స్త్రీ వాదం అనగా లైంగిక
స్వేచ్ఛ ను మహిళలు కలిగి ఉండుట.
స్త్రీవాదం శరీరాల విముక్తికి సంబంధించినది. గర్భస్రావం మరియు గర్భనిరోధం వంటి విషయాలు ఆ స్వేచ్ఛ లో ఒక భాగం. కానీ నేటి
సమాజంలో స్త్రీవాదుల పోరాటం వివిధ రూపాలలో ఉన్నది.
ముస్లిం మహిళలు, అలాగే ముస్లిం
పురుషుల దృష్తి లో మన శరీరం ముఖ్యంగా మహిళా శరీరం ఒక పవిత్ర ఆలయం. ప్రదర్సన
కు వ్యతిరేకంగా అది వినయం ను
ప్రదర్శించును.
ఇస్లాం ఒక సంస్కృతిని
మరియు మహిళా సాధికారతను కలిగి ఉంది. దైవ వాణి దివ్య ఖురాన్ లో స్త్రీ పురుషులు సమానులు అని మరియు రోజువారీ చర్యలకు మహిళలు మరియు పురుషులు సమాన బాధ్యతలను కలిగి
ఉన్నారని వివరించబడింది. కుటుంబం, దాతృత్వం, పిల్లలు, సెక్స్, మొదలైన అన్ని
విషయాలలో స్త్రీ పురుషులు ఒకే రకమైన విధులు ఋజుమార్గం లో కొనసాగించాలని
ఉంది.
తోలి తరం ఇస్లామిక్ మహిళలు ఈ ఆలోచనను అలాగే ఉంచారు. తొలి ముస్లిం మహిళ ఖదీజా(ర) (మహమ్మద్
ప్రవక్త(స) యొక్క మొదటి భార్య) ప్రభావం లేకుండా ఇస్లాం ఆవిర్భావించలేదు.
ఖదీజా(ర) ఒక వ్యాపార మహిళ మరియు అరేబియా లో ఒక భూమి యజమాని. మహమ్మద్ (స) నోట దైవ వాణి వేలుబడినప్పుడు అతనిని దైవం చేత
ఎన్నిక కాబడిన వాడు అని అతనికి నమ్మకం
కలిగించిన మహిళ అతని భార్య ఖదీజా(ర) మాత్రమే.
మహమ్మద్(స) ను అల్లాహ్ మరియు అతని దూతల వాణి వినమని
ప్రోత్సహించినది ఖదీజా(ర). ముహమ్మదు (స) కు కావలసిన మనోధైర్యం ఇచ్చి మరియు అతనిని అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త అని
విశ్వసించిన వారిలో మొదటి వ్యక్తి ఖదీజా(ర) మాత్రమే. ఇస్లాం అభివృద్ధిలో తన సంపూర్ణ మద్దతు ఇచ్చిన తోలి మహిళ ఖదీజా(ర) మాత్రమే.
నిర్బయంతో, సూటిగా, ధైర్యంగా తన నిచ్చిత అబిప్రాయం ను బాహాటంగా ప్రకటించిన మొదటి స్త్రీవాద మహిళా ఖదీజా(ర).
ముస్లిం స్త్రీలు ఈ
మహిళలను తమ మార్గదర్శకులుగా నమ్ముతారు మరియు వారి బాటలో నడిచేదరు. ప్రస్తుత భయానక పితృస్వామ్య
సమాజంలో ముస్లిం బాలికలు ఈ ప్రముఖ ఇస్లామిక్ మహిళల మార్గదర్శకత్వం కొరకు ఎదురు
చూస్తారు. నేటి ఆధునిక ముస్లిం స్త్రీ
దేనికి బయపడక తమ మత విశ్వాసాలకు గుర్తుగా స్వచ్చందంగా హిజాబ్ ధరించెదరు.
హిజాబ్ అనునది ఒక తల గుడ్డ (head scarf) అది వారు బలవంతంగా గాక వ్యక్తిగత ఇష్టం తో
ధరించెదరు. అది ఒక ముస్లిం స్త్రీ యొక్క సొంత వ్యక్తిగత ఎంపికను ప్రతిబింబిస్తుంది.
అమెరికన్ మహిళలు ఒక
నిర్దిష్ట శరీర భౌతిక ఆకర్షణ కలిగి తమ సమాజాలలో నిరంతరము ఒత్తిళ్లతో ఆందోళనతో
ఉంటారు. ఇతరులకు తమ శరీరం
ప్రదర్శించాలని వారి మొప్పు పొందాలని
ఉంటారు.
కాని ముస్లిం మహిళలు ఈ రోజువారీ ఒత్తిళ్లు నుండి విముక్తి పొంది తమ
శరీరం ప్రదర్శనకు ఆట వస్తువు కాదు అని
చెప్పే ధైర్యం కలిగి ఉంటారు. నేను మహిళా
గా గుర్తింపు గౌరవం పొందుతాను అని చెప్పే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇస్లామిక్
మహిళలు తమ సమాజాల్లో తమ స్వీయ వేష ధారణ తో గౌరవం పొందుతారు.
స్త్రీవాదం ఏమి
చెబుతున్నది? మహిళలు తమ శరీరాలతో,చూపులతో,
వస్త్ర ధారణ తో సంభంధం లేకుండా స్థిరమైన గౌరవం పొందాలని చెబుతున్నది. ముస్లిం -అమెరికన్ సమాజంలో మరియు ముస్లిం
ప్రపంచంలోని ప్రాంతాల్లో నమ్రతగల ఇస్లామిక్ మహిళ తన ప్రవర్తన చేత గౌరవించబడుతుంది.
కొన్ని వారాల క్రితం నేను
ఇస్లాం లో స్త్రీవాదం (feminism) గురించి ఉపన్యాసం వినటానికి వెళ్ళాను.ఉపన్యాసకురాలు హిజాబ్ ధరించిన మహిళా. ఉపన్యాసం
విన్నతరవాత అధునాతన స్త్రీవాదం పోకడలు
మారవలసిన అవసరం ఉంది అనిపించినది. .
మనం సాధారణం గా అమెరికన్/పాశ్చాత్య మహిళలు స్వేచ్ఛగా ఉన్నారు మరియు ముస్లిం మహిళలు అణిచివెత కు గురిఅయ్యారని ఆలోచించడం చేస్తాము. కాని నాకు దీనికి విరుద్దం గా నిజమైన పితృస్వామ్య సమాజం లో ఎవరు అణిచివేయబద్దారో నాకు అవగతం అయ్యింది. హిజాబ్ ధరించిన మహిళా చెడు చూపులనుంచి మరియు సమాజ నిర్భందల నుండి విడుదల అయ్యిందనే విషయం నాకు తెల్సింది. అమెరికన్ స్త్రీవాదులు నిజంగా అమెరికా సమాజం చూపులలో, అక్కడి పురుషుల చేతులలో బంది అయినారు అనుట వాస్తవం.
ఒక్కసారి ముస్లిం స్త్రీలను గమనించండి వారు తమ
శరీరం అంగడి వస్తువు కాదు పవిత్ర దేవాలయo అని నిరూపించారు. నమ్రత ధైర్యం స్త్రీ వాద
ప్రతీకలని నిరూపించారు.ప్రస్తుత స్త్రివాదానికి బిన్నమైన ముస్లిం స్త్రివాదులను ఆహ్వానిద్దాం మరియు
గౌరవిద్దాం.
No comments:
Post a Comment