికి ఐస్‌క్రీం పార్లర్‌లకు క్యూ కడుతున్నారు. 

పురాతన పర్షియాలో ఉద్భవించిందని చెప్పబడే ఈ రుచికరమైన డెజర్ట్ ఐస్‌క్రీం ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రియమైన రుచికరమైనదిగా మారింది మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది.

USAలో జాతీయ ఐస్ క్రీం నెల (ప్రతి సంవత్సరం జూలై) మరియు ప్రతి సంవత్సరం జూలై మూడవ ఆదివారం నాడు జాతీయ ఐస్ క్రీమ్ దినోత్సవం జరుపుతారు. భారతదేశంలో జాతీయ ఐస్ క్రీం డే జూలై మూడవ ఆదివారం, కాని  ఈ వాస్తవం చాలా మందికి తెలియదు.

రుచికరమైన ఐస్ క్రీం యొక్క మూలాలు శతాబ్దాల నాటివి. క్రీ.పూ. 550లో ప్రాచీన పర్షియాలో మన ఆధునిక ఐస్‌క్రీమ్‌ను పోలి ఉండే తీపి గురించి మొట్టమొదటిగా నమోదు చేయబడినది.  పురాతన చైనీస్ చక్రవర్తులు ఐస్ క్రీమ్‌ల మాదిరిగా ఉండే అనేక రకాల  స్వీట్‌ల తయారీ, ఉత్పత్తిని ప్రోత్సహించారు.

అలెగ్జాండర్ ది గ్రేట్ తన ఆర్మీ అధికారులతో రాత్రిపూట పార్టీల సమయంలో పండ్ల పదార్దాలతో కలిపి ఐస్ తినడం ఆనందించాడని అంటారు.. పురాతన రోమన్ సామ్రాజ్యం సమయంలో, నీరో చక్రవర్తి పండ్లు మరియు రసాల మిశ్రమంతో తినటానికి ఎత్తైన పర్వత శిఖరాల నుండి తాజా మంచును తీసుకురావడానికి రన్నర్‌లను పంపేవాడు. ఇటలీ ప్రయాణికుడు మార్కో పోలో ఆసియాలో తన ప్రయాణాల నుండి మంచు ఆధారిత తీపి వంటకాలతో ఇటలీకి తిరిగి వచ్చాడు.

శతాబ్దాలుగా, ఐరోపా మరియు ఆసియా రాజుల వంటశాలలలో పనిచేస్తున్న చెఫ్‌లు ఐస్ తో కూడిన తీపి వంటకాలను తయారు చేసేవారు. 1500 మరియు 1600 లలో, మొఘల్ చక్రవర్తులు హిమాలయ పర్వతాల నుండి పెద్ద మొత్తంలో మంచును ఢిల్లీలోని రాజధానికి తీసుకురావడానికి గుర్రపు సైనికుల రిలేలను ఉపయోగించారు. ఆ తర్వాత మంచును కుల్ఫీ తయారీకి ఉపయోగించారు. అపట్లో  రిఫ్రిజిరేటర్లు లేవు కాబట్టి, మంచు కరగకుండా ఉండటానికి గడ్డితో కప్పబడిన చెక్క పెట్టెల్లో నిల్వ చేసేవారు.

కొన్ని శతాబ్దాల తరువాత, ఐస్ క్రీం తయారీ ప్రక్రియ సరళీకృతం చేయబడింది. USలో ఐస్ క్రీం గురించిన మొదటి అధికారిక సూచన 1774లో మేరీల్యాండ్ గవర్నర్ విలియం బ్లేడెన్ కు అతని  అతిథి రాసిన లేఖలో చూడవచ్చు. మే 12, 1777, రోజువారీ ప్రజల వినియోగానికి ఐస్ క్రీం అందుబాటులో ఉందని పేర్కొంటూ న్యూయార్క్ గెజిట్‌లో ప్రకటన ప్రచురించబడింది. ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ భారీ ఐస్ క్రీం అభిమాని మరియు ఐస్ క్రీం కోసం ప్రతి సంవత్సరం 200 డాలర్లు ఖర్చు చేసేవాడు.

1900లలోనే ఐస్‌క్రీం తినే ట్రెండ్ భూమి నలుమూలలకూ వేగంగా వ్యాపించింది. విద్యుత్ ఆవిష్కరణ మరియు శీతలీకరణ ఐస్ క్రీం తయారీ పరిశ్రమకు పెద్ద ఊపునిచ్చాయి. ప్రతి దేశంలోని నిపుణులు వారి స్వంత దేశస్థుల అభిరుచులను తీర్చడానికి వారి స్వంత రకాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు.

అర్జెంటీనాలో హెలాడో ఐస్ క్రీం ఉంది, ఇది ఇటలీలో కనిపెట్టిన జెలాటోని పోలి ఉంటుంది. చైనాలో నల్ల నువ్వులు మరియు ఎరుపు బీన్స్ నుండి సేకరించిన సాంప్రదాయ చైనీస్ రుచుల నుండి తయారు చేయబడిన ఐస్ క్రీములు ఉన్నాయి. ఇండోనేషియాలో అవకాడో, జాక్‌ఫ్రూట్, రెడ్ బీన్స్ మరియు ముంగ్ బీన్స్ వంటి రుచులతో కూడిన ఐస్ క్రీమ్‌లు ఉన్నాయి. ఫిలిప్పీన్స్‌లో హాలో-హాలో అనే వింత పేరుతో ఒక వెరైటీ ఉంది. దొండూర్మా అనే టర్కిష్ వెరైటీ ఉంది. ఇందులో సాలెప్ (దుంపల నుండి తయారు చేయబడింది) మరియు మాస్టిక్ (రెసిన్ నుండి తయారు చేయబడింది) ఉన్నాయి. సిరియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఐస్ క్రీం రకం బూజా.

ఆశ్చర్యకరంగా నార్వే లాంటి శీతల దేశం ఐస్ క్రీమ్ వినియోగంలో మొదటి స్థానంలో ఉంది. మార్కెట్ సర్వేల ప్రకారం, నార్వేజియన్లు ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి 9.8 లీటర్ల ఐస్ క్రీం తింటారు. వారి తరువాత స్థానం  ఆస్ట్రేలియన్లు మరియు స్వీడన్లది.. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన రుచి సాధారణ వనిల్లా అని కూడా పరిశోధనలో తేలింది. రెండవది చాక్లెట్ మరియు మూడవది కోకోనట్  తరువాత స్ట్రాబెర్రీ. బబుల్ గమ్ మరియు పంప్కిన్ వంటి అసాధారణ రుచులు కూడా ఇష్టమైన రుచుల టాప్ 20 జాబితాలో ఉన్నాయి.

ప్రసిద్ధ నార్వేజియన్ అన్వేషకుడు రోల్డ్ అముండ్‌సెన్ తన బృందంతో కలిసి ధ్రువ యాత్రలకు వెళ్ళినప్పుడు, వారు తమతో పాటు అనేక కార్టన్‌ల ఐస్‌క్రీమ్‌ను తీసుకెల్లారు.  రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, యుఎస్‌లోని ఐస్‌క్రీమ్ తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా వివిధ యుద్ధభూమిలలో  పోరాడుతున్న తమ సైనికులకు 135 మిలియన్ టన్నుల ఐస్‌క్రీమ్‌ను పంపించారు.